కొత్త జిల్లాల ఏర్పాట్లు ఇప్పట్లో లేవు: కేసీఆర్
హైదరాబాద్: ఏడు కొత్త జిల్లాలపై మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొత్త జిల్లాల వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ తర్వాతే ఉంటుందని కేసీఆర్ మీడియాకు తెలిపారు.
తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడే కాదని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రం ఏడు కొత్త జిల్లాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.