నా పేరు చిన్‌ చిన్‌ చూ | Sonakshi Sinha on recreating 'Mera Naam Chin Chin Chu' for Happy Phirr Bhag Jayegi | Sakshi
Sakshi News home page

నా పేరు చిన్‌ చిన్‌ చూ

Published Fri, Aug 10 2018 5:31 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Sonakshi Sinha on recreating 'Mera Naam Chin Chin Chu' for Happy Phirr Bhag Jayegi - Sakshi

నాటి సినిమాలో హెలెన్‌, సోనాక్షీ సిన్హా

ఏదైనా ప్రాంతంలో కథ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన స్పెషాలిటీని కథలో జోడించడానికి ప్రయత్నిస్తుంటారు దర్శక–నిర్మాతలు. ఆ ప్రాంతపు యాస కావచ్చు, లేదా అక్కడ ఫేమస్‌ పాట కావచ్చు. అదే చేశారు బాలీవుడ్‌ దర్శకుడు ముద్దాసర్‌ అజీజ్‌. సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఫిర్‌ బాగ్‌ జాయేగి’. 2016లో రిలీజ్‌ అయిన ‘హ్యాపీ ఫిర్‌ బాగ్‌ జాయేగి’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. పెళ్లి నుంచి తప్పించుకునే పెళ్లి కూతురికి సంబంధించిన కథతో ఈ సినిమా సాగనుంది. ఎక్కువ శాతం సినిమా చైనా బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందట.

అందుకే 1950లో ‘హౌరా బ్రిడ్జ్‌’ సినిమాలో హాట్‌ డ్యాన్సర్‌ హెలెన్‌ చేసిన సూపర్‌ హిట్‌ డ్యాన్స్‌ నంబర్‌ ‘మేరా నామ్‌ చిన్‌ చిన్‌ చూ’ (నా పేరు చిన్‌ చిన్‌ చూ) పాటను ఈ సినిమా కోసం రీమిక్స్‌ చేశారు. విశేషం ఏంటంటే ఈ పాటలో హెలెన్‌లా స్టెప్పులేయడమే కాకుండా పాటను కూడా పాడారు సోనాక్షి. ఈ రీమిక్స్‌ గురించి ఆమె మాట్లాడుతూ –‘‘హెలెన్‌ ఆంటీ చేసిన సాంగ్‌ను నేను మళ్లీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తనని కాపీ చేయాలనో, తనలా చేయాలనో అనుకోలేదు. ఈ సాంగ్‌ను ఎంజాయ్‌ చేస్తూ చేశాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. సోనాక్షీ వేసిన స్టెప్పులకు యూనిట్‌ ఫిదా అయ్యారట. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement