coastal areas
-
జపాన్‌లో సునామీ హెచ్చరికలు
టోక్యో: ద్వీప దేశమైన జపాన్‌లో నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం సంభవించింది. వాయవ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం 4 గంటల తరువాత పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా తెలియజేసింది. ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. తొలుత సాయంత్రం 4.06 గంటల ప్రాంతంలో మొదలైన ప్రకంపనలు 4.32 గంటల వరకు కొనసాగాయి. ఈ భూకంప తీవ్రత సాయంత్రం 4.10 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. భూకంపం దాటికి సముద్రంలో ఐదు అడుగుల మేర అలలు ఎగిసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. పశి్చమ కోస్తా తీరంలోని ఇషిగావా, నిగాటా, టొమయా జిల్లాలకు జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇషిగావాకు మేజర్ సునామీ హెచ్చరిక, మిగిలిన పశి్చమ తీర ప్రాంతానికి తక్కువ తీవ్రత కలిగిన సునామీ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని గంటల తర్వాత సముద్రంలో అలల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సాధారణ సునామీ హెచ్చరికలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. తీర ప్రాంతాల్లోని జనం తక్షణమే సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని సూచించింది. నిగాటా, టొమయాలో 3 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. ఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రధాని కిషిడా చెప్పారు. శిథిలాల కింద బాధితులు! ఇషిగావా జిల్లాతోపాటు సమీప ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయని వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇషిగావాలోని నోటో ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల మేర సునామీ అలలు విస్తరించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. భూకంపం వల్ల ఇళ్లు కంపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కుర్చీలు, టేబుళ్ల కింద దాక్కున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. రాజధాని టోక్యోతోపాటు కాంటో ఏరియాలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. అధికారులతో పాటు సైన్యమూ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఉభయ కొరియాలతో పాటు రష్యాలోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. టోక్యోలోని భారత రాయబార కార్యాలయం బాధితులకు సమాచారం, సహాయం అందించేందుకు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. -
‘పెరిగే సముద్ర మట్టాలతో కొన్ని దేశాలే జలసమాధి’
భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి పలు దేశాలను ముంచేస్తాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘పెరుగుతున్న సముద్ర మట్టాలు’ అంశంపై ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సముద్ర మట్టాలు పెరిగితే భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్ ఏంజెలెస్, న్యూయార్క్, బ్యూనస్ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు. భూతాపం 2 డిగ్రీలు పెరిగితే సముద్రమట్టాలు ఆరు మీటర్లు, 5 డిగ్రీలు పెరిగితే ఏకంగా 22 మీటర్లు పైకెగసి ఆయా దేశాలను జలసమాధి చేస్తాయి’ అని హెచ్చరించారు. చదవండి: ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి -
భయపెడుతున్న తుఫాన్ సిత్రాంగ్.. దిశ మార్చుకుంటూ దడ పుట్టిస్తోంది!
భువనేశ్వర్: సిత్రాంగ్ తుపాను హెచ్చరికలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. తుఫాన్ బంగాళాఖాతంలో క్షణక్షణం దిశను మార్చుకుంటూ తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. తుఫాన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గుండా తీరం దాటుతుందనే ముందస్తు సంకేతాలతో బిక్కుబిక్కుమంటున్నారు. అక్టోబరు నెలలో పలు తుపానులు ఇప్పటికే ఇక్కడి ప్రజల గుండెల్లో దడ పుట్టించాయి. ఈ భయంతోనే సిత్రాంగ్ తుపాను ఎటువంటి బీభత్సం సృష్టిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. దీనిపై విపత్తు నిర్వహణ యంత్రాంగం సకాలంలో స్పందించేందుకు వాతావరణ విభాగం అనుక్షణం తాజా సమాచారం ముందస్తుగా జారీ చేస్తుంది. ప్రజలు భయపడి ఆందోళన చెందాల్సిందేమీ లేదని పేర్కొంటోంది. తుపాను ముఖచిత్రం ఇంకా స్పష్టం కానందున సిత్రాంగ్ తుపాను ఎక్కడ తీరం దాటుతుందో స్పష్టం కాలేదని భారతీయ వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్రో తెలియజేశారు. ఇదిలాఉండగా ఈనెల 25వ తేదీ నాటికి సిత్రాంగ్ తుపాను పశ్చిమ బెంగాల్ దిఘా ప్రాంతంలో తీరం దాటుతుందని అమెరికా గ్లోబల్ ఫోర్కాస్ట్ సిస్టమ్ జీఎఫ్ఎస్ మంగళవారం ముందస్తు సమాచారం ప్రసారం చేసింది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ (ఈసీఎండబ్ల్యూఎఫ్) సంస్థ సిత్రాంగ్ తుపాను రాష్ట్రంలో బాలాసోర్ ప్రాంతంలో తీరం దాటుతుందని వెల్లడించింది. అత్యవసర సమావేశం విపత్తు నిర్వహణ విభాగం సిత్రాంగ్ తుపాను తీవ్రత నేపథ్యంలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఈనెల 22వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా తుపాను తీరం దాటే సంకేతాలు క్రమంగా బలపడుతున్నట్లు ప్రాంతీయ వాతావరణ విభాగం తెలిపింది. ఈనెల 23వ తేదీ లేదా 24వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను ఖరారు అయ్యే సంకేతాలను ఈ కేంద్రం జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఏర్పడిన వాయుగుండం (సైక్లోనిక్ సర్క్యులేషన్) మంగళవారం నాటికి ఘనీభవించింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తాండవిస్తుంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఫలితంగా రాష్ట్రంలో కొన్నిచోట్ల ఈనెల 23వ తేదీ వరకు వర్షం కురుస్తుంది. ఈనెల 23 లేదా 24వ తేదీ నాటికి ఈ వాతావరణం తుపానుగా పరిణతి చెందుతుందని భారతీయ వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టరు మృత్యుంజయ మహాపాత్రో వెల్లడించారు. ప్రస్తుతానికి అల్ప పీడన ప్రాంతం స్పష్టం కానందున తుపాను తీవ్రత, తీరం దాటే ప్రాంతం వివరాలు ధ్రువీకరించడం సాధ్యం కాదని ఆయన వివరించారు. తుపాను కదలికపై అనుక్షణం నిఘా వేసి ఉన్నట్లు తెలిపారు. క్రమంగా తుపాను వాతావరణం బలపడుతున్నందున గాలుల వేగం పుంజుకుంటుంది. ఈనెల 22వ తేదీ నుంచి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గంటకు 45 కిలో మీటర్ల నుంచి 55 కిలో మీటర్ల వేగంతో వీచే గాలుల తీవ్రత గంటకు 65 కిలో మీటర్ల వేగం పుంజుకునే అవకాశం ఉందని తెలిపారు. సమావేశం నిర్వహణ బెంబేలెత్తిస్తున్న సిత్రాంగ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో విపత్తు నిర్వహణ యంత్రాంగం మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రత్యేక సహాయ కమిషనర్ ఇన్చార్జి సత్యవ్రత సాహు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. తుపాను తాకిడి ప్రతిపాదిత తీర ప్రాంతాల జిల్లా కలెక్టర్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వహణ వర్గం ఓస్డమా కార్య నిర్వాహక అధికారి జ్ఞానదాస్ తెలిపారు. దక్షిణ అండమాన్ సాగరం, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఆవిర్భవించిన వాయుగుండం రానున్న 48 గంటల్లో మరింత ఘనీభవించి బుధవారం లేదా గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడన క్షేత్రం స్పష్టమయ్యే సంకేతాలు బలపడుతున్నట్లు వాతావరణ విభాగం ముందస్తు సమాచారం జారీ చేసిందని జ్ఞానదాస్ వివరించారు. అల్పపీడనం క్రమంగా బలపడుతూ పశ్చిమ కేంద్రీయ, కేంద్ర బంగాళాఖాతం గుండా కదలిక పుంజుకుంటుంది. దీని ప్రభావంతో ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో వానలు ప్రారంభమవుతాయన్నారు. ఈ నెల 22 లేదా 23వ తేదీ నాటికి అల్పపీడనం తుపాను రూపురేఖలు స్పష్టం అవుతాయని పేర్కొన్నారు. అల్పపీడనం స్పష్టమైతే తప్ప తుపాను తాకిడి, తీవ్రత వివరాలను అంచనా వేయడం అసాధ్యమని వివరించారు. #Rains_thunderStorm_winds activities.. The Latest Updates many version says Probably, if the formation of #Sitrang completed...the cyclone come up #UTurn based perpendicular "Yaas"way Bengal way 23 Oct/3 pm to 26 Oct 7am a #touftimes direction #SWtoNE. pic.twitter.com/QsyrdYCcWo — EverythingIND20 (@EverythingIND20) October 19, 2022 -
ఏపీ వాసులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు.తెలంగాణలోని అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు పడతామని వాతావరణ శాఖ పేర్కొంది. చదవండి: టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు -
బీజేపీతోనే గుజరాత్ వికాసం: మోదీ
భావ్‌నగర్: దేశంలోనే అతిపొడవైన తీర ప్రాంతమున్న గుజరాత్ అభివృద్ధి కోసం దశాబ్దాలపాటు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని ప్రధాని మోదీ అన్నారు. ఫలితంగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం గత 20 ఏళ్లుగా నిజాయతీతో ప్రయత్నాలు చేసి రాష్ట్రం అభివృద్ధికి బాటలు పరిచిందని పేర్కొన్నారు. ప్రచార ఆర్భాటాలకు డబ్బు వృథా చేయకుండా తీర ప్రాంతం వెంబడి పలు భారీ ప్రాజెక్టులు చేపట్టిందని ఆయన అన్నారు. ఫలితంగా లక్షలాది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని చెప్పారు. ప్రజాసేవే పరమావధిగా భావిస్తున్న బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడూ నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. భావ్‌నగర్, బొటాడ్, అమ్రేలీ జిల్లాల్లో గురువారం రూ.6 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపిన సందర్భంగా భావ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ టెర్మినల్, బ్రౌన్‌ఫీల్డ్ పోర్ట్ అభివృద్ధి, కార్గో కంటెయినర్ ఉత్పత్తి విభాగం తదితరాలు ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సమయంలో ప్రధాని మోదీ రూ.29 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. -
రోబో రక్షిస్తుంది
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): సముద్రంలో ప్రమాదవశాత్తూ మునిగిపోతున్న వారిని క్షణాల్లో రక్షించేందుకు రోబో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైజాగ్ సేఫ్ సంస్థ ‘లైఫ్ బాయ్’ పేరుతో ఈ రోబోను రూపొందించింది. దీనిని ఇటీవల నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ ప్రారంభించారు. ఈ రోబో పూర్తిగా బోటు తరహాలోనే పనిచేస్తుంది. ఒకేసారి ముగ్గురిని కాపాడనుంది. సెకనుకు 7 మీటర్ల వేగంతో 600 మీటర్ల వరకు పనిచేస్తుంది. ఈ రోబో ధర రూ.5.50 లక్షలు కాగా, వీటిని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉంచేందుకు ఐదు యంత్రాలను ప్రభుత్వ అనుమతితో కొనుగోలు చేయనున్నారు. అలలపై దూసుకుపోతున్న రోబో -
ఒంపు సొంపుల ఏరులో.. మడ అడవుల మధ్యలో
చుట్టూ మనసులను కట్టిపడేసే ప్రకృతి సిద్ధ మడ అడవులు.. వంపుసొంపులతో హొయలు పోతూ..వడివడిగా పరవళ్లు తొక్కే కాలువ..చల్లగా తాకే చిరుగాలికి లయబద్ధంగా రాగాలు పోతున్నట్లు వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. వీటన్నింటి మధ్య లాహిరిలాహిరిలా హిరిలో.. అంటూ సాగే పడవ ప్రయాణం.. చదువుతుంటేనే మది అలలపై తేలి ఆడుతున్నట్లు ఉప్పొంగుతోంది కదూ.. ఈ మధురానుభూతులు ఆస్వాదించాలంటే నాగాయలంక మండలంలోని తీర ప్రాంతాన్ని సందర్శించాల్సిందే! నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోద నుంచి సముద్ర ప్రాంతం వరకూ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో తెల్లమడ, నల్లమడ, పొన్న, దుడ్డుపొన్న వంటి రకాల మొక్కలున్నాయి. వీటిలో మడ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. నీటిలో వేర్లు, మొదళ్ళు కనబడుతూ పైన పచ్చని మొక్కలతో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. మడ అడవుల నడుమ, నదీపాయలు, సింకుల్లో ప్రయాణిస్తూ సాగే ప్రయాణం సుందర్బన్ అడవుల అందాలను తలపిస్తుంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా సహజ సిద్ధ ప్రకృతి సోయగాలకు నెలవు ఈ తీర ప్రాంతం. ప్రత్యేకమైన ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు మరుపురాని అనుభూతినిస్తుంది. ఈ మడ అడవుల అందాలను తిలకించాలంటే నాగాయలంక, గుల్లలమోద, ఎదురుమొండి, సంగమేశ్వరం నుంచి ప్రత్యేక పడవల్లో వెళ్ళాల్సి ఉంటుంది.. రవాణా సదుపాయం కల్పిస్తే మరింతగా టూరిజం అభివృద్ధి ప్రస్తుతం ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసుకుని టూరిస్టులు ఈ లైట్‌హౌస్ సందర్శిస్తున్నారు. ఈ ప్రయాణం రిస్కుతో కూడుకోవడం, ఖర్చులు ఎక్కువ అవడం వల్ల లైట్‌హౌస్‌ని సందర్శించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ చాలామంది ఈ ప్రాంతాన్ని సందర్శించలేక పోతున్నారు. దీనికితోడు లైట్‌హౌస్ ప్రాంతంలో ఏమీ దొరక్క పోవడం పర్యాటకులకు నిరాశే మిగులుతుంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు పర్యాటకశాఖ ప్రత్యేక లాంచీలు, బోట్లను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. లైట్‌హౌస్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక ఆకర్షణగా లైట్‌హౌస్ ఓ వైపు పచ్చని మడ అడవులు, మరో వైపు కృష్ణా నది, ఇంకోవైపు బంగాళాఖాతం మధ్య ఉండే మడ అడవుల నడుమ ఉండే గుల్లలమోద లైట్‌హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగాయలంక నుంచి 25 కి.మీ దూరంలో లైట్ హౌస్ ఉంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ లైట్‌హౌస్‌ని 1972లో ఆధునీకరించారు. దీని ఎత్తు 135 అడుగులు. 9 అంతస్తులు కలిగి ఉంది. 1977 ఉప్పెనకు ఈ లైట్‌హౌస్ 5వ అంతస్తు వరకూ వరద నీరు వచ్చినట్లు రికార్డులో నమోదైంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా పచ్చని మడ అడవులు, నదీపాయల నడుమ ఉండటం ఈ లైట్‌హౌస్ ప్రత్యేకత. (క్లిక్: ఎంత తిన్నా.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..) -
Cyclone Asani : ఏపీకి అలర్ట్.. దూసుకొస్తున్న అసని..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. తీవ్ర తుపానుగా మారి ఒడిశా తీరానికి దగ్గరగా వస్తోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఆదివారం నర్సీపట్నం, శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, కోనసీమ, విజయవాడ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనంతపురం, కడప ప్రాంతాల్లోను వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో భారీ వర్షానికి రోడ్లు నీళ్లతో నిండి ట్రాఫిక్ స్తంభించింది. చదవండి: పాపం రమాదేవి.. భర్త ప్రాణాలు కాపాడబోయి.. కృష్ణా జిల్లా మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో భారీవర్షాలు, ఈదురు గాలులకు చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కోతకొచ్చిన మామిడికాయలు రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు, ఎక్కువచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. -
వాణిజ్య ఖిల్లా ‘పశ్చిమ’
సాక్షిప్రతినిధి, ఏలూరు: అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా ఏర్పడిన నూతన పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య ఖిల్లాగా అవతరించింది. డెల్టా, గోదావరి, సముద్ర తీర ప్రాంతాలతో ఆవిష్కృతమైంది. జిల్లాగా ఏర్పడిన నరసాపురం పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి. రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేశారు. ఆక్వా ఉత్పత్తులు, విదేశీ ఎగుమతులు, వాణిజ్య, విద్యాసంస్థలు కలబోతగా భీమవరం కేంద్రంగా జిల్లా అవతరించింది. ఆధ్యాత్మిక సౌరభం, రాజకీయ చైతన్యంతో విరాజిల్లనుంది. ఆక్వాహబ్‌గా పేర్గాంచి.. ప్రధానంగా 1.80 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుతో భీమవరం ఆక్వాహబ్‌గా మారింది. ఆక్వా చెరువులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్, సీడ్ యూనిట్లు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడి నుంచి అమెరికా, చైనా, మలేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్, శ్రీలంకతో పాటు యూరప్ దేశాలకు నిత్యం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. రెండో బార్డోలి: స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో భీమవరానికి ప్రత్యేక స్థానం ఉంది. రెండో బార్డోలిగా పేర్గాంచింది. ఆధ్యాత్మిక సౌరభం: పాలకొల్లు, భీమవరంలో పంచారామక్షేత్రాలు, భీమవరంలో మావుళ్లమ్మవారి ఆలయం, పెనుగొండలో వాసవీ మాత ఆలయం, నరసాపురంలో ఆదికేశవ ఎంబేరుమన్నార్ కోవెలతో జిల్లా ఆధ్యాత్మికంగా విలసిల్లుతోంది. కళలకు ప్రసిద్ధి: పాలకొల్లు, నరసాపురం, భీమవరం ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతానికి చెందిన ఎందరో రంగస్థల, సినీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులుగా వెలుగొందుతున్నారు. రాజకీయ చైతన్యం: నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయంగా కీలకం. ఇక్కడి నుంచి పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. చారిత్రక నేపథ్యం: నరసాపురం ప్రాంతానికి చారిత్రక నేపథ్యం ఉంది. మొగల్తూరు రాజులు మొగల్తూరు కేంద్రంగా కృష్ణా జిల్లా వరకూ పాలన సాగించారు. డచ్, బ్రిటిషర్లు ఇక్కడ స్థావరాలు ఏర్పాటుచేసుకున్నారు. 300 ఏళ్ల క్రితం డచ్ వారు నిర్మించిన వైఎన్ కళాశాల పరిపాలనా భవనం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. లేసు, వాణిజ్య ఉత్పత్తులు: ఐర్లాండ్ దేశస్తులు పరిచయం చేసిన లేసు అల్లికల పరిశ్రమ ఈ ప్రాంతంలో ఉంది. మొగల్తూరు మామిడి, మోళ్లపర్రు ఎండుచేపలు, పాలకొల్లు కొబ్బరి, నరసాపురం బంగారం వ్యాపారం, తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్, ఆయిల్ విక్రయాలకు పేర్గాంచింది. ఇస్రో ఇంధన తయారీ: అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాల్లో అవసరమైన ఇంధనాన్ని తణుకు కేంద్రంగా ఉత్పత్తి చేస్తున్నారు. 1988 నుంచి ఆంధ్రా సుగర్స్ అనుబంధ సంస్థలో తయారైన ఇంధనాన్ని ఇస్రో ఉపయోగిస్తోంది. విద్యా నిలయం: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలు ఉన్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. -
తమిళనాడుకు మరో తుపాను హెచ్చరిక! రానున్న 48 గంటల్లో..
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని కోస్తా జిల్లాలకు రానున్న 48 గంటల్లో మరో తుపాను పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తీవ్ర వర్షాలతో అల్లాడుతున్న తమిళనాడు నవంబర్ 29 నాటికి మరో తుపాన్‌ను ఎదుర్కొనబోతోంది. తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన సూచనల ప్రకారం.. రానున్న 48 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నవంబర్ 29 నాటికి అది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా. ஆழ்வார்பேட்டை பாரதிதாசன் சாலை மழை நீரால் மூழ்கியது. People.. be safe, drive carefully wherever you see the water as there are damaged roads as well. #ChennaiRains #chennaifloods #Rains #TamilNadu #NEWS #NewsBreak pic.twitter.com/gPuHgoMA7C — suwathy venugopal (@suwavenus) November 27, 2021 #Palar river witnessing the flow of more than 1 lakh cusecs of water #TamilNadu #Vellore #AP #Karnataka pic.twitter.com/nIlLu4nXSp — Shabbir Ahmed (@Ahmedshabbir20) November 21, 2021 అయితే, తమిళనాడుతోపాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలలో పరిస్థితి రాబోయే 2-3 రోజుల్లో మరింత ఉధృతంగా మారనుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మని కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా డిసెంబర్ 1 నాటికి మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ, నైరుతి ప్రాంతాలతో పాటు గుజరాత్‌లోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. Visual from West Mambalam, #Chennai#ChennaiRain @karthickselvaa @Stalin__SP @vedhavalli_13 @dharannniii #Tamilnadu pic.twitter.com/l4vC27lFoo — Tamilnadu Galatas (@tamilnadugalata) November 27, 2021 Beautiful weather at Beasant Nagar beach, Chennai #ChennaiRains2021 #TamilNadu #Chennai pic.twitter.com/Zqk23ZXA5P — Vidhu Trivedi 🇮🇳 (@vidhu0522) November 27, 2021 -
బాబోయ్ భల్లూకం: ఎలుగుబంట్ల హల్చల్
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దానం, తీర ప్రాంతాల్లో గత కొద్ది కాలంగా ఎలుగు బంట్లు (భల్లూకాలు) హల్చల్ చేస్తుండంతో ప్రజలు భయందోళన చెందుతున్నారు. ప్రధానంగా మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని పలు గ్రామాల్లో ఉన్న జీడి తోటలు, సముద్ర తీరాల్లో సంచరిస్తున్నాయి. ప్రస్తుతం జీడి పిక్కలను ఎరేందుకు రైతులు తోటల్లోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. దీంతో ఏ సమయంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. అనేక మందికి గాయాలు.. ►ఇప్పటికే అనేక మందిపై ఎలుగులు దాడిచేసి గాయపరిచాయి. చికిత్స పొందుతూ క్షతగాత్రులు పదుల సంఖ్యలో మృతి చెందారు. ►మూడేళ్ల క్రితం తాడివాడ వద్ద రైతులు పంట రక్ష ణకు ఏర్పాటు చేసుకున్న కంచెలో ఎలుగు చిక్కింద ►రెండేళ్ల క్రితం చినవంక గ్రామ దేవత ఆలయంలో ఎలుగు చొరబడింది. ►అక్కుపల్లిలో కిరాణా దుకాణంపై దాడిచేశాయి. ► రాజాంలో అంగన్వాడీ కేంద్రంలో ఎలుగులు చొరబడి నూనె, పప్పు, ఇతర నిత్యావసర సరుకుల ను ధ్వంసం చేశాయి. ►డెప్పూరులో రాత్రి సమయంలో గ్రామ వీధుల్లో సంచరించి ప్రజలకు ప్రాణభయం కలిగించాయి. ►కిడిసింగిలో నిర్మాణం జరుగుతున్న ఇంటిలో రెండు ఎలుగులు కనిపించడంతో భవన నిర్మాణ కార్మికులు బయటకు పరుగులు తీశారు. ►గత మూడు రోజుల నుంచి డోకులపాడు సము ద్ర తీరంలో రెండు ఎలుగులు సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికారు లు స్పందించి ఎలుగుల సంచారాన్ని నియంత్రించా లని ఉద్దాన, తీర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. తీరంలో ఎలుగుబంట్లు.. వజ్రపుకొత్తూరు: మండలంలోని ఉద్దాన తీరప్రాంత గ్రామాల్లో ఎలుగుబంట్లు భయాందోళన కు గురిచేస్తున్నాయి. బుధ, గురువారాల్లో డోకు లపాడు తీర ప్రాంతంలో రెండు ఎలుగుబంట్లు సంచరించడంతో జీడి రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒంటరిగా తిరగొద్దు ప్రస్తుత సీజన్లో పనస, జీడి పండ్లు తీనేందుకు ఎలుగులు తోటల్లో సంచరిస్తా యి. తోటలకు వెళ్లేటప్పు డు, రాత్రి సమయంతో ఆరు బయటకు వచ్చేటప్పుడు ఒంటరిగా రావొ ద్దు. ఎలుగులను కవ్వించకూడదు. వాటి సంచారాన్ని గమనిస్తూ పలు జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించాం. – రాజనీకాంతరావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కాశీబుగ్గ రేంజ్ చదవండి: సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు! కొడుకును బావిలో పడేసి...ఆపై తండ్రీ ఆత్మహత్య -
మన తీరాన ‘మరో చరిత్ర’
సాక్షి, హైదరాబాద్ : మన భూపాలపల్లికి కంబోడియాతో ఉన్న సంబంధం ఏంటి? భూపాలపల్లి జిల్లా దేవునిగుట్టపై ఉన్న బౌద్ధమందిరం అచ్చుగుద్దినట్టు ప్రపంచ ప్రఖ్యాత అంకోర్వాట్ దేవాలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. కంబోడియా నిర్మాణ విధానం భూపాలపల్లిలో ఎలా ప్రత్యక్షమైంది? చారి త్రక ఆధారాలు ఇప్పటికీ వెలికితీయలేదు. శ్రీకాకుళం జిల్లాలోని దంతపురానికి శ్రీలంకకు ఉన్న లింకేమిటి?. కళింగరాజుల హయాంలో దంతపురంలో బౌద్ధస్తూపం నిర్మితమైంది. ఆ స్తూపం కింద బుద్ధుడి అస్థికగా ఆయన దంతం ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ దంతం శ్రీలంకలోని క్యాండీ సమీపంలోని ప్రముఖ బౌద్ధక్షేత్రం దవల మళిగవిలలో ఉంది. ఇక్కడి నుంచి అటెందుకు తరలింది? శ్రీకాకుళానికి శ్రీలంక దేశానికి మధ్య సంబంధం ఎలా కుదిరింది?.వేల కిలోమీటర్ల దూరంలోని దేశాల్లో తెలుగు వారు వందల ఏళ్లుగా ఎందుకుంటున్నారు? చరిత్రలో కచ్చితమైన సమాధానాల్లేని ప్రశ్నలెన్నో. కానీ వీటి వెనుక సహేతుక చారిత్రక కారణాలున్నాయి. వాటి తీగలాగితే మన దేశానికి–ఇతర దేశాలకు మధ్య వాణిజ్య, సాంస్కృతిక, విజ్ఞాన సంబంధ బాంధవ్యాల డొంక ఇప్పుడు కదులుతుంది. నాటి ఆధారాలు వెలికి తీస్తే ఇప్పుడు ఆయా దేశాలతో కొత్త మైత్రికి బాటలు వేయొచ్చు. ఇది వాణిజ్యపరంగా మన దేశానికి ఉపయోగపడొచ్చు. ఇప్పుడిలాంటి ఆలోచనలే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అందుకే సముద్ర మార్గం ఆధారంగా మన దేశం ఏయే దేశాలతో సంబంధాలు నెరిపిందో చారిత్రక ఆధారాలను వెలికితీయాలని నిర్ణయించింది. సముద్ర తీరం ఉన్న ప్రాంతాల్లో ‘ప్రాజెక్ట్ మౌసమ్’పేరుతో బృహత్తర అధ్యయనాన్ని నిర్వహించనుంది. ఈ బాధ్యతల్ని ప్రాంతాల వారీగా విభజించి కొందరు నిష్ణాతులకు అప్పగించింది. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అధ్యయన బాధ్యతను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె.పి.రావుకు అప్పగించింది. దేశాలతో కొత్త బాంధవ్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఓడరేవు బందరు నుంచి కాకతీయ రాజులు ఇతర దేశాలతో వాణిజ్యపరమైన సంబంధాలు కొనసాగించారు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ రేవు మీదుగా వస్తువుల ఎగుమతి, దిగుమతులు కొనసాగాయి. దాన్ని రూఢీచేసే శాసనాలు వెలుగు చూశాయి. అందుకే కాకతీయ శాసనాలు ఇప్పటికీ ఆంధ్ర సముద్ర తీరప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇలా ఆసియా నుంచి ఆఫ్రికా వరకు ఎన్నో దేశాలతో కాకతీయుల కంటే ముందు, కాకతీయుల తర్వాత కూడా వాణిజ్య సంబంధాలు కొనసాగాయి. మన ప్రాంతాన్ని పాలించిన అన్ని సామ్రాజ్యాలు ఈ సంబంధాల్ని కొనసాగించాయి. వ్యాపార వాణిజ్యాలనే ప్రధాన లక్ష్యంతో మొదలైన ఈ సంబంధ బాంధవ్యాలు సంస్కృతీ సంప్రదాయాలతోనూ పెనవేసుకున్నాయి. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో అలనాటి చారిత్రక నిర్మాణాల్లో విదేశీశైలి దీనికి నిదర్శనం. అప్పట్లోనే తెలంగాణ ప్రాంతం నుంచి నల్లరాయి ఆఫ్రికా, యూరప్‌లకు చేరింది. ఇప్పటికీ చాలా దేశాల్లో అక్కడ మన శైలి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి ఇంజినీర్లు ఆయా దేశాలకు వెళ్లి నిర్మాణాల్లో పాలుపంచుకున్న దాఖలాలున్నాయి. ఇవి దేశాల మధ్య మైత్రికి దోహదం చేశాయి. క్రమంగా అవి కనుమరుగయ్యాయి. కానీ నాటి దోస్తీకి గుర్తుగా ఇప్పటికీ ఎన్నో చారిత్రక నిర్మాణాలు అలరారుతున్నాయి. ఆయా నిర్మాణాల ఆధారంగా నాటి మైత్రీజాడలను వెలికితీయాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త వాణిజ్యానికి, స్నేహాలకు బాటలు ‘ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్’నోడల్ ఏజెన్సీగా కేంద్ర పర్యాటక శాఖ ఓ బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇది సముద్ర మార్గం ద్వారా మన దేశంలోని ఏయే ప్రాంతాలు ఏయే దేశాలతో సంబంధాన్ని కలిగి ఉండేవో వెలికితీయబోతోంది. వాటిని ప్రతిఫలించే నిర్మాణాలు, చారిత్రక స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ప్రాధాన్యం ఏంటి, దానితో ఏయే దేశాలు సంబంధం కలిగి ఉన్నాయి, ఆ స్నేహానికి కారణంగా అసలు రెండు ప్రాంతాల మధ్య జరిగిన రవాణా ఏంటి, నాటి వాణిజ్యం, ఆర్థిక అంశాలు తదితర అన్ని వివరాలూ ఈ అధ్యయనంలో తేలనున్నాయి. ఆయా వివరాల ఆధారంగా ఆయా దేశాలతో ఇప్పుడు మనదేశం కొత్త మైత్రిని ఎలా పెంపొందించుకోవచ్చో ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇది మళ్లీ కొత్త వాణిజ్యానికి బాటలు వేస్తుందని కేంద్రం నమ్ముతోంది. యునెస్కో గుర్తింపునకు అవకాశం మన తీరప్రాంతాల్లో విలసిల్లిన సంస్కృతి, దానికి గుర్తుగా ఉన్న నిర్మాణాలు, అవి ఇతర దేశాల మైత్రిని ప్రతిఫలించే తీరును వెలికితీసి యునెస్కో ముందు నిలపవచ్చన్న మరో ప్రయత్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ప్రపంచ వారసత్వ జాబితాలో మనదేశంలోని కట్టడాలకు చోటు తక్కువే. ఆ గుర్తింపు పొందదగిన చరిత్ర ఉండి కూడా కొన్ని మరుగునపడ్డాయి. ఇప్పుడు చేపట్టబోయే కొత్త అన్వేషణ దానికి ప్రాణం పోస్తుందన్న ఆలోచన కేంద్రం మదిలో ఉంది. ఇది గొప్ప అధ్యయనం ‘ప్రాజెక్టు మౌసమ్’పేరుతో కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించనున్న అధ్యయనం బృహత్తరమైంది. ఇది తీరప్రాంతాలతో గల విదేశీ సంబంధాల చరిత్రను వెలుగులోకి తెస్తుంది. మళ్లీ దేశాల మధ్య కొత్త సంబంధాలకు బాటలు వేయటమే కాక మన చరిత్ర యునెస్కో ముంగిట మెరిసేందుకు కారణం కానుంది. ఇందులో పాలుపంచుకునే అవకాశం నాకు దక్కడం గర్వంగా ఉంది. – ప్రొఫెసర్ కె.పి.రావు -
అలల కల్లోలం: ఉప్పొంగుతున్న కడలి
సఖినేటిపల్లి: ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, అమావాస్య ఘడియలకు అంతర్వేది వద్ద తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడే అలలు తీర ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు నెలలుగా పౌర్ణమి, అమావాస్య ఘడియల్లో పోటెత్తుతున్న ఉప్పునీరు, ప్రస్తుత అల్పపీడన ప్రభావానికి అమావాస్య తోడవడంతో సముద్రుడు మరింత ఉగ్రుడవుతున్నాడు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి. శుక్రవారం సముద్ర కెరటాలు తీరాన్ని దాటుకుని సుమారు 500 మీటర్ల మేర అంతర్వేదికర కొత్త వంతెనకు సమీపంలో రోడ్డును దాటి సరుగుడు తోటల్లోకి చేరాయి. సాగరసంగమానికి సమీపాన ఉన్న పల్లిపాలెంలో ఇళ్ల వద్దకు కూడా ఉప్పునీరు పోటెత్తింది. అంతర్వేదికర గ్రామంలో ఉప్పునీరు పోటెత్తిన ప్రాంతాలను, పల్లిపాలెంలో ముంపునకు గురైన నివాస గృహాలను తహసీల్దార్ రామ కుమారి పరిశీలించారు. ముంపు నీటి వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఆమె వెంట ఆర్ఐ బి.మనోజ్, వీఆర్వో బొల్లాప్రగడ సీతారామం, గ్రామస్తులు ఉన్నారు. పర్ర ప్రాంతానికి పోటెత్తిన ఉప్పునీరు ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానాం సముద్ర తీరంలో శుక్రవారం ఉదయం సముద్రపు అలలు బీచ్ రోడ్డు పల్లపు ప్రాంతంలోకి భారీగా చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బీచ్‌రోడ్డు వద్ద కట్టు కాలువ వంతెన సమీపంలో ఎస్.యానాంలోని రవ్వ చమురు సంస్థ ఆన్‌షోర్, ఆఫ్షోర్లకు పైపులైన్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో పల్లంగా ఉండటం వల్ల అక్కడే సముద్రపు అలలు ఎగసి పడి నీరు కట్టు కాలువను దాటుకుని పర్ర ప్రాంతానికి ఎగబాకాయి. దీంతో పైప్‌లైన్ ఉన్న ప్రాంతంలో గాడిలా ఏర్పడి కాలువలా తయారయ్యింది. ఒక దశలో పైపులైన్ లీకయ్యిందంటూ వదంతులు వ్యాపించడంతో రవ్వ అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రపు అలలు వస్తున్న ప్రాంతాన్ని రవ్వ యాజమాన్య సిబ్బంది పరిశీలించి, సముద్రపు పోటు అధికంగా ఉండటం వల్ల ఇలా జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మధ్యాహ్న సమయం వరకూ సముద్రపు నీరు భారీగా పర్రలోకి చేరడంతో డ్రెయిన్ల ద్వారా ఉప్పనీరు పంట పొలాలకు చేరుతోందని స్థానికులు, రైతులు ఆందోళన చెందారు. తహసీల్దారు కె.పద్మావతి, ఆర్ఐ ఎన్.ప్రసూన, వీఆర్ఓ రాములు బీచ్ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అమావాస్య, అల్పపీడన ప్రభావంతో ఆటు పోట్లకు సముద్రం అల్లకల్లోలంగా మారిందని తేల్చారు. అంతర్వేదికరలో కొత్తవంతెన వద్ద రోడ్డును దాటుకుని సరుగుడు తోటల్లోకి చొచ్చుకు వస్తున్న ఉప్పునీరు నేలకొరిగిన భారీ వృక్షాలు.. కోతకు గురైన తీరం.. అల్లవరం: ఓడలరేవు తీరం వద్ద రక్షణగా ఉన్న కరకట్టలను, సరుగుడు తోటలను దాటుకుంటూ సముద్ర అలలు పల్లపు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ వృక్షాలు సైతం కెరటాల తాకిడికి నేలకొరిగాయి. గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన అలల తాకిడి శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. దీని ప్రభావంతో తీరం కోతకు గురైంది. తీరానికి ఆనుకుని ఉన్న ఆక్వా చెరువులు సముద్రపు నీటితో నిండిపోయాయి. ఓడలరేవు ఆ‹ఫ్‌షోర్ టెరి్మనల్ ప్రహరీ, ఓడలరేవు తీరానికి పర్యాటకంగా పేరు తెచ్చిపెట్టిన సముద్ర రిసార్ట్సు గోడలను కెరటాలు తాకాయి. అమావాస్య ప్రభావంతో సముద్రం ముందుకు వచ్చిందని, దీని ప్రభావం మరో మూడు, నాలుగు రోజులు ఉంటుందని అధికారులు అంటున్నారు. -
తీరంలో అలజడి
సాక్షి, విజయనగరం : వాతావరణ మార్పులతో సంద్రంలో అలజడి నెలకొంది. అలలు ఉవ్వెత్తున ఎగసి తీరాన్ని తాకుతున్నాయి. చింతపల్లి తీరం ఆదివారం కోతకు గురికావడంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. సముద్రంలో బలమైన గాలులు వీయడం.. కెరటాల తాకిడి పెరగడంతో వేటకు వెళ్లేందుకు వెనుకడుగువేస్తున్నారు. పూసపాటిరేగ తీరంలో సుమారు 400 వరకు బోట్లు ఉన్నా కేవలం 12 బోట్లతోనే వేట సాగించారు. చింతపల్లి రేవు నుంచి కేవలం 3 బోట్లు మాత్రమే వేటకు వెళ్లాయి. పతివాడబర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, కోనాడ, చింతపల్లి గ్రామాల మత్స్యకారులు వేటను వాయిదా వేసుకున్నారు. -
తుఫాన్ షెల్టర్లు సిద్ధం
- రూ.16.24 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో 16 భవనాల నిర్మాణం - పూర్తి చేసిన భవనాలు తహశీల్దార్లకు అప్పగింత - ప్రతి షెల్టర్‌కు సొసైటీ తప్పనిసరి ఒంగోలు టూటౌన్ : జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తుఫాన్ షెల్టర్ల నిర్మాణం పూర్తయింది. తుఫాన్ల నుంచి తీరప్రాంత గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఆధునిక వసతులతో వీటిని నిర్మించారు. రెండు దశల్లో తుఫాన్ షెల్టర్లు జిల్లాకు మంజూరయ్యాయి. 2011-13 ఆర్ధిక సంవత్సరంలో మొదటి దశ (ఫేజ్-1) మూడు తుఫాన్ షెల్టర్లు మంజూరవగా..2014-15 లో ఉలవపాడు మండలంలో ఐదు, కొత్తపట్నం మండలంలో ఆరు, చీరాల మండలంలో ఒక తుఫాన్ షెల్టర్‌తో కలిపి మొత్తం 12 మంజూరుయ్యాయి. జాతీయ తుఫాన్ విపత్తు నివారణ పథకం కింద ప్రపంచ బ్యాంకు నిధులతో తుఫాన్ షెల్టర్ల నిర్మాణం పీఆర్ ఇంజినీరింగ్ శాఖ పర్యవేక్షణలో చేపట్టారు. భవనం అంచనాలను బట్టి రూ.90 లక్షల నుంచి రూ.కోటి 10 లక్షల వరకు ఒక్కొక్క భవనానికి నిధులు కేటాయించారు. మొదటి విడతలో మంజూరైన తుఫాన్ షెల్టర్లు చాకిచర్ల, కనపర్తి గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఆయా తహశీల్దార్లకు అప్పగించారు. పాకలలోతుఫాన్ షెల్టర్ ఇటీవల పూర్తయింది. రెండో విడతలో మంజూరైన చీరాల ఓడరేవు, కొత్తపట్నం మండలంలో కె. పల్లెపాలెం, మోటుమాల, పాదర్తి, రంగాయపాలెం, గవళ్లపాలెం, మడనూరు గ్రామాల్లో తుఫాన్ షెల్టర్లు పూర్తయ్యాయి. అదే విధంగా ఉలవపాడు మండలంలో కరేడు గ్రామ పరిధిలో పెద్దపల్లెపాలెం, అలగాయపాలెం, కొత్తపల్లెపాలెం, గుడ్లూరు మండలంలోని మండవవారిపాలెం, సాలిపేట గ్రామాల్లో తుఫాన్ షెల్టర్లు కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. సింగరాయకొండలోని పోతయ్యగారి పట్టపుపాలెంలో నిర్మించతలపెట్టిన తుఫాన్ షెల్టర్ మాత్రం స్థలం లేకపోవడం వలన ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం దానికి గ్రామస్తుల చొరవతో స్థల సేకరణ జరిగి..రెండు రోజుల క్రితం బిల్డింగ్ నిర్మాణానికి సిద్ధమైందని ఇంజినీరింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం 16 తుఫాన్ షెల్టర్లలో 15 పూర్తయ్యాయి. ఒక్కటి మాత్రం ప్రస్తుతం పునాదులు పడే దశలో ఉంది. పూర్తయిన అన్ని తుఫాన్ షెల్టర్లను ఆయా మండలాల తహశీల్దార్లకు అప్పగించామని పీఐయు (పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ) ఈఈ యం.వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. మొత్తం తీర ప్రాంత గ్రామాల్లో 54 తుఫాన్ షెల్టర్లు ఉండగా వాటిలో కేవలం 24 మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. మిగిలినవి శిథిలావస్థకు చేరాయి. సొసైటీలు ఏర్పాటులో నిర్లక్ష్యం గ్రామస్తుల శుభకార్యాలకు నిత్యం ఉపయోగపడే లా ఆధునిక వసతులతో నగరాల్లో అపార్ట్మెంట్లను తలదన్నేలా కొత్త తుఫాన్ షెల్టర్లను నిర్మించారు. భవనం కింద ఖాళీ స్థలం, చుట్టూ కాంపౌండ్ వాల్, పార్కింగ్ వంటి సౌకర్యాలు ఉండేలా రూపకల్పన చేశారు. మనుషులకే కాకుండా పశువులు, మేకలు, గొర్రెలను రక్షించుకునేందుకు అనువుగా ఈ తుఫాన్ షెల్టర్ల నిర్మాణం జరిగింది. ప్రతి తుఫాన్ షెల్టర్‌కు ఒక సొసైటీ ఏర్పాటు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. సొసైటీల ఏర్పాటు ఆయా తహశీల్దార్లకు అప్పగించారు. గతంలో ఏర్పాటు చేసిన తుఫాన్ షెల్టర్లు నిత్యం వాడుకలో లేక నిరుపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరుతుండటంతో ఈసారి కొత్త పంథాను ఎంచుకొని నిర్మించారు. ప్రతి తుఫాన్ షెల్టర్‌కు గ్రామస్థాయిలో సొసైటీ ఏర్పాటు చేయాలి. ఆ బాధ్యత ఆయా తహశీల్దార్లకు అప్పగించారు. అయితే ఇప్పటి వరకు చాలా తుఫాన్ షెల్టర్లకు సొసైటీలు ఏర్పాటు చేయలేదని సమాచారం. -
తీరప్రాంతాల్లో ‘అల’జడి!
సాక్షి, ముంబై: కడలి ఉగ్రరూపం దాల్చడంతో ముంబైలోని తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. గత రెండ్రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడం, రోజురోజుకు అలల తాకిడి మరింతగా పెరుగుతుండడంతో సముద్ర తీరప్రాంతాలైన గేట్ వే ఆఫ్ ఇండియా, మెరైన్ డ్రైవ్, వర్లీ, శివాజీ పార్కు, మాహిం తదితర ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకొస్తోంది. నీటితోపాటు కొట్టుకొస్తున్న చెత్తాచెదారంతో ఈ ప్రాంతాలన్ని డంప్‌యార్డును తలపిస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండుమూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉండడంతో ఇక్కడి మురికివాడలను ఖాళీ చేయాల్సిందిగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరే షన్(బీఎసీ) ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం కూడా నాలుగున్నర మీటర్ల నుంచి ఐదు మీటర్ల ఎత్తు అలలు ఎగిసిపడడంతో సముద్రపు నీరంతా రోడ్లపైకి వచ్చింది. దీంతో మెరైన్ డ్రైవ్‌లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చౌపాటీ వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన పానీపూరి, బేల్‌పూరి, శేవ్పూరి తదితర తినుబండరాలు విక్రయించే స్టాళ్లన్ని అలలకు చెల్లాచెదురయ్యాయి. ఒకపక్క ఎగిసిపడుతున్న భారీ అలలు, మరోపక్క వేగంగా వీస్తున్న గాలులవల్ల నీరంతా దుకాణాల్లోకి వచ్చేస్తోంది. గేట్ వే ఆఫ్ ఇండియాకు కూత వేటు దూరంలో ఉన్న తాజ్‌మహల్ హోటల్ ప్రవేశ ద్వారం వరకు సముద్ర పు నీరు చేరడంతో ఆ ప్రాంతమంత చెత్తకుప్పగా మారింది. భారీగా వస్తున్న అలల కారణంగా గేట్ వే ఆఫ్ ఇండియాను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులను అనుమతించడం లేదు. శివాజీపార్క్ పరిసరాల్లో ఉన్న స్కౌట్ అండ్ గైడ్ ప్రధాన కార్యాలయం వరకు నీరు వచ్చి చేరింది. కీర్తి కాలేజీ రహదారిపైకి, కాలనీల్లోకి కూడా నీరు రావడంతో పార్కింగ్ చేసిన వాహనాలన్నీ పాడైపోయాయి. మాహిం ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ముందుజాగ్రత్త చర్యగా హై టైడ్ సమయంలో పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణశాఖ డిప్యూటీ డెరైక్టర్ కృష్ణానంద హోసాలికర్ చెప్పారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద 15 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. దాదర్, జుహూ, వర్సోవా, అక్సా బీచ్, గోరాయి తదితర తీర ప్రాంతాలవద్ద అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, జాతీయ విపత్తుల నిర్వహణ సిబ్బంది, బీఎంసీ భద్రతాశాఖ సిబ్బంది. ఇలా వందలాది మందిని నియమించారు. వీరంతా కోస్టుగార్డు సిబ్బందితో తరుచూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ‘అల’జడి కొనసాగే సమయం తేది సమయం అలల ఎత్తు (మీ.లో) 14 జూన్ మ.12.32 4.60 15 జూన్ మ.2.03 4.85 16 జూన్ మ.2.50 4.85 17 జూన్ మ.3.56 4.74 18 జూన్ సా. 4.23 4.55 -
వర్షం ఉంది
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : లెహర్ తుఫాన్ ముప్పు తప్పినా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగానే ఉంది. గురువారం మచిలీపట్నం వద్ద తుఫాన్ తీరం దాటింది. ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో స్పెషల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన మండలాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రాక్టర్లు, లారీలను రెడీగా ఉంచారు. కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు అలాగే ఉంచారు. లెహర్ ముప్పు తప్పినట్లు తెలియడంతో జిల్లాకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు హైదరాబాద్‌లోనే ఉన్నారు. పై-లీన్ తుఫాన్ కంటే లెహర్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం ముందస్తుగానే రంగంలోకి దిగింది. జిల్లాలోని 11 తీర ప్రాంతాలకు 11 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వారు బుధవారం నుంచి అక్కడే ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. భారీ వర్షాలు కురిసి రాకపోకలు స్తంభిస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు బియ్యం, కిరోసిన్ సిద్ధంగా ఉంచారు. భారీ వర్షాలతో పాటు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు రావడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోతే వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాకు జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి ప్రత్యేకంగా బృందాలను రప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలెక్టర్ విజయకుమార్ కోరారు. తుఫాన్ తీవ్రత గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో బృందాలను అక్కడకు పంపామని, అత్యవసమైతే ప్రకాశం జిల్లాకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. అన్నిరకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా హెలికాప్టర్‌ను కూడా జిల్లా యంత్రాంగం రెడీగా ఉంచింది. వేటకు సిద్ధమైన మత్స్యకారులు కొన్ని రోజుల నుంచి వేటకు అంతరాయం కలుగుతుండటంతో మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వేట తప్పితే మరో జీవనాధారం లేని వారి కుటుంబాలు కొన్ని రోజులు పస్తులతో గడపాల్సిన దుస్థితి నెలకొంది. వరుసపెట్టి ప్రకృతి వైపరీత్యాలు వస్తుండటంతో తల్లడిల్లిన మత్స్యకారులు శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో వేటకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల్లో 38 మరపడవలు, 2110 యాంత్రీకరణ పడవులు, 2020 నాటు పడవలున్నాయి. సముద్రంలోకి వేటకు వెళ్లడం ద్వారా వచ్చే చేపలతో మత్స్యకారులు తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కొన్ని వారాల నుంచి వారి పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకదాని వెంట మరొకటి తుపాన్లు వస్తుండటంతో ఉపాధి దెబ్బతింది. ఈ నేపథ్యంలో లెహర్ తుఫాన్ వాయుగుండంగా మారి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చని రాష్ట్ర స్థాయి అధికారులు ప్రకటించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. తుపాన్లు రావడం, సముద్రం అల్లకల్లోలంగా ఉండటం, అలల ఉధృతి పెరిగి పడవలు, వలలు ఎక్కడ కొట్టుకుపోతాయోనని అనేక మంది మత్స్యకారులు వాటిని ఒడ్డుకు దూరంగా పెట్టుకున్నారు. వేటకు వెళ్లవచ్చని ప్రకటన రావడంతో పడవలు, వలలు సిద్ధం చేసుకుంటున్నారు. పెపైచ్చు తుఫాన్ల కారణంగా సముద్రం కొంత కుదుపులకు గురికావడం, ఆ సమయంలో వేటకు వెళితే చేపలు అధికంగా పడనుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు మరింత ఉత్సాహం చూపుతున్నారు. -
పెను ప్రళయం సృష్టించనున్న లెహర్
లెహర్ తుఫాను పెను ప్రళయం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. దీని ప్రభావం వల్ల గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గాలుల వేగం 140 కిలోమీటర్ల వరకు ఉందని, ప్రధానంగా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలపై తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుందని చెప్పారు. ఇంకా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు తదితర జిల్లాలపైనా తుఫాను తన ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు. దీని ప్రభావం వల్ల రేపు సాయంత్రం నుంచే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తుఫాను తీరం దాటే సమయంలో పెను విధ్వంసం సృష్టిస్తుందని చెప్పారు. భారీగా పంట నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. రోడ్డు, రైలు రవాణాపై నియంత్రణ అవసరమని, శ్రీకాకుళం, రణస్థలం తదితర ప్రాంతాలపై లెహర్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో అధికారులందరినీ ఆయన అప్రమత్తం చేశారు. ఇక విశాఖ జిల్లా యంత్రాంగం కూడా తుఫాను ముప్పు బారి నుంచి ప్రజలను రక్షించేందుకు సర్వ సన్నద్ధం అవుతోంది. లెహర్ నేపథ్యంలో విశాఖ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాను తీరం దాటుతుందని భావిస్తున్న 28వ తేదీన పాఠశాలలన్నింటికీ సెలవు ప్రకటించారు. ఆర్మీ, నేవీ బృందాలను అప్రమత్తం చేశారు. దాదాపు 48 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. పెను గాలుల వల్ల కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతినకుండా చూసేందుకు ముందుగానే సెల్ ప్రొవైడర్లతో కలెక్టర్ ఆరోఖ్యరాజ్ సమావేశం నిర్వహించారు. మరోవైపు లెహర్ తుఫాను నేపథ్యంలో రేపు రాత్రి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం 127 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 30 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో సర్పంచ్ల సాయం తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు. -
హెలెన్ తుపానుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం హెలెన్ తుపానుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏకె మహంతితో పాటు ఉన్నతాధికారులుతో సమీక్ష జరిపారు. సముద్ర తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు. జాతీయ విపత్తు నివారణ సంస్థతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. అవసరం అయితే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తుర్పూ, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లా అధికార యంత్రాగం జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందాలతో కలిసి పనిచేయాలన్నారు. కాగా తూర్పుగోదావరి జిల్లాలో సముద్రంలో చిక్కుకున్న 20మంది మత్స్యకారులను నేవీ సిబ్బంది రక్షించారు. హెలికాప్టర్ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి -
జల దిగ్బంధంలో ఒంటూరు గ్రామం
సోంపేట(కవిటి), న్యూస్‌లైన్: శుక్రవారం సాయంత్రం వారందరినీ కుసుంపురంలోని పునరావాస కేంద్రానికి తరలించారు..శనివారం ఉదయం తుఫాన్ ప్రభావం పెద్దగా కనిపించలేదు..దీంతో ఏమీ కాదులే.. అన్న ధీమాతో వారంతా స్వగ్రామానికి వెళ్లిపోయారు.మధ్యాహ్నానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈదురు గాలులు మొదలై సాయంత్రానికి ప్రచండ వేగం అందుకున్నాయి. వాటికి తోడు భారీ వర్షం. సాయంత్రం 6 గంటల తర్వాత పరిస్థితి గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. ఫలితం.. ఆ గ్రామస్తుల పరిస్థితి నరకంలో చిక్కుకున్నట్లయ్యింది. రెండు రోజులపాటు అదే ఎలా గడిపారో వారు చెబుతుంటేనే.. గగుర్పాటు కలిగింది. స్వయంగా అనుభవించిన వారెంత నరకయాతన అనుభవించారో!.. మంగళవారం కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణించి అతి కష్టం మీద ఒంటూరు గ్రామానికి వెళ్లిన ‘న్యూస్‌లైన్’ విలేకరికి అక్కడి ప్రజలు తాము అనుభవించిన వ్యథను కళ్లకు కట్టారు. కవిటి మండలంలో సముద్ర తీరంలో ఉన్న గ్రామం ఒంటూరు. మంగళవారం నాటికి కూడా ప్రపంచంతో సంబంధం లేకుండా కునారిల్లుతోంది. శుక్రవారం సాయంత్రం పునరావాస కేంద్రానికి తరలివెళ్లిన గ్రామానికి చెందిన 250 మంది శనివారం ఉదయం తుఫాన్ ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో గ్రామానికి తిరిగి వెళ్లిపోయారు. ఆ మధ్యాహ్నం నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. తుఫాన్ విలయంలో చిక్కుకున్నారు. గ్రామంలోకి నీరు చొచ్చుకొచ్చింది. రెండురోజులు పాటు దిగ్బంధించింది. శనివారం సాయంత్రం ఒకటి రెండుసార్లు అధికారులు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫోన్లు పని చేయడం మానేశాయి. దాంతో సహాయం కోరు అవకాశం కూడా లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీశారు. మంగళవారం గ్రామానికి వెళ్లిన ‘న్యూస్‌లైన్’ను చూసి వారు ఆశ్చర్యపోయారు. ఇంతవరకు ఒక్క అధికారి కూడా రాలేదు. ఎలా ఉన్నామని పలకరించేవారు కూడా లేరు. రెండురోజులుగా గ్రామంలో నీరు నిలబడిపోయింది. కనీసం వంట చేసుకుందామన్నా అవకాశం లేకుండా పోయిందని వారు ఆవేదన వెళ్లబోసుకున్నారు. కష్టం చెప్పుకొనేందుకు మనిషి దొరికాడన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒక దశలో శనివారం రాత్రి మా పని అయిపోయిందనే అనుకున్నామని.. ఆదివారం తెల్లవారి తుఫాను ప్రభావం తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు. రెండురోజులు ఆహారం లేక పిల్లాపాపలతో చాలా ఇబ్బందులు పడ్డామని గుండెల్లో దాచుకున్న బాధను వెళ్లగక్కారు. ఈ రోజు వరకు గాంజి కాచుకొని తింటున్నామని వెల్లడించారు. తాగడానికి గ్రామ బావిలోనే బురదనీరే గతి అని చెప్పారు. గ్రామం నుంచి బయటకు వెళ్లే దారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఒంటూరుతో పాటు పక్కనే ఉన్న కళింగపట్నం ప్రజలు కూడా అవస్థలు పడుతున్నారు. కళింగపట్నం దగ్గర బ్రిడ్జి దిగువన వేసిన తాత్కాలిక కంకర రోడ్డు కొట్టుకుపోవడంతో తెప్పపై ఆ ఊరికి వెళ్లాల్సి వస్తోంది. వినూత్నంగా చార్జింగ్ చేసిన యువకుడు ఒంటూరు ప్రజల బాగోగుల గురించి ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి బంధువులు ఆందోళన చెందుతుంటారని గుర్తించిన గ్రామానికి చెందిన యువకుడు గుడియా రామారావు వారికి చేతనైన సాయం చేయాలన్న సంకల్పంతో సొంత ప్రతిభతో తన సెల్‌కి చార్జింగ్ చేశాడు. ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ టార్చిలైట్లోని బ్యాటరీ తీసి, దాన్ని మొబైల్ ఫోన్ బ్యాటరీతో అనుసంధానం చేసి చార్జింగ్ చేశాడు. ఆ ఫోన్ ద్వారా గ్రామస్తుల బాగోగులను వారి బంధువులకు చేరవేసి సహకరిస్తున్నారు. బురద నీరే గతి గ్రామంలో తాగడానికి నీరు లేదు. మంచినీటి బావి మొత్తం బురదగా మారింది. ఆ నీరే మరగబెట్టి తాగుతున్నాం. -ధనుంజయరావు, ఒంటూరు ఒక్క అధికారీ రాలేదు తుఫాను తరువాత నేటికి గ్రామానికి ఒక్క అధికారి గానీ, నాయకులు గానీ రాలేదు. రెండురోజులు పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. -రామారావు, ఒంటూరు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలి యడం లేదు. గ్రామానికి వెళ్లాలంటే తెప్పల మీద ఆధారపడాల్సి వస్తుం ది. అధికారులు స్పందించాలి. -ఎస్.కూర్మమ్మ, కళింగపట్నం -
తుఫాను ప్రభావం.. యంత్రాంగం అప్రమత్తం
తుఫాను హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఫైలిన్ తుఫాను ఈరాత్రికే విశాఖ - పోర్ట్ బ్లెయిర్ మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో దాదాపు 25 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురిసే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో మత్స్యకారులు వేటకు వెళ్లొదని తెలిపారు. గుంటూరు, తెనాలి ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటయ్యాయి. నిజాపట్నం ఓడరేవులో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాపై తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లా కేంద్రం ఏలూరు సహా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అధికారులతో కలెక్టర్ సిద్ధార్థజైన్ సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా టోల్ ఫ్రీ నెంబరు. 08812 230617. కాకినాడ, గంగవరాల్లో రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేయడంతో పాటు స్పెషల్ సిగ్నల్ నెం.3 కూడా జారీ చేశారు. ప్రకాశం జిల్లాలో జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ తుఫాను హెచ్చరిక జారీ చేశారు. 48 గంటలపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నం. 08592 281400. మండల అధికారులు ప్రధాన కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు.