ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని కోస్తా జిల్లాలకు రానున్న 48 గంటల్లో మరో తుపాను పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తీవ్ర వర్షాలతో అల్లాడుతున్న తమిళనాడు నవంబర్ 29 నాటికి మరో తుపాన్‌ను ఎదుర్కొనబోతోంది. తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన సూచనల ప్రకారం.. రానున్న 48 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నవంబర్ 29 నాటికి అది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా.
ஆழ்வார்பேட்டை பாரதிதாசன் சாலை மழை நீரால் மூழ்கியது.
— suwathy venugopal (@suwavenus) November 27, 2021
People.. be safe, drive carefully wherever you see the water as there are damaged roads as well. #ChennaiRains #chennaifloods #Rains #TamilNadu #NEWS #NewsBreak pic.twitter.com/gPuHgoMA7C
#Palar river witnessing the flow of more than 1 lakh cusecs of water #TamilNadu #Vellore #AP #Karnataka pic.twitter.com/nIlLu4nXSp
— Shabbir Ahmed (@Ahmedshabbir20) November 21, 2021
అయితే, తమిళనాడుతోపాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలలో పరిస్థితి రాబోయే 2-3 రోజుల్లో మరింత ఉధృతంగా మారనుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మని కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా డిసెంబర్ 1 నాటికి మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ, నైరుతి ప్రాంతాలతో పాటు గుజరాత్‌లోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Visual from West Mambalam, #Chennai#ChennaiRain @karthickselvaa @Stalin__SP @vedhavalli_13 @dharannniii #Tamilnadu pic.twitter.com/l4vC27lFoo
— Tamilnadu Galatas (@tamilnadugalata) November 27, 2021
Beautiful weather at Beasant Nagar beach, Chennai #ChennaiRains2021 #TamilNadu #Chennai pic.twitter.com/Zqk23ZXA5P
— Vidhu Trivedi 🇮🇳 (@vidhu0522) November 27, 2021
Comments
Please login to add a commentAdd a comment