womans day
-
Russia: మహిళలపై పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మాస్కో: మహిళా దినోత్సవం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మహిళలపై ప్రశంసల జల్లు కురిపించారు. మాతృత్వపు బహుమతులను వారు అందిస్తున్నారని కీర్తించారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం(మార్చ్ 8)నాడు పుతిన్ దేశంలోని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ‘మహిళలు క్లిష్టతరమైన బాధ్యతలు వేగంగా, సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు మగవారి పట్ల చాలా కేరింగ్‌గా ఉంటారు. ఎన్నో సమస్యలున్నప్పటికీ వారెప్పుడూ అందంగానే వెలిగిపోతుంటారు’అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో రష్యాలో బర్త్‌రేటు పెంచే ప్రచారాన్ని పుతిన్ తీవ్రం చేశారు. ముగ్గురు పిల్లలున్న యువ తల్లిదండ్రుల కోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహిళా దినోత్సవం సందర్భంగా పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. గత వారం పార్లమెంట్లో మాట్లాడుతూ ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలున్న తల్లిదండ్రులు దేశానికి గొప్ప గౌరవం అని పుతిన్ కీర్తించడం గమనార్హం. కాగా, సోవియెట్ కాలం నుంచి రష్యాలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మార్చి 8 వుమెన్స్ డేను హాలిడేగా ప్రకటించి మహిళలకు భారీగా బహుమతులు అందిస్తారు. ఇదీ చదవండి.. ఐదోసారి పెళ్లికి సిద్ధమైన మర్డోక్ -
మహిళా సాధికారతకు సహకరించాలి: కవిత
సాక్షి, హైదరాబాద్: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు సహకరించాలని ఎంపీ కవిత కోరారు. పార్క్ హయత్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీడర్షిప్ సమ్మిట్–2018కి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారసత్వ మహిళా నాయకులను కొందరు ప్రశ్నిస్తున్నారని.. పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని సూచించారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా దేశ అధ్యక్షులుగా మహిళలకు అవకాశం రాలేదని అలాంటిది మన దేశంలో ఇందిరా గాంధీ లాంటి వ్యక్తి ప్రధాని అయినా మహిళలు ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ హబ్‌ను ప్రారంభించిందని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి వారికి భద్రత మీద భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ మాట్లాడుతూ, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు పెరగాలన్నారు. స్త్రీలు వంటింటికి పరిమితం కాకుండా బయటి ప్రపంచాన్ని చూడాలని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సాక్షి, హైదరాబాద్: ప్రతి పేద కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్‌లో జరిగిన ఎల్పీజీ పంపిణీదారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిలిండర్ల పంపిణీలో అక్రమాలు సహించబోమని, చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. నగదు బదిలీ పథకంతో గ్యాస్ సిలిండర్ల అక్రమాలు తగ్గాయని అన్నారు. -
నేను రాజకీయాల్లోకి రావడం పక్కా : నటి
తమిళసినిమా: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావడం అన్నది పక్కా అంటున్నారు. కల్సా డాన్స్ కళాకారిణి అయిన ఈమె నటిగా రంగప్రవేశం చేసినప్పుడు క్లిక్ అవుతారో? లేదో అన్న సందేహం చాలామందికి కలిగింది. ఎందుకుంటే తొలి చిత్రం నిరాశపరచింది. మలి చిత్ర విడుదల నిలిచిపోయింది. ఆ తరువాత కూడా అవకాశాలు రాని పరిస్థితి. అలాంటి నటి ఇప్పుడు 9 చిత్రాలతో తీరిక లేనంత బిజీగా ఉన్నారు. లక్ అంటే ఈమెదే అనాలి. నటుడు విశాల్‌తో ప్రేమ, ఆ తరువాత మనస్పర్థలు లాంటి వదంతులు కూడా వరలక్ష్మిని పాపులర్ చేశాయని చెప్పొచ్చు. ఒక పక్క నటిగా బిజీగా ఉన్నా మరో పక్క మహిళల కోసం ‘సేవ్‌శక్తి’ అనే సంస్థను నెలకొల్సి దాని ద్వారా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా ఉత్తర చెన్నై ప్రాంతంలో సేవ్‌శక్తి తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ ఇచ్చిన భేటీ.. ప్ర: అనూహ్యంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజకీయ రంగప్రవేశం చేసే ఆలోచన ఏమైనా ఉందా? జ: రాజకీయం అనేది కాని పదమా? ఎవరినో ఓడించాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి రాకూడదు గానీ, నటీనటులే కాదు, సమాజానికి మంచి చేయాలనుకునే వారెవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. సినిమా ద్వారా పేరు, ప్రఖ్యాతులనే బలాన్ని మంచి విషయాలకు ఉపయోగించడంలో తప్పులేదు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను. అన్నింటినీ ఒకే సారి మార్చలేం. ప్ర: రాజకీయాల్లో మీ లక్ష్యం? జ: మహిళలకు అన్ని విధాలుగా మంచి చేయాలన్నదే నా లక్ష్యం ప్ర: రజనీకాంత్, కమలహాసన్‌ల రాజకీయరంగ ప్రవేశం గురించి? జ: నేను ముందే చెప్పాను. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. ఇంకా చెప్పాలంటే ఊరులోని వారందరు రావాలంటాను. ప్ర: నటుడు విశాల్ రాజకీయరంగ ప్రవేశం గురించి? జ: ఆయన రాజకీయరంగం గురించి చెప్పడానికేమీలేదు. ప్ర: మీరు ఉత్తర చెన్నైలో సేవా కార్యక్రమాలను ప్రారంభించడానికి కారణం? జ: కారణం ఇతర ప్రాంతాల కంటే అక్కడ సమస్యలు అధికం కావడమే. ఆ ప్రాంతంలో నాకు చేతనైనంత సాయం చేయాలనే అక్కడ సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. ప్ర: పాఠశాల విద్య విధానంలో ఎలాంటి మార్చులు రావాలంటారు? జ: పాఠశాల విద్యతో పాటు ఆత్మరక్షణ విద్య, సెక్స్ గురించి అవగాహన పాఠాలు అవసరం. -
వనితకు వరం.. ‘వీ హబ్’
-
మహిళా మంత్రులు లేని రాష్ట్రంగా రికార్డు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పుణ్యమా అని మంత్రి వర్గంలో మహిళా సభ్యులు లేని రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకి ఎక్కిం దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. గురువారం మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. మహిళల పట్ల అధికార టీఆర్ఎస్కు ఎందుకంత చిన్నచూపో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రాజకీయంగా సముచిత అవకాశాలు కల్పిస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉండాలనే టీఆర్ఎస్ డిమాండ్ సరికాదని బీజేపీ సీనియర్ నేత ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు అన్నారు. రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడల్లా రిజర్వేషన్లు మారుతాయన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని రాజ్యాంగంలోనే ఉందన్నారు. -
హైకోర్టులో ఘనంగా మహిళా దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ టి.రజని, సీనియర్ న్యాయవాది ఎం.భాస్కరలక్ష్మి, రక్షణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.బాలలత, ‘మన చెరువులు రక్షించుకుందాం’ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ జవీన్ జైరత్ తదితరులు హాజరయ్యారు. మహిళా సాధికారత, నేటి సమాజంలో మహిళల పాత్ర, మహిళాభివృద్ధి వంటి అంశాలపై పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం వారిని న్యాయవాదుల సంఘాలు సన్మానించాయి. -
వనితకు వరం.. ‘వీ హబ్’
సాక్షి, హైదరాబాద్ : ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వరమిచ్చింది. కొత్తగా పరిశ్రమలు పెట్టే వారి కోసం ఇప్పటికే టీహబ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా వీహబ్ (ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ హబ్) ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీ హబ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఈ వీ హబ్ ఇంక్యుబేటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. వీహబ్‌కు కొత్త ఆలోచనలతో వచ్చే మహిళలకు అక్కడే యూనిట్ ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వడంతోపాటు పెట్టుబడి కోసం రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు సాయాన్ని అందజేయనుం ది. దీనికి తొలుత ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను వీహబ్‌కు తెలియజేయాలి. ప్రాజెక్టు రిపోర్టు సమర్పించిన అనంతరం పారిశ్రామిక రంగంలో పేరొందిన నిపుణుల ఆధ్వర్యంలో వారికి మార్గనిర్దేశనం చేస్తారు. ఈ మేరకు వీహబ్ ఆరు ప్రముఖ సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రభుత్వమే తొలి కొనుగోలుదారు ‘ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీహబ్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. తొలుత రూ.15 కోట్లతో ప్రారంభిస్తున్నాం. విడతల వారీగా అభివృద్ధి చేస్తూ భారీగా నిధులు కేటాయిస్తాం. ప్రతి మహిళను విజయవంతమైన పారిశ్రామికవేత్తగా తయారుచేయడమే వీ హబ్ లక్ష్యం’ అని కేటీఆర్ తెలిపారు. వీహబ్ ప్రారంభించిన అనంతరం ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘మహిళలకు వినూత్న ఆలోచనలు వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టాలంటే ప్రోత్సాహం అంతంతమాత్రంగానే దక్కుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభు త్వం వీ హబ్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసిం ది. ఆలోచన వస్తే వెంటనే వీహబ్‌లో సంప్రదించండి. నిపుణులతో అవగాహన కల్పించి మార్గనిర్దేశనం చేస్తాం. ఉత్తమ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దుతాం. వారు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వమే తొలుత కొనుగోలు చేస్తుంది. టీ హబ్ ద్వారా ఇప్పటికే వేలాది మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాం. వీ హబ్ ఆలోచన ఇదివరకే చేసినప్పటికీ మంచిరోజున ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించాం’ అని అన్నారు. చరిత్ర సృష్టిస్తున్నారు.. ‘క్రీడా రంగంలో మన హైదరాబాదీ అమ్మాయిలు సానియా మీర్జా, సైనా నెహ్వాల్, మిథాలీరాజ్, అరుణారెడ్డి సరి కొత్త చరిత్ర సృష్టించారు. వ్యాపారంలో సరికొత్త కాన్సెప్ట్ ‘పెళ్లి జడలు’పేరుతో వ్యాపారం ప్రారంభించిన కల్పన అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ వీహబ్ అండగా ఉంటుంది’అని అన్నారు. చాలా కుటుంబాల్లో తమ పిల్లల్ని డాక్టర్, ఇంజనీరు చేయాలని అనుకుంటున్నారని, కానీ అత్యుత్తమ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే దిశగా ఆలోచించడం లేదన్నారు. కేటీఆర్ ప్రసంగానికి ముందు పలువురు మహిళా పారిశ్రామిక వేత్తలు తమ అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో ప్రాజెక్టు సంచాలకులు టెస్సీ థామస్, ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు కోల వాణి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
లండన్‌లో ఘనంగా ‘మహిళా దినోత్సవం’
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. లండన్ కేంద్రంగా పని చేస్తున్న ఏషియన్ వుమెన్ రిసోర్స్ సెంటర్(ఏడబ్ల్యూఆర్‌సీ) కార్యాలయంలో టాక్ మహిళా కార్యవర్గ సభ్యులంతా కలిసి మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఏడబ్ల్యూఆర్‌సీ డైరెక్టర్ సర్బజిత్ గాంగేర్ ముందుగా మహిళల, పిల్లల కోసం వారి సంస్థ చేస్తున్న కార్యక్రమాలని సభ్యులకి వివరించారు. ప్రస్తుతం మహిళలు ఎన్నో విషయాల్లో సరైన తోడు లేక వారి పట్ల జరుగుతన్న హింసని, అన్యాయాన్ని, అవమానాల్ని చెప్పుకొనే వేదిక లేక జీవితం పట్ల ఆశల్ని కోల్పోతున్నారన్నారు. ముఖ్యంగా ఏషియా ఖండం నుంచి ఉన్న ప్రవాస మహిళలకు ఇటువంటి చేయూత ఎంతో అవసరముందని తెలిపారు. మా సంస్థ గురించి తెలుసుకొని మమ్మల్ని ప్రోత్సహించడం మాకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. అలాగే మాకు ఆర్థిక సహాయాన్ని అందించినందుకు టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కందికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ.. సాటి మహిళగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సంస్థని ప్రోత్సహించడం నా బాధ్యత అన్నారు. ఎన్నో ఆశలతో విదేశాలకు వస్తున్న మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని మనమంతా కలిసి ఎదుర్కొని వారికి భరోసా కలిపించడమే కాకుండా వీలైనంత సహాయం అందించాలని తెలిపారు. టాక్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండి సహాయ చేస్తుందని తెలిపారు. మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా బలోపేతం అయినప్పుడే అసలైన అభివృద్ధి జరుగుతుందన్నారు. టాక్ మహిళా విభాగం కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ.. టాక్ సంస్థ సేవే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ఇలా మహిళల సంక్షేమం కోసం పని చేస్త్తున్న సంస్థ సభ్యులతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకోవడం మాలో కొత్త ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపిందని చెప్పారు. ఇలా మేము క్రియాశీలకంగా పని చేసేలా మమ్మల్నే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఆదర్శంగా ఉన్న ఎంపీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. చివరిగా సంస్థల సభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి పరస్పరం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, మహిళా విభాగం కార్యదర్శి సుప్రజ పులుసు, కల్చరల్ కో ఆర్డినేటర్ జాహ్నవి వేముల, కల్చరల్ సెక్రటరీ శ్రావ్య వందనపు, సభ్యలు మమతా జక్కి, ఏడబ్ల్యూఆర్‌సీ సభ్యులు పాల్గొన్నవారిలో ఉన్నారు. -
రావూరి.. పాటలు తేనెలూరి
శ్రీనివాసుడి చెంత బుల్లెమ్మ స్వర ధార ఆమె గానం ‘శ్రీవారి’కి స్వరనీరాజనం స్వరం.. మృదు మాధుర్యం తెనాలి: తిరుమల ఏడుకొండలవాడిని దర్శించుకొనే లక్షలాది భక్తులు లిప్తపాటు కలిగే దర్శన భాగ్యానికి భక్తి పారవశ్యంతో పొంగిపోతారు. మరికొన్ని క్షణాలు అక్కడే ఉండాలని ఆరాటపడతారు. అలాంటి అదృష్టమే కాదు.. శాశ్వతంగా స్వామికి సేవ చేసుకునే భాగ్యం ఓ సాధారణ గాయనికి దక్కింది. పెళ్లి ఊరేగింపులు, వేడుకల్లో సంగీత బృందాల్లో పాటలు పాడిన యువతి ఇప్పుడు తిరుమల వాసుని పాదాల చెంతకు చేరిన తీరు ఆద్యంతం హృద్యం. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన గాయనిగా ఎదిగి.. ఒదిగిన గాయని రావూరి బుల్లెమ్మ విజయప్రస్థానం ఆమె మాటల్లోనే... నా పేరు రావూరి బుల్లెమ్మ. తెనాలి సమీపంలోని కొలకలూరు. తండ్రి రావూరి ముసలయ్య మాజీ సైనికుడు. తల్లి సామ్రాజ్యం. మేం తొమ్మిది మంది సంతానం. ఆడపిల్లల్లో నేనే చివరిదాన్ని. నాన్న పౌరాణిక నాటకాల్లో నటించేవారు. ఆయన వారసత్వమేమో తెలియదు కానీ.. మా అందరికీ ఏదొక కళలో ప్రవేశం ఉండేది. నాకు పాటలు పాడటమంటే పిచ్చి. ఇంటర్మీడియట్లో రోజూ తెనాలి వెళ్లి సంగీతం నేర్చుకునేదాన్ని. గాయని మాధవపెద్ది మీనాక్షి తొలి గురువు. చదువు ఇంటర్మీఇయట్తోనే ఆపేయాల్సి వచ్చినా సంగీతంతో మాత్రం నా అనుబంధాన్ని కొనసాగించాను. నాలాగే పాటలు పాడే సోదరుడు బుజ్జి ఓ పాటల పోటీకి నన్ను వెంటబెట్టుకు వెళ్లాడు. మ్యూజికల్ పార్టీ నిర్వాహకులు నా పాట విని తమ ట్రూపులోకి ఆహ్వానించారు. మాధుర్యంతో మెప్పు.. జీవనానికీ తోడ్పడుతుందనే భావనతో గుంటూరులో సంగీత కళాశాలలో సర్టిఫికెట్ కోర్సు చేశా. గాన కళాకారిణి సుమశ్రీగా సంగీత ప్రపంచానికి మరింత చేరువయ్యా. గొంతులోని మాధుర్యం.. ఎంతటి కఠినమైన పాటనైనా భావం చెడకుండా చూసేది. పాడిన పాట అచ్చు సినిమాలో గాయకులు పాడిన విధంగానే ఉండేది. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, చిత్ర, ఆనంద్ సంగీత కచేరీల్లో పాడటం మరచిపోలేని అనుభవం. హిందోళం.. మాల్కోస్ రాగమని చెప్పా.. పాటతో అల్లుకున్న జీవితం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పత్రిక ప్రకటనతో అద్భుతమైన మలుపు తీసుకుంది. అన్నమయ్య ప్రాజెక్టులో టీటీడీ ఆస్థాన గాయని పోస్టుకు దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూలో ‘కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు’ పాడి వినిపించా..‘కర్ణాటక సంగీతంలో ఏ రాగం?’ అన్న ప్రశ్నకు, ‘హిందోళం’ అనీ హిందూస్థానీలో ‘మాల్కోస్ రాగం’ అంటారని చెప్పా. నెలరోజుల తర్వాత వచ్చిన అపాయింట్మెంట్ లెటరు వచ్చింది. 2001 జూన్ 14 నుంచి ఇక స్వామి సేవకు అంకితమయ్యాను. టీటీడీ ఆస్థాన వయొలిన్ కళాకారుడు కె.శంకర్‌తో నా భావాలు కలిసి వివాహానికి దారి తీసింది. ఇద్దరమూ శ్రీవారి సేవలో గడుపుతున్నాం. మాకో కుమారుడు హరిచరణ్. దేశవిదేశాల్లో కచేరీలు.. టీటీడీ అన్నామాచార్య ప్రాజెక్టులో అన్నమాచార్యుడి సంకీర్తనలు గానం చేయటం నా ఉద్యోగం. ‘శ్రీవారి ఊంజల సేవ (సహస్ర దీపాలంకరణసేవ)లో గానం చేస్తుంటాం.. ‘ఉయ్యాలా.. బాలు నూచెదరూ’, ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’ వంటి లాలి పాటలు పాడతాం. అలివేలు మంగాపురంలో అమ్మవారి ఊంజలసేవలోనూ పాల్గొంటాం. గోవిందరాజుల ఆలయం, కాణిపాకం వినాయకుడు, బైరాగిపట్టెడలో ఆంజనేయస్వామి ఆలయం, కపిలతీర్థంలో గానం చేస్తుంటాం. ఒడిశా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, దక్షిణాఫ్రికాలోని కెన్యాలో జరిగిన స్వామివారి కల్యాణోత్సవాలకూ టీటీడీ నన్ను పంపింది. 500 కీర్తనలు పాడగలను.. డజను అన్నమాచార్య పాటలతో ఉద్యోగంలో చేరిన నేను ఇప్పుడు తేలిగ్గా 500 కీర్తనలు గానం చేయగలుగుతున్నా. ప్రముఖ విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌తో కలిసి ‘అన్నమయ్య సంకీర్తన కుసుమాంజలి’ ఆడియో క్యాసెట్ తీసుకొచ్చా. సొంతంగా ‘అన్నమయ్య సంకీర్తన మహాహారం’ వెలువరించా. టీటీడీ చేసిన ‘అలిమేల్మంగ నామావళి’లో 108 నామాలు నేను పాడాను. నా గానంతో ‘అన్నమయ్య సంకీర్తన శిఖామణి’, ‘అన్నమయ్య సంకీర్తన వైభోగం’, ‘వెంగమాంబ కీర్తనలు’ ఆడియో క్యాసెట్లు వచ్చాయి. టీటీడీ గతేడాది ఆగస్టులో ‘ఉత్తమ గాయని’గా నన్ను గౌరవించింది. ఇటీవల కరీంనగర్లో సామవేదం షణ్ముఖశర్మ చేతుల మీదుగా ‘సంకీర్తన సుమశ్రీ’ బిరుదు పొందా. -
రేపు మహిళలకు ప్రత్యేకంగా లైసెన్స్ మేళా
కర్నూలు: అంతర్జాతీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రమీళ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లకు జిల్లాలో మూడు విడతలుగా ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించారు. కార్మికుల నుంచి భారీ స్పందన రావడంతో మహిళలకు కూడా ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళల కోసం 8వ తేదీ ప్రత్యేకంగా స్లాడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. -
ప్రధాని సదస్సుకు నలుగురు మహిళా సర్పంచులు
కర్నూలు(అర్బన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తున్న సదస్సుకు జిల్లాకు చెందిన నలుగురు సర్పంచులు పాల్గొంటున్నారు. తమ గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దిన నేపథ్యంలో వీరు భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్న సదస్సుకు ఎంపికయ్యారు. జిల్లాలో మొత్తం 83 గ్రామాలు ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఐదుగురు సర్పంచులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సుకు హాజరయ్యేందుకు అవకాశం కలిగింది. అయితే ఒకరు వ్యక్తిగత కారణాలతో హాజరయ్యేందుకు విముఖత చూపగా, నలుగురు సర్పంచులను అధికారికంగా గుజరాత్‌కు పంపుతున్నారు. గాంధీనగర్‌కు వెళ్తున్నది వీరే నందికొట్కూరు మండలం బొల్లవరం, బిజినెవేముల గ్రామాల సర్పంచులు అనురాధ, తెలుగు లక్ష్మమ్మ, మద్దికెర మండలం ఎడవలి గ్రామ సర్పంచు నెట్టెకంఠమ్మ, దేవనకొండ మండలం నల్లచెలిమిల గ్రామ సర్పంచ్ రామాంజనమ్మ గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో జరుగుతున్న సదస్సుకు బయలుదేరుతున్నారు. వీరిని విజయవాడకు తీసుకువెళ్లి అక్కడి నుంచి ఏసీ రైల్లో గాంధీనగర్‌కు పంపుతున్నారు. ఆ సదస్సులో వీరు ప్రధాని చేతుల మీదుగా సన్మానం, ప్రశంసాపత్రాలను అందుకోనున్నారు. ఆ వేదికపై నుంచి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాన్ని జిల్లాలోని 50 మంది మహిళా సర్పంచులు వినే విధంగా జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా మహిళా సర్పంచులకు సమాచారాన్ని చేరవేశారు. వీరందరిని ఒకచోటికి చేర్చి ప్రధాని ప్రసంగాన్ని వినిపించనున్నారు. -
నిర్భయ ఘటన తర్వాత మహిళల్లో పెరిగిన చైతన్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత మహిళల్లో చైతన్యం పెరిగింది. పోలీస్‌స్టేషన్ మెట్లెక్కి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత రెండు నెలల కాలంలో ఢిల్లీ పోలీసు స్టేషన్లలో సుమారు 300 రేప్ కేసులు, 500కు పైగా వేధింపుల కేసులు నమోదయ్యాయి. ‘కేసుల సంఖ్య పెరగడం శుభ పరిణామం. నిర్భయ ఘటన తర్వాత మహిళల్లో ఉన్న స్తబ్ధత తొలగిపోయింది. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రస్తుతం మహిళలు ధైర్యంగా స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ’ అని ఢిల్లీ పోలీసులు అభిప్రాయపడ్డారు. గత రెండు నెలల కాలంలో పోలీసుల రికార్డుల సమాచారం ప్రకారం ఐపీసీ 354, 509(వేధింపులు, బలవంతపు లైంగిక దాడి) సెక్షన్ల కింద 500 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. 2014 డిసెంబర్ 15కు ముందు రాష్ట్రంలో 4,179 వేధింపుల కేసులు నమోదైతే 67.17 శాతం కేసులు పరిష్కారం అయ్యాయి. పరిచయమున్న వారే నిందితులు వేధింపులు, అత్యాచార కేసుల్లో 96 శాతం మంది బాధితులు తమకు, తమ తల్లిదండ్రులకు పరిచయం ఉన్న వారి చేతుల్లోనే మోసానికి గురవుతున్నట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బాస్సీ తెలిపారు. కేవలం 4 శాతం మంది మాత్రమే అపరిచితుల చేతుల్లో బలవుతున్నట్లు స్పష్టం చేశారు. పురుషుల వేధింపులను ఎదుర్కోవడానికి మహిళల్లో స్వీయ సంరక్షణకు మెలకవులు, భౌతిక సామర్థ్యం పెంచడానికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బాల్య దశ నుంచే పాఠశాలల్లో స్వీయ రక్షణ కోసం బాలిక లకు శిక్షణను ఇస్తే వారికి 15 ఏళ్లు వచ్చే సరికి పోకిరీల భరతం పడతారని వివరించారు. ఈ ఏడాది ‘లక్ష మంది’ బాలికలకు వాటిపై శిక్షణను ఇవ్వాల్సిందిగా లక్ష్యం నిర్దేశించుకున్నామని తెలిపారు. మార్చి 8 ఆదివారం నాటికి 26 వేల మంది బాలికలకు శిక్షణను ఇచ్చినట్లు ఆనందం వ్యక్తం చేశారు. ‘మహిళా’ పోలీసులకు పదోన్నతులు న్యూఢిల్లీ: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో 45 మంది మహిళా ఎస్ఐలకు ఇన్స్పెక్టర్ల ర్యాంకుతో పదోన్నతులిచ్చారు. దీంతో 20 ఏళ్ల ఎస్ఐల నిరీక్షణకు తెరపడింది. దీనిపై పోలీసు కమిషనర్ బీఎస్ బస్సి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. స్టేషన్లలో మహిళా పోలీసుల అవసరం చాలా ఉందని ఆయన తెలిపారు. వీరితో మహిళలపై నేరాలను నియంత్రించొచ్చన్నారు. త్వరలోనే మహిళా భద్రతకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. -
బతికి సాధిస్తా..
నేటి బాలికలే రేపటి మహిళలు. మరి ఆ రేపటి మహిళలు ఇప్పుడెంత సేఫ్‌గా ఉన్నారు? దేశం మొత్తం బేటీ బచావో అంటోంది? మరి హైదరాబాద్ మాటేమిటి? రానున్న మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చిన్నారుల స్థితిగతులపై వరుస కథనాలు.. సైరా (పేరు మార్చాం) పదిహేనేళ్ల అమ్మాయి. పేదరికం, అమాయకత్వం ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నాయి. బాల్యాన్ని మాయం చేశాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి కోలుకుంటూ బతుకుపై ఆశ పెంచుకుంటోంది. ఆ కథ ఈ బేటీ మాటల్లోనే.. ..:: సరస్వతి రమ నాన్నకు అనారోగ్యం. అమ్మ ఉల్లిగడ్డలమ్మి ఇల్లు నడిపిస్తుంది. నాకో అక్క. కష్టమైనా.. అమ్మ మా ఇద్దరినీ మంచి స్కూల్లో జాయిన్ చేసింది. ఓసారి సమయానికి అమ్మ ఫీజ్ కట్టకపోయే సరికి మమ్మల్ని స్కూల్ నుంచి తీసేశారు. అప్పుడు నేను సెవెన్త్.. అక్క టెన్త్. ఎలాగో అక్క టెన్త్ కంప్లీట్ చేసింది. నేను ఏడుతోనే ఆపేశాను. ఆ టైమ్‌లోనే అక్కకు పెళ్లయింది. అప్పుడు నాకు పదమూడేళ్లు. బావ పేరు మొహినుద్దీన్ (మార్చాం). అక్కా, బావా మా ఇంట్లోనే ఉండేవారు. కొన్నాళ్లకి బావ వాళ్ల అన్నయ్య (జాఫర్) చుట్టపుచూపుగా వచ్చి మా ఇంట్లోనే ఉండసాగాడు. రోజూ నాకోసం చాక్లెట్లు, బిస్కట్లు తెస్తుండేవాడు. ‘జాఫర్ భయ్యా’ అని పిలుస్తూ నేనూ అతనితో చనువుగానే మాట్లాడేదాన్ని. చిన్నప్పటి నుంచి అన్నయ్య ఉంటే బాగుండనుకునే నాకు.. జాఫర్ రాగానే ఓ అన్నయ్య దొరికాడన్న ఫీలింగ్ కలిగింది. ఒకరోజు... ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. జాఫర్ నా పక్కన కూర్చోని అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. వెంటనే బయటకొచ్చేశాను. భయంతో ఎవరికీ చెప్పలేదు. కొన్ని రోజులకు నన్నిచ్చి పెళ్లిచేయాలని అమ్మనడిగాడు జాఫర్. అమ్మ అతనిని గట్టిగా తిట్టి పంపింది. అప్పటికే అతనికి 30 ఏళ్లు. కొన్నాళ్లకి అమ్మకి, అక్కకి గొడవైంది. అక్క, బావ వేరు కాపురం పెట్టారు. జాఫర్ మాత్రం మా ఇంట్లోనే ఉండేవాడు. నాన్న ఆరోగ్యం కాస్త మెరుగైంది. అమ్మకి సాయంగా మార్కెట్‌కీ వెళ్లసాగాడు. అమ్మా, నాన్న మార్కెట్‌కి వెళ్లిపోతే ఇంట్లో నేనొక్కదాన్నే ఉండేదాన్ని. ఆ క్రమంలో.. ఓ రోజు జాఫర్ బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి గడియ వేశాడు. ‘నిన్ను నాకిచ్చి పెళ్లి చేయరా..’ అంటూ నాపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. కాళ్లుపట్టుకుని బతిమాలినా వదలే ్లదు. పరువు పోతుందని విషయాన్ని మనసులోనే దాచుకున్నాను. ఇదే అలుసుగా జాఫర్ నాపై ఓ నెల రోజులు పదే పదే దాడి చేశాడు. నెల తర్వాత నా శరీరంలో సహజంగా జరగాల్సిన ఓ ప్రక్రియ ఆగిపోయింది. అమ్మకి చెప్పాను. హాస్పిటల్‌కి తీసుకెళ్తే నేను ప్రెగ్నెంట్ అని తేలింది. అమ్మ నన్ను బరబర లాక్కుంటూ ఇంటికొచ్చింది. జాఫర్ గురించి ఆరా తీస్తే అప్పటికే వాడు గాయబ్. అమ్మ నాకు అబార్షన్ చేయించింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇంకో జాఫర్.. పాతగాయం నుంచి కొంత కోలుకున్నాక బయటివాళ్లతో కాస్త మాట్లాడేదాన్ని. మా ఇంటి కింద ఓ హోటల్ ఉండేది. బ్రెడ్, స్నాక్స్ కోసం నా కజిన్‌తో కలసి హోటల్‌కు వెళ్లేదాన్ని. అక్కడే ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. అతని పేరూ జాఫరే. ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. నాకో సిమ్‌కార్డ్ ఇచ్చాడు. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అప్పటికి నాకు పదిహేనేళ్లు. జాఫర్ నన్ను పెళ్లి చేసుకుంటానని మా అమ్మను అడిగాడు. అమ్మానాన్న లేని అనాథనని చెప్పాడు. అమ్మ సరేనంది. అందరం కలసి ఒకే ఇంట్లో హ్యాపీగా ఉన్నాం. ఓ రోజు... అమ్మ కోపంతో అరుస్తూ నన్ను బాగా కొట్టింది. కోపమొచ్చి అక్క వాళ్లింటికి వెళ్లాను. అక్క పోలీస్ కంప్లయింట్ ఇవ్వమంది. అలాగే చేశాను. దాంతో పోలీసులు నన్ను హాస్టల్లో చేర్పించారు. వారం తర్వాత షాహీన్కొచ్చాను. జరిగింది ఆలోచిస్తే నేను చేసిన తప్పేంటో తెలిసింది. వెళ్లి అమ్మను క్షమాపణ అడిగాను. ఆ రోజు నన్నెందుకు కొట్టిందో అమ్మ అప్పుడు చెప్పింది. ఈ జాఫర్‌కి అంతకుముందే పెళ్లయి ఇద్దరు పిల్లలట. అది అమ్మకు తెలిసింది. అందుకే కొట్టింది. అలా తెలిసీ తెలియనితనంతో రెండుసార్లు దెబ్బతిన్నాను. బాధగా ఉంది. అయినా బతకాలన్న తపనుంది. ‘షాహీన్’ సంస్థ సాయంతో చదువుకుంటున్నాను. నా కాళ్లపై నేను నిలబడతాను. నాలాంటి అమ్మాయిలకు అండగా నిలుస్తాను.