అల్పపీడనంగా బలహీనపడ్డ హెలెన్ తుపాను | Helen Cyclone Turns Weak | Sakshi
Sakshi News home page

అల్పపీడనంగా బలహీనపడ్డ హెలెన్ తుపాను

Published Sat, Nov 23 2013 10:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

Helen Cyclone Turns Weak

విశాఖ : మచిలీపట్నం వద్ద నిన్న తీరం దాటిన హెలెన్ తుపాను శనివారం అల్పపీడనంగా బలహీనపడింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని పయనిస్తోంది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తుండటంతో తెలంగాణ, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చిరించింది.

మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సుమారు 50వేల కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. 2 లక్షల హెక్టార్లలో వరిపంట నీట మునిగింది. 350 ఇళ్లు తుపాను ధాటికి కొట్టుకుపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement