Uppena Making Video: Mythri Movie Makers Released Uppena Movie Making Video - Sakshi
Sakshi News home page

‘ఉప్పెన’ మేకింగ్ వీడియో కూడా అదుర్స్‌!‌

Published Thu, Feb 25 2021 8:30 PM | Last Updated on Fri, Feb 26 2021 9:35 AM

Mythri Movie Makers Released Uppena Movie Making Video - Sakshi

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పలు రికార్డులను తిరగరాసింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను లాభాల్లో ముంచెత్తింది. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగానూ నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్‌ సేతుపతి నటన ఈ సినిమా విజయానికి ప్లస్‌ అయింది. విలన్‌ పాత్రలో కనిపించిన విజయ్‌ సేతుపతి యాక్టింగ్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్‌లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగానూ ఉప్పెన రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఉప్పెన మేకింగ్ వీడియోను మైత్రీ మూవీ మేక‌ర్స్  విడుద‌ల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

మొదటి సినిమాతోనే ఎంతో పరిణతితో నటించిన వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టిలకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా టీజర్లు, పాటలు​ సినిమా విడుదలకు ముందే పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. కరోనా నిబంధనల సడలింపుతో ఉప్పెన 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైంది. ఇలా ప్రతీ అంశం ఉప్పెన విజయంలో భాగమై సునామీలా వసూళ్లు కురిపిస్తుంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

చదవండి : (ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు)
(వైష్ణవ్‌ తేజ్‌ తొలి పారితోషికం ఎంతంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement