‘‘సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) కారణంగా నేను చనిపోలేదు... బతికే ఉన్నాను. దురదృష్టం ఏంటంటే.. అనేక మంది మహిళలకు ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల వారు వారి జీవితాలను కోల్పోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ల మాదిరి కాదు. ఇందుకు మెరుగైన చికిత్స ఉంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్, వైద్య పరీక్షలతో వెంటనే ఈ క్యాన్సర్‌ను గుర్తించి, చికిత్స తీసుకోవడం వంటి చర్యలతో ఈ వ్యాధిని నివారించవచ్చు.
ఈ వ్యాధితో ఎవరూ ్రపాణాలు కోల్పోకుండా ఉండేందుకు మార్గాలు ఉన్నాయి. వాటిపై అవగాహన కల్పిద్దాం’’ అని పేర్కొన్నారు నటి, మోడల్ పూనమ్ పాండే. ఫిబ్రవరి 2న సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ఆమె మరణించినట్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఓపోస్ట్ షేర్ అయింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు మరణ విషయాన్ని ధృవీకరించలేదు. అలాగే కాన్పూర్‌పోలీసులకు, అక్కడి మీడియాకు పూనమ్ పాండే మరణంపై సరైన స్పష్టత లేదు. దీంతో పూనమ్ జీవించే ఉన్నారని, పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలా తాను మృతి చెందినట్లు ఫేక్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి.
ఫైనల్‌గా ఇదే నిజమైంది. సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించే ప్రక్రియలో భాగంగానే తన చావును ఫేక్ చేసినట్లుగా పూనమ్ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా వీడియోలు షేర్ చేశారు. నేడు (ఫిబ్రవరి 4) వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగానే పూనమ్ ఇలా చేశారని తెలుస్తోంది. అయితే పూనమ్ ఈ విధంగా చేయడం వివాదాస్పదంగా మారడంతో మరికొన్ని వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు. ‘‘అవును.. నా చావును ఫేక్ చేశాను.
కానీ సడన్‌గా అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. సైలెంట్‌గా జీవితాలను ముగించే వ్యాధి అది. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాల్సి ఉంది. నా చావు వార్త సర్వైకల్ క్యాన్సర్ గురించిన చర్చను పైకి తెచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. ఓ సెలబ్రిటీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయిందన్న వార్త దేశవ్యాప్తంగా ఆ క్యాన్సర్ గురించి మాట్లాడుకునేలా చేసింది. నేను చేయాలనుకున్నది ఇదే. నేను ఎవర్నైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అంటూ వీడియోలు షేర్ చేశారు పూనమ్.
Comments
Please login to add a commentAdd a comment