లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. లండన్ కేంద్రంగా పని చేస్తున్న ఏషియన్ వుమెన్ రిసోర్స్ సెంటర్(ఏడబ్ల్యూఆర్‌సీ) కార్యాలయంలో టాక్ మహిళా కార్యవర్గ సభ్యులంతా కలిసి మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఏడబ్ల్యూఆర్‌సీ డైరెక్టర్ సర్బజిత్ గాంగేర్ ముందుగా మహిళల, పిల్లల కోసం వారి సంస్థ చేస్తున్న కార్యక్రమాలని సభ్యులకి వివరించారు. ప్రస్తుతం మహిళలు ఎన్నో విషయాల్లో సరైన తోడు లేక వారి పట్ల జరుగుతన్న హింసని, అన్యాయాన్ని, అవమానాల్ని చెప్పుకొనే వేదిక లేక జీవితం పట్ల ఆశల్ని కోల్పోతున్నారన్నారు. ముఖ్యంగా ఏషియా ఖండం నుంచి ఉన్న ప్రవాస మహిళలకు ఇటువంటి చేయూత ఎంతో అవసరముందని తెలిపారు. మా సంస్థ గురించి తెలుసుకొని మమ్మల్ని ప్రోత్సహించడం మాకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. అలాగే మాకు ఆర్థిక సహాయాన్ని అందించినందుకు టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కందికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ.. సాటి మహిళగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సంస్థని ప్రోత్సహించడం నా బాధ్యత అన్నారు. ఎన్నో ఆశలతో విదేశాలకు వస్తున్న మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని మనమంతా కలిసి ఎదుర్కొని వారికి భరోసా కలిపించడమే కాకుండా వీలైనంత సహాయం అందించాలని తెలిపారు. టాక్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండి సహాయ చేస్తుందని తెలిపారు. మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా బలోపేతం అయినప్పుడే అసలైన అభివృద్ధి జరుగుతుందన్నారు.
టాక్ మహిళా విభాగం కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ.. టాక్ సంస్థ సేవే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ఇలా మహిళల సంక్షేమం కోసం పని చేస్త్తున్న సంస్థ సభ్యులతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకోవడం మాలో కొత్త ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపిందని చెప్పారు. ఇలా మేము క్రియాశీలకంగా పని చేసేలా మమ్మల్నే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఆదర్శంగా ఉన్న ఎంపీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు.
చివరిగా సంస్థల సభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి పరస్పరం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, మహిళా విభాగం కార్యదర్శి సుప్రజ పులుసు, కల్చరల్ కో ఆర్డినేటర్ జాహ్నవి వేముల, కల్చరల్ సెక్రటరీ శ్రావ్య వందనపు, సభ్యలు మమతా జక్కి, ఏడబ్ల్యూఆర్‌సీ సభ్యులు పాల్గొన్నవారిలో ఉన్నారు.
లండన్ టాక్ ఆధ్వర్యంలో ‘మహిళా దినోత్సవం’
Published Thu, Mar 8 2018 7:48 PM | Last Updated on Thu, Mar 8 2018 7:48 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment