Winter Storm
-
అమెరికాలో భీకర మంచు తుపాను (ఫొటోలు)
-
అమెరికాలో భీకర మంచు తుపాను.. 1989 తర్వాత తొలిసారిగా బ్లిజ్జార్డ్ వార్నింగ్
పియెర్రె: అమెరికాను భీకర మంచు తుపాను వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి. వందలాది నివాసాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లు మూతబడ్డాయి. వాతావరణ విభాగం 1989 తర్వాత మొదటిసారిగా మంచు తుపాను (బ్లిజ్జార్డ్) హెచ్చరికలను జారీ చేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 4.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా సుమారు 24 రాష్ట్రాల్లోని 6.5 కోట్ల మంది ప్రజలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. వ్యోమింగ్, ఆరిజోనా, న్యూ మెక్సికో, పోర్ట్‌ల్యాండ్, ఓరెగాన్ పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్ప డింది. మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియా ల్లో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో జనం రాత్రిళ్లు చీకట్లోనే గడిపారు. మంచు, చలిగాలులతో కాలిఫోర్నియా, సియెర్రా నెవడాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సుమారు 1,800 విమాన సర్వీసులు రద్దు కాగా, మరో 6 వేలకు పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇలా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఇందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నాష్‌విల్లేలో బుధవారం అత్యధికంగా 26.67 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై 127 ఏళ్ల రికార్డు బద్దలైందని అధికారులు చెప్పారు. ఇండియానా పొలిస్, సిన్సినాటి, అట్లాంటా, లెక్జింగ్టన్, కెంటకీ, అలబామాల్లోనూ ఇదే స్థాయిలో ఎండలున్నాయి. -
Bomb Cyclone 2022: తీరం దాటని తుపాను బాంబు
చలి... నీళ్ళు కాదు మనుషులే నిలువునా గడ్డకట్టే చలి. మైనస్ 8 నుంచి మైనస్ 48 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతతో ఇళ్ళను కప్పేసిన హిమపాతం. గింయుమనే ఈదురుగాలులు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేరు... వెచ్చగా ఇంట్లో ఉందామంటే కనీసం కరెంట్ లేదు. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా విహార యాత్రలకు వెళదామంటే, మంచుతో హైవేలు మూత బడ్డాయి. వేల కొద్దీ సర్వీసులు రద్దయి, విమానాలు నడవడం లేదు. తీవ్ర మంచు తుపాను రకమైన ‘బాంబు సైక్లోన్’ దెబ్బతో అమెరికాలోని అనేక రాష్ట్రాలు, కెనడాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. సర్వసాధారణంగా సమశీతోష్ణంగా ఉండే అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కనివిని ఎరుగని స్థితి. ఇప్పటికి మరణాల సంఖ్య యాభై లోపే అంటున్నా, మోకాలి లోతు మంచులో కూరుకుపోయిన ఇళ్ళూ వాకిళ్ళనూ శుభ్రం చేసి, విద్యుత్ సరఫరాను సక్రమంగా, అందరికీ అందుబాటులోకి తెచ్చేలోగా ఇంటాబయటా ఇరుక్కుపోయిన మరెందరికి ప్రాణం మీదకు వస్తుందో చెప్పలేం. అత్యవసర వాహనాలు సైతం కదలడానికి కష్టమవుతున్న ప్రాణాంతక రోడ్లతో మరో వారం పరిస్థితులు ఇలానే ఉంటాయన్న వార్తలు భీతి గొల్పుతున్నాయి. కెనడా సరిహద్దు నుంచి మెక్సికో సరిహద్దు వరకు 3 వేల కిలోమీటర్ల పైగా ఇదే దుర్భర వాతావరణం. అమెరికా జనాభాలో 60 శాతం మందికి ఏదో రకమైన ఇబ్బందులు. న్యూయార్క్ రాష్ట్రం బఫలో నగరం మంచు తుపాను గాలులు, హిమపాతంతో స్తంభించిపోయింది. నయాగరా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 43 అంగుళాల ఎత్తున మంచు పేరుకుంది. మరిగే నీటిని గాలిలోకి విసిరితే, తక్షణమే మంచుగడ్డగా మారుతున్న పరిస్థితి చూశాక, ఇది ‘తరానికి ఒకసారి వచ్చే’ మంచు తుపానని ఎందుకన్నదీ అర్థమవుతుంది. అట్లాంటిక్ మహాసముద్ర తుపానులు, చక్రవాతాల సీజన్ అమెరికాకు కొత్త కాదు. ఉష్ణమండల ప్రాంతాల్లో వేడెక్కిన సముద్ర జలాల వల్ల వేసవిలో చక్రవాతాలు ఏర్పడతాయి. ఆ తుపానులు తెచ్చే వరదల జలవిలయం ఒక ఎల్తైతే, తాజాగా విరుచుకుపడ్డ శీతకాలపు మంచు తుపాను మరో ఎత్తు. 24 గంటల్లో 24 మిల్లీ బార్స్, అంతకన్నా ఎక్కువగా వాతావరణ పీడనం ఒక్కసారిగా చకచకా పడిపోయి, బలమైన తుపానుగా మారితే ‘బాంబు సైక్లోన్’ అంటారు. బాంబు పేలినట్టు పీడనం హఠాత్తుగా పడిపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని అలా పిలుస్తారు. ఈదురుగాలులు, కన్ను పొడుచుకున్నా కనిపించని తీవ్ర హిమపాతం ఈ తుపానుతో అనూహ్య పరిణామాలు. ఒంటిపై ఏమీ లేకుండా 5 నిమిషాలుంటే, మనిషి మొద్దుబారి పోతాడు. ఇవెంత ప్రమాదకరమో చెప్పేందుకు 1980లో శాస్త్రవేత్తలు బాంబు సైక్లోన్ అనే మాట సృష్టించారు. ఇలియట్ అని పేరుపెట్టిన తాజా మంచు తుపాను దెబ్బకు ఒక దశలో 17 లక్షల మందికి పైగా విద్యుత్ సరఫరా లేక ఇక్కట్ల పాలయ్యారు. సోమవారానికి ఆ సంఖ్య 2 లక్షల లోపు నకు రావడం ఒకింత సాంత్వన. 2021లో టెక్సాస్‌లో భీకర హిమపాతంతో పవర్‌గ్రిడ్ విఫలమై, 200 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్న విషాదం లాంటివి పునరావృతం కాకపోవడం ఊరట. అమెరికాలో 13.5 కోట్ల మందిని కడగండ్ల పాల్జేసిన మంచు తుపానుతో పంటలు, పశువులు, చివరకు రైల్వేలైన్లు దెబ్బ తినిపోతున్నాయి. నిరుడు ఇలాగే శీతకాలపు మంచులో రైతులు తమ పశువులకు దాణా, నీళ్ళు అందించలేక తిప్పలు పడ్డారు. ఈసారి నిన్నటి దాకా దుర్భిక్షంతో అల్లాడిన పంటలకు ఇది కొత్త దెబ్బ. ఈ తుపానుండేది కొద్ది రోజులైనా, ఆహారధరలు పెరగడం సహా ప్రభావం దీర్ఘకాలికమే. మరోపక్క వారం రోజులుగా ఉత్తర జపాన్‌లో శీతకాలపు సగటుకు దాదాపు మూడు రెట్లు ఎక్కువ మంచు కురిసి, ప్రాణహాని జరిగింది. అమెరికా లానే జపాన్‌లోనూ రైళ్ళు, విమాన సేవల రద్దు, కరెంట్ కష్టాలు. ఇవన్నీ ఇప్పుడు మేలుకొలుపులు. ప్రకృతిపై మనం సాగించిన తీవ్ర విధ్వంసానికి అనుభవిస్తున్న ఫలితాలు. పర్యావరణ మార్పులు మనపై చూపుతున్న ఆగ్రహానికి ప్రతీకలు. అరుదుగా వస్తాయనే బాంబు సైక్లోన్లు ఆ మధ్య 2019లో, మూడేళ్ళకే మరోసారి ఇప్పుడూ రావడం గమనార్హం. ఆందోళనకరం ఏమిటంటే, పర్యావరణ మార్పుల పుణ్యమా అని భవిష్యత్తులో మరిన్ని బాంబు సైక్లోన్లు వస్తాయట. ఒక్క బఫలో నగరంలోనే∙1976 నాటి రికార్డ్‌కు రెట్టింపు హిమపాతం గత శుక్రవారం జరిగింది. 1878 తర్వాత గత 144 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. ఇవన్నీ పదే పదే మనకు చెబుతున్నది ఒక్కటే... ఇక ఆలస్యం చేస్తే ప్రపంచానికి ముప్పు. ఇప్పటికే ఋతువులు గతులు తప్పాయి. ఈ ఏడాది బ్రిటన్, యూరప్‌లలో కనివిని ఎరుగని వడగాడ్పులు, సతతం పారే నదులు ఎండిపోవడం చూశాం. ఎండ, వాన, చలి – ప్రతిదీ గరిష్ఠానికి చేరుతున్న కాలంలోకి వచ్చేశాం. మనం చేస్తున్న ప్రకృతి విధ్వంసం, విడుదల చేస్తున్న గ్రీన్హౌస్ వాయువులే ఇప్పుడు శాపాలయ్యాయి. నామమాత్ర ‘కాప్’ సదస్సుల లాంటివి పెట్టి, ఊకదంపుడు ఉపన్యాసాలిస్తే ఉపయోగం లేదు. అగ్రరాజ్యాల అలక్ష్యం సహా అనేక కారణాలతో పర్యావరణ పరిరక్షణకు పెట్టుకున్న లక్ష్యాలను ప్రపంచం చేరుకున్న దాఖలాలూ లేవు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత వర్ధమాన దేశాలదేనని తప్పించుకోజూస్తే కష్టమే. ప్రకృతి హెచ్చరికల్ని విస్మరిస్తే, మూల్యం చెల్లించుకోక తప్పదు. అగ్రరాజ్యంలో తాజా మంచు తుపాను బీభత్సం అచ్చంగా జగత్ప్రళయ సినిమాల్లోని దృశ్యాల్లా ఉన్నాయని పలువురి వ్యాఖ్య. ఇకనైనా కళ్ళు తెరవకుంటే భూతాపోన్నతితో వచ్చేది అచ్చంగా ప్రళయమేనని గుర్తించాలి. ప్రపంచ దేశాలన్నీ తగు చర్యలకు నడుం బిగించాలి. -
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. నాలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
అమెరికాలో మంచు తుపాను విలయంతో నాలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. తూర్పు కోస్తా రాష్ట్రాలైన న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా నగరాల్లోని రహాదారులపై రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. శీతలగాలుల తీవ్రతతో ఈ హిమపాతం మరో నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందని అమెరికా వాతావరణ విభాగం అంచనా వేసింది. తుపాను కారణంగా అత్యవసర సేవలు మినహా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మంచుతుపాను ధాటికి దేశవ్యాప్తంగా నాలుగు వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్, షికాగో, బోస్టన్ రాష్ట్రాల్లో విమానాశ్రయాలు పూర్తిగా మంచులో నిండిపోయాయి. రోడ్లపై రెండు అడుగులకు పైగా మంచు పేరుకు పోవడంతో అక్కడి రోడ్లన్ని ప్రమాదకరంగా మారాయి. మంచు కారణంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో ఇప్పటికే చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. -
అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ.. 1,200 విమానాలు రద్దు
అట్లాంటా: అమెరికా ఆగ్నేయ ప్రాంతాన్ని చలి తుఫాను, పెనుగాలులు, హిమపాతం వణికిస్తున్నాయి. వీటి ప్రభావంతో చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయాలు, వృక్షాలు నేలకూలడం, రోడ్లన్నీ మంచుతో నిండిపోవడం జరుగుతోంది. జార్జియా, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా తదితర ప్రాంతాలన్నీ ఆదివారం నుంచి చలిపులి చేతికి చిక్కి వణుకుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు హైవే పెట్రోల్ అధికారులు తెలిపారు. (చదవండి: లైన్లో నిలబడితే డబ్బులే డబ్బులు.. గంటకు రూ.2 వేలు పక్కా!) కారును మంచు కప్పేసిన దృశ్యం ఫ్లోరిడాలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో విరుచుకుపడ్డ టోర్నడో బీభత్సంతో ఒక ట్రైలర్ పార్క్ నాశనమైంది. చార్లట్ డగ్లస్ విమానాశ్రయం నుంచి 1,200కు పైగా విమానాలను రద్దు చేశారు. కరోలినాలో దాదాపు 1.5 లక్షల మంది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్ పై ప్రభావం ఉండకపోయినా, లాంగ్ ఐలాండ్, కనెక్టికట్ తీరప్రాంతాల్లో ప్రభావం ఉంటుందని అంచనా. ఒహాయో, పెన్సిల్వేనియాల్లో 6– 13 అంగుళాల మేర హిమపాతం ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. (చదవండి: అఫ్గనిస్తాన్‌లో భారీ భూకంపం.. 26 మంది మృతి) -
మంచు గుప్పిట్లో అమెరికా.. ముప్పులో 15 కోట్ల మంది
టెక్సాస్: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలను మంచు ముంచేస్తోంది. భారీగా కురుస్తున్న మంచుతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. విమానాలను రద్దు చేశారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి వీల్లేకుండా రహదారులన్నీ మంచుతో కప్పేసి ఉన్నాయి. దాదాపుగా 15 కోట్ల మంది అమెరికన్లకి మంచు ముప్పులో ఉన్నట్టుగా ది నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరించింది. టెక్సాస్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో 40 లక్షల మందికిపైగా అమెరికన్లు నీళ్లు, కరెంట్ లేక అల్లాడిపోతున్నారు. టెక్సాస్, అలబామా, ఒరెగాన్, ఒక్లహోమా, కాన్సస్, కెంటకీ, మిసిసిపీ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. టెక్సాస్‌లో పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. విద్యుత్ ప్లాంట్లు సరిగా పని చేయడం లేదు. పైపుల్లో నీరు గడ్డ కట్టుకపోవడంతో ప్రజలు నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ నేషనల్ గార్డ్ సాయం కోరారు. కన్సాస్ గవర్నర్ కరెంట్ పొదుపుగా వాడుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఇక కెంటకీలో మరింత బలంగా చలి గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలన్నీ పాటించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఇప్పటికీ 27 లక్షల మందికిపైగా ప్రజలు చీకట్లోనే మగ్గిపోతున్నారు. లూసియానా, డల్లాస్ రాష్ట్రాల్లోనూ మంచు బీభత్సం నెలకొంది. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న బలమైన చలిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నార్త్ కరోలినాలో టోర్నడోలకు ముగ్గురు మరణించారు. చదవండి: (పార్లమెంట్ హౌజ్‌లోనే అత్యాచారం) -
అమెరికాలో మంచు తుపాను
-
అమెరికాను వణికిస్తున్న మంచుతుఫాను