కౌన్ బనేగా పూనమ్ కా హీరో | Kaun Banega Poonam Ka Hero' attracts over 25000 actors to star opposite Poonam Pandey in Helen | Sakshi
Sakshi News home page

కౌన్ బనేగా పూనమ్ కా హీరో

Published Wed, May 27 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

కౌన్ బనేగా పూనమ్ కా హీరో

కౌన్ బనేగా పూనమ్ కా హీరో

‘నా సరసన హీరోగా నటించే అవకాశం ఎవరు కొట్టేస్తారు?’ అని పూనమ్ పాండే లాంటి హాట్ గాళ్ పిలుపు ఇస్తే ఇంకేమన్నా ఉందా? కుర్రకారు రంగంలోకి దిగి, ఆ అవకాశం కోసం అప్లికేషన్ పెట్టేసుకుంటారు. విషయం ఏంటంటే... పూనమ్ కథానాయికగా ‘హెలెన్’ చిత్రం రూపొందనుంది.
 
  కానీ, ప్రముఖ నటి హెలెన్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రం కాదిది. పూర్తిగా వేరే కథ. ఇందులో పూనమ్ సరసన కొత్త అబ్బాయిని హీరోగా నటింపజేయాలని నిర్మాతలు అనుకున్నారట. అందుకని ‘కౌన్ బనేగా పూనమ్ కా హీరో’ అనే పోటీ నిర్వహించారు. ‘కౌన్ బనేగా పూనమ్ కా హీరో’ అని వీడియో పొందుపరిచారు.
 
 ఈ అవకాశం సంపాదించాలంటే రెండు నిమిషాల వీడియో చిత్రీకరించి, పంపించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. పోటీదారులు వందల్లో ఉంటారు. సునాయాసంగా ఎంపిక చేసేయొచ్చు అనుకున్న నిర్మాతల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంకా 25 వేల వీడియోలు వచ్చాయి. మరి.. పూనమ్మా? మజాకానా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement