South Andaman sea
-
అండమాన్‌లో అల్పపీడనం.. తుపానుగా మారేందుకు ఎక్కువ అవకాశం
సాక్షి, అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రంలో మంగళవారం (నేడు) అల్పపీడనం ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది ఉపరితల ఆవర్తనంగా బ్యాంకాక్ పరిసరాల్లో కొనసాగుతూ నేడు అండమాన్‌కు చేరుకునే అవకాశం ఉందని అంచనా. అల్పపీడనం ఏర్పడ్డాక ఇది 48 గంటల్లో వాయుగుండంగా బలపడుతుంది. ఆ తర్వాత తుపానుగా మారేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని గమనాన్ని బట్టి మంగళవారం పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: (తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి: విజయసాయిరెడ్డి) తుపానుగా మారితే కాకినాడ తీరం నుంచి ఒడిశా వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తరాంధ్రపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. తుపానుగా మారితే వచ్చే నెల 2 నుంచి దీని ప్రభావం రాష్ట్రంపై ఉండనుంది. మరోవైపు కోమరిన్, శ్రీలంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల సోమవారం కూడా నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
తమిళనాడుకు మరో తుపాను హెచ్చరిక! రానున్న 48 గంటల్లో..
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని కోస్తా జిల్లాలకు రానున్న 48 గంటల్లో మరో తుపాను పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తీవ్ర వర్షాలతో అల్లాడుతున్న తమిళనాడు నవంబర్ 29 నాటికి మరో తుపాన్‌ను ఎదుర్కొనబోతోంది. తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన సూచనల ప్రకారం.. రానున్న 48 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నవంబర్ 29 నాటికి అది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా. ஆழ்வார்பேட்டை பாரதிதாசன் சாலை மழை நீரால் மூழ்கியது. People.. be safe, drive carefully wherever you see the water as there are damaged roads as well. #ChennaiRains #chennaifloods #Rains #TamilNadu #NEWS #NewsBreak pic.twitter.com/gPuHgoMA7C — suwathy venugopal (@suwavenus) November 27, 2021 #Palar river witnessing the flow of more than 1 lakh cusecs of water #TamilNadu #Vellore #AP #Karnataka pic.twitter.com/nIlLu4nXSp — Shabbir Ahmed (@Ahmedshabbir20) November 21, 2021 అయితే, తమిళనాడుతోపాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలలో పరిస్థితి రాబోయే 2-3 రోజుల్లో మరింత ఉధృతంగా మారనుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మని కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా డిసెంబర్ 1 నాటికి మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ, నైరుతి ప్రాంతాలతో పాటు గుజరాత్‌లోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. Visual from West Mambalam, #Chennai#ChennaiRain @karthickselvaa @Stalin__SP @vedhavalli_13 @dharannniii #Tamilnadu pic.twitter.com/l4vC27lFoo — Tamilnadu Galatas (@tamilnadugalata) November 27, 2021 Beautiful weather at Beasant Nagar beach, Chennai #ChennaiRains2021 #TamilNadu #Chennai pic.twitter.com/Zqk23ZXA5P — Vidhu Trivedi 🇮🇳 (@vidhu0522) November 27, 2021 -
మరో వాయు‘గండం’
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. సోమవారం రాత్రి వాయుగుండంగా మారనుంది. నివర్ తుపాను నుంచి తెప్పరిల్లుతున్న రైతులకు ఈ సమాచారం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించడంతో వారికి దిక్కుతోచడంలేదు. ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం వద్ద కేంద్రీకృతమైన ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. తొలుత వాయుగుండంగా మారే ఈ అల్పపీడనం తరువాత 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో డిసెంబరు 1 నుంచి 3 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలోని కరైకల్‌లో అతి భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలోకి చేపలు పట్టేవారు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. రాయలసీమ.. దక్షిణ కోస్తా ప్రాంతాల్లో చాలాచోట్ల ఆదివారం భారీవర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో కందుకూరులో 9 సెం.మీ., కావలిలో 6, వెలిగండ్ల, సీతారామపురం, కొనకనమిట్లల్లో 3, వింజమూరు, వెంకటగిరి, బెస్తవారిపేట, ఉదయగిరి, పొదిలిల్లో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిలువునా ముంచిన ‘నివర్’ అక్టోబర్‌లో కురిసిన భారీవర్షాలు, వరదలు తెచ్చిన కష్టాల నుంచి కోలుకోకముందే నివర్ తుపాను మరో దెబ్బతీసింది. పంటలను తుడిచిపెట్టేసింది. చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో పలు చెరువులు, కుంటలు, రోడ్ల తెగిపోయాయి. జాతీయ రహదారుల్లో సైతం వంతెనలు తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పంటచేలు చెరువులను తలపిస్తున్నాయి. కోతకొచ్చిన వేలాది హెక్టార్ల వరి పంట నీటమునిగింది. పలుచోట్ల కోసిన వరి పనలు నీళ్లల్లో తేలాయి. కోతకు వచ్చిన పంట నేలవాలింది. అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమమయ్యాయి. మిరప, వంగ, బెండ, టమోటా, కాకర, బీర తదితర కూరగాయలు, ఆకుకూరల తోటలు నీళ్లలో కుళ్లిపోయాయి. అరకొరగా ఉన్న పంటనైనా దక్కించుకోవాలని అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలకు మరో ముప్పు పొంచి ఉందని తెలియడంతో దిక్కుతోచటంలేదు. ఇప్పటికే జలవనరులు నిండుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వర్షాలు పడితే మరింత ప్రమాదమని భయపడుతున్నారు. ఫిబ్రవరి నుంచి అకాల భారీవర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టం అంచనాలకు అందనిది. ముఖ్యంగా భారీ పంట నష్టాలతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ముంచేసిన అక్టోబరు రైతులకు ప్రభుత్వం చేయూత తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేయూత ఇస్తోంది. ► జూన్–జూలై, ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో ఉద్యాన, వ్యవసాయ పంటల రైతులకు ప్రభుత్వం రూ.135,70,52,500 పెట్టుబడి రాయితీ విడుదల చేసింది. ► ఫిబ్రవరి–ఏప్రిల్ నెలల మధ్య భారీవర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.10.76 కోట్ల పెట్టుబడి సాయం విడుదల చేసింది. ► కేవలం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అక్టోబరు వరకూ భారీ వర్షాలు, వరదలవల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 279.08 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించింది. ► చంద్రబాబు సర్కారు బకాయిలు వదిలి పెట్టగా చెల్లించిన పెట్టుబడి రాయితీ దీనికి అదనం. -
తెలంగాణలో నేడు,రేపు తేలికపాటి వర్షాలు
-
ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు
విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడనుంది. ఇది మంగళవారం మధ్యాహ్నం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుంది. అలాగే ఉత్తర బంగాళాఖాతంలోనూ మరో ఆవర్తనం స్థిరంగా ఉంది. సముద్రమట్టానికి ఇది 2.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. తమిళనాడుపై మరో ఉపరితల ఆవర్తనం ప్రభావం చూపుతోంది. వీటన్నిటి కారణంగా రానున్న 24 గంటల్లో రాయలసీమలో కొన్నిచోట్ల, కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. మరోవైపు ఈనెల 7వ తేదీ నుంచి రాష్ట్రం వర్షాలు ఊపందుకునే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం వల్ల రాయలసీమపై ఒకింత వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.