తుఫాను హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఫైలిన్ తుఫాను ఈరాత్రికే విశాఖ - పోర్ట్ బ్లెయిర్ మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో దాదాపు 25 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురిసే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో మత్స్యకారులు వేటకు వెళ్లొదని తెలిపారు. గుంటూరు, తెనాలి ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటయ్యాయి. నిజాపట్నం ఓడరేవులో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాపై తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లా కేంద్రం ఏలూరు సహా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అధికారులతో కలెక్టర్ సిద్ధార్థజైన్ సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా టోల్ ఫ్రీ నెంబరు. 08812 230617.
కాకినాడ, గంగవరాల్లో రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేయడంతో పాటు స్పెషల్ సిగ్నల్ నెం.3 కూడా జారీ చేశారు. ప్రకాశం జిల్లాలో జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ తుఫాను హెచ్చరిక జారీ చేశారు. 48 గంటలపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నం. 08592 281400. మండల అధికారులు ప్రధాన కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు.
తుఫాను ప్రభావం.. యంత్రాంగం అప్రమత్తం
Published Wed, Oct 9 2013 9:43 PM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement