హెలెన్ తుపానుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం హెలెన్ తుపానుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏకె మహంతితో పాటు ఉన్నతాధికారులుతో సమీక్ష జరిపారు. సముద్ర తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు. జాతీయ విపత్తు నివారణ సంస్థతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. అవసరం అయితే ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తుర్పూ, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లా అధికార యంత్రాగం జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందాలతో కలిసి పనిచేయాలన్నారు. కాగా తూర్పుగోదావరి జిల్లాలో సముద్రంలో చిక్కుకున్న 20మంది మత్స్యకారులను నేవీ సిబ్బంది రక్షించారు. హెలికాప్టర్ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి