టాక్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు | telangana state formation day celebrations by TAUK in london | Sakshi
Sakshi News home page

టాక్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు

Published Sat, Jun 3 2017 4:07 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM

టాక్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు - Sakshi

టాక్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు

లండన్‌: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్‌(టాక్) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ  వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్లోని టాక్ కేంద్ర కార్యాలయంలో కార్యవర్గ కుటుంబసభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు. అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా టాక్ వ్యవస్థాపకుడు, ఎన్‌ఆర్‌ఐ టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో బాగస్వాములైనందుకు గర్వాంగా ఉందని, అలాగే రాష్ట్ర ఏర్పాటును కూడా చూసే అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన కెసిఆర్ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. బంగారు తెలంగాణ కేవలం కెసిఆర్ వల్లే సాధ్యమని, ఉద్యమంలో వెంట ఉన్నట్లే బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా కేసీఆర్‌ వెంట ఉండి తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు.

టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ.. మొట్ట మొదటిసారి టాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలు జూన్ రెండు నాడే జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తామంతా కేవలం నేడు సంబరాలకు పరిమితం కాకుండా, నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని గుర్తు చేసుకున్నారు. సేవే లక్ష్యం, బంగారు తెలంగాణే ధ్యేయంగా ముందుకు వెళ్తూ.. తెలంగాణ సమాజానికి తమ వంతు బాధ్యతగా సేవ చేస్తామని, బంగారు తెలంగాణ లో భాగస్వాములమవుతామని తెలిపారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ ముఖ్య నాయకులు మట్టా రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర కంది, కార్యవర్గ సభ్యులు  మత్తా రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, విజయలక్ష్మి, సుమా దేవి, మధుసూదన్ రెడ్డి, రత్నాకర్, అశోక్, నవీన్, విక్రమ్, సత్య, శైలజ, వెంకట్ రెడ్డి, రవి రైతినేని, సత్యం కంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement