జయేష్ రంజన్(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న జయేష్ రంజన్‌కు లైన్ క్లియర్ అయింది. జయేష్ రంజన్ నామినేషన్ తిరస్కరణ చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా నామినేషన్ తిరస్కరించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఉండటంతో నామినేషన్‌ను ఆమోదించాల్సిందేనని రిటర్నింగ్ అధికారిని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. దీంతో ఈ నెల 9వ తేదీ జరగనున్న ప్రెసిడెంట్ ఎన్నికల్లో రంగరావుతో కలిసి జయేష్ రంజన్ పోటీపడనున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసిన తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ బీజేపీనేత జితేందర్‌రెడ్డి నామినేషన్లు అనూహ్యంగా తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
చదవండి : రసవత్తరంగా తెలంగాణ ఒలంపిక్ ఎన్నికలు
Comments
Please login to add a commentAdd a comment