Salman Khan, Janatha Garage Bollywood Remake - Sakshi
Sakshi News home page

Janatha Garage: 'జనతా గ్యారేజ్‌' రీమేక్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో

Published Mon, Jul 12 2021 8:33 AM | Last Updated on Mon, Jul 12 2021 11:03 AM

Salman Khan In Janatha Garage Hindi remake - Sakshi

బాహుబలి సక్సెస్‌ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు మార్కెట్‌ పెరిగిందనడంలో ఏ మాత్రం​ అతిశయోక్తి లేదు. దీంతో బాలీవుడ్‌ హీరోలు వరుసగా తెలుగు సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు. ఇక్కడ బ్లాక్‌ బస్టర్‌ అయిన సినిమాలను రీమేక్‌ చేసి హిట్‌ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే బీటౌన్‌ హీరోలు మన తెలుగు సినిమాలను రీమేక్‌ చేస్తుండగా ఇప్పుడు ఆ జాబితాలోకి సల్మాన్‌ ఖాన్‌ కూడా చేరారు. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా జనతా గ్యారేజ్ సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే.

సమంత, నిత్యా మీనన్‌ హీరోయిన్లుగా, మోహన్‌లాల్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్నిబాలీవుడ్‌లో రీమేక్‌ చేయన్నునారట. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అగ్రిమెంట్‌ కూడా రూపొందినట్లు బీటౌన్‌ టాక్‌. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement