అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య | Suicide of the couple with the burden of debt | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

Published Thu, Oct 10 2019 4:17 AM | Last Updated on Thu, Oct 10 2019 5:09 AM

Suicide of the couple with the burden of debt - Sakshi

ఆత్మహత్య చేసుకున్న పవన్, దివ్యలక్ష్మి దంపతులు

అన్నవరం (ప్రత్తిపాడు): అప్పుల బాధ తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన భార్యాభర్తలు దుడ్డు ఎస్‌వీఆర్‌ పవన్‌ (50), దివ్యలక్ష్మి (45) ఆదివారం అన్నవరం వచ్చి ఓ హోటల్‌లో దిగారు.

మంగళవారం ఉదయం ఎంతసేపటికీ వారు గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్‌ నిర్వాహకులు  కిటికీ తీసి చూడగా దంపతులిద్దరూ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవులై కనిపించారు. దీంతో హోటల్‌ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతులు బస చేసిన గదిలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. అందులో అప్పుల బాధ తాళలేక, అవి తీరే దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement