అగ్రరాజ్యం అమెరికాను శీతాకాల తుపాను భయకంపితులను చేస్తోంది. సుమారు పది లక్షల మంది అమెరికన్లు భారీ శీతాకాలపు తుఫానుకు ప్రభావితమయ్యారు. ఈ తుపాను కారణంగా ఈ దశాబ్దంలో అత్యంత భారీ హిమపాతం, అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మధ్యఅమెరికాను తాకిన ఈ తుఫాను మరో రెండు రోజుల్లో తూర్పు దిశగా కదులుతుందని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యుఎస్) తెలిపింది. ఈ నేపధ్యంలో కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి(Emergency) ప్రకటించారు. మిసిసిపీ, ఫ్లోరిడాతో సహా ప్రాంతాల్లో తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. ఈ తుపాను కారణంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు ముప్పు పొంచివుందని ఎన్‌డబ్ల్యుఎస్ పేర్కొంది.
ఆర్కిటిక్ చుట్టూ ప్రసరించే చల్లటి గాలితో కూడిన పోలార్ వోర్టెక్స్(Polar Vortex) వల్ల ఈ విపరీత వాతావరణం ఏర్పడుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దశాబ్దంలో సంభవించిన అత్యంత భారీ హిమపాతం ఇదేనని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇది 2011 తరువాత అమెరికాలో అత్యంత శీతల జనవరిగా పేర్కొంది. చారిత్రక సగటు కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు ఒక వారం పాటు కొనసాగనున్నాయని పేర్కొంది. ఆదివారం సాయంత్రానికి తుఫాను వచ్చే అవకాశం ఉన్న తూర్పు తీరంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి.
ఎన్‌డబ్ల్యుఎస్ తెలిపిన వివరాల ప్రకారం సెంట్రల్ అమెరికాలో ఆదివారం తుపాను కారణంగా జనజీవనానికి ఆటంకాలు ఏర్పాడతాయి. పలు చోట్లు రోడ్లను మూసివేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాన్సాస్, ఇండియానా(Indiana)లోని కొన్ని ప్రాంతాల్లో కనీసం 8 ఇంచుల మేరకు మంచు కురిసే అవకాశాలున్నాయి. మిడ్‌వెస్ట్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంచు తుఫానులు తలెత్తే అవకాశం ఉంది. మిస్సౌరీ, ఇల్లినాయిస్, కెంటుకీ, వెస్ట్ వర్జీనియా ప్రాంతాలలో భారీగా మంచు కురిసే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: కాశీలోనూ కుంభమేళా ఉత్సాహం.. పోటెత్తనున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment