TAUK
-
ఘనంగా "టాక్ - చేనేత బతుకమ్మ - దసరా" సంబరాలు
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి 1200 మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత హై కమిషన్ ప్రతినిధి రాహుల్, స్థానిక హౌన్సలౌ మేయర్ టోనీ లౌకిలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కేటీఆర్ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం కూడా వేడుకలను "చేనేత బతుకమ్మ మరియు దసరా "గా జరుపుకున్నామని సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. తమ పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం ఎంతో సంతోషాన్ని..స్ఫూర్తినిచ్చిందని టాక్ ఈవెంట్స్ ఇంచార్జ్ రత్నాకర్ కడుదుల అన్నారు. కల్చరల్ ఇంఛార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా " అలాయ్ - బలాయ్ " కార్యక్రమంలో, చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి ( బంగారం)ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంశించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరాపండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మల మధ్య కాకతీయ కళాతోరణం వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆతిథులందరి ప్రశంసలందుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా వినూత్నంగా ఇలా ఎదో ఒక ప్రతిమను ఏర్పాటు చేస్తున్నామని, పోయిన సంవత్సరం చార్మినార్ని ఏర్పాటు చేశామని కార్యదర్శి మల్లా రెడ్డి తెలిపారు. విదేశాల్లో స్థిరపడ్డా కానీ, తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లి చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రజలంతా పాల్గొనాలని, ప్రవాసులంతా ఎంపీ సంతోష్ చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రశంసించడమే కాకుండా తమ వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కలిపిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ భారీ పోస్టర్ని ఆవిష్కరించారు. హాజరైన ముఖ్య అతిధులు మరియు ప్రవాసులంతా " ఐ ప్లెడ్జ్ టు సపోర్ట్.. గ్రీన్ ఇండియా చాలెంజ్’’ అనే సెల్ఫీ స్టాండ్ వద్ద ఫోటోలు దిగి తమ మద్దతును తెలియజేసారు. ఈ కార్యక్రమంలో భారత హై కమీషన్ ప్రతినిధి రాహుల్‌తో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక హౌన్సలౌ మేయర్ టోనీ లౌకి మాట్లాడుతూ.. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. గత సంవత్సరాలుగా చేనేతకు చేయూతగా మా వేడుకలని చేనేత బతుకమ్మ సంబరాలుగా చేయడం ద్వారా ఎన్నో నేతన్న కుటుంబాలకు మేలు జరిగిందని తెలిపారు. ఉద్యమ బిడ్డలుగా ప్రతి కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నింటిని ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికి కృతఙ్ఞతలు తెలిపారు. వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేతపై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేతవస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లి గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ ఈ వేడుకలలో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేతవస్త్రాలు ధరించాలని కోరామని అలాగే చాలామంది ఈ రోజు చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా వుందని అన్నారు. టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవిత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీ కవిత గారితో కేవలం పోస్టర్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా, వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారుఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాతే మన పండగలకు, మన సంస్కృతికి సరైన గౌరవం గుర్తింపు లభించిందని, ఉద్యమ నాయకుడే నేడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే నేడు అధికారికంగా రాష్ట్ర పండుగగా బతుకమ్మను నిర్వహించుకోగల్గుతున్నామని, కాబట్టి కెసిఆర్ గారి పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చేనేతకు చేయూతగా చేస్తున్న వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యత ఉందని తెలిపారు. టాక్ ఈవెంట్స్ ఇంచార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ.. నేటి వేడుకల్లో స్థానిక బ్రిటిష్ వారు సైతం పాల్గొనడమే కాకుండా, మమ్మల్ని అడిగి తెలుసుకొని బతుకమ్మను తయారు చేసి తెచ్చి, బతుకమ్మ ఆటలో పాల్గొనడం మాకెంతో స్ఫూర్తినిచ్చింది తెలిపారు. టాక్ కార్యదర్శి నవీన్ రెడ్డి మాట్లాడుతూ మా వేడుకలకు హాజరైన ప్రవాస సంస్థల ప్రతినిధులకు, సహకిరించిన మీడియా సంస్థలకు మరియు స్థానిక ప్రభుత్వ అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రవాసులు, టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి, బాధ్యత గల తెలంగాణా బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో ఎంతో స్పూర్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు, ఎన్నారై టి. ఆర్.ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, టాక్ అద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, టాక్ జాతీయ కన్వీనర్ శ్రీకాంత్ పెద్దిరాజు ముఖ్య సభ్యులు మట్టా రెడ్డి, వెంకట్ రెడ్డి దొంతుల,నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల,మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి,వంశీ రెక్నర్ , రంజిత్ చాతరాజు,సత్యం కంది,గణేష్ పాస్తం ,రాకేష్ పటేల్,రవి రేటినేని ,రవి ప్రదీప్ పులుసు,,సత్య చిలుముల,శ్రీధర్ రావు,వెంకీ సుదిరెడ్డి, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, జస్వంత్,వంశీ పొన్నం, భరత్ బాశెట్టి, వేణు నక్కిరెడ్డి, హరి గౌడ్ నవాబ్ పేట్ , నవీన్ మాదిరెడ్డి, చిత్తరంజన్ రెడ్డి,సురేష్ బుడగం,మధుసూదన్ రెడ్డి,వంశీ పొన్నం మహిళా విభాగం సభ్యులు శ్వేతా రెడ్డి,సుష్మన,జహ్నవి వేముల, సుప్రజ పులుసు,క్రాంతి రేటినేని,మమత జక్కీ ,శ్వేతా మహేందర్, ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు. -
లండన్‌లో ఘనంగా 'టాక్ బోనాల జాతర'
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ హైకమిషన్ అనిమా భరద్వాజ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లష్కర్ బోనాలకు ఏ మాత్రం తీసిపోకుండా స్వదేశంలో జరుపుకున్నట్టే అన్ని సంప్రదాయాలను పాటిస్తూ పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపు తరువాత ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం స్వాగతోపన్యాసం చేయగా, కార్యదర్శి రవి రేతినేని కార్యక్రమానికి వక్తగా వ్యవహరించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుండి సుమారు 800మందికి పైగా ప్రవాసులు హాజరయ్యారు. భారత సంతతికి చెందిన స్థానిక ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. స్థానిక ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ "బోనాల" వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇండియన్ హై కమీషన్ ప్రతినిధి అనిమా భరద్వాజ్ మాట్లాడుతూ బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్తున్న తీరుని ప్రశంసించారు. టాక్ సంస్థ ఇటు జాతీయ పండుగలు రాష్ట్ర పండుగలు ఎంతో ఘనంగా నిర్వహిస్తు భారత జాతి గౌరవాన్ని విదేశీ గడ్డ పై ముందుకు తీసుకెళ్తూ ఎందరికో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. సంస్థ అద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ.. టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు. టాక్ సంస్థని, అలాగే బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించడమే కాకుండా అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న నిజామాబాదు ఎంపీ కవితకి కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలందిరికీ టాక్ వ్యవస్థాపకుడు, ఎన్నారై టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని, ఒక నాడు పండుగలంటే కేవలం సంక్రాంతి - ఉగాది మాత్రమేనని, ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు - బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నారైలలో ఇంతటి స్ఫూర్తి నింపి, ముఖ్యంగా టాక్ సంస్థని ప్రోత్సహిస్తున్న ఎంపీ కవితకి కృతఙ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చినట్టు మనంతా కూడా ఒక రోజు చేనేత దుస్తులు ధరించి వారిని ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన మహేశ్వరి మహా కాళీ నృత్యం, అలాగే రాగసుధా పర్యవేక్షణలో తెలంగాణలో మాత్రమే ప్రాముఖ్యత కలిగిన మథుర, కోయా లంబడా సంప్రదాయ నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేకంగా సత్కరించి, బహుమతులందజేశారు. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎంపీ వీరేంద్ర శర్మ, ఎంపీ సీమా మల్హోత్రా, ఇండియన్ హై కమీషన్ ప్రతినిధి అనిమా భరద్వాజ్లని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో ప్రశంసించారు. టాక్ సభ్యులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి ,రత్నాకర్ కడుదుల, సేరు సంజయ్, సుప్రజ పులుసు, విక్రమ్ రెడ్డి రేకుల, వెంకట్ రెడ్డి దొంతుల, శ్రీకాంత్ పెద్దిరాజు, శ్రీకాంత్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన బోనాల జాతర ఇంతటివిజయం సాధించడం సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్ అడ్వైజరీ ఛైర్మన్ గోపాల్ మేకల, ఉపాధ్యక్షులు స్వాతి బుడగం, ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి రేకుల, జాతీయ కన్వీనర్ శ్రీకాంత్ పెద్దిరాజు, సభ్యులు, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల , శ్రీధర్ రావు, శ్రీకాంత్ జెల్ల, సత్య పింగిళి, సత్య చిలుముల, సత్యం కంది, హరి నవపేట్, శ్రీనివాస్ మేకల, సుమ దేవి, సుప్రజ, శుషుమ్న రెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, వెంకట్ రెడ్డి, వేణు రెడ్డి నక్కిరెడ్డి, ప్రియాంక, క్రాంతి, మమతా జక్కి, శ్రీనివాస్, భరత్, రాజేష్ వాకా, వెంకీ, రవికిరణ్, గణేష్, హరి, హరిదీప్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, మట్టా రెడ్డి, రాజేష్ వర్మ, రాకేష్ పటేల్, రంజిత్, రవి ప్రదీప్, రవి రతినేని, నరేందర్, నవీన్ భువనగిరి, నవీన్ మాది రెడ్డి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. -
లండన్‌లో ఘనంగా ‘మహిళా దినోత్సవం’
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. లండన్ కేంద్రంగా పని చేస్తున్న ఏషియన్ వుమెన్ రిసోర్స్ సెంటర్(ఏడబ్ల్యూఆర్‌సీ) కార్యాలయంలో టాక్ మహిళా కార్యవర్గ సభ్యులంతా కలిసి మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఏడబ్ల్యూఆర్‌సీ డైరెక్టర్ సర్బజిత్ గాంగేర్ ముందుగా మహిళల, పిల్లల కోసం వారి సంస్థ చేస్తున్న కార్యక్రమాలని సభ్యులకి వివరించారు. ప్రస్తుతం మహిళలు ఎన్నో విషయాల్లో సరైన తోడు లేక వారి పట్ల జరుగుతన్న హింసని, అన్యాయాన్ని, అవమానాల్ని చెప్పుకొనే వేదిక లేక జీవితం పట్ల ఆశల్ని కోల్పోతున్నారన్నారు. ముఖ్యంగా ఏషియా ఖండం నుంచి ఉన్న ప్రవాస మహిళలకు ఇటువంటి చేయూత ఎంతో అవసరముందని తెలిపారు. మా సంస్థ గురించి తెలుసుకొని మమ్మల్ని ప్రోత్సహించడం మాకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. అలాగే మాకు ఆర్థిక సహాయాన్ని అందించినందుకు టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కందికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ.. సాటి మహిళగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సంస్థని ప్రోత్సహించడం నా బాధ్యత అన్నారు. ఎన్నో ఆశలతో విదేశాలకు వస్తున్న మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని మనమంతా కలిసి ఎదుర్కొని వారికి భరోసా కలిపించడమే కాకుండా వీలైనంత సహాయం అందించాలని తెలిపారు. టాక్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండి సహాయ చేస్తుందని తెలిపారు. మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా బలోపేతం అయినప్పుడే అసలైన అభివృద్ధి జరుగుతుందన్నారు. టాక్ మహిళా విభాగం కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ.. టాక్ సంస్థ సేవే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ఇలా మహిళల సంక్షేమం కోసం పని చేస్త్తున్న సంస్థ సభ్యులతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకోవడం మాలో కొత్త ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపిందని చెప్పారు. ఇలా మేము క్రియాశీలకంగా పని చేసేలా మమ్మల్నే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఆదర్శంగా ఉన్న ఎంపీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. చివరిగా సంస్థల సభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి పరస్పరం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, మహిళా విభాగం కార్యదర్శి సుప్రజ పులుసు, కల్చరల్ కో ఆర్డినేటర్ జాహ్నవి వేముల, కల్చరల్ సెక్రటరీ శ్రావ్య వందనపు, సభ్యలు మమతా జక్కి, ఏడబ్ల్యూఆర్‌సీ సభ్యులు పాల్గొన్నవారిలో ఉన్నారు. -
భారత స్వాతంత్ర్య వేడుకల్లో టాక్
లండన్: లండన్ లోని భారత హై కమీషన్, భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా జరిపిన స్వాతంత్ర్య వేడుకల్లో, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) తెలంగాణా రాష్ట్రానికి ప్రాతినిత్యం వహించింది. భారత హై కమీషనర్ వైకే సిన్హా ముందుగా జెండా ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. యూకే నలుమూలల నుంచి వేలాదిమంది ప్రవాస భారతీయులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం ఉట్టి పడేలా చార్మినార్ ప్రతిమతో ముఖద్వారం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కటౌట్.. టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ అన్నింటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, భాషా, సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి, తెలంగాణ నాయకత్వం, గత మూడు సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు.. ఇలా వీటన్నింటి సమాచారాన్ని స్టాల్లో ప్రదర్శించారు. తెలంగాణ ప్రత్యేకత గురించి వివరించారు. తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు, ఇతర ఆతిథులకు తెలియజేయాలనే భావన తో, టాక్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణా ప్రముఖులు, తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు, పెట్టుబడులకు అనుకూల నిర్ణయాల సమాచారాన్ని, మూడు సంవత్సరాలుగా సాధించిన విజాయాల తో కూడిన ప్రత్యేక ‘తెలంగాణా స్టాల్’ ని ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షురాలు పవిత్ర కంది తెలిపారు. చేనేత పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ నాయత్వంలో చేనేత వస్త్రాలపై తీసుకొస్తున్న అవగాహనను కూడా టాక్ సంస్థ తన ప్రదర్శన లో పెట్టింది. భారత హై కమీషనర్ వైకే సిన్హా, భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్లిమెంట్ సభ్యులు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, ఇతర ప్రతినిధుల బృందం ‘తెలంగాణా స్టాల్’ ని సందర్శించారు. తెలంగాణా సంస్కృతి - సాంప్రదాయాలను ప్రపంచానికి చూపించాలనే ప్రయత్నం చాలా స్పూర్తిదాయకంగా ఉందని ప్రశంసించారు. అలాగే తెలంగాణా రాష్ట్రం ముందుకు వెళ్తున్న తీరు గమనిస్తున్నామని, ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను టాక్ సంస్థ ప్రతినిధులని అడిగి తెలుసుకున్నారు. స్టాల్ లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల, తెలంగాణా ప్రముఖుల చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి ఏర్పాటు చేసిన కేక్ ను భారత హై కమిషనర్ వైకే సిన్హా కట్ చేశారు. ప్రవాస తెలంగాణా వాసులు ఏర్పాటు చేసిన స్టాల్ ని సందర్శించారు. తెలంగాణ ప్రాముఖ్యతను ప్రదర్శిస్తున్న తీరుని అభినందించారు. చార్మినార్ ప్రతిమతో ముఖద్వారం చాలా అందంగా, తెలంగాణ తనం విదేశీ గడ్డపై ఉట్టిపలే ఉందని అభినందించారు. ఫోటోలు, సెల్ఫీలతో టాక్ సంస్థ స్టాల్ సందడిగా మారింది. ‘తెలంగాణా జానపద నృత్యం’ను సాంస్కృతిక వేదిక పై ప్రదర్శించడం విశేషం. దీంతో అతిథులు కేరింతలతో ఎంతో ఉత్సాహంగా లేచి వారితో జత కలిసి నృత్యం చేశారు. తెలంగాణ జానపద నృత్యం సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో హైలైట్ గా నిలిచింది. జానపద నృత్య ప్రదర్శన ఇచ్చిన సత్య చిలుముల, వంశీ చిడిపోతు, నాగరాజు మన్నం, శివకుమార్ గ్రంధి, దేవి ప్రవీణ్ అడబాల( చెర్రీ) , తిరు కణపురం, రుచిత రేణికుంటలను.. ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా అభినందించారు. ‘తెలంగాణా స్టాల్’ ని సందర్శించిన ఆతిథులందరికి మన ‘హైదరాబాద్ బిర్యానీ’ రుచి చూపించారు. ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ మట్టా రెడ్డి సభ్యులు వెంకట్ రెడ్డి దొంతుల, ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి రేకుల, జాయింట్ సెక్రటరీ లు నవీన్ రెడ్డి ,శ్రీకాంత్ జెల్ల, ఇవెంట్స్ , కల్చరల్ ఇన్చార్జ్ అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, రీడింగ్ సెక్రటరీ, స్పోర్ట్స్ఇంచార్జ్ మల్లా రెడ్డి, మహిళా విభాగం ఇంచార్జ్ సుమా దేవిపురుమని, మహిళా విభాగం సెక్రటరీ సుప్రజ పులుసు, మహిళా విభాగం సభ్యులు ప్రవల్లిక భువనగిరి, క్రాంతి రత్తినేని, కల్చరల్ సెక్రెటరీలు సత్య చిలుముల, శ్రావ్య వందనపు, కల్చరల్ కోఆర్డినేటర్ శైలజ జెల్ల, స్పాన్సర్ సెక్రటరీ రవి రత్తినేని, ఐటీ ఇంచార్జ్ రవి ప్రదీప్ పులుసు, సంస్థ సభ్యులు రవికిరణ్, వెంకీ సుదిరెడ్డి, నవీన్ భువనగిరి, సుషుమ్న, సుమ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. -
లండన్‌లో "ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ మార్చ్"
- వందలాదిగా పాల్గొన్న ప్రవాస సంఘాల ప్రతినిధులు లండన్: భారతీయ హై కమిషన్ ఆధ్వర్యంలో భారత 71వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 'ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ మార్చ్'ను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఇండియన్ హై కమిషన్ కార్యాలయం వరకు సాగింది. భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది ప్రవాస సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. "భారత్ మాతాకీ జై " అను నినాదాలతో లండన్ వినువీధులు మారుమోగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్)కు చెందిన సభ్యులు మార్చ్‌లో ప్రాతినిధ్యం వహించి "జై భారత్, జై తెలంగాణ" అంటూ నినదించారు. మార్చ్ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భారత హై కమిషనర్ వైకే సిన్హా ప్రవాస భారతీయులకు స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మాతృభూమిపై మీకున్న ప్రేమ ఎంతో గొప్పదని ప్రవాస భారతీయులను ప్రశంసించారు. కార్యక్రమం వియజయవంతం కావడానికి కృషి చేసిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లండన్‌లో ఎన్నో ర్యాలీలు నిర్వహించామని, కానీ నేటి భారత స్వాతంత్ర వేడుకల సందర్బంగా ఏర్పాటు చేసిన "ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ మార్చ్ " లో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని అన్నారు. మరీ ముఖ్యంగా బ్రిటిష్ గడ్డపై భారత జెండా ఎగురవేసి ఇలా అర్ధరాత్రి సంబరాలు చేసుకోవడం మరుపురాని అనుభూతినిచ్చిందని తెలిపారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస బిడ్డలందరూ ఒక చోట ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆహ్వానించిన భారత హై కమిషన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హై కమిషన్ ప్రతినిధులు ఏఎస్ రాజన్, విజయ్ వసంత, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, సభ్యులు నవీన్ రెడ్డి, అశోక్, రత్నాకర్, సత్య, రాకేష్, సత్యపాల్, రాజేష్ వాకా, ప్రవీణ్ వీర, రవి కిరణ్, వెంకీ, నగేష్, రాకేష్, నాగరాజు, భరత్, సత్తి రెడ్డి, నరేష్, రమ్మీ, జకీర్, రవీందర్ రెడ్డి, సాయి నితిన్, ఇతర ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
లండన్ లో ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి
లండన్: ఎన్నారై టీఆర్ఎస్, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్దంతి సందర్భంగా నివాళి సభ ఏర్పాటు చేశారు. టాక్ సమస్త కార్యవర్గ సభ్యులు, ప్రవాస తెలంగాణ వాదులు హాజరై జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సార్ చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి, జోహార్ జయశంకర్ సార్... జయశంకర్ సార్ అమర్ రహే అంటూ నివాళుర్పించారు. ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షుడు, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ... తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్ర గొప్పదని, చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పనిచేశారని, నేడు సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించుకోవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు .అనుకున్న ఆశయ సాధనకై ఆయన చేసిన కృషిని ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. అలాగే ఇటీవల వరుస దాడులతో యూకే లోని పలు నగరాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు సంస్థ తరుపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఈవెంట్స్ కో ఆర్డినేటర్ రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ.. జయశంకర్ సార్ జీవితం అందరికి ఒక స్ఫూర్తి సందేశమని, ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భం ఏదైనా మనమంతా తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట ఉండి, జయశంకర్ సార్ ఆశయాల కోసం కృషి చెయ్యాలని, ఇదే మనం వారికిచ్చే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, సెక్రటరీ సృజన్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి, నవీన్ మాదిరెడ్డి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ సత్యపాల్ పింగిళి, సత్య చిలుముల, రవి ప్రదీప్, నవీన్ భువనగిరి, తదితరులు హాజరయ్యారు. -
టాక్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్‌లోని టాక్ కేంద్ర కార్యాలయంలో కార్యవర్గ కుటుంబసభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు. అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా టాక్ వ్యవస్థాపకుడు, ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో బాగస్వాములైనందుకు గర్వాంగా ఉందని, అలాగే రాష్ట్ర ఏర్పాటును కూడా చూసే అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన కెసిఆర్ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. బంగారు తెలంగాణ కేవలం కెసిఆర్ వల్లే సాధ్యమని, ఉద్యమంలో వెంట ఉన్నట్లే బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా కేసీఆర్ వెంట ఉండి తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ.. మొట్ట మొదటిసారి టాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలు జూన్ రెండు నాడే జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తామంతా కేవలం నేడు సంబరాలకు పరిమితం కాకుండా, నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని గుర్తు చేసుకున్నారు. సేవే లక్ష్యం, బంగారు తెలంగాణే ధ్యేయంగా ముందుకు వెళ్తూ.. తెలంగాణ సమాజానికి తమ వంతు బాధ్యతగా సేవ చేస్తామని, బంగారు తెలంగాణ లో భాగస్వాములమవుతామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ ముఖ్య నాయకులు మట్టా రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర కంది, కార్యవర్గ సభ్యులు మత్తా రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, విజయలక్ష్మి, సుమా దేవి, మధుసూదన్ రెడ్డి, రత్నాకర్, అశోక్, నవీన్, విక్రమ్, సత్య, శైలజ, వెంకట్ రెడ్డి, రవి రైతినేని, సత్యం కంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టాక్ ఆద్వర్యం లో యూకేలో ఉగాది వేడుకలు
యూకే లోని షెఫీల్డ్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్ ), హిందూ మందిర్ సంయుక్తంగా శ్రీ హేవిళంబి నామ ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. టాక్ సభ్యులు సాయిబాబు నర్రా, అరవింద్ రెడ్డి అధ్యక్షతన షెఫీల్డ్ హిందూ దేవాలయంలోని కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ వేడుకలకు లార్డ్ లెఫ్టినెంట్ అఫ్ సౌత్ యార్క్ షైర్ ఆండ్రూ కూమ్బ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రవాస తెలుగు వారు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మొదట సాంప్రదాయ పూజలతో ఆరంభమైన వేడుకలో పంచాగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథి లార్డ్ లెఫ్టినెంట్ అఫ్ సౌత్ యార్క్ షైర్ ఆండ్రూ కూమ్బ్ మాట్లాడుతూ.. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తనకు హిందూ ధర్మం, సాంప్రదాయాలంటే ఎంతో గౌరవమని, ఇకముందు కూడా హిందూ ధర్మం గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ.. రుచులలో తీపి, చేదు ఉన్నట్లే జీవితంలో కూడా కష్టసుఖాలు ఉంటాయని, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది సంబరాలలో తెలుగువారే కాకుండా మరాఠీలు , గుజరాతీలు, బెంగాలీలు మరియు పంజాబీలు పాల్గొనడం విశేషం. తెలుగు వారి పండగలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న షెఫిల్డ్ హిందూ సమాజ్ సంస్థకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సంబరాలలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది, సభ్యులు సాయిబాబు నర్రా, అరవింద్ రెడ్డి, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, శ్రీకాంత్ జెల్లా, స్నేహలత, ప్రత్యుష, మాధవ్,విజయ్ ,భూషణ్ ,రాజేష్ వాకా ,వెంకీ ,రాజు తదితరులు పాల్గొన్నారు.