న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ హుదూద్ తుఫానుపై ఢిల్లీ నుంచే అధికారులతో శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మంత్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.
వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించి తనకు సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం కేసీఆర్ ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే.