'జిగ్రా' ట్రైలర్‌.. రూమర్‌ బాయ్‌ఫ్రెండ్‌పై అక్కాచెల్లెళ్ల ప్రశంసలు | Khushi Kapoor Comments On Jigra Trailer | Sakshi

'జిగ్రా' ట్రైలర్‌.. రూమర్‌ బాయ్‌ఫ్రెండ్‌పై అక్కాచెల్లెళ్ల ప్రశంసలు

Published Thu, Sep 26 2024 4:47 PM | Last Updated on Thu, Sep 26 2024 7:17 PM

Khushi Kapoor Comments On Jigra Trailer

బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అలియా భట్‌ నటించిన జిగ్రా సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో వేదాంగ్‌ రైనా కీలక పాత్ర పోషిస్తున్నాడు.  వాసన్‌ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌ నిర్మించారు. వాస్తవంగా ఈ సినిమా సెప్టెంబర్‌ 27న విడుదల కావాల్సింది. అయితే, అదే రోజు ఎన్టీఆర్‌ దేవర సినిమా విడుదల కానున్నడంతో జిగ్రా సినిమా రిలిజ్‌ను రెండు వారాల పాటు వాయిదా వేశారు. దీంతో అక్టోబర్‌ 11న జిగ్రా విడుదల కానుంది.

తమ్ముడు కోసం అక్క చేసే పోరాట కథనంతో ‘జిగ్రా’ సినిమా ఉండనుంది. మహిళా ప్రాధాన్యతను తెలిపేలా ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తమ్ముడు ఒక ప్రమాదంలో చిక్కుకుంటే తన అక్క చేసే పోరాటం ఏ రేంజ్‌లో ఉంటుందో చిత్ర దర్శకుడు సినిమా రూపంలో చూపించాడు.

ట్రైలర్‌పై ఖుషి కపూర్‌ కామెంట్‌
అలనాటి స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్‌ జిగ్రా ట్రైలర్‌ గురించి కామెంట్‌ చేసింది. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన నటుడు వేదాంగ్‌ రైనాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన  ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ట్రైలర్‌ను పంచుకుంది. హార్ట్‌ సింబల్‌తో పాటు ఎమోషనల్‌ ఫేస్‌ ఎమోజీలను కూడా ఖుషి కపూర్‌ షేర్‌ చేసింది.

జాన్వీ కపూర్‌ కూడా జిగ్రా ట్రైలర్‌పై పోస్ట్‌ చేశారు. ఇందులో వేదాంగ్‌ నటన చూసి తాను చాలా ఎమోషనల్‌ అయినట్లు పంచుకుంది. తన హృదయం కూడా బరువెక్కిందని పేర్కొంది. ట్రైలర్‌కే తాను ఇలా అయితే, సినిమా చూసిన తర్వాత తాను ఏవిధంగా ఫీలవుతానో అర్థంకావడం లేదంటూ రాసుకొచ్చింది. లేడీ బచ్చన్‌ అలియాభట్‌ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని తెలిపిందని జాన్వీ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement