మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై బాక్సాపీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం... లాక్‌డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయంలో సగ భాగం అయింది. ఇప్పటికే ఈ సినిమా రూ.70 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటుతోంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే తన కుమారుడు సంజయ్‌ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయాలని తమిళ సూపర్‌స్టార్ విజయ్ భావిస్తున్న్ట్లట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చిత్ర బృందంతో ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదట ఈ సినిమాను టాలీవుడ్‌తో పాటు తమిళ్‌లో కూడా విడుదల చేయాలని భావించినా విజయ్ సేతుపతి మాత్రం వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. కథ బాగుందని, డబ్ చేయడం కంటే రీమేక్ చేస్తే మంచి వసూళ్లను రాబడుతుందని సలహా ఇచ్చారట. అంతేకాకుండా తమిళ రీమేక్ రైట్స్‌ను స్వయంగా విజయ్ సేతుపతి తీసుకోబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఉప్పెనను రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా ఉప్పెన రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
చదవండి : (‘ఉప్పెన’పై మహేశ్ బాబు రివ్యూ)
(బాప్‌రే.. కేజీఎఫ్ 2 తెలుగు రైట్స్‌కి అన్ని కోట్లా?)
Comments
Please login to add a commentAdd a comment