హిందీ హెలెన్‌! | Janhvi Kapoor in a Malayalam Remake | Sakshi
Sakshi News home page

హిందీ హెలెన్‌!

Jul 19 2020 2:15 AM | Updated on Jul 19 2020 2:15 AM

Janhvi Kapoor in a Malayalam Remake - Sakshi

జాన్వీ కపూర్

హిందీ ‘హెలెన్‌’గా జాన్వీ కపూర్‌ కనిపించబోతున్నారా? అంటే అందుకు తగ్గ ప్రయత్నాలు మొదలయ్యాయనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. 2019లో మలయాళంలో సూపర్‌హిట్‌ సాధించిన చిత్రం ‘హెలెన్‌’. అన్నాబెన్‌ టైటిల్‌ రోల్‌ చేశారు. ఫారిన్‌ వెళ్లాలనుకునే బీఎస్సీ నర్సింగ్‌ గ్రాడ్యుయేట్‌ ‘హెలెన్‌’ ఇంగ్లీష్‌ ట్రైనింగ్‌ క్లాసులు తీసుకుంటూ ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తుంటుంది.

కానీ ఓ రోజు ఆ రెస్టారెంట్‌లోని కోల్డ్‌ స్టోరేజ్‌లో ఇరుక్కుపోతుంది హెలెన్‌. అప్పటికే ఆ రెస్టారెంట్‌ మేనేజర్‌ తాళం వేసి వెళ్లిపోతాడు. మైనస్‌ 18 డిగ్రీల చలిలో హెలెన్‌ తనను తాను ఎలా రక్షించుకుంది? అన్నదే ఈ చిత్రం ప్రధానాంశం. హిందీలో ‘హెలెన్‌’ చిత్రం రీమేక్‌ కానుందట. జాన్వీ కపూర్‌ టైటిల్‌ రోల్‌ చేయనున్నారని సమాచారం. మరోవైపు ఈ ‘హెలెన్‌’ చిత్రం తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా రీమేక్‌ కానుందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement