బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండియా.. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న చర్చ! తాజాగా ఇదే అంశంపై నిర్మాతల రౌండ్ టేబుల్‌లో తెలుగు నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi), హిందీ ప్రొడ్యూసర్ బోనీకపూర్ (Boney Kapoor) మాట్లాడారు. దక్షిణాది ఇండస్ట్రీ బాలీవుడ్‌పై ప్రభావం చూపించిందని, కానీ హిందీ చిత్ర పరిశ్రమ మాత్రం ముంబైకే పరిమితమైందని సెటైర్లు వేశాడు. అది బోనీకపూర్ ఒప్పుకోలేదు. 'రష్యాలో ఇప్పటికీ రాజ్‌కపూర్‌ను గుర్తు చేసుకుంటారు. ఈజిప్టుకు వెళ్లినప్పుడు కూడా అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ గురించి మాత్రమే మాట్లాడతారు.
ఎగతాళి చేస్తున్నారేంటి?
షారూఖ్, బిగ్‌బీకి 'ద కింగ్ ఆఫ్ మొరాకో' అన్న బిరుదు ఇచ్చారు'.. అని బోనీ చెప్పుకుంటూ పోతుండగా కూడా మధ్యలో నాగవంశీ కలగజేసుకున్నాడు. అతడిని పూర్తిగా చెప్పనివ్వకుండా మధ్యలో దూరడంపై బాలీవుడ్ (Bollywood) డైరెక్టర్ సంజయ్ గుప్తా మండిపడ్డాడు. బోనీగారిని ఎగతాళి చేస్తున్న ఈ అసహ్యకరమైన వ్యక్తి ఎవరు? అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఫైర్ అయ్యాడు. అల్లు అరవింద్, సురేశ్ బాబు వంటి సీనియర్ నిర్మాతల ముందు ఇలా దర్జాగా కూర్చుని ముఖానికి వేళ్లు చూపిస్తూ మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించాడు.
బాలీవుడ్ అక్కడే ఆగిపోయింది
బాలీవుడ్ సినీ విశ్లేషకులు సుమిత్ సైతం ఈ వివాదంపై స్పందిస్తూ నాగవంశీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలుగు చిత్రపరిశ్రమ పాన్ ఇండియా ట్రెండ్‌ను పరిచయం చేసిందనడంలో సందేహం లేదు. బాలీవుడ్ ఇంకా మసాలా సినిమాల్నే నమ్ముకుంటూ ఎక్కడో ఆగిపోయింది. కానీ ఇక్కడ బోనీకపూర్ గారిని అగౌరవపర్చడం అనవసరం. చెప్పాలనుకున్నదేదో మర్యాదగా చెప్పుంటే అయిపోయేది. ఎంతోమంది దక్షిణాది ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు, హీరోలు హిందీ సినిమాపై ఎనలేని ప్రేమ చూపిస్తారు.
విమర్శ తప్పు కాదు, కానీ!
అమితాబ్, ప్రకాశ్ మెహ్రా, యష్ చోప్రా, మన్మోహన్ దేశాయ్ వంటి గొప్పవాళ్ల సినిమాలను ఆదర్శంగా తీసుకునే కమర్షియల్ సినిమాలు తీస్తున్నామని చెప్తుంటారు. సౌత్ సినిమాల కలెక్షన్స్‌లో హిందీ బాక్సాఫీస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని మర్చిపోవచ్చు. విమర్శ తప్పనడం లేదు, కానీ అవమానించడం మాత్రం తప్పే! ఇలా యాటిట్యూడ్ చూపిస్తే పాతాళంలోకి వెళ్లిపోతారు జాగ్రత్త! ఇది ప్రతిఒక్కరికీ వర్తిస్తుంది అని ట్వీట్ చేశాడు.
మీరు నేర్పించనక్కర్లేదు
దీనికి నిర్మాత నాగవంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పెద్దవారిని ఎలా గౌరవించాలనేది నువ్వు నేర్పించనక్కర్లేదు. బోనీగారిని మీకంటే ఎక్కువే గౌరవిస్తాం. ఆ చర్చలో ఎక్కడా బోనీని అగౌరవపర్చలేదు. మేమంతా ఎంతో బాగా మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం. ఇంటర్వ్యూ అయ్యాక ఒకరినొకరు ఆప్యాయంగా హత్తుకున్నాం. కాబట్టి నువ్వు చూసినదాన్ని బట్టి అదే నిజమని డిసైడ్ అయిపోకండి అని రాసుకొచ్చాడు.
You don’t need to teach us how to respect elders, we respect boney ji more than u guys do and there was no disrespect towards boney ji in that conversation it was a healthy discussion, me and boney ji had a nice laugh and hugged each other after the interview… So please dont…
— Naga Vamsi (@vamsi84) December 31, 2024
చదవండి: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో స్టార్స్.. ప్రభాస్ ఎక్కడంటే..?
Comments
Please login to add a commentAdd a comment