'ఉప్పెన' రీమేక్‌.. స్టార్‌ హీరోయిన్‌ చెల్లెలుకు ఛాన్స్‌ | Big Producer Planning For Uppena Movie Remake In Bollywood With Khushi Kapoor, Deets Inside - Sakshi
Sakshi News home page

Uppena Bollywood Remake: 'ఉప్పెన' రీమేక్‌.. స్టార్‌ హీరోయిన్‌ చెల్లెలుకు ఛాన్స్‌

Mar 22 2024 2:30 PM | Updated on Mar 22 2024 3:07 PM

Bollywood Big Producer Uppena Remake Plan - Sakshi

తెలుగు చిత్రం 'ఉప్పెన' పేరుకు తగ్గట్టుగానే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్‌. అయినా చిత్రం సంచలన విజయం సాధించింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్‌ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంతోనే  కృతి శెట్టి  ఎంట్రీ ఇచ్చింది. నటుడు విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళం, బాలీవుడ్‌లో రీమేక్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట.

తాజాగా రామ్ చరణ్- జాన్వీకపూర్‌ల కొత్త ప్రాజెక్ట్‌ RC16 సినిమా ఓపెనింగ్ కార్యక్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బుచ్చిబాబు డైరెక్టర్‌గా ఉన్నారు. సినిమా ప్రారంభ కార్యక్రమంలో బోనీ కపూర్ మాట్లాడుతూ..  బుచ్చిబాబు డైరెక్ట్‌ చేసిన ఉప్పెన సినిమా చూశానని అది తనకు బాగా నచ్చిందని చెప్పారట. అంతేకాకుండా ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయాలనే అభిప్రాయం ఉన్నట్లు పేర్కొన్నారట. ఈ క్రమంలో తన చిన్న కూతురు ఖుషి కపూర్‌ని ఉప్పెన సినిమా చూడమని బోనీ కపూర్‌ సలహా ఇచ్చారట. ఒకవేళ బాలీవుడ్‌లో ఉప్పెన చిత్రాన్ని రీమేక్‌ చేస్తే అందులో హీరోయిన్‌గా ఖుషి కపూర్‌ను సెట్‌ చేయాలని ఆయన ప్లాన్‌లో ఉన్నారట.

ముంబైలోని  ధీరూబాయ్ అంబానీ స్కూల్​లో ఖుషి కపూర్ విద్యాభ్యాసం పూర్తిచేసింది. లండన్‌ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ కూడా తీసుకుంది. బాలీవుడ్‌లో సరైన ఎంట్రీ కోసం ఆమె ఎదురుచూస్తుంది. ఉప్పెన సినిమా అయితే ఆమెకు కరెక్ట్‌గా సెట్‌ అవుతుందని బోనీకపూర్‌ ప్లాన్‌లో ఉన్నారట. మరీ ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే బోనీ కపూర్‌నే క్లారిటీ ఇవ్వాలి.


(అక్క జాన్వీ కపూర్‌తో ఖుషి కపూర్‌)

మరోవైపు ఉప్పెన సినిమాను కోలీవుడ్‌లో కూడా రీమేక్‌ చేయాలనే ప్లాన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాన్‌ చేస్తుందట. విజయ్‌ వారసుడు సంజయ్‌  దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ తమిళ్‌లో ఉప్పెన రీమేక్‌ అయితే అందులో కృతి శెట్టినే హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువ అని చెప్పవచ్చు. ఇప్పటికే పలు సినిమాలతో కోలీవుడ్‌లో కృతి శెట్టి బిజీగా ఉంది. ఉప్పెన రీమేక్‌ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీలో రూమర్స్‌ భారీగానే కొనసాగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement