Jayesh Ranjan
-
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమతో భారీగా ఉద్యోగాలు
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ వల్ల భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా వినియోగదారులకు, విక్రేతలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. అసోసియేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఆఫ్ ఇండియా (ఏడీఎస్‌ఈఐ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ (ఫిడ్సీ) సహకారంతో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కాన్క్లేవ్’లో ఆయన పాల్గొని మాట్లాడారు.‘ఈ పరిశ్రమ ద్వారా రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చు. స్థానికంగా ఈ రంగం వృద్ధి చెందితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. ఈ పరిశ్రమలో సేవలందించే సంస్థలు నైతిక పద్ధతులను పాటిస్తూ స్థిరాభివృద్ధిపై దృష్టి సారించాలి. వినియోగదారులకు, విక్రేతలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ప్రభుత్వం పోత్సాహం అందిస్తుంది. రాష్ట్రంలో తయారీ యూనిట్లు స్థాపించేందుకు సంస్థలు ముందుకురావాలి. ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ విభాగంలో సేవలందించే సంస్థలకు అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుంది’ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ..‘పారదర్శకంగా వినియోగదారులకు ఉత్పత్తులు అందించడంలో ఈ పరిశ్రమ కీలకంగా మారనుంది. మోసపూరిత విధానాల నుంచి యూజర్లను రక్షిస్తూ, వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ద్వారా మెరుగైన సేవలందించేందుకు వీలుగా స్టేట్ మానిటరింగ్ కమిటీను త్వరలో ఏర్పాటు చేస్తాం. ఇది వినియోగదారులు, సంస్థల ప్రయోజనాలను కాపాడుతుంది’ అన్నారు. ఏడీఎస్‌ఈఐ అధ్యక్షుడు సంజీవ్ కుమార్ మాట్లాడుతూ..‘డైరెక్ట్ సెల్లింగ్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వంతో జతకట్టడం సంతోషకరం. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకారం నెలకొల్పేందుకు ఈ సదస్సు వేదికగా నిలిచింది’ అన్నారు.ఈ సందర్భంగా ఏడీఎస్‌ఈఐ, ఫిడ్సీ సంస్థలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అభివృద్ధికి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి తమ మద్దతు తెలుపుతామని ప్రకటించాయి. ఈ సమావేశంలో సామాజిక బాధ్యతను పెంపొందించడంపై దృష్టి సారించడంతో పాటు, భవిష్యత్తులో డైరెక్ట్ సెల్లింగ్ విభాగంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, డేటా అనలిటిక్స్ వినియోగంపై చర్చించారు.ఇదీ చదవండి: మానవ వనరులను ఆకర్షించడంలో విఫలంరిటైల్ వ్యాపారులు, దళారులు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తయారీదారుల నుంచి ఉత్పత్తులను వినియోగదారులకు అందించడమే ‘డైరెక్ట్ సెల్లింగ్’. భవిష్యత్తులో ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విధానంలో దళారులు లేకపోవడంతో తుది ఉత్పత్తులు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ విలువ ఏకంగా 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు)గా ఉంది. 2030 నాటికి ఈ పరిశ్రమ ఏటా 6.4 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా. -
ఒలింపిక్ అధ్యక్షుడిగా జయేష్ రంజన్ గెలుపు
-
జయేష్ రంజన్‌కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న జయేష్ రంజన్‌కు లైన్ క్లియర్ అయింది. జయేష్ రంజన్ నామినేషన్ తిరస్కరణ చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా నామినేషన్ తిరస్కరించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఉండటంతో నామినేషన్‌ను ఆమోదించాల్సిందేనని రిటర్నింగ్ అధికారిని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. దీంతో ఈ నెల 9వ తేదీ జరగనున్న ప్రెసిడెంట్ ఎన్నికల్లో రంగరావుతో కలిసి జయేష్ రంజన్ పోటీపడనున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసిన తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ బీజేపీనేత జితేందర్‌రెడ్డి నామినేషన్లు అనూహ్యంగా తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి : రసవత్తరంగా తెలంగాణ ఒలంపిక్ ఎన్నికలు -
ఆ ఎన్నికలు జరగనిచ్చే ప్రసక్తే లేదు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి హైడ్రామా కొనసాగుతోంది. ఈ నెల 9న జరగబోయే ఎన్నికలను అడ్డుకుంటామని జయేష్ రంజన్ ప్యానల్ అంటోంది. రిటర్నింగ్ అధికారి చంద్రకుమార్ నియామకం చెల్లదని చెబుతోంది. మాజీ న్యాయమూర్తి కేసీ.భానును మొదట రిటర్నింగ్ అధికారిగా నియమించి, అనంతరం తెర మీదకి మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్‌ను తీసుకురావటాన్ని తప్పుబడుతోంది. ఢిల్లీ పెద్దల సహకారంతో కొందరు తెలంగాణలో పెత్తనం చేయాలని చూస్తున్నారని జయేష్ రంజన్ ప్యానెల్ ఆరోపిస్తోంది. ఢిల్లీలో కాదు.. ఎన్నికలు హైదరాబాద్‌లోనే.. ‘తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఢిల్లీలో కాదు.. హైదరాబాద్‌లోనే జరిగి తీరతాయ్’ అని తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు అన్నారు. ఒలంపిక్ ఎన్నికల విషయంలో నెలకొన్న పరిణామాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రిటర్నింగ్ అధికారిగా చంద్రకుమార్ నియామకంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. జయేష్ రంజన్ నామినేషన్ తిరస్కరించటం అనైతికమని తెలిపారు. నామినేషన్ తిరస్కరించటానికి గల కారణాలు చంద్రకుమార్ ఇప్పటికీ చెప్పటంలేదని, రిటర్నింగ్ ఆఫీసర్‌గా చంద్రకుమార్‌ను ఎవరు నియమించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి : ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కరణ.. -
ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కరణ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ బీజేపీనేత జితేందర్‌రెడ్డి నామినేషన్లు అనూహ్యంగా తిరస్కరించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషనన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. గతంలో ఒలంపిక్ అసోషియేషన్ ఆఫ్ తెలంగాణకు నాయకత్వం వహించిన కె. రంగారావు నామినేషన్‌ను స్వీకరించగా.. జయేష్ రంజన్ క్యాట్ నుంచి అనుమతి పొందకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిజెక్టు చేశారు. దీనిపై జయేష్ రంజన్, జితేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ అధ్యక్ష ఎన్నికలు కాస్త రాజకీయనాయుడికి, ప్రభుత్వ అధికారికి మధ్య పోటీగా మారనున్నాయి. -
ఫిబ్రవరి 17–19 తేదీల్లో హైదరాబాద్‌లో బయో ఏసియా 2020
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా వచ్చే నెలలో జరిగే బయో ఏసియా 17వ సదస్సులో భాగంగా ‘స్టార్టప్ స్టేజ్’వేదికగా లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా బయో ఏసియా వేదికపై 75 స్టార్టప్‌లకు తమ ఆవిష్కరణలు ప్రదర్శించే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటివరకు 300 స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోగా, దరఖాస్తు గడువును ఈ నెల 12 వరకు పొడిగించాలని నిర్వాహకులు నిర్ణయించారు. లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద వేదిక ‘బయో ఏసియా 2020’సదస్సు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ రెండు రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలతో స్టార్టప్‌లు భేటీ అయ్యే అవకాశాన్ని ‘స్టార్టప్ స్టేజ్’కల్పిస్తుంది. ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు స్టార్టప్ స్టేజ్ అవకాశం కల్పిస్తుంది. 75 స్టార్టప్‌లకు ఈ అవకాశం దక్కనుండగా, వీటి నుంచి ఎంపిక చేసిన ఐదు అత్యుత్తమ స్టార్టప్‌లకు పెట్టుబడుదారులతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశంతో పాటు నగదు బహుమతి లభిస్తుంది. బయో ఏసియా సదస్సులో భాగంగా జరిగే చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా ఎంపిక చేసిన స్టార్టప్‌లకు కల్పిస్తారు. టెక్ మహీంద్ర భాగస్వామ్యంతో.. బయో ఏసియా సదస్సులో భాగంగా ‘స్టార్టప్ స్టేజ్’ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టెక్ మహీంద్ర సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తుండగా.. టెక్ మహీంద్ర లీడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. ఐదేళ్లుగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న బయో ఏసియా సదస్సుల్లో స్టార్టప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు, అనేక నూతన ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగే 17వ బయో ఏసియా సదస్సులో తమ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు ఇప్పటికే 300 దరఖాస్తులు రాగా, ఈ నెల 12 వరకు దరఖాస్తు గడువు ఉందని బయో ఏసియా సీఈవో శక్తి నాగప్పన్ వెల్లడించారు. -
ఫార్మా రాజధానిగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ‘17వ బయో ఏసియా సదస్సు’ వెబ్సైట్, థీమ్‌లను బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో కేటీఆర్ ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 17వ బయో ఏసియా సదస్సును ‘టుడే ఫర్ టుమారో’నినాదంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ను ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు రాజధానిగా మారుస్తామని చెప్పారు. టీఎస్ఐఐసీ, రిచ్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వంటి పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు పలు కేంద్ర సంస్థలు కూడా ఈ సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు తెలిపారు. బయో ఏషియా సమావేశానికి స్విట్జర్లాండ్ భాగస్వామి దేశంగా, జర్మనీ సంయుక్త భాగస్వామిగా ఉంటుందన్నారు. అసోం, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ‘రాష్ట్ర భాగస్వాములు’ హోదాలో ఈ సమావేశానికి హాజరవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
రొమ్ము కేన్సర్‌పై పీవీ సింధు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రొమ్ము కేన్సర్ మహిళల పాలిట ఓ మహమ్మారిగా మారింది. దేశంలో ఏటా కొత్తగా 1.62 లక్షల కేసులు నమోదువుతుండగా, ప్రతి పదినిమిషాలకు ఒకరు ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారు. రొమ్ము ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి రొమ్ము కేన్సర్ ఫౌండేషన్ మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన ‘ఏబీసీ ఆఫ్ కేన్సర్ యాప్’లో ప్రముఖ క్రీడాకారణి పీవీ సింధూతో ప్రచారానికి శ్రీ కారం చుట్టింది. ఈ మేరకు సోమవారం హోటల్ పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ కేన్సర్’ పేరుతో రూపొందించిన లైఫ్ సైజ్ అగ్మంటేన్ రియాల్టీ వీడియో క్యాంపెయిన్‌ను పీవీ సింధు, యూబీసీఎఫ్ సలహాదారు జయేష్ రంజన్, యూబీసీఎఫ్ సీఈఓ డాక్టర్ పి.రఘురామ్ ప్రారంభించారు. ఆశా వర్కర్లు, ఔత్సాహికులు తమ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లోని ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. రౌండ్‌గా ఉన్న యాస్ మార్క్‌ను ఉన్న ప్రదేశాన్ని స్కాన్ చేస్తే.. పీవీ సింధు ప్రచార వీడియో ప్లే అవుతుంది. పీవీ సింధూ అభిమానులు దీన్ని ఫొటో కూడా తీసుకోవచ్చు. గ్రామీణ మహిళలకు రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు అవంత్రి టెక్నాలజీ సహాయంతో దీన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు డాక్టర్ రఘురామ్ చెప్పారు. రఘురామ్‌తో కలిసి రొమ్ము కేన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించడం తనకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సింధు పేర్కొన్నారు. -
ఉద్యోగం కావాలంటే ఈ యాప్ ఉండాలి గురూ..!
సాక్షి, హైదరాబాద్ : ఇకపై ఉద్యోగ ప్రయత్నం మరింత సులభతరం కానుంది. ఇందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ సరికొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ సహకారంతో ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్‌పేజీ తెరిచింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులు ఈ యాప్ లేదా వెబ్‌పేజీలో వివరాలు నమోదు చేసుకుంటే చాలు.. వారి అర్హతకు తగ్గ ఉద్యోగాల జాబితా ప్రత్యక్షమవుతుంది. ఇంతకుముందు కొన్ని ప్రైవేటు సంస్థలు ఇలాంటి సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ... అవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. ఉద్యోగం వచ్చిన తర్వాత.. లేదా ఉద్యోగాల జాబితా ప్రచురణకు వెబ్సైట్ నిర్వహణ సంస్థకు రుసుము చెల్లించాల్సి వచ్చేది. తాజాగా కార్మిక ఉపాధి కల్పన శాఖ తీసుకొచ్చిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్చంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ మాత్రం పూర్తిగా ఉచితం. కంపెనీలల్లో ఖాళీల నమోదుకు ఎలాంటి చెల్లింపులుండవు. ఉద్యోగ ప్రయత్నం చేసే అభ్యర్థికి సైతం పూర్తిగా ఉచిత సేవలందిస్తారు. గుర్తింపు ఉన్న కంపెనీల్లోనే.. డీట్ యాప్, వెబ్పేజీల్లో గుర్తింపు ఉన్న కంపెనీల్లో ఖాళీల ప్రదర్శనకు కచ్చితమైన నిబంధనలు పాటిస్తుంది. ఉద్యోగ ఖాళీలున్నట్లు వచ్చే నోటిఫికేషన్ల తాలూకు కంపెనీ పూర్వాపరాలు ముందుగా యాప్ నిర్వాహకులు పరిశీలిస్తారు. మొబైల్ ఫోన్ వెరిఫికేషన్, ఈ–మెయిల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత క్షేత్ర పరిశీలన చేసి నిర్ధారిస్తారు. అలా మూడు దశల్లో ఆమోదం పొందిన తర్వాతే సదరు నోటిఫికేషన్లను యాప్, వెబ్పేజీల్లో ప్రదర్శిస్తారు. ప్రభుత్వం అనుమతి తీసుకుని నిర్వహించే కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు రంగ కంపెనీలైనా.. సంబంధిత శాఖల సలహాలు, సూచనలు సైతం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. యాప్ డౌన్లోడ్ ఇలా.. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో డీట్ (deet) అని టైప్ చేసి సెర్చ్ చేస్తే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్చంజ్ ఆఫ్ తెలంగాణ పేరుతో యాప్ ప్రత్యక్షమవుతుంది. ఇన్స్టాల్ చేసుకుని.. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఉద్యోగావకాశాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఎంపిక చేసుకున్న తర్వాత అవకాశాలను బట్టి ఉద్యోగం ఇచ్చే కంపెనీతో చాట్ చేసే వీలుంటుంది. ఆ కంపెనీ ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకుని ఉద్యోగ పరిస్థితి, ఇంటర్వూ్య తదితర ప్రక్రియల కోసం ముందుకెళ్లొచ్చు. అలాగే https://tsdeet.com వెబ్సైట్ ద్వారా కూడా ఉద్యోగాల శోధన చేయొచ్చు. డీట్ యాప్, వెబ్‌పేజీలను ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి డీట్ యాప్, డీట్ వెబ్‌పేజీలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ యాప్ ద్వారా ఉచితంగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ యాప్, వెబ్‌పేజీ నిర్వహణ కోసం ఏటా రూ.10 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కార్మిక ఉపాధి కల్పన డైరెక్టర్ కేవై నాయక్, మోహిత్‌కుమార్ పాల్గొన్నారు. ఓకే చోట పరిశీలన ఉద్యోగావకాశాల కోసం కంపెనీల చుట్టూ తిరిగితే సమయం వృథా అవుతుంది. అక్కడ ఉద్యోగాలున్నా అవి అభ్యర్థి అర్హతలకు సరిపోతాయో లేదోనన్న సందేహం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే కంపెనీలు వెబ్‌పేజీల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నా.. ఆయా కంపెనీల పేజీలను ఒక్కొక్కటిగా వీక్షించడంతో సమయం ఎక్కువ పడుతుంది. వీటిన్నింటిని అధిగమించి సులభంగా ఒకే వేదికగా ఉద్యోగాలను చూసుకునే వీలు కల్పిస్తున్నాం. ప్రస్తుతం ఈ యాప్/వెబ్‌పేజీలు ప్రారంభదశలో ఉన్నాయి. ఇప్పటికే 45 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారం ఉంది. – చల్లా మణికాంత్, సీఈవో స్టోరీటెక్ -
హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్
-
అమెజాన్ అతిపెద్ద క్యాంపస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఆఫీస్ స్పేస్ 18 లక్షల చదరపు అడుగులు కైవసం చేసుకుంది. మొత్తం 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాట్లున్నాయి. 39 నెలల్లోనే నిర్మాణం పూర్తి అయింది. ప్రతిరోజు సగటున 2,000 మంది కార్మికులు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈఫిల్ టవర్‌కు వినియోగించిన ఇనుము కంటే రెండున్నరెట్లు ఈ భవనానికి వాడారు. ఒకే సమయంలో 972 మంది వెళ్లగలిగేలా 49 లిఫ్టులున్నాయి. ఇవి సెకనుకు ఒక్కో అంతస్తును దాటతాయి. 86 మీటర్ల ఎత్తున్న ఈ భవనంలో విభిన్న రెస్టారెంట్లతో 24 గంటలూ నడిచే భారీ కెఫెటేరియా, హెలిప్యాడ్, 290 కాన్ఫరెన్స్ రూమ్స్ ఏర్పాటు చేశారు. నిర్మాణానికి రూ. 1,500 కోట్లకుపైగా వెచ్చించినట్టు సమాచారం. తొలుత హైదరాబాద్ నుంచే.. అమెజాన్‌కు యూఎస్ వెలుపల ఇది ఏకైక సొంత భవనం కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో సంస్థకు 300 క్యాంపస్‌లు ఉన్నాయి. అన్ని కేంద్రాల విస్తీర్ణం 4 కోట్ల చదరపు అడుగులు ఉంది. భారత్‌లో 13 రాష్ట్రాల్లో 50 గిడ్డంగులున్నాయి. ఇక హైదరాబాద్‌లో కంపెనీకి ఎనిమిది ఆఫీసులున్నాయి. 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి నెలకొన్నాయి. 2004లో భారత్‌లో అడుగుపెట్టిన అమెజాన్ తొలుత భాగ్యనగరి కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించింది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ టీమ్స్తోపాటు పెద్ద ఎత్తున కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ హైదరాబాద్ నుంచి జరుగుతున్నాయి. కాగా, నూతన క్యాంపస్‌ను తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రారంభించారు. భారత్ నుంచి ఎగుమతులకు ఊతం.. భారత్‌లో అమెజాన్‌కు 30 ఆఫీసులున్నాయి. 62,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. వీరిలో 20,000కుపైగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 1.55 లక్షల మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు భారత్‌లో రూ.35,000 కోట్ల పెట్టుబడి పెట్టామని అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు ఫుడ్, రిటైల్‌లో ఖర్చు చేశామన్నారు. గ్లోబల్ రియల్ ఎస్టేట్ వైస్ ప్రెసిడెంట్ జాన్ షోట్లర్తో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘గ్లోబల్ సెల్లింగ్ వేదిక ద్వారా ఇక్కడి చిన్న వర్తకులు విదేశాల్లో తమ ఉత్పత్తులు విక్రయించుకునే సౌలభ్యం కల్పించాం. 50,000 మంది విక్రేతలు 14 కోట్ల ఉత్పత్తులు అమ్మకానికి ఉంచారు. ఇప్పటి వరకు రూ.7,000 కోట్ల విలువైన ప్రొడక్టులు ఎగుమతి అయ్యాయి. వచ్చే మూడేళ్లలో ఇది రూ.35,000 కోట్లకు చేరుతుందని ఆశిస్తున్నాం. ఈ–కామర్స్ రంగంలో మందగమనం లేదు’ అని వివరించారు. ఆఫీసులో లోపలి ప్రదేశం ఉద్యోగులకు ఆటవిడుపు. ఇండోర్ క్రికెట్ విశాలమైన కార్యాలయం క్యాంపస్‌లో భారీ కెఫెటేరియా -
ఇక ‘మీ సేవలు’ చాలు
సాక్షి, హైదరాబాద్: ‘మీ సేవ’కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని జిల్లాల్లో అడ్డగోలుగా కొత్త కేంద్రాలకు అనుమతులివ్వడాన్ని తప్పుబట్టిన సర్కారు.. ఇప్పటికే జారీచేసిన నోటిఫికేషన్లను రద్దుచేయాలని ఆదేశించింది. ఇకపై ‘మీ సేవ’కేంద్రాల ఏర్పాటులో నిర్దిష్ట మార్గదర్శకాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే కొత్త నిబంధనలు వెలువరించనున్నట్లు వెల్లడించింది. మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ–సేవల వినియోగంపై ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ‘మీ సేవ’కేంద్రాల కొనసాగింపును కూడా సమీక్షించాల్సిన పరిస్థితి రావచ్చని అభిప్రాయపడింది. ఈ అంశాలను పరిగణనలోకి ఉంచుకొని కొత్త సెంటర్ల ఏర్పాటుపై అచితూచి అడుగేయాలని సూచించింది. గతేడాది భద్రాద్రి–కొత్తగూడెం.. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ‘మీ సేవ’కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇకపై అలా జరగడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. రోజుకు లక్షన్నర సేవలు జనన, మరణ ధ్రువపత్రాలు, మ్యుటేషన్లు, పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఏం కావాలన్నా ‘మీ సేవ’గడప తొక్కాల్సిందే. ఇలా దాదాపు 500 ఎలక్ట్రానిక్ సేవలందిస్తున్న మీ–సేవ కేంద్రాల్లో ప్రతిరోజు సగటున లక్షన్నర లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా రెవెన్యూశాఖకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో మీ–సేవ కేంద్రాలు ప్రారంభించిన గత ఎనిమిదేళ్లలో ఇప్పటివరకు 12.50 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,500 పైచిలుకు కేంద్రాలు పనిచేస్తుండగా.. ఇందులో 85% సెంటర్లలో నెలవారీ ఆదాయం రూ.10వేల లోపే ఉంటుంది. ఈ పరిణామం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణ కూడా కష్టంగా మారడానికి ప్రధాన కారణం ప్రభుత్వ శాఖలు ఆన్‌సేవలు విస్తరించడమే. పోలీస్, ట్రాఫిక్, ఇతర ప్రభుత్వ విభాగాలు తమ సేవలను ఈ సేవలతోపాటు సొంతంగా ఏర్పాటు చేస్తున్న పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నాయి. తద్వారా మీ–సేవ కేంద్రాల్లో లావాదేవీల సంఖ్య తగ్గుతోంది. దీంతో ఇప్పటికే లాభదాయంగాని సెంటర్లను నెట్టుకొస్తున్న నిర్వాహకులకు కొత్తగా ఏర్పాటు చేసే వాటితో మరింత నష్టం జరగనుంది. మేడ్చల్‌లో రెట్టింపు కేంద్రాలు గతేడాది భద్రాద్రి జిల్లాలో 5వేల జనాభా, దూరాన్ని బట్టి కొత్తగా 53 మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు ఆ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. నిర్వాహకుల గిట్టుబాటును పరిగణనలోకి తీసుకోకుండా ఎడాపెడా కొత్తవాటికి అనుమతి ఇవ్వడం సరికాదని అన్ని జిల్లాల యంత్రాంగాలను ప్రభుత్వం హెచ్చరించినా.. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఏకంగా 219 కొత్త కేంద్రాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో సర్కారు సీరియస్ అయింది. దూరాన్ని కూడా పట్టించుకోకుండా 5వేల జనాభా ఆధారంగా గల్లీకో కేంద్రం ఉండేలా నోటిఫికేషన్లు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇప్పటికే జిల్లాలో 297 కేంద్రాలుండగా.. తాజాగా దాదాపుగా అదే స్థాయిలో కొత్త కేంద్రాలకు పచ్చజెండా ఊపడంతో సమస్య తెరపైకి వచ్చింది. ఇలా అడ్డగోలు వ్యవహారాలకు తావివ్వకుండా ఇకపై నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేసింది. మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ సేవల విస్తృతితో మీ–సేవల్లో తరుగుదల కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇదే ట్రెండ్ కొనసాగితే.. ప్రస్తుతం ఉన్నవాటినే కుదించే పరిస్థితి రావచ్చు. ఈ ధోరణిని పరిగణనలోకి తీసుకొని త్వరలోనే కొత్త మార్గదర్శకాలను ప్రకటించనున్నట్లు కలెక్టర్లకు రాసిన లేఖలో జయేశ్‌రంజన్ పేర్కొన్నారు. -
హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడే మొదలైంది
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడే మొదలైందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ జేఎల్‌ఎల్‌ని ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 2014లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.52 వేల కోట్లు ఉంటే.. 2019లో లక్షా 9 వేల కోట్లకి చేరిందని అన్నారు. నగరంలో మౌలికవసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, మంచినీటి కొరత తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. త్వరలో లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చి నగరంలోని తూర్పుప్రాంతంలో ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తామన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును హైదరాబాద్‌లో కేవలం 36 శాతం మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీన్ని పెంచాల్సిన అవసరముందని తెలిపారు. -
తాత్కాలిక సచివాలయానికి సీఎస్
సాక్షి, హైదరాబాద్: సచివాలయం తరలింపు నేపథ్యంలో బీఆర్ కేఆర్ భవన్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి మంగళవారం విధులకు హాజరయ్యారు. ఆయనతో పాటు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా తదితరులు తమకు కేటాయించిన చాంబర్ నుంచి విధులు నిర్వర్తించారు. తాత్కాలిక సచివాలయం ఏర్పాటు పనులతో పాటు తన చాంబర్లో కొనసాగుతున్న పనులను సీఎస్ పరిశీలించారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు సాగేలా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. కాగా, మంగళవారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచి విధులు నిర్వర్తించాలనే సీఎం ఆదేశాల నేపథ్యంలో.. పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఫైళ్లకు సంబంధించిన మూటలతో బీఆర్కేఆర్ భవన్‌కు తరలిరావడం కనిపించింది. జపాన్ బృందంతో జయేశ్ భేటీ తాత్కాలిక సచివాలయంలో ఏర్పాటైన తన కార్యాలయాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ప్రారంభించారు. తన చాంబర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం.. జపాన్‌కు చెందిన డెన్షో కంపెనీ ప్రతినిధులతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జపాన్‌లోని ఒసాకా కేంద్రంగా పనిచేస్తున్న డెన్షోకు షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌లోనూ అనుబంధ కంపెనీలు ఉన్నాయి. బేరింగ్ ఉత్పత్తులను వివిధ దేశాలకు సరఫరా చేసే డెన్షో ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించిన చర్చలు జరగలేదని, సాధారణ భేటీ మాత్రమేనని జయేశ్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
ఎనిమిది వర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 8 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 8 మంది ఐఏఎస్ అధికారులు ఇంఛార్జ్ వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త వీసీలను నియమించే వరకు ఇంఛార్జ్‌లే వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇంఛార్జ్ వీసీల వివరాలు: ఉస్మానియా యూనివర్సిటీ- అరవింద్ కుమార్ ఐఏఎస్ జేఎన్ టీయూహెచ్ - జయేశ్ రంజన్, ఐఏఎస్ కాకతీయ యూనివర్సిటీ-డాక్టర్ బీ జనార్దన్ రెడ్డి, ఐఏఎస్ తెలంగాణ యూనివర్సిటీ-వీ అనిల్ కుమార్, ఐఏఎస్ పాలమూరు యూనివర్సిటీ-రాహుల్ బొజ్జా, ఐఏఎస్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ-అరవింద్ కుమార్, ఐఏఎస్ పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ-వీ అనిల్ కుమార్ ఐఏఎస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం-సి. పార్థసారథి, ఐఏఎస్ -
భవిష్యత్తు డిజైనింగ్ రంగానిదే!
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో డిజైనింగ్ రంగానికి ప్రాధాన్యం పెరగనుందని, ప్రతీ రంగంలోనూ డిజైనింగ్‌తో విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. సృజనాత్మకతకు పదును పెట్టేలా, యువతకు, విద్యార్థులకు అరుదైన, అద్భుత అవకాశాలు కల్పించే చక్కటి వేదికగా ఇది మారాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వరల్డ్ డిజైన్ అసెంబ్లీ (డబ్ల్యూడీఏ) 31వ వేడుకలు హైదరాబాద్‌లో జరగనుండటం దేశానికే గర్వకారణమన్నారు. హైదరాబాద్ డిజైన్ వీక్ (హెచ్‌డీడబ్ల్యూ)లో భాగం గా అక్టోబరు 9 నుంచి 13 వరకు హ్యుమనైజింగ్ డిజైన్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇకనుంచి ఏటా హెచ్‌డీడబ్ల్యూ వేడుకలు నగరంలో జరుగుతాయన్నారు. హైదరాబాద్ డిజైన్ వీక్ ద్వారా విద్యార్థుల కు అపార అవకాశాలు కలుగుతున్నాయన్నారు. సృజనాత్మకతను ప్రోత్సహించేలా.. సృజనాత్మకతను ప్రోత్సహించేలా అక్టోబరు 9, 10వ తేదీల్లో నగరవ్యాప్తంగా పలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కార్యక్రమాలు చేపడతామని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. పతంగులు చేయడం, బొమ్మలు గీయడం, ఫొటోగ్రఫీ, ఆర్కిటెక్ట్, తదితర అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం హెచ్‌డీడబ్ల్యూ లోగోను, వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో జయేశ్ రంజన్‌తో పాటు గ్రీన్‌గోల్డ్ కంపెనీ సీఈవో రాజీవ్ చిల్కా, అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ డైరెక్టర్ ప్రవీణ్ నహర్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్) డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ చిల్కా మాట్లాడుతూ..మనదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన చోటా భీమ్ డిజైన్ కోసం తన బృందం చేసిన కృషిని వివరించారు. భవిష్యత్తులో వ్యవసాయం, రోడ్డు ప్రమాదాలు, రవాణా, పర్యావరణం, జనాభా, వసతులు తదితర రంగాల్లో డిజైనింగ్‌లతో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో అజిత్ రంగ్నేకర్, ప్రవీణ్ నహార్ వివరించారు. -
‘త్రీఐ’లతోనే దేశం పురోభివృద్ధి
రాయదుర్గం: ఇన్నోవేషన్, ఇన్‌క్లూజివ్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (త్రీఐ)లతో దేశం పురోభివృద్ధి సాధిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాయదుర్గంలో శుక్రవారం ‘ది స్టార్టప్ వే– మేడ్ ఇన్ హైదరాబాద్’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో భారతదేశం బాగుపడేందుకు ఏం చేయాలని ప్రశ్నించగా.. తాను పలు సలహాలు ఇచ్చినట్లు చెప్పారు. అందుకోసం ‘త్రీఐ’ల గురించి వివరించినట్లు కేటీఆర్ తెలిపారు. వీటకి ప్రాధాన్యం ఇస్తే దేశీయ ఉత్పత్తులు పెరిగి, పోటీతత్వంతో అభివృద్ధి సాధ్యమని చెప్పినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహించడంతోనే స్టార్టప్‌లు దేశానికే ఆదర్శంగా మారారని చెప్పారు. యువకులు, ఉత్సాహవంతులంతా వినూత్నంగా ఆలోచించి, ఉత్పత్తి ఆధారిత స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇస్తే, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుంటోందన్నారు. హెడ్‌కానిస్టేబుల్ కుమారుడు దేశంలో మొదటిసారిగా మారుత్‌డ్రోన్స్ స్టార్టప్ ద్వారా ప్రేమ్ దోమల నివారణకు మంచి పరిష్కారం కనుగొని డ్రోన్ సేవలను ప్రభుత్వం వినియోగి స్తోందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం టీహబ్, వీ–హబ్, రిచ్, వంటివి ఎన్నో ప్రారంభించిందని, త్వరలో టీహబ్–2ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. 48 ఇంక్యుబేషన్ సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో మెంటర్ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఐటీ శాఖా ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్ వెల్లడించారు. మెంటర్లు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతం లోని వినూత్నంగా ఆలోచించే సామాజిక సమస్యల పరిష్కారానికి రూపొందించే స్టార్టప్‌లకు చేయూత, ప్రోత్సాహం, సలహాలు ఇచ్చేందుకు ఈ వ్యవస్థ ఏర్పాటు అవసరమని గుర్తించిందన్నారు. 2014లో ట్రిపుల్ఐటీలోని సీఐఈ, డీల్యాబ్ రెండు ఇంక్యుబేషన్ సెంటర్లలో 200 వరకు స్టార్టప్లుండేవని, ప్రస్తుతం 48 ఇంక్యుబేషన్సెంటర్లలో 3వేలకుపైగా స్టార్లప్‌లు రూపొందాయని రాష్ట్ర ఐటీశాఖా ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసి రెడ్‌బస్ వ్యవస్థాపకులు ఫణీంద్రసమాను బా«ధ్యతలు అప్పగించామని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని వారిని ప్రొత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. – ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ వారి విజయమే.. ‘మేడ్ ఇన్ హైదరాబాద్’ హైదరాబాద్‌లో విజయవంతంగా స్టార్టప్‌లను ప్రారంభించి నిర్వహిస్తున్న 25 మంది స్టార్టప్ వ్యాపారుల విజయగాథలతో కూడిన పుస్తకమే ‘మేడ్ ఇన్ హైదరాబాద్’. దీన్ని ఎం.సోమశేఖర్, సత్య అయ్యగారి, సురేశ్థరూర్, వర్షాబిల్గారీ, శుష్మనాయక్, నేహజా రైటర్స్‌గా వ్యవహరించగా, ఎడిటర్‌గా వనజా బనగారి వ్యవహరించారు. సంతోషంగా ఉంది.. సక్సెస్ స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు వచ్చి ఒక పుస్తకంలో మా స్టార్టప్గురించి వ్రాయడం ఎంతో సంతోషంగా ఉంది. అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఈ గుర్తింపు పొందడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇప్పుడు 25 మంది మా కంపెనీలో పనిచేస్తున్నారు’ – హేమంత్ సత్యనారాయణ, స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్ ఏపీఎల్‌కు కేటరింగ్ చేస్తాం.. బిలిగ్రే పేరిట హోటల్స్‌ను 2000లో ప్రారంభించాం. వీటి ద్వారా ఐపీఎల్ పోటీలకు కేటరింగ్ చేస్తుంటాం. మా వద్ద 150 మంది పనిచేస్తున్నారు. దివ్యాంగుడిని అయినా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసి ఏ ఇబ్బంది లేకుండా కష్టపడుతూ పనిచేస్తున్నాను. – కిరణ్, బిలిగ్రే వ్యవస్థాపకుడు -
టీ వాలెట్‌తో రేషన్ షాపుల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో 1,700 రేషన్ షాపులను టీ వాలెట్‌తో అనుసంధానం చేస్తున్నామని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది తోడ్పాటుగా ఉంటుందని తెలిపారు. శనివారం సచివాలయంలో ఆయన టీ వాలెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం అకున్ మాట్లాడుతూ.. ఈ సేవలను ఆగస్టు నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని చెప్పారు. రంగారెడ్డిలో రెండు నెలలపాటు పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించామని తెలిపారు. ఇప్పటికే మీ సేవ, ఈ సేవ, పీఎస్సీ, దోస్త్, విజయా డెయిరీ వంటి సేవలు టీ వాలెట్‌తో లింక్ అయ్యాయని చెప్పారు. కొత్తగా రేషన్ షాపులకు అనుసంధానం చేస్తున్నామని వివరించారు. మీ సేవ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో ఏకైక టీ వాలెట్ ఇదే అని, డిజిటల్ పేమెంట్స్‌కు గ్యారెంటీ ఇస్తున్నామని చెప్పారు. ఈ వాలెట్ ద్వారా డబ్బులు డ్రా చేసుకునే వీలును నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కల్పిస్తున్నామని తెలిపారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. నోట్లపై ఆధారపడకుండా డిజిటల్ ఉపయోగం పెంచాలని చూస్తున్నామని పేర్కొన్నారు. టీ వాలెట్ వాడకంలో ఎలాంటి చార్జీ ఉండదని తెలిపారు. -
ఉపాధి కల్పనలో ‘ఐటీ’ మేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఐదేళ్లుగా సాధించిన పురోగతి నివేదికను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ శనివారం విడుదల చేశారు. రాష్ట్ర ఐటీ విభాగం వివిధ రంగాల్లో మెరుగైన సేవల కోసం చేపట్టిన కార్యక్రమాల పురోగతిని ఈ నివేదికలో వివరించారు. ‘రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులను రెండేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. గత నాలుగేళ్లలో జాతీయ స్థాయిలో 170 శాతం వృద్ధి కనిపించగా రాష్ట్రంలో 190 శాతం మేర వృద్ధి నమోదైంది. ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య త్వరలో 10 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. ఐటీ రంగానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన టీ–హబ్, టాస్క్, టీ–సాట్, టీ–ఫైబర్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు లక్ష్యాలకు మించి ఫలితాన్ని ఇస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (సీఎస్సార్) మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి టీ–సిగ్ (తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్)ను ఐటీ విభాగానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తాం’అని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఐటీ రంగంలో 5.43 లక్షల ఉద్యోగాలను సృష్టించగా గతేడాది ఏకంగా 67,725 మంది వృత్తి నిపుణులకు కొత్తగా అవకాశం లభించిందన్నారు. ఐటీ పురోగతి నివేదికలో పేర్కొన్న అంశాలివీ - మెరుగైన పౌర సేవలు అందించేందుకు ‘మీ సేవ’అధునాతన వెర్షన్‌ను సిద్ధం చేశాం. ఆధార్ అనుసంధాన చెల్లింపుల విధానం (ఏఈపీఎస్)లో మీ సేవ కేంద్రాల్లో నగదు డ్రా చేసుకునే వీలుంటుంది. ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (ఈఎస్డీ)లో భాగంగా రూపొందించిన రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ ద్వారా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించే విధానం సత్ఫలితాలిస్తోంది. - నాస్కామ్ ఫౌండేషన్ రూపొందించిన టెక్నాలజీ ఎంపవరింగ్ గర్ల్స్ (టెగ్) ద్వారా 66 మంది బాలికలకు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ విభాగాలు ఐటీ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. - ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో మెకానికల్, మెకానికల్ స్టార్టప్స్‌కు సంబంధించి 78 వేల చదరపు అడుగుల్లో దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైప్ సెంటర్ (టీ–వర్క్స్)ను ఐటీ విభాగం గతేడాది ప్రారంభించింది. - రాష్ట్ర ప్రభుత్వ శాటిలైట్ నెట్వర్క్ ‘టీ–శాట్’ద్వారా 4,612 కార్యక్రమాలను ప్రసారం చేయగా 2.39 లక్షల మంది వీక్షించారు. టీ–శాట్ యూట్యూబ్ చానల్‌కు 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. - ప్రభుత్వ అధికారిక సామాజిక మాధ్యమ వేదిక ‘టీ–వెబ్’ద్వారా సగటున ప్రతి నెలా 3 కోట్ల మందిని చేరుతోంది. - తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ద్వారా టైర్–2, టైర్–3 పట్టణాల్లో ఐటీలో ఔత్సాహికులను ప్రోత్సహిస్తుండగా ఇప్పటివరకు 12 జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. - కార్మిక, పోలీసులు, స్త్రీ నిధి, ఆర్టీసీ, డెయిరీ, పౌర సరఫరాలు, జేఎన్టీయూ తదితర విభాగాల సేవలను ఒకేచోటకు తెస్తూ గతేడాది ప్రారంభించిన ‘టీ–వ్యాలెట్‘ద్వారా 2018–19లో రూ. 1,202 కోట్ల విలువ చేసే 28.8 లక్షల లావాదేవీలు జరిగాయి. 1.72 లక్షల మంది తమ వివరాలను వ్యాలెట్‌లో నమోదు చేసుకున్నారు. - నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ‘టీ–హబ్’కొత్త ఆవిష్కరణలు, కొత్త వ్యాపార నమూనాలు రూపొందించడంలో విజయవంతమైంది. - ‘టాస్క్’ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది యువత ఏడాది కాలంలో వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ పొందారు. - ఆవిష్కరణ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు ‘వీ హబ్’ద్వారా శిక్షణ, అవకాశాల కల్పన తదితరాలపై మద్దతు ఇస్తుండగా 245 మంది వారి ఆలోచనలు పంపారు. వాటిలోంచి 26 వినూత్న ఆలోచనలను ఎంపిక చేశారు. మహిళా ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు యూఎస్ ఇండియా కౌన్సిల్, ప్రాక్టర్ అండ్ గాంబుల్ సహకారంతో ‘బిజ్ అరెనా’పేరిట పోటీ నిర్వహించింది. -
అహాహ్హ నాకే ముందు నాన్న చేతి వంట
అంతా గొప్పగొప్ప నాన్నలు! టైమే లేనివాళ్లు. వంటసలే రాని వాళ్లు. వాళ్లొచ్చి కుకింగ్ మొదలు పెట్టేశారు. రిజల్టేమిటి? పాస్ అయిన వాళ్లెందరు? పాస్ చేయబడిన వాళ్లెందరు?! నాన్న వండితే ఎలా ఉంటుంది? అమ్మ వండినట్లయితే ఉండదు. కానీ ఆ వంటలో నాన్న ప్రేమ ఉంటుంది. కూతురు ఆ ప్రేమను రుచి చూస్తుంది. అందుకే నాన్న వంటలో లోపాలను కూతురి ‘టేస్ట్ బడ్స్’ గుర్తించవు. అదే అమ్మ వంటలో ఏదో ఒక రోజు ఒక్క ఆవగింజ పేలకపోయినా సరే... ‘పంటి కింద పడుతున్నాయమ్మా’ అంటూ కంప్లయింట్ చేస్తారు అమ్మాయిలు. ‘నువ్వు వండేటప్పుడు అన్నీ సమంగా వేయించు. నేనూ చూస్తాగా’ అంటూ తల్లి మొట్టికాయ వేసినట్లు బదులిస్తుంది. ఆ చిన్నారి అమ్మవైపు గుర్రుగా చూడడాన్ని ఓరకంట గమనిస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంటాడు తండ్రి. ఆ మాత్రం భరోసా దొరికితే ఇంకేం కావాలి... అమ్మను ఈజీగా ఆట పట్టించేయవచ్చు. అంతే... ఏ ఇంట్లో అయినా తండ్రీకూతుళ్లు ఒక జట్టు. ఆ ఇద్దరూ జట్టుకట్టి వారంలో ఓ రోజు తామే వండితే ఎలా ఉంటుంది? ఆ వండుకున్న వాళ్లకు మాత్రం తండ్రీ కూతుళ్ల ప్రేమలా రుచిగానే అనిపిస్తుందా వంట. కానీ ఆ వంటలో లోపాలు అమ్మకు మాత్రమే తెలుస్తాయి. అందుకే, ఎందుకైనా మంచిదని అమ్మల గైడెన్స్‌లో అనేక మంది తండ్రీకూతుళ్లు వండడానికి సిద్ధమైన ఒక ఈవెంట్ ఇది. ఇంట్రెస్టింగ్ కదా! ఐఏఎస్ ‘చెఫ్’ జయేశ్ రంజన్ ఐఏఎస్ ఆఫీసర్. తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీ. 1992 బ్యాచ్ కు చెందిన జయేశ్ ఐఏఎస్‌లో ఆల్ ఇండియా టాపర్. ఆయన ఢిల్లీయూనివర్సిటీ, కోల్కత్తా యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, బర్మింగ్ హామ్, టోక్యో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్ ఇన్స్టిట్యూట్లలో చదువుకున్నారు. ఉద్యోగంలో బిజీ కాకపోతే ఇంకా చదువుకోవడానికి ఏమేమి కోర్సులు న్నాయా అని చూసుకుని చేరిపోయే వారేమో! ఇప్పుడైతే ఉద్యోగంలో కొంచెం ఆటవిడుపు చూసుకుని హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న ‘ద కలినరీ లాంజ్’లో ఉగాది పచ్చడి చేయడం నేర్చుకు న్నారు. ‘డాడ్స్ కుకింగ్ క్లబ్’లో చేరి కూతురితో కలిసి వంటలు చేస్తున్నారు. ఏప్రాన్ కట్టుకుని గరిటె పట్టుకున్నారాయన. జయేశ్ పుట్టింది, పెరిగింది రాజస్థాన్‌లో. వాళ్ల పూర్వీకులది పంజాబ్ రాష్ట్రం. తెలుగు వాళ్ల ఉగాది పచ్చడితో పరిచయమే లేని రంజన్ ఉగాది పచ్చడి కలపడానికి రెడీ అయ్యారు. కూతురు ఇషిక మాత్రం ‘మా నాన్న అన్నింటిలో బెస్ట్’ అన్నంత ధీమాతో చూస్తోంది. అయితే... భార్య రుచీ రంజన్ మాత్రం ఈ తండ్రీకూతుళ్లు.. çపచ్చడి కోసం ఏమేమి కలుపుతున్నారో, ఎంతెంత కలుపుతున్నారోనని చూస్తూ, కడుపు కకావికలం కానివ్వకుండా జాగ్రత్త కోసం సూచనలిస్తున్నారు. ఉడికిందా? ఐతే ఓకే! ‘ద కలినరీ లాంజ్’ ఇటీవల నిర్వహించిన డాడ్స్ కుకింగ్ క్లబ్లో వండడానికి తండ్రులు చాలామందే వచ్చారు. చెయ్యి తిరిగిన తండ్రులు కూతుళ్లకు నేర్పిస్తూ వండారు. లెర్నర్ తండ్రులు కూతుళ్ల సలహా, సహాయం తీసుకుంటూ వండారు. మొదటగా ఉగాది పచ్చడి కలిపి, ఆ తర్వాత పాస్తా చేసి భార్యాపిల్లలకు తినిపించారు మగవాళ్లు. వంట చేస్తే మానసిక ఒత్తిడి ఎంతగా తగ్గుతుందోనని సంతోషపడిపోయారు వంట చేసిన మగవాళ్లందరూ. వాళ్లంతా ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో, ఊపిరి సలపనంత బిజీగా ఉండేవాళ్లే. అందుకే వాళ్లకు వండడం ఒక ఆటవిడుపైంది. కూతుళ్లు గరిటె తిప్పుతుంటే తండ్రులు పెనంలో దినుసులు వేస్తున్నారు. తండ్రులు ఉడికిందా లేదా అని చూస్తుంటే కూతుళ్లు... నాన్నకసలు వంట వచ్చా రాదా, నాన్న వంట చూడడానికేనా తినడానికి కూడానా అని సందేహంగా రుచి చూస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో కూతుళ్లందరూ తండ్రులకు పాస్ సర్టిఫికేట్లు ఇచ్చేశారు. తర్వాత అంతా కలిసి ఆనందానుభూతులను పంచుకుంటూ భోజనం చేశారు. ‘‘మా ఉద్యోగాల్లో టైమ్ మా చేతిలో ఉండదు. చాలాసార్లు కుటుంబంతో క్వాలిటీ టైమ్ గడపలేక పోతుంటాం. టైట్ షెడ్యూల్లో ఇలాంటి ఒక సరదా ప్రోగ్రామ్ని కూడా చేర్చుకుంటే చాలా బాగుం టుంది. బిజీగా ఉండే తండ్రులు పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవడానికి ఇలాంటి కుకింగ్ క్లబ్‌లు బాగా ఉపయోగపడతాయి’’ అన్నారు జయేశ్ రంజన్. ఆ కార్యక్రమాన్ని రూపొందించిన జయ్ కిషన్ మాట్లాడుతూ ‘‘వారంలో ఒక రోజు డాడ్స్ క్లబ్‌కి వచ్చి కుటుంబం అంతా ఆనందంగా గడపడానికి ఇదో మంచి మార్గం. మంచి ఆహారంతో ఆరోగ్యం కూడా బావుంటుంది’’ అన్నారు. జయ్ కిషన్ సీరియల్ ఎంటర్ప్రెన్యూర్, టీ హబ్ మాజీ సీఈవో. – వాకా మంజులారెడ్డి -
ప్రభుత్వ విధానాలతోనే భారీ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: కొత్త పరిశ్రమల కోసం పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉన్న పరిశ్రమలకు మరింత సహకరించడం, మూతపడిన వాటిని తెరిపించడం చేస్తూ.. బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. సిర్పూర్ పేపర్ మిల్లును తిరిగి తెరిపించడంలో విజయం సాధించామని.. ఇప్పుడు ఓరియంట్ సిమెంట్స్ విస్తరణకు బిర్లా గ్రూప్‌తో ఒప్పందం కుదరడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్, సీకె బిర్లా సమక్షంలో ఓరియంట్ సిమెంట్ విస్తరణపై తెలంగాణ ప్రభుత్వంతో సీకే బిర్లా గ్రూప్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా జరిగిన అవగాహన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఓరియంట్ సిమెంట్స్ విస్తరణ ద్వారా రూ.రెండు వేల కోట్ల నూతన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయని అన్నారు. దీనిద్వారా సుమారు నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, మరో ఎనిమిది వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పారు. కంపెనీలో స్థానిక యువకులకే ఉద్యోగావకాశాలు దక్కేలా చూడాలని కోరామని, అవసరమైతే ఇందుకోసం ఒక శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సీకే బిర్లా విస్తరణ ప్రకటన ద్వారా పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణపై మరింత విశ్వాసం పెరుగుతుందని, మరిన్ని నూతన పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరామన్నారు. బిర్లాకు అభివృద్ధి కార్యక్రమాల వివరణ తెలంగాణలో గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని, వివిధ ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను సీకే బిర్లాకు మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే ప్రాథమిక సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన తాగునీటి కోసం మిషన్ భగీరథ, సాగునీటి కోసం నూతన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. కరెంటు సంక్షోభం వస్తుందనే స్థాయి నుంచి నిరంతరం సరఫరా చేసే దశకు చేరుకున్నామని చెప్పారు. ప్రభుత్వ పారదర్శక విధానాలను పరిగణనలోకి తీసుకున్న అనేక కంపెనీలు ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తోపాటు టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాశ్‌రెడ్డి, ఎండీ మల్సూర్ తదితరులు పాల్గొన్నారు. బిర్లా గ్రూప్ విస్తరణ ప్రకటన ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ తన భారీ విస్తరణ ప్రణాళికలను సోమవారం ప్రకటించింది. మంచిర్యాలలోని దేవాపూర్‌లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని సుమారు రూ.రెండు వేల కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నట్లు తెలిపింది. కంపెనీ తుది అనుమతులు పొందే ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని, త్వరలోనే అన్ని అనుమతులు కేంద్రం నుంచి లభిస్తాయని ఎంవోయూ అవగాహన సమావేశంలో గ్రూపు చైర్మన్ సీకే బిర్లా తెలిపారు. త్వరలోనే విస్తరణ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణంపై ఆయన ప్రశంసలు కురిపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ అనేక వినూత్న విధానాలతో పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. పారిశ్రామిక వర్గాల్లో మంచిపేరు సంపాదించుకుందని పేర్కొన్నారు. -
నగరంలో అంతర్జాతీయ బ్లాక్‌చైన్ కాంగ్రెస్: జయేశ్
సాక్షి, హైదరాబాద్: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు నగరం వేదిక కానుంది. తొలి అంతర్జాతీ య బ్లాక్‌చైన్ కాంగ్రెస్‌కు హైదరాబాద్ గోవాతో కలసి ఆతిథ్యం ఇవ్వనుంది. నీతి ఆయోగ్, తెలంగాణ, గోవా రాష్ట్రాల ప్రభుత్వాలు, న్యూక్లియస్ విజన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆగస్టు 3, 4 తేదీల్లో నగరంలోని హెచ్ఐసీసీ కాంప్లెక్స్‌లో, 5న గోవాలో ఈ సదస్సును నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఇక్కడ వెల్లడించారు. ఈ సదస్సుకు వచ్చే ఐటీ పరిశ్రమలు, స్టార్టప్‌ల యజమానులతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తారని పేర్కొన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నా యని వార్తలొస్తున్నాయని, అదే సమయంలో బ్లాక్‌చైన్ లాంటి కొత్త టెక్నాలజీలు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నాయని జయేశ్ తెలిపారు. విద్యార్థులు ఇలాంటి కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఆరేడు విభాగాల్లో బ్లాక్‌చైన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. భూ రికార్డుల నిర్వహణకు బ్లాక్‌చైన్ పరిజ్ఞానం ఎంతో ఉపయోగకరమన్నారు. బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలను అత్యంత సురక్షితంగా భద్రపరిచేందుకు ‘ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ప్రూఫ్ లెడ్జర్’గా బ్లాక్‌చైన్ సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యూక్లియస్ విజన్ సీఈవో అభిషేక్ పిట్టి తదితరులు పాల్గొన్నారు. -
తొలిసారిగా రీజినల్ యాడ్ ఏజెన్సీలకు అవార్డ్స్
-
త్వరలో టీవెబ్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వెబ్సైట్లలో సమా చారాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరించడంతో పాటు వాటి నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తున్నట్లు సీఎస్ ఎస్కే జోషి తెలిపారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలకు సంబంధించి 265 వెబ్సైట్లు ఉన్నాయన్నారు. వీటిని మొబైల్ ఫ్రెండ్లీగా మార్చడంతో పాటు సోషల్ మీడియాతో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం ఐటీ శాఖ ద్వారా ‘టీవెబ్’ను ఆవిష్కరిస్తామన్నారు. సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. టీవెబ్ రూపకల్పనపై ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రతీ శాఖ వెబ్‌సైట్‌ను సమీక్షించడంతో పాటు రేటింగ్, ఆడిట్ అవార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఆయా శాఖలకు సంబంధించి రియల్ టైమ్ డేటాని డాష్‌బోర్డు ద్వారా తెలుసుకునేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల అప్డేషన్ ప్రక్రియ పూర్తిచేసినందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, దేవాదాయ, వక్ఫ్, పట్టణ భూముల వివరాలను ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. ధరణి వెబ్సైట్ ద్వారా భూముల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారి పట్టాదారు పాస్ పుస్తకాల ప్రింటింగ్‌కు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతు బంధు పథకానికి సంబంధించి చెక్కుల ముద్రణ వివరాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అధికారులకు తెలిపారు. డాష్‌బోర్డు రూపకల్పనకు తీసుకున్న చర్యలపై జీఏడీ ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హా అధికారులకు వివరించారు. వివిధ శాఖలకు సంబంధించి అవసరమైన అంశాలపై ప్రతి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, అజయ్‌మిశ్రా, ముఖ్య కార్యదర్శులు సోమేశ్‌కుమార్, శాంతి కుమారి, శాలినీ మిశ్రా, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
మరో ఏడాది ఆగక తప్పదు!
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీ, ప్రోత్సాహకాలను పూర్తిగా చెల్లించేందుకు ఏడాది సమయం పడుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. పరిశ్రమలకు రూ.1,800 కోట్ల రాయితీ, ప్రోత్సాహకాల బకాయిలు ఉండగా.. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,300 కోట్లు కేటాయించిందని చెప్పారు. మిగతా రూ.500 కోట్ల బకాయిలకు వచ్చే ఏడాది బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఐహెచ్‌సీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఖాయిలా పడిన ఎంఎస్ఎంఈలకు చేయూత అందించి, మళ్లీ పనిచేసేందుకు సహకరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో టీఐహెచ్‌సీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సంస్థ అపూర్వ విజయాలు అందుకుని యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల సమస్యలను పరిష్కరిస్తాం.. మార్కెటింగ్ వైఫల్యాలు, పెద్ద పరిశ్రమల నుంచి తీవ్ర పోటీతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ, ప్రోత్సాహకాలు సకాలంలో అందMýఠిb పోవడంతో.. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతబడుతున్నట్టుగా టీఐహెచ్‌సీ జరిపిన అధ్యయనంలో తేలిందని జయేశ్ రంజన్ చెప్పారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగా గుర్తించి పరిష్కరిస్తే.. అవి మూతపడకుండా కాపాడుకోగలమన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న సూక్ష్మ, చిన్న పరిశ్రమలు బాగా వృద్ధిలో ఉన్నట్టుగా తమ పరిశీలనలో తేలిందని.. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఖరీదైనప్పటికీ దీర్ఘకాలికంగా లాభాలు ఆర్జించేందుకు తోడ్పడుతుందని తెలిపారు. అధిక విద్యుత్ చార్జీలతో పలు పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కానీ నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకుంటున్న చర్యల కారణంగా అధిక చార్జీలు తప్పడం లేదని పేర్కొన్నారు. కాగా.. ఖాయిలా పడిన 50 పరిశ్రమలపై టీఐహెచ్‌సీ ఆధ్వర్యంలో అధ్యయనం జరపగా.. 60 శాతం పరిశ్రమలు ఆర్థికేతర సమస్యలతోనే మూతపడినట్టు తేలిందని సంస్థ సీఈఓ ఎం.సంజయ్ చెప్పారు. ప్రధానంగా విద్యుత్ సరఫరా, నోట్ల రద్దు, జీఎస్టీ సంబంధిత అంశాలు, భారీగా పేరుకున్న వాణిజ్య పన్నుల బకాయిలు, వ్యూహాత్మక నిర్వహణ లోపాలు వంటి సమస్యలే కారణమని తెలిపారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు సకాలంలో అందక మరో 38 శాతం పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. -
వనితకు వరం.. ‘వీ హబ్’
-
వనితకు వరం.. ‘వీ హబ్’
సాక్షి, హైదరాబాద్ : ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వరమిచ్చింది. కొత్తగా పరిశ్రమలు పెట్టే వారి కోసం ఇప్పటికే టీహబ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా వీహబ్ (ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ హబ్) ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీ హబ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఈ వీ హబ్ ఇంక్యుబేటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. వీహబ్‌కు కొత్త ఆలోచనలతో వచ్చే మహిళలకు అక్కడే యూనిట్ ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వడంతోపాటు పెట్టుబడి కోసం రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు సాయాన్ని అందజేయనుం ది. దీనికి తొలుత ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను వీహబ్‌కు తెలియజేయాలి. ప్రాజెక్టు రిపోర్టు సమర్పించిన అనంతరం పారిశ్రామిక రంగంలో పేరొందిన నిపుణుల ఆధ్వర్యంలో వారికి మార్గనిర్దేశనం చేస్తారు. ఈ మేరకు వీహబ్ ఆరు ప్రముఖ సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రభుత్వమే తొలి కొనుగోలుదారు ‘ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీహబ్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. తొలుత రూ.15 కోట్లతో ప్రారంభిస్తున్నాం. విడతల వారీగా అభివృద్ధి చేస్తూ భారీగా నిధులు కేటాయిస్తాం. ప్రతి మహిళను విజయవంతమైన పారిశ్రామికవేత్తగా తయారుచేయడమే వీ హబ్ లక్ష్యం’ అని కేటీఆర్ తెలిపారు. వీహబ్ ప్రారంభించిన అనంతరం ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘మహిళలకు వినూత్న ఆలోచనలు వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టాలంటే ప్రోత్సాహం అంతంతమాత్రంగానే దక్కుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభు త్వం వీ హబ్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసిం ది. ఆలోచన వస్తే వెంటనే వీహబ్‌లో సంప్రదించండి. నిపుణులతో అవగాహన కల్పించి మార్గనిర్దేశనం చేస్తాం. ఉత్తమ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దుతాం. వారు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వమే తొలుత కొనుగోలు చేస్తుంది. టీ హబ్ ద్వారా ఇప్పటికే వేలాది మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాం. వీ హబ్ ఆలోచన ఇదివరకే చేసినప్పటికీ మంచిరోజున ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించాం’ అని అన్నారు. చరిత్ర సృష్టిస్తున్నారు.. ‘క్రీడా రంగంలో మన హైదరాబాదీ అమ్మాయిలు సానియా మీర్జా, సైనా నెహ్వాల్, మిథాలీరాజ్, అరుణారెడ్డి సరి కొత్త చరిత్ర సృష్టించారు. వ్యాపారంలో సరికొత్త కాన్సెప్ట్ ‘పెళ్లి జడలు’పేరుతో వ్యాపారం ప్రారంభించిన కల్పన అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ వీహబ్ అండగా ఉంటుంది’అని అన్నారు. చాలా కుటుంబాల్లో తమ పిల్లల్ని డాక్టర్, ఇంజనీరు చేయాలని అనుకుంటున్నారని, కానీ అత్యుత్తమ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే దిశగా ఆలోచించడం లేదన్నారు. కేటీఆర్ ప్రసంగానికి ముందు పలువురు మహిళా పారిశ్రామిక వేత్తలు తమ అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో ప్రాజెక్టు సంచాలకులు టెస్సీ థామస్, ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు కోల వాణి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ రోబో వచ్చెన్.. సిటీ మురిసెన్..!
సాక్షి,సిటీబ్యూరో: ఇనుములో ఒక హృదయం మొలిచెను..అందరికీ సుపరిచితమైన రోబో సినిమాలోని పాట తరహాలో.. గ్రేటర్లో పోలీసు విధులు నిర్వహించేందుకు పోలీస్రోబో వచ్చేసింది. గచ్చిబౌలిలోని హెచ్‌బోట్స్ సంస్థ ప్రయోగశాలలో సిద్ధమైన ఈ రోబోను శుక్రవారం ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఆవిష్కరించారు. తక్కువ ఖర్చుతో ఈ రోబోను తయారు చేయడంతోపాటు కృత్రిమ మేథస్సుతో సమర్థవంతంగా పనిచేయించడమే దీని ప్రత్యేకత. ఇనుముతోపాటు కార్బన్‌ఫైబర్ మెటీరియల్‌తో దీనిని తయారు చేశారు. డిసెంబరు 31న సాయంత్రం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రెండు గంటలపాటు పోలీసు విధులను ఈ రోబో నిర్వహించనుండడం విశేషం. -
ఐటీ రంగంలో డ్రగ్స్: జయేష్ రంజన్ స్పందన
హైదరాబాద్: డ్రగ్స్ మహమ్మారి ఐటీ రంగానికి కూడా విస్తరించడం కలకలం రేపుతోంది. సినీ ప్రముఖులు, పాఠశాల విద్యార్థులే కాదు టెకీలు సైతం మత్తులో చిత్తవుతున్నారు.. సాఫ్ట్వేర్ కంపెనీల్లోని కెఫెటేరియాలే డ్రగ్స్‌కు అడ్డాలుగా మారుతున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ సిట్ దర్యాప్తులో మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జాతకాలు బయటపడ్డటంతో ఈ అంశంపై తాజాగా తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ స్పందించారు. డ్రగ్స్ బారిన పడిన ఐటీ ఉద్యోగులు, కంపెనీల జాబితాను ఎక్సైజ్‌శాఖ తమకు ఇచ్చిందని తెలిపారు. ఆయా కంపెనీల మేనేజ్మెంట్తో తానే స్వయంగా మాట్లాడుతున్నట్టు వెల్లడించారు. ఎక్సైజ్‌శాఖ ఇచ్చిన జాబితాలోని ఐటీ కంపెనీల్లో 20 నుంచి 30శాతం మంది ఉద్యోగులు డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పారు. కొంతమంది టెకీలు డ్రగ్స్ తీసుకున్నంతమాత్రాన ఐటీరంగం మొత్తం తీసుకున్నట్టు కాదని, దీనిని భూతద్దంలో చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎక్సైజ్‌శాఖ ఇచ్చిన జాబితాలో కంపెనీల పేర్లే తప్ప ఉద్యోగుల పేర్లు లేవని తెలిపారు. డ్రగ్స్ ముఠా సభ్యులు కెల్విన్, ఖుదూస్, నిఖిల్ శెట్టి, విలియమ్స్, జీశాన్‌ల విచారణలో ఐటీ ఉద్యోగులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. పదుల కంపెనీల్లోని వందలాది మంది సిబ్బంది మత్తుకు బానిసయ్యారని స్వయంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. వారి జాబితా రూపొందించి ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌కు సమర్పించారు. -
2020కి స్టార్టప్‌లల్లో భాగ్యనగరం నం.1
ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ హైదరాబాద్: స్టార్టప్‌లలో 2020 నాటికి దేశంలోనే హైదరాబాద్ నంబర్ వన్‌గా ఎదిగే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో టై, వాక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లు సంయుక్తంగా నిర్వహించనున్న స్టార్టప్ ఎక్సలెరేటర్ ప్రోగ్రామ్ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం స్టార్టప్‌లలో బెంగళూర్, గుర్గావ్, ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నాల్గో స్థానంలో ఉందన్నారు. ఇక్కడ అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన టీహబ్‌లో యువ పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఐఎస్బీ, ట్రిపుల్ ఐటీ, నల్సార్ యూనివర్సిటీలు సహకారం అందిస్తున్నాయని చెప్పారు. టై, వాక్సెన్ స్కూల్లు ఇచ్చే శిక్షణ.. స్టార్టప్‌లలో యువ పారిశ్రామికవేత్తలు రాణించేందుకు ఎంతగానో తోడ్పతుందన్నారు. టై హైదరాబాద్ అధ్యక్షుడు సురేశ్ చల్లా మాట్లాడుతూ... ఇప్పటికే స్టార్టప్‌లు ప్రారంభించిన వారితో పాటు యువ పారిశ్రామికవేత్తలకు సెప్టెంబర్ 13-15 తేదీల్లో, 23-25 తేదీల్లో జహీరాబాద్‌లోని వాక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో శిక్షణ ఇస్తామని వెల్లడించారు. క్యాంపస్‌లోనే ఉండి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని... మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్స్, టీం బిల్డింగ్, గ్రోత్ మేనేజ్మెంట్, హెచ్‌ఆర్‌లలో శిక్షణ ఇస్తామని తెలిపారు. స్టార్టప్‌లు నెలకొల్పేవారికి ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రతి నెలలో మొదటి శుక్రవారం టీ-హబ్‌లోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పారిశ్రామికవేత్తల అనుభవాలను మేళవించి శిక్షణ ఇవ్వనున్నట్లు వాక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ డాక్టర్ జేసీ వాండెమ్‌బర్గ్ పేర్కొన్నారు. ఐటీతో పాటు వివిధ రంగాలలో ఎదిగేందుకు భారతదేశంలో అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. -
హైదరాబాద్ కు వస్తున్న యాపిల్ సీఈవో
హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఈ నెల19న హైదరాబాద్ కు రానున్నారు. ఎల్లుండి(గురువారం) ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ తో భేటీ కానున్నారు. నానక్ రాంగూడలోని వేవ్ రాక్ బిల్డింగ్ లో జరిగే కార్యక్రమంలో యాపిల్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. యాపిల్ అభివృద్ధి కేంద్రాన్ని టిమ్ కుక్ ప్రారంభించనున్నారు. అయితే ఆయన వస్తారని కచ్చితంగా చెప్పలేమని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. కొన్ని అనుమతుల కోసం యాపిల్ సంస్థకు చెందిన ప్రతినిధులు గతంలో తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిశారని వెల్లడించారు. యాపిల్ అభివృద్ధి కేంద్రానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. అయితే ఎంత పెట్టుడులు పెడుతుందనేది ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న టిమ్ కుక్ ఈ రోజు రాత్రి ముంబై చేరుకుంటారు. ముంబై తాజ్ ప్యాలెస్ లో బస చేస్తారు. 20, 21 తేదీల్లో ఢిల్లీలో పర్యటిస్తారు. ఈనెల 21 ప్రధాని నరేంద్ర మోదీతో టిమ్ కుక్ సమావేశమవుతారు. బెంగళూరుకు కూడా ఆయన వెళ్లే అవకాశముందని సమాచారం. -
అంకితభావంతో పని చేయండి
ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)లో శిక్షణ పొంది, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 75 మందికి ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ నియామక పత్రాలను అందజేశారు. బేగంపేట్‌లోని టాస్క్ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జయేశ్ రంజన్ మాట్లాడుతూ, అంకితభావంతో పని చేయాలని ఉద్యోగులకు సూచించారు. టాస్క్ సీఈవో సుజీవ్ నాయర్ మాట్లాడుతూ, వివిధ సబ్జెక్టుల్లో ఐటీఐ/పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన 2 వేల మందికి ఇప్పటివరకు శిక్షణ ఇచ్చామని, రెజుల్యూట్, జిప్పర్ డాట్‌కామ్, బీమ్ టెలికామ్, ప్లాన్‌మాన్ తదితర సంస్థల్లో 200 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. మరో 300 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు రెజుల్యూట్ సంస్థ అంగీకరించిందని, వారంలోగా 50 మందికి నియామక ఉత్తర్వులిస్తారని తెలిపారు. కార్యక్రమంలో రెజుల్యూట్ ఎలక్ట్రానిక్స్ ఎండీ రమీందర్ సింగ్, ఎలక్ట్రానిక్స్ డెరైక్టర్ సుజయ్ తదితరులు పాల్గొన్నారు. -
'పెట్టుబడులకు గమ్యస్థానం.. తెలంగాణ'
- సీఐఐ సదస్సులో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ హైదరాబాద్: పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమమైన గమ్యస్థానమని రాష్ర్ట ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ చెప్పారు. మెరుగైన ప్రభుత్వ పాలసీలు, ఐటీ, స్టార్టప్స్ సంస్థలకు ప్రోత్సాహం, చక్కని మౌలిక వసతులతో వ్యాపార అనుకూల వాతావరణం ఇక్కడ ఉందన్నారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) బుధవారం బేగంపేట కాకతీయ హోటల్లో ‘తెలంగాణ మూవింగ్ ఫార్వర్డ్- త్రూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడ్ ఇన్నోవేషన్’పై నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన ప్రసంగించారు. ‘సరళమైన, పారదర్శకమైన పాలసీలు, పుష్కలమైన మానవ వనరులు, పటిష్టమైన రాజకీయ నాయకత్వంతో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నాం. విద్య, పరిశ్రమలకు అనుసంధానం కల్పిస్తున్నాం’ అని జయేష్‌రంజన్ చెప్పారు. హైదరాబాద్‌ను డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డీఆర్డీఎల్ డెరైక్టర్ జయరామన్ తెలిపారు. దేశ ఉత్పత్తులను విదేశీ రక్షణ దళాలు కొనుగోలు చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ విభాగం-సీఐఐకి మధ్య 25లక్షల మొక్కలు నాటే ఒప్పందంపై జయేష్‌రంజన్, సీఐఐ తెలంగాణ చైర్పర్సన్ వనిత దాట్ల సంతకాలు చేశారు. సీఐఐ సౌత్ రీజియన్ డిప్యూటీ చైర్మన్ రమేష్ దాట్ల, తెలంగాణ ఉపాధ్యక్షుడు నృపేందర్‌రావు, వివిధ సంస్థల అధినేతలు పాల్గొన్నారు. -
ఆర్ఎఫ్సీని తలదన్నేలా తెలంగాణలో కొత్త ఫిల్మ్‌సిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఫిల్మ్ సిటీ నిర్మించాలన్నది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశయమని రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ప్రపంచస్థాయి ఫిల్మ్‌సిటీ (రామోజీ ఫిల్మ్ సిటీ- ఆర్ఎఫ్సీ) ఉందని.. దీన్ని తలదన్నేలా మరో ఫిల్మ్‌సిటీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందన్నారు. ప్రపంచ స్థాయిలో అత్యున్నత సాంకేతికతో ఏర్పాటుకానున్న ఈ ఫిల్మ్‌సిటీ నిర్మాణంలో సినీ పరిశ్రమ భాగం పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ సదస్సులో పాల్గొన్న జయేశ్ రంజన్.. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న అత్యున్నత విధానాలపై అధ్యయనం జరిపి లండన్‌లో అమలవుతున్న విధానమే అత్యున్నతమైనదని గుర్తించిందన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలంగాణ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైం సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని జయేశ్ రంజన్ తెలిపారు. అయితే పైరసీకి పాల్పడుతున్న వెబ్సైట్లు వేల సంఖ్యలో ఉంటున్నాయని, వీటిని నిలిపేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. వెబ్సైట్లను బ్లాక్ చేసే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించాలని తాము చేస్తున్న డిమాండ్‌కు మద్దతు తెలపాలని కోరారు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో గేమింగ్, యానిమేషన్, మల్టీమీడియా క్లస్టర్ ఏర్పాటు కోసం రూ. 500 కోట్ల విలువజేసే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. ఇందులో మల్టిమీడియా సిగ్నేచర్ టవర్‌ను నిర్మిస్తామన్నారు. డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్ల కొరతను ఈ ప్రాజెక్టుతో తీర్చుకోవచ్చన్నారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా సహకరిస్తోందని, ఇలాంటి తోడ్పాటు అరుదుగా లభిస్తుందని ఐఫా డెరైక్టర్ సబ్బాస్ జోసెఫ్ అభినందించారు. పేద, మధ్యతరగతి ప్రజలు మల్టిప్లెక్స్ థియేటర్ల టికెట్ల భారాన్ని మోయలేరని, అందువల్ల ఎక్కువ సంఖ్యలో థియేటర్లను ఏర్పాటు చేస్తేనే ప్రజలకు సినిమా చేరుతుందని బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్ర పేర్కొన్నారు. సినీ పరిశ్రమలోని అన్ని శాఖల్లో తీవ్రంగా ఉన్న నిపుణుల కొరతను అధిగమించేందుకు యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని సినీ నిర్మాత డి.సురేశ్‌బాబు పేర్కొన్నారు. బాలల చిత్రాలు, యానిమేషన్ చిత్రాలకు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉందని సినీ నిర్మాత అల్లు అరవింద్ పిలుపునిచ్చారు. సదస్సులో దిగ్గజ దర్శకుడు రమేశ్ సిప్పి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ సినీనటులు నాగార్జున, వివేక్ ఒబెరాయ్, ఆస్కార్ అవార్డు గ్రహిత రసూల్ పోకుట్టి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్‌లో ఇన్ఫోసిస్ క్యాంపస్!
హైదరాబాద్: టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్ వరంగల్‌లో క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఫిబ్రవరిలో కంపెనీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కంపెనీకి అతిపెద్ద క్యాంపస్ అయిన పోచారం కేంద్రాన్ని అదే నెలలో ప్రారంభిస్తోంది. మైసూరు సెంటర్ మాదిరిగా ఇంజనీరింగ్ పూర్తయిన తాజా గ్రాడ్యుయేట్లకు వరంగల్ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. క్యాంపస్ ఏర్పాటు విషయమై కంపెనీ సీఈవో విశాల్ సిక్కాతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చర్చించినట్టు సమాచారం. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం టి-హబ్‌ను సందర్శించిన సందర్భంగా వీరిరువురు భేటీ అయ్యారు. ఐటీ రంగాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం నూతన ఐటీ విధాన ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలో మినీ ఐటీ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ హబ్‌లలో కార్యాలయాలను నెలకొల్పే కంపెనీలకు ప్రోత్సాహకాలతో పాటు అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఇటీవల తెలిపారు. -
స్పానిష్ సంగీతం.. మెక్సికన్ నృత్యం
ఉత్సాహంగా ప్రారంభమైన ‘స్కై ఫెస్ట్’ సాక్షి, హైదరాబాద్: రెక్కలు తొడిగి ఆకాశ వీధిలో విహారం... హెలికాప్టర్ నుంచి విహంగంలా భూతలానికి పయనం... నడుమ మెక్సికన్ భామల నృత్యం... చిన్నారుల విచిత్ర వేషం... గచ్చిబౌలి స్టేడియంలో ఐదు రోజుల ‘స్కై ఫెస్ట్ 2015’ ఆరంభం అదిరిపోయింది. ‘సాక్షి’ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్న ఈ మెగా ఉత్సవాన్ని తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్ బుధవారం ప్రారంభించారు. ఇంతటి భారీ ఈవెంట్ నగరంలో జరగడం ఇదే తొలిసారని, కుటుంబం, స్నేహితులతో కలసి జాలీగా ఆస్వాదించేందుకు ఇది చక్కని వేదికని జయేశ్‌రంజన్ అన్నారు. సరికొత్తగా: ‘స్కై ఫెస్ట్’ నగరవాసులకు ఆసాంతం సరికొత్త అనుభూతిని పంచుతోంది. తొలుత స్టేడియంలో ప్రారంభమైన ‘హాట్ ఎయిర్ బెలూన్ రైడ్’ వినూత్నంగా సాగింది. మొత్తం ఐదు బెలూన్లలో సాగిన ఈ రైడ్‌లో జయేశ్‌రంజన్, ఆయన సతీమణితో పాటు 28 మంది పాల్గొన్నారు. వీటిల్లో ఒక బెలూన్ 12 కిలోమీటర్ల దూరంలోని తల్లాపూర్ దగ్గర ల్యాండ్ అయింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 11 మంది సభ్యుల ఆకాశగంగ టీమ్ చేసిన పారా జంపింగ్ విన్యాసం విశేషంగా ఆకట్టుకుంది. రెండు హెలికాప్టర్లలో 8000 అడుగుల నుంచి పారాచూట్‌తో జాతీయ జెండా రెపరెపలతో ఒక్కొక్కరుగా కిందకి దిగుతూ అబ్బురపరిచారు. ఇక మెక్సికో, స్పెయిన్ సంప్రదాయ హార్ప్ మ్యూజిక్ సందర్శకులతో స్టెప్పులు వేయించింది. మెక్సికన్ సుందరాంగులు షేకింగ్ డ్యాన్స్‌లతో మతిపోగొట్టారు. పాఠశాల విద్యార్థులు ‘కల్ప పారడైజ్’ శకటాన్ని ప్రదర్శించి చెట్ల ప్రాముఖ్యత చెప్పారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలెత్తారు. బతుకమ్మ ఆడారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చినవారంతా హైదరాబాద్ రుచులు ఆస్వాదించారు. పేద రోగులకు ఉచితంగా పాలటివ్ కేర్ చికిత్స అందిస్తున్న ‘స్పర్శ్ హాస్పైస్’ కోసం రోటరీ క్లబ్ ఈ బెలూన్ రైడ్ నిధులు వెచ్చించనుంది. -
ఘనంగా ప్రారంభమైన 'స్కై ఫెస్ట్ 2015'
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో బుధవారం స్కై ఫెస్ట్-2015 వేడుక ఘనంగా ప్రారంభమైంది. ఐదురోజుల పాటు అలరించనున్న ఈ గగన పండుగ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఐటీ సెక్రటరీ జెయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాన్సర్ బాధితులకు సాయం అందించేందుకు బంజారాహిల్స్ రోటరీక్లబ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ వేడుకలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆకాశగంగ బృందం చేసే పారా జంపింగ్, హేయిర్ బెలూన్స్ విన్యాసాలు, మ్యూజికల్ ఈవెంట్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. -
టీ-హబ్‌లో టాటా క్యాపిటల్ పెట్టుబడులు!
సెప్టెంబర్‌లో టీ-హబ్ ప్రారంభోత్సవానికి రతన్ టాటా ♦ ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ వెల్లడి ♦ 29, 30 తేదీల్లో ఆగస్ట్ ఫెస్ట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : స్టార్టప్స్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్ ఇన్నోవేషన్ ఫండ్‌లో టాటా క్యాపిటల్ పెట్టుబడి పెట్టనుంది. ఐటీ శాఖ సెక్రటరీ జయేశ్ రంజన్ శుక్రవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ విషయం చెప్పారు. పెట్టుబడుల విలువ వెల్లడించలేమని.. పెట్టుబడి తో పాటు నిధుల నిర్వహణ కూడా టాటానే చేస్తుందని తెలియజేశారు. ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు ఈనెల 12న ముంబైలో టాటా క్యాపిటల్ పెద్దలతో సమావేశం కానున్నట్లు తెలియజేశారు. ఈనెల 29న జరిగే ఆగస్ట్ ఫెస్ట్ సదస్సు విశేషాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌ను 60 వేల చ.అ.ల్లో నిర్మిస్తున్నామని.. దీన్ని సెప్టెంబర్‌లో ప్రారంభిస్తామని తెలియజేశారు. టీ-హబ్ ప్రారంభానికి రతన్ టాటాను ఆహ్వానించినట్లు చెప్పారు. ‘‘100 మిలియన్ డాలర్లతో టీ-హబ్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రాథమిక నిధుల కింద రూ.10 కోట్లను అందుబాటులో ఉంచాం. నిధుల సమీకరణ కోసం మరి కొందరితో చర్చిస్తున్నాం’’ అని తెలియజేశారు. టీ-హబ్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ట్రిపుల్ ఐటీ, నల్సార్ భాగస్వాములుగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఐఎస్బీ అసోసియేట్ డెరైక్టర్ అరుణారెడ్డి, ఆగస్ట్ ఫెస్ట్ వ్యవస్థాపకుడు కిరణ్ పాల్గొన్నారు. ఆగస్ట్ ఫెస్ట్‌కు 200 స్టార్టప్‌లు! జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈనెల 29, 30 తేదీల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆగస్ట్ ఫెస్ట్ సదస్సు జరగనుంది. టీ-హబ్, ఐఎస్‌బీల సంయుక్త భాగస్వామ్యంలో జరిగే ఈ సదస్సులో 200 దేశీ స్టార్టప్ కంపెనీలు, సింగపూర్, అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి సుమారు 300లకు పైగా ఇన్వెస్టర్లు పాల్గొంటారు. 4 వేల మంది సందర్శకులొస్తారని అంచనా వేస్తున్నట్లు కిరణ్ చెప్పారు. ఏటా నిర్వహించే ఈ ఆగస్ట్ ఫెస్ట్‌ను... తొలి ఏడాది 500 మంది, రెండో ఏడాది 2,500 మంది సందర్శించారని చెప్పారు. ఆసక్తి గలవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.దిఆగస్ట్ఫెస్ట్.కామ్‌లో సంప్రదించవచ్చు. -
ఆ 'నలుగురు' మాకే కావాలి
ఐఏఎస్ అధికారులపై కేంద్రానికి టీ సర్కారు లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారుల కోసం పట్టుపడుతోంది. వారిని తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ప్రత్యేకాధికారి సోమేశ్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ జయేశ్ రంజన్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్‌లను తెలంగాణలోనే కొనసాగించాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఈ నలుగురు అధికారులను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. వీరిని ఇప్పటికిప్పుడే రిలీవ్ చేయొద్దన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏపీకి కేటాయించిన అధికారులందర్నీ ఒకేసారి రిలీవ్ చేస్తే.. అక్కడ్నుంచి రావాల్సిన అధికారుల విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా పాలన వ్యవస్థ స్తంభించిపోతుందని సర్కారు భావిస్తోంది. అందుకే అధికారులను దశల వారీగా రిలీవ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించిన అధికారులను ఆ ప్రభుత్వం జనవరి 1 లేదా 2వ తేదీల్లో రిలీవ్ చేసే అవకాశం ఉందన్న సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి స్పంది స్తోంది. తెలంగాణ ప్రభుత్వం నలుగురు అధికారులను ఈ రాష్ట్రంలోనే కొనసాగించాలని కోరినట్టుగానే.. ఏపీ సర్కారు కూడా నలుగురు అధికారులను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు సమాచారం. అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనల ప్రకారం ఒకే నగరంలో బదిలీ అయినా.. కేడర్ మారిన అధికారులను రిలీవ్ చేసిన 24 గంటల్లోగా వారు విధుల్లో చేరాల్సి ఉంటుంది. అదే వేరే ప్రాంతంలో ఉంటే వారం రోజుల గడువు ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. -
‘స్మార్ట్’కు దుబాయ్ సహకారం
* మంత్రి కేటీఆర్ ఆహ్వానానికి ‘దుబాయ్ స్మార్ట్ సిటీ’ సానుకూల స్పందన * వారం రోజుల్లో హైదరాబాద్‌ను సందర్శించనున్న సంస్థ సీఈఓ ముల్లా * తెలంగాణలో పెట్టుబడులపై ఆసక్తి చూపిన దుబాయ్ పారిశ్రామికవేత్తలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆహ్వానానికి ‘దుబాయ్ స్మార్ట్ సిటీ’ సీఈఓ సానుకూలంగా స్పందించారు. సంస్థ సీఈవో అబ్దుల్ లతీఫ్ అల్-ముల్లా నేతృత్వంలోని బృందం హైదరాబాద్ నగర పర్యటనకు రానుంది. వారం రోజుల్లో హైదరాబాద్‌ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలని అల్-ముల్లా నిర్ణయించారు. దుబాయ్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్ఐఐసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జయేష్ రంజన్‌తో కలసి ఆదివారం అక్కడి ‘దుబాయ్ స్మార్ట్ట్ సిటీ’ కార్యాలయంలో ఆ సంస్థ సీఈవో ముల్లా, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ బాజు జార్జ్‌తో సమావేశమయ్యారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్టులో అంతర్భాగంగా హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే విషయంలో సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఐటీఐఆర్ హైదరాబాద్ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిన దుబాయ్ స్మార్ట్ సిటీ సీఈవో ముల్లా.. రాష్ట్ర ప్రభుత్వంతో తదుపరి చర్చల నిమిత్తం వారం రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని సందర్శించాలని నిర్ణయించారు. దుబాయ్ స్మార్ట్ సిటీ గురించి క్లుప్తంగా.. ఐటీ కార్యాలయాలు, నివాస, వ్యాపార సముదాయాల సమ్మిళిత అభివృద్ధికి మారుపేరుగా దుబాయ్‌లోని స్మార్ట్ సిటీని అభివర్ణించవచ్చు. అత్యుత్తమ ప్రమాణాల మధ్య పనిచేయడానికి, జీవనం కొనసాగించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. అక్కడి స్మార్ట్ సిటీ నమూనాను అనుకరించి ఐరోపాలోని మాల్టా ద్వీపంలో స్మార్ట్ సిటీని నిర్మించారు. ఇక భారత్ విషయానికి వస్తే.. కోచీలో 250 ఎకరాల విస్తీర్ణంలో స్మార్ట్ సిటీని నిర్మించేందుకు కేరళ ప్రభుత్వం ‘దుబాయ్ స్మార్ట్ సిటీ’తో 2007లో ఒప్పందం చేసుకుంది. వచ్చే 8 ఏళ్లలో ఇక్కడ దుబాయ్ స్మార్ట్ సిటీ రూ.8 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తెలంగాణపై దుబాయ్ పారిశ్రామికవేత్తల ఆసక్తి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు. టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, గనులు, బయోటెక్నాలజీ, సాధారణ ఇంజనీరింగ్ ఆధారిత రంగాలపై ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఫిక్కీ, ఐబీపీసీ, దుబాయ్, ఇండియన్ కాన్సులేట్ల సంయుక్త ఆధ్వర్యంలో దుబాయ్‌లోని క్రౌన్‌ప్లాజా హోటల్లో ఆదివారం నిర్వహించిన ‘ఇన్వెస్టర్స్ మీట్’లో మంత్రి కె.తారకరామారావు పాల్గొని రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించగా..అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్ఐఐసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జయేష్ రంజన్, ఫిక్కీ బృంద నేత అరుణ్ చావ్లా, ఐబీపీసీ అధ్యక్షుడు పరాస్ షాదాద్పురి, గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు జువ్వాడి శ్రీనివాస రావు, శ్రీనివాస శర్మ, రాజా శ్రీనివాస రావు, విజయభాస్కర్, అంబటి రఘు తదితరులు పాల్గొన్నారు. -
థర్డ్ పార్టీతో పర్యావరణ తనిఖీ
అప్పుడే పారదర్శకత ఉంటుంది -ఏపీఐఐసీ ఎండీ జయేశ్ రంజన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీలు పర్యావరణ తనిఖీలకు థర్డ్ పార్టీలను(అన్య సంస్థలు) అనుమతించాలి. అప్పుడే కంపెనీలపై నమ్మకంతోపాటు పారదర్శకతకు ఆస్కారం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఎండీ జయేశ్ రంజన్ అన్నారు. పర్యావరణ చట్టాలు, నియంత్రణలు-పరిశ్రమ పాత్ర అన్న అంశంపై మంగళవారమిక్కడ ఫ్యాప్సీలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడే విషయంలో కంపెనీలు స్వీయ నియంత్రణలు పాటించాలని సూచించారు. కాలుష్యకారక కంపెనీల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి, స్థానికంగా ఆ మొత్తాన్ని ఖర్చు చేయాలని పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శి కేడీఆర్ జయకుమార్ అభిప్రాయపడ్డారు. ప్రమాణాలు అవసరం: ఆర్థికాభివృద్ధికి అవసరమైన పర్యావరణ ప్రమాణాలు ప్రత్యేక ప్రాంతాలు, రాష్ట్రాలవారీగా రూపొందాలని ఫ్యాప్సీ ఎన్విరాన్మెంటల్ కమిటీ చైర్మన్, సువెన్‌లైఫ్ సెన్సైస్ సీఈవో వెంకట్ జాస్తి అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవాడలను ప్రోత్సహించేలా ప్రస్తుత నియంత్రణలను సమీక్షించాలని కోరారు. పర్యావరణానికి సంబంధించి 26 చట్టాలు ఉన్నాయని, వీటిపై అత్యధికులకు అవగాహన లేదని జీడిమెట్ల ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చైర్మన్ జి.కృష్ణబాపయ్య చౌదరి అన్నారు. రెండు రాష్ట్రాలు సమంగా.. పారిశ్రామికంగా సీమాంధ్రకు, తెలంగాణకు సమానమైన ప్రయోజనాలు కల్పించాలని కేంద్రాన్ని కోరతామని ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా సాక్షి బిజినెస్ బ్యూరోతో పేర్కొన్నారు. కేవలం ఒక ప్రాంతానికే అధిక ప్రయోజనాలు ఇవ్వడం వల్ల సమతుల్యత దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల్లో స్నేహపూర్వక పోటీ ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. -
గేమింగ్ సిటీ స్థలం వివాదరహితం
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో గేమింగ్, యానిమేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ (గేమ్) సిటీ స్థలంపై వివాదమేమీ లేదని పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఎండీ జయేష్ రంజన్ స్పష్టం చేశారు. ప్రతిపాదిత స్థలంలో హెరిటేజ్ రాక్స్ ఉన్నందున నిర్మాణాలు చేపట్టవద్దనే వాదన సరికాదన్నారు. ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజుతో కలసి ఆయన శుక్రవారం ఏపీఐఐసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 439 ఎకరాలున్న రాయదుర్గం భూమిలో హెరిటేజ్ రాక్స్ ఉన్నట్లు హుడా 2008లో పేర్కొందన్నారు. రెండు కంపెనీల (పూర్వాంకర, డీఎల్ఎఫ్)కు కేటాయించిన స్థలంలో కట్టడాలు నిర్మించరాదని హెరిటేజ్ టెక్నికల్ కమిటీ పేర్కొందన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కొన్ని మార్పులతో నిర్మాణాలు చేపట్టవచ్చని తెలిపిందన్నారు. సమస్య ఉన్న రెండు కంపెనీలకు ప్రత్యామ్నాయ స్థలాలను ఈ నెల 6న చూపించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో యూనిట్ ఏర్పాటు వద్దని నిర్ణయించుకున్నట్టు పూర్వాంకర తెలిపిందన్నారు. సదరు సంస్థ చెల్లించిన రూ. 400 కోట్లను వాపస్ ఇస్తామన్నారు. డీఎల్ఎఫ్ సంస్థ విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతామన్నారు. ఐటీ మంత్రి, సీఎంలపై విమర్శలు సరికాదన్నారు. -
జాయింట్ వెంచర్లకు గుడ్‌బై!
సాక్షి, హైదరాబాద్: జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల నుంచి బయటకు రావాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) నిర్ణయించింది. సంస్థకు సంబంధించిన జేవీలపై వివిధ రకాల విచారణలు కొనసాగుతుండటంతో పాటు ఆయూ ప్రాజెక్టుల్లో సంస్థ వాటాపై చెలరేగుతున్న వివాదాల నేపథ్యంలో ఏపీఐఐసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏపీఐఐసీ పాలకమండలి సమావేశం శుక్రవారం జరిగింది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్‌తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మార్, రహేజా, హైటెక్ సిటీ, రాంకీ ఫార్మాసిటీ మొదలైన మొత్తం 19 రకాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టులను వివిధ సంస్థలతో కలిసి ఏపీఐఐసీ చేపట్టింది. ఈ జేవీల్లో ఏపీఐఐసీకి 11 శాతం నుంచి 26 శాతం వరకూ వాటాలు ఉన్నాయి. జేవీల నుంచి బయటపడాలని భావిస్తున్న సంస్థ.. తన వాటాల విలువను లెక్కించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్లను నియమించాలని సమావేశంలో నిర్ణయించింది. ఈ విలువ లెక్కింపు ఆధారంగా... ప్రస్తుతం జేవీలో ఉన్న సంస్థకు తమ వాటా కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకవేళ సదరు సంస్థ ముందుకు రాని పక్షంలో ఇతర సంస్థలకు విక్రయించే వీలుందని సమాచారం. అయితే జేవీ ప్రాజెక్టుల్లో ప్రభుత్వ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలనే వాదన వినిపిస్తోంది. ఈ సంస్థలకు ప్రభుత్వం భూమి ఇవ్వడంతో పాటు రకరకాల రాయితీలను కల్పించింది. అందువల్ల ఏపీఐఐసీ ఈ ప్రాజెక్టుల నుంచి బయటకు వస్తే భాగస్వామ్య ప్రైవేటు సంస్థలు ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఏపీఐఐసీ జేవీ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యూరుు. ఫలితాలు కూడా వస్తున్నారుు. డివిడెండ్ల రూపంలో ఆర్థిక లాభాలు పొందాల్సిన ఏపీఐఐసీ ఈ నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారితీసే సూచనలు కన్పిస్తున్నారుు.