అన్నవరం దేవస్థానం పాలకమండలి ఏర్పాటు
అన్నవరం దేవస్థానం పాలకమండలి ఏర్పాటు
Published Thu, May 18 2017 11:49 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
- ఛైర్మన్‌గా వ్యవస్థాపక ధర్మకర్త రోహిత్
- ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రధానార్చకుడు
- బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం
- జీఓ విడుదల చేసిన ప్రభుత్వం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి రెండేళ్ల కాలపరిమితితో పాలక మండలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి జీఓ విడుదల చేసింది. గతంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు ( వంశపారంపర్య ధర్మకర్త)తో కలిపి తొమ్మిది మంది సభ్యులు ఉండేవారు.ఈ సంఖ్యను తెలుగుదేశం ప్రభుత్వం 16కు పెంచింది. ఇందులో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఆలయ ప్రధానార్చకుడితోపాటు 13 మంది టీడీపీకి చెందినవారున్నారు. ఒకరు బీజేపీ, మరొకరు ఆలయానికి విరాళాలిచ్చిన దాత ఉన్నారు.
పాలక మండలి సభ్యులు వీరే...
వ్యవస్థాపక ధర్మకర్తగా రాజా ఇనుగంటి వేంకట రోహిత్, పాలక మండలి సభ్యులుగా రావిపాటి సత్యనారాయణ, పర్వత గుర్రాజు(రాజబాబు) యనమల రాజేశ్వరరావు, యడ్ల బేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, చెల్లి శేషుకుమారి , కొత్త విశ్వేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, సింగిలిదేవి సత్తిరాజు, మారెడ్డి సింగారెడ్డి, మట్టే సత్యప్రసాద్, కొండవీటి సత్యనారాయణలు నియమితులయ్యారు. ఈ పాలకమండలికి ఛైర్మన్‌గా ఐవీ రోహిత్ వ్యవహరిస్తారని, కొండవీటి సత్యనారాయణ ఎక్స్‌అఫీషియో సభ్యునిగా, మిగిలిన వారంతా సభ్యులుగా వ్యవహరిస్తారని ఆ జీఓలో పేర్కొన్నారు.
Advertisement
Advertisement