హెలెన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్ | ys jagan mohan reddy tour in helen affected areas | Sakshi
Sakshi News home page

హెలెన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్

Published Sat, Nov 23 2013 12:42 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ys jagan mohan reddy tour in helen affected  areas

హెలెన్ పెను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న కుప్పంలో ప్రారంభించవలసిన సమైక్య శంఖారావం యాత్రను 30వ తేదికి మార్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం కార్యాలయం శనివారం హైదరాబాద్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తు ఈ నెల 28 నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం యాత్రను కుప్పంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే హెలెన్ తుఫాన్ బాధితులను పరామర్శించి, ఆ తర్వాత సమైక్య శంఖారావం యాత్ర చేపట్టాలని వైఎస్ జగన్ భావించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement