governing
-
ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం..
తిరుమల: అన్నమయ్య భవన్లో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. వివిధ అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తున్నట్లు ఛైర్మన్ వైవీ సుబ్బార్డెడి చెప్పారు. 4 కోట్ల రూపాయలతో అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు భక్తులు సౌకర్యార్దం షేడ్లు ఏర్పాటు చేస్తామని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రూ.2.5 కోట్లతో పీఏసీలో భక్తుల సౌకర్యార్ధం మరమత్తు పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 24 కోట్ల రూపాయల వ్యయంతో రోండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు నిర్మించనున్నట్లు చెప్పారు. రూ.4.5 కోట్ల వ్యయంతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికరణ చేయనున్నట్లు స్పష్టం చేశారు. రూ.23.5 కోట్ల వ్యయంతో తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లేక్స్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణంకు 3 కోట్లు కేటాయింపు చేస్తున్నట్లు చెప్పారు. రూ.3.1 కోట్ల వ్యయంతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ది పనులుకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. 9.85 కోట్ల వ్యయంతో వకుళామాత ఆలయం వద్ద అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. 2.6 కోట్లు వ్యయంతో తిరుమలలో అవుటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శ్రీనివాస సేతు ప్రాజేక్ట్ కి పనులు ప్రాతిపాదికన 118 కోట్లు కేటాయింపు చేసినట్లు చెప్పారు. టీబీ వార్డు ఏర్పాటు.. యస్వీ ఆయిర్వేద కళశాల అభివృద్ది పనులుకు 11.5 కోట్లు కేటాయింపు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు 2.2 కోట్లు కేటాయింపు చేసినట్లు పేర్కొన్నారు.రూ. 11 కోట్లతో యస్వీ సంగీత కళశాల అభివృద్ది పనులుకు కేటాయింపు చేశామని వెల్లడించారు. తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం,పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ది పనులుకు రూ. 1.25 కోట్లు కేటాయించామని చెప్పారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ని టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడు సంవత్సరాలు పోడిగింపు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలుకు కంచె ఏర్పాటుకు 1.25 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రూ.5 కోట్ల వ్యయంతో ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు కేటాయింపులు చేశామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఏలూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన -
విభజన తర్వాత ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రమైంది: సీఎం జగన్
సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పు పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణాభివృద్ధి, వివిధ రంగాల్లో ఆత్మ నిర్భర్ సాధించేందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయ్యిందన్నారు. 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారని, జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటేనని, వ్యవసాయరంగం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని తాము ఆ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వ్యవసాయరంగంలో ఉన్న రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, ఉచిత పంటలబీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటలపాటు ఉచితంగా కరెంటు తదితర పథకాలు, కార్యక్రమాలను రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్నాం. రైతులకు మరింత అండగా నిలవడానికి వారికి భరోసానిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ అవసరాలకు ఒన్ స్టాప్ సొల్యూషన్ కింద ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. నాణ్యమైన, ధృవీకరించిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాలద్వారా అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం. డిజిటిల్ టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ సీఎంయాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చాం. మొత్తం పంటల కొనుగోలు ప్రక్రియను రోజువారీగా ఆర్బీకేల స్థాయిలో ఈ యాప్‌ద్వారా నిరంతరం పరిశీలన, పర్యవేక్షణ చేస్తున్నాం. అవసరమైన పక్షంలో ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు చేస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్నాం. దీంతోపాటు ఆర్బీకే స్థాయిలోనే ఇ– క్రాప్ బుకింగ్ కూడా చేస్తున్నాం. ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలు తదితర వాటిని సమర్థవంతగా అమలు చేయడానికి ఇ–క్రాప్ బుకింగ్ దోహదపడుతోంది. ఆర్బీకేల్లో కియోస్క్‌లను కూడా అందుబాటులో పెట్టాం. రైతులకు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వాటిని కియోస్క్‌ల ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. వారి చెంతకే అవన్నీ కూడా చేరవేస్తున్నాం. పంటలకు సంబంధించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి, సూచనలు చేయడానికి శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్‌నుకూడా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఆర్బీకేల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లనుకూడా ప్రారంభిస్తున్నాం. పంటల మార్పిడి, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, క్రమంగా సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులవైపుగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఇక విద్యా రంగం విషయానికొస్తే బడికెళ్లడం, చదువుకోవడం అన్నది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని సుస్థిర ప్రగతి లక్ష్యాలతో అనుసంధానం చేశాం. స్కూళ్లుమానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతోపాటు జీఈఆర్ నిష్పత్తిని పెంచేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్ నిష్పత్తి 99.21 శాతంకాగా, ఏపీలో ఇది 84.48 కావడం విచారకరం. 2018లో కేంద్ర విద్యాశాఖ విడుదలచేసిన గణాంకాల్లో విద్యారంగంలో రాష్ట్రం పనితీరు అత్యంత దారుణంగా ఉందని వెల్లడైంది. అందుకే విద్యారంగంలో కీలక అంశాలపై దృష్టిపెడుతూ సమర్థవంతమైన విధానాలను తీసుకు వచ్చాం. తల్లిదండ్రుల పేదరికం అన్నది పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేస్తోంది. పిల్లలను బడికి పంపిస్తే చాలు, ఏటా రూ.15వేల రూపాయల చొప్పున పిల్లల తల్లులకు అందిస్తోంది. 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను కూడా పరిగణలోకి తీసుకున్నాం. అంతేకాదు పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తీసుకు వచ్చాం. విద్యాకానుక ద్వారా స్కూలు బ్యాగులు, బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్, నోట్ పుస్తకాలు, షూ, 3 జతల యూనిఫారం, ఇంగ్లిషు టు తెలుగు డిక్షనరీలు ఇస్తున్నాం. పిల్లలకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్ యాప్‌కూడా అందిస్తున్నాం. 8 వ తరగతి విదార్థులకు ట్యాబ్ కూడా ఇవ్వబోతున్నాం. పిల్లలు మంచి వాతావరణంలో విజ్ఞానాన్ని సముపార్జించడానికి మన బడి నాడు – నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగునీరు, పెయింటింగ్, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, పిల్లలకు, టీచర్లకు ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లిషు ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, కావాల్సిన మరమ్మతులు అన్నీ చేపడుతున్నాం. మొత్తం మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తాం. మొదటి విడత కింద ఇప్పటికే 15,715 స్కూళ్లను తీర్చిదిద్దాం. ఇందులో డిజిటల్ తరగతుల ఏర్పాటు కూడా పూర్తిచేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిషు భాషకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు చక్కటి పునాది వేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేలా పిల్లలను తీర్చిదిద్దడానికి అన్ని స్కూళ్లను మ్యాపింగ్ చేసి సబ్జెక్టు వారీగా టీచర్లను 3వ తరగతి నుంచే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఉన్నత విద్యా స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కేవలం విద్య ద్వారానే పేదిరికం నుంచి బయటపడతారని గట్టిగా విశ్వసిస్తూ విద్యాదీవెన పథకం ద్వారా 100శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నాం. గత మూడేళ్లలో 21.56 లక్షల మంది విద్యార్థులు దీనిద్వారా లబ్ధిపొందారు. విద్యార్థులు భోజనం, హాస్టల్ ఖర్చుకోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. ఇక అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో సంప్రదాయ కోర్సులను ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదద్దాం. నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నాం. 1.6 లక్షలమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ముందుకు వచ్చింది. కోవిడ్ కారణంగా తలెత్తిన ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. 2018–19లో క్యాంపస్‌ల ద్వారా 37వేలమందికి ఉద్యోగాలు వస్తే, 2020–21లో 69వేలు వచ్చాయి. పౌరుల గడపవద్దకే సేవలందించే విధానాన్ని అమలు చేస్తూ.. చివరి వరకూ అత్యంత పారదర్శకంగా సేవలను అందిస్తున్నాం. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ప్రతి 50–100 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను కూడా నియమించాం. దీనివల్ల ఉపాధి కల్పించడమేకాదు, అవినీతి లేకుండా, పారదర్శకంగా సేవలను ప్రజలకు అందిస్తున్నాం. మరింత సమర్థవంతంగా లక్ష్యాలు సాధించడానికి అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాం. వివక్షకు, అవినీతికి తావులేకుండా అర్హులైన వారి అందరికీ అన్ని అందాలన్నదే లక్ష్యం. దీనికి సంబంధించి ఒక నోట్‌ను కూడా సమర్పించిన సీఎం జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు.. -
ప్చ్.. కరుణ చూపలేదు!
- రూ.200 వ్రతాల భక్తులను కరుణించని పాలక మండలి - క్యూ లైన్‌పై షెల్టర్ నిర్ణయం వాయిదా అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని సన్నిధిలో రూ.200 వ్రతాల భక్తులపై అన్నవరం దేవస్థానం పాలక మండలి కరుణ చూపలేదు. క్యూలో నిలబడే ఈ వ్రతాల భక్తులకు నీడ కల్పించేందుకుగాను షెల్టర్ నిర్మించేందుకు ఇంజినీరింగ్ అధికారులు చేసిన ప్రతిపాదనలను మరో నెల వాయిదా వేసింది. ప్రకాష్ సదన్ సత్రంలోని సమావేశ మందిరంలో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం పాలక మండలి సమావేశం జరిగింది. సభ్యులతోపాటు ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు సత్యగిరిపై సభ్యులు మొక్కలు నాటారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ముఖ్య తీర్మానాలివీ.. - దేవస్థానంలో నామినేషన్ పద్ధతిపై నామమాత్రపు అద్దెకు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న 14 కాఫీ, టీ విక్రయ పాయింట్లను ఇకపై టెండర్ కం బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇవ్వాలి. - సత్యదేవుని ప్రసాదం తయారీకి రూ.49 లక్షలతో కొత్త ఇత్తడి కళాయిలు కొనుగోలు చేయాలి. - యంత్రాలయంలో యంత్రం వద్ద శాస్త్ర విరుద్ధంగా పాత ఈఓ కె.నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాన్ని తొలగించి, దానిస్థానంలో నూనె దీపాలు ఏర్పాటు చేయాలి. - దేవస్థానం స్టాఫ్ క్వార్టర్లకు పెయింటింగ్, పశ్చిమ రాజగోపురం వద్ద ఫ్లోరింగ్ పనులు చేయాలి. - స్వామివారి నిత్యకల్యాణం మండపానికి రూ.5 లక్షలతో రంగులు వేయాలి. - రెండు టన్నుల వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీకి ప్రతిపాదనలు రూపొందించాలి. - రూ.1,500, రూ.2 వేల వ్రత మండపాల్లో రూ.4.15 లక్షలతో అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయాలి. - హరిహరసదన్ సత్రం ముందు వివాహాలు చేసుకునేందుకు ఉపయోగిస్తున్న ఖాళీ స్థలాన్ని ఇకపై అద్దెకు ఇవ్వకూడదు. షెల్టర్ నిర్మించేదెప్పుడో! దేవస్థానంలో జరిగే వ్రతాల్లో సగానికి పైగా రూ.200 వ్రతాలే ఉంటాయి. వీటిని ఆచరించేవారిలో ఎక్కువమంది పేద, మధ్యతరగతివారే. గత ఏడాది రూ.200 వ్రతాలే మూడు లక్షలు జరిగాయి. ఇన్ని వ్రతాలు జరుగుతున్నా వీటి నిర్వహణకు మూడు మండపాలే ఉన్నాయి. బ్యాచ్‌కు 200 మంది మాత్రమే ఈ మండపాల్లో వ్రతాలాచరించే వీలుంటుంది. ఇందుకోసం భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి ఉంటోంది. ఎండొచ్చినా, వానొచ్చినా క్యూలో తడవాల్సిందే. వారి కష్టాలపై ‘వ్రతాలు రూ.200.. ఇబ్బందులు వేయింతలు’ శీర్షికన గత నెల 27వ తేదీన సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన అధికారులు.. రూ.200 వ్రతాలాచరించే భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించేలా షెల్టర్ నిర్మించేందుకు సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో రూ.10 లక్షలతో ప్రతిపాదనలు సమర్పించారు. అయితే దీనిని పాలక మండలి వచ్చే సమావేశానికి వాయిదా వేసింది. ఈ షెల్టర్ నిర్మాణానికి వెంటనే టెండర్ పిలిచినా పనులు ప్రారంభించడానికి కనీసం నెల పడుతుంది. పని పూర్తి కావడానికి మరో నెల పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ అంశాన్ని పాలక మండలి మరో నెల వాయిదా వేయడంతో ఇప్పట్లో ఈ పనులు జరిగే అవకాశాలు లేవు. ఫలితంగా రూ.200 వ్రతాల భక్తుల ఇబ్బందులు కూడా ఇప్పుడప్పుడే తొలగే పరిస్థితి కానరావడంలేదు. పాలక మండలి సభ్యులు ఈ వ్రత మండపాలను ఈ నెల 25న పరిశీలించి షెల్టర్ అవసరమా, కాదా అనే దానిపై ఒక నిర్ధారణకు వస్తామన్నారని, అందువల్లనే ఈ అంశాన్ని వాయిదా వేశామని ఈఓ జగన్నాథరావు ‘సాక్షి’కి తెలిపారు. -
‘స్వామి సొమ్ముతో షో’ వద్దు
- పునఃపరిశీలించాలి - అన్నవరం దేవస్థానం నూతన పాలక మండలి తీర్మానం - రూ.55 లక్షలతో స్వామివారికి కొత్త రథం తయారీకి పచ్చజెండా - సబ్ క్యాంటీన్ వద్ద భక్తులకు ఉచితంగా పులిహోర, దద్ధోజనం పంపిణీ - గోల్డ్‌బాండ్ స్కీమ్‌లో 2.860 కిలోల బంగారం డిపాజిట్ అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని సొమ్ము రూ.2.96 కోట్లతో సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పునఃపరిశీలించాలని కోరుతూ అన్నవరం దేవస్థానం పాలక మండలి తీర్మానించింది. దేవస్థానం నూతన పాలక మండలి తొలి సమావేశం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ప్రకాష్ సదన్ సత్రంలోని పాలక మండలి సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఉదయం 11 నుంచి సాయంత్రం వరకూ జరిగిన ఈ సమావేశంలో తొమ్మిది అంశాలపై చర్చించారు. పాలక మండలి సభ్యులు రావిపాటి సత్యనారాయణ, యనమల రాజేశ్వరరావు, యడ్ల భేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, చెల్లి శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు (కొండబాబు), సత్తి దేవదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, మారెడ్డి సింగారెడ్డి, మట్టే సత్యప్రసాద్, సింగిలిదేవి సత్తిరాజు, ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఈఓ కె.నాగేశ్వరరావు, ఏసీ జగన్నాథరావు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్య తీర్మానాలివీ.. - రూ.2.96 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సౌండ్ అండ్ లైట్ షో దేవస్థానానికి అంత లాభదాయకం కాదు. అలాగని టెంపుల్ టూరిజం అభివృద్ధికి కూడా అంతగా ఉపయోగపడేది కాదు. పైగా ఇది దేవస్థానానికి ఆర్ధికంగా భారం. ఉన్నతాధికారులు పునఃపరిశీలన జరిపి దీనిని ఉపసంహరించాలి. - గత నవంబర్ నుంచి మూసివేసిన సబ్ క్యాంటీన్ వద్ద భక్తులకు ఉదయం ఉచితంగా పులిహోర, దద్ధోజనం పంపిణీ చేయాలి. రద్దీ రోజుల్లో 2 వేల మందికి, ఇతర రోజుల్లో వెయ్యి మందికి సరిపోయేలా పంపిణీ చేయాలి. సోమవారం నుంచి దీనిని ప్రారంభించాలి. - స్వామి, అమ్మవార్లను ఉత్సవాల్లో ఊరేగించేందుకు రూ.55 లక్షలతో నూతన రథం తయారు చేయించాలి. - దేవస్థానంలో ఉన్న 2.860 కేజీల బంగారాన్ని గోల్డ్ బాండ్ స్కీమ్‌లో డిపాజిట్ చేయాలి. - గురువారం జరిగిన షాపుల వేలంలో గత ఏడాదికన్నా అత్యధికంగా పాడుకున్నవారికి షాపులను ఇవ్వాలి. -
వీడని వివాదాల చెర
అన్నవరం పాలక మండలి ప్రమాణ స్వీకారం తనకు తెలియకుండా ముహూర్తం నిర్ణయించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం జూన్ నాలుగుకు మారిన ముహూర్తం అన్నవరం (ప్రత్తిపాడు): అన్నవరం దేవస్థానం పాలకమండలి నియామక జీఓ ఏ ముహూర్తాన విడుదలైందో కానీ ఏదో ఒక వివాదం వెంటాడుతోంది. ఇప్పటివరకూ పాలకమండలి ప్రమాణస్వీకార వేదిక విషయంలో వివాదం ఏర్పడగా, ఇప్పుడు తేదీ విషయంలో మరో వివాదం తలెత్తింది. దీంతో జూన్ నాలుగో తేదీకి ప్రమాణస్వీకారం వాయిదా పడింది. పాలకమండలి ప్రమాణ స్వీకారానికి జూన్ ఒకటో తేదీని ముహూర్తంగా నిర్ణయించి ఆతర్వాత తనను దేవస్థానం అధికారులు ఆహ్వానించడంపై ప్రత్తిపాడు శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ ఒకటో తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉందని, అందువల్ల జిల్లా మంత్రులు కానీ, తాను కానీ హాజరయ్యే పరిస్థితి లేదని ఆయన అధికారులకు తెలిపినట్టు సమాచారం. ఇప్పటికే జూన్ ఒకటో తేదీన ప్రమాణస్వీకారం జరుగుతుందని పాలకమండలిలో సభ్యులుగా నియమితులైన 16 మందికీ దేవస్థానం అధికారులు సమాచారం పంపించారు. ఆ సభ్యులు భారీ ఊరేగింపుతో అన్నవరం వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రమాణస్వీకార తేదీ మార్పుపై అధికారులు తర్జనభర్జనలు పడ్డారు. చివరకు జూన్ నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలు కొత్త ముహూర్తంగా నిర్ణయించారు. ఆ సమయంలో కళావేదిక మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యే హాజరయ్యేందుకు వీలుగా తేదీ మార్పు దేవస్థానం పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక శాసనసభ్యుడు హాజరయ్యేందుకు వీలుగా జూన్ నాలుగో తేదీకి మార్పు చేసినట్టు ఈఓ కె. నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం ‘సాక్షి’ కి తెలిపారు. ముందుగా నిర్ణయించిన ఒకటో తేదీన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ఉన్నందున ఆ తేదీని మార్చామన్నారు. ఉదయం 9.30 గంటలకు బదులు సాయంత్రం నాలుగు గంటలకు ఆ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. -
అన్నవరం దేవస్థానం పాలకమండలి ఏర్పాటు
- ఛైర్మన్‌గా వ్యవస్థాపక ధర్మకర్త రోహిత్ - ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రధానార్చకుడు - బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం - జీఓ విడుదల చేసిన ప్రభుత్వం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి రెండేళ్ల కాలపరిమితితో పాలక మండలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి జీఓ విడుదల చేసింది. గతంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు ( వంశపారంపర్య ధర్మకర్త)తో కలిపి తొమ్మిది మంది సభ్యులు ఉండేవారు.ఈ సంఖ్యను తెలుగుదేశం ప్రభుత్వం 16కు పెంచింది. ఇందులో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఆలయ ప్రధానార్చకుడితోపాటు 13 మంది టీడీపీకి చెందినవారున్నారు. ఒకరు బీజేపీ, మరొకరు ఆలయానికి విరాళాలిచ్చిన దాత ఉన్నారు. పాలక మండలి సభ్యులు వీరే... వ్యవస్థాపక ధర్మకర్తగా రాజా ఇనుగంటి వేంకట రోహిత్, పాలక మండలి సభ్యులుగా రావిపాటి సత్యనారాయణ, పర్వత గుర్రాజు(రాజబాబు) యనమల రాజేశ్వరరావు, యడ్ల బేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, చెల్లి శేషుకుమారి , కొత్త విశ్వేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, సింగిలిదేవి సత్తిరాజు, మారెడ్డి సింగారెడ్డి, మట్టే సత్యప్రసాద్, కొండవీటి సత్యనారాయణలు నియమితులయ్యారు. ఈ పాలకమండలికి ఛైర్మన్‌గా ఐవీ రోహిత్ వ్యవహరిస్తారని, కొండవీటి సత్యనారాయణ ఎక్స్అఫీషియో సభ్యునిగా, మిగిలిన వారంతా సభ్యులుగా వ్యవహరిస్తారని ఆ జీఓలో పేర్కొన్నారు.