టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సినిమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాజాగా నిర్వహించిన నిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. దక్షిణాది ప్రేక్షకులు బాలీవుడ్ చిత్రాలను చూసే విధానాన్ని మార్చారని పేర్కొన్నారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, యానిమల్, జవాన్ చిత్రాలతో ఆ మార్పును చూశామని అన్నారు.
అయితే నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్‌పై బాలీవుడ్ డైరెక్టర్ బోనీకపూర్ స్పందించారు. దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉందన్నారు. అలాగే తెలుగు సినిమాలకు యూఎస్‌లో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది.. అంతేకాకుండా తమిళ చిత్రాలకు సింగపూర్, మలేషియాలో డిమాండ్ ఉందని తెలిపారు. గల్ఫ్ దేశాలతో పోలిస్తే యూఎస్ పెద్ద మార్కెట్ అని బోనీ కపూర్ అన్నారు. అయితే మలయాళ సినిమాకు గల్ఫ్‌లో భారీ మార్కెట్ ఉందని నాగవంశీ అన్నారు.
అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ముంబయికే పరిమితమైందన్న నాగవంశీ కామెంట్స్‌ను బోనీ కపూర్ వ్యతిరేకించారు. పుష్ప- 2 హీరో అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్‌కి పెద్ద అభిమానిని అని చెప్పిన విషయాన్ని బోనీకపూర్ గుర్తు చేశారు. అంతేకాకుండా తాను సీనియర్ ఎన్టీఆర్‌కు బిగ్ ఫ్యాన్ అని అన్నారు. దీనికి స్పందిస్తూ.. తాను షారూఖ్, అల్లు అర్జున్, చిరంజీవికి పెద్ద అభిమానినని నాగవంశీ అన్నారు.
ఇటీవల మీడియాతో అమితాబ్ బచ్చన్ మాట్లాడిన విషయాన్ని బోనీ కపూర్ గుర్తు చేశారు. సినిమాకు భాష అడ్డంకి కాదు.. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. ఈరోజు మరాఠీ సినిమాలు రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాయని బోనీకపూర్ తెలిపారు. మరాఠీ సినిమా ఈ తరహా బిజినెస్ చేస్తుందని ఎవరూ ఊహిందలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment