ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వరమిచ్చింది. కొత్తగా పరిశ్రమలు పెట్టే వారి కోసం ఇప్పటికే టీహబ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా వీహబ్ (ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ హబ్) ఏర్పాటు చేసింది.