హైదరాబాద్ కు వస్తున్న యాపిల్ సీఈవో | Apple to inaugurate Hyderabad facility on May 19 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ కు వస్తున్న యాపిల్ సీఈవో

Published Tue, May 17 2016 5:40 PM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM

హైదరాబాద్ కు వస్తున్న యాపిల్ సీఈవో - Sakshi

హైదరాబాద్ కు వస్తున్న యాపిల్ సీఈవో

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఈ నెల19న హైదరాబాద్ కు రానున్నారు. ఎల్లుండి(గురువారం) ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ తో భేటీ కానున్నారు. నానక్ రాంగూడలోని వేవ్ రాక్ బిల్డింగ్ లో జరిగే కార్యక్రమంలో యాపిల్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. యాపిల్ అభివృద్ధి కేంద్రాన్ని టిమ్ కుక్ ప్రారంభించనున్నారు.

అయితే ఆయన వస్తారని కచ్చితంగా చెప్పలేమని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. కొన్ని అనుమతుల కోసం యాపిల్ సంస్థకు చెందిన ప్రతినిధులు గతంలో తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిశారని వెల్లడించారు. యాపిల్ అభివృద్ధి కేంద్రానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. అయితే ఎంత పెట్టుడులు పెడుతుందనేది ఆయన వెల్లడించలేదు.

ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న టిమ్ కుక్ ఈ రోజు రాత్రి ముంబై చేరుకుంటారు. ముంబై తాజ్ ప్యాలెస్ లో బస చేస్తారు. 20, 21 తేదీల్లో ఢిల్లీలో పర్యటిస్తారు. ఈనెల 21 ప్రధాని నరేంద్ర మోదీతో టిమ్ కుక్ సమావేశమవుతారు. బెంగళూరుకు కూడా ఆయన వెళ్లే అవకాశముందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement