Nanakramguda
-
గోల్డ్'s జిమ్‌ను ప్రారంభించిన సీనియర్ హీరో నరేష్ (ఫొటోలు)
-
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో బబుల్గమ్ చిత్ర యూనిట్ సందడి
-
స్టార్ క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)
-
HYD: హైటెక్నాలజీతో యూఎస్ కాన్సులేట్.. ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాంక్!
హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూఎస్ కాన్సులేట్ సేవలు నానక్‌రాంగూడలోని నూతన కార్యాలయం నుంచి మంగళవారం ప్రారంభమయ్యాయి. బేగంపేట నుంచి నానక్‌రాంగూడలో కొత్తగా నిర్మించిన కార్యాలయానికి మారిన తర్వాత పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నామని కాన్సులేట్ అధికారులు తెలిపారు. మొదటి యూఎస్ పాస్‌పోర్టును జారీచేసినట్టు ఫొటోలను కాన్సులేట్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఖర్చు ఎంతో తెలుసా.. అయితే, హైదరాబాద్ నగరంలో ఆసియాలోనే అతిపెద్ద, విశాలమైన అమెరికన్ కాన్సులేట్ కట్టి అగ్రరాజ్యం నిర్మించింది. దాదాపు 2800 కోట్లు(340 మిలియన్ యూఎస్ డాలర్స్) ఖర్చుతో ఆధునిక భవనాన్ని నిర్మించింది. దాదాపు 12.2 ఎకరాల విస్తీర్ణంలో హై టెక్నాలజీతో ఈ భవనాన్ని నిర్మించింది. కాగా, తెలుగు రాష్ట్రాలు, దేశం నుంచి అమెరికాకు స్టూడెంట్ వీసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఓ పెద్ద ఆఫీసును నిర్మించాలని అమెరికా 2017లోనే కాన్సులేట్ భవన నిర్మాణానికి ప్లాన్ చేసింది. ఇందుకు కావాల్సిన సదుపాయాలు, డబ్బులను అమెరికా ప్రభుత్వం కేటాయించింది. కానీ, కోవిడ్ కారణం భవన నిర్మాణం కొంచెం ఆలస్యమైంది. హైదరాబాదే స్పెషల్.. ఇక, తాజాగా భవన నిర్మాణం పూర్తి కావడంతో మంగళవారం నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త కాన్సులేట్ నుంచి పాస్‌పోర్టులను కూడా జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఇండియాలో ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ కాకుండా వీసా కార్యకలాపాలు, దౌత్య కార్యకలాపాల కోసం దేశవ్యాప్తంగా నాలుగు కాన్సులేట్స్ ఉన్నాయి. వీటన్నింటిలో అతిపెద్దదిగా ఇప్పుడు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ గుర్తింపు పొందింది. వీసా కోసం.. వీసా ఇంటర్వ్యూ అవసరం ఉన్నవారు మొదట హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌లోని వీసా అప్లికేషన్ సెంటర్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ కూడా అక్కడే తీసుకుంటారు. వీసా రెన్యువల్ కోసం ఇంటర్వ్యూ మినహాయింపు కలిగిన వారు వీసా అప్లికేషన్ సెంటర్లో డాక్యుమెంట్స్ దాఖలు చేస్తే చాలు. ఇంటర్వ్యూ అవసరం ఉన్నవారు మరో రోజు నానాక్‌రాంగూడలోని కొత్త అమెరికన్ కాన్సులెట్ కార్యాలయానికి వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. Yesterday, @usandhyderabad opened a new state-of-the-art facility in the city’s bustling Financial District. This new Consulate chancery represents a tangible investment by the United States in growing the U.S.-India bilateral relationship. pic.twitter.com/EApWzxY3Ud — Vedant Patel (@StateDeputySpox) March 21, 2023 కాగా, కొత్త కాన్సులేట్ నుంచి తెలంగాణ, ఏపీ, ఒడిషా రాష్ట్రాలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ తెలిపారు. మరోవైపు, వాషింగ్టన్లో అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వేదాంత్ పటేల్ స్పందిస్తూ.. కొత్త భవనాన్ని పూర్తి పర్యావరణహితంగా నిర్మిణించినట్టు స్పష్టం చేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి శుద్ధిచేసేలా.. మళ్లీ ఆ నీటిని తిరిగి వినియోగించుకునేలా నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. అలాగే, ఇండియా నుంచి అమెరికాలో పెట్టుబడులను కూడా ప్రోత్సహించడానికి నూతన కాన్సులేట్ దోహదపడుతుందని అన్నారు. Here’s a short video on how one can reach the Visa Application Center (VAC), located at the Lower Concourse, HITEC City Metro Station, Madhapur, HYD 500081. pic.twitter.com/hyJuhzrIBR — U.S. Consulate General Hyderabad (@USAndHyderabad) March 17, 2023 -
హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్.. ఇక వీసాల జారీ మరింత సులభతరం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ అత్యాధునిక హంగులతో నిర్మించిన సొంత భవనంలోకి మారిపోయింది. నానక్‌రామ్‌గూడలోని కొత్త, శాశ్వత అమెరికన్ కాన్సులేట్ భవనంలో సోమవారం కార్యకలాపాలు మొదలయ్యాయని కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ ప్రకటించారు. భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇదో మైలురాయి అని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వీసాల జారీని సులభతరం చేసేందుకు ఇక్కడ అధికారుల సంఖ్య పెంచుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు అమెరికా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2008వ సంవత్సరంలో హైదరాబాద్‌లో తొలిసారి అమెరికన్ కాన్సులేట్ ప్రారంభం కాగా, ఇప్పటివరకూ అది బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో పనిచేసిన విషయం తెలిసిందే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శాశ్వత భవన నిర్మాణం కోసం నానక్‌రామ్ గూడలో సుమారు 12 ఎకరాల స్థలం కేటాయించారు. అందులోనే అమెరికా సుమారు 34 కోట్ల డాలర్ల (రూ.2,800 కోట్లు) వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించుకుంది. చిరునామా: సర్వే నంబరు 115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్ గూడ, హైదరాబాద్, తెలంగాణ, 500032. ♦ అత్యవసర కాన్సులర్ సేవల కోసం (అమెరికా పౌరులైతే) +91 040 6932 8000 నంబరులో సంప్రదించవచ్చు. ♦ సాధారణ సేవల కోసం ‘‘HydACS@state.gov.’’ఐడీకి మెయిల్ చేయవచ్చు. ♦ వీసా ఇంటర్వ్యూలు నిర్దిష్ట సమయాల్లో నానక్‌రామ్ గూడలోని కొత్త కార్యాలయంలో జరుగుతాయి. ♦ వీసాలకు సంబంధించిన ఇతర సరీ్వసులు (బయోమెట్రిక్స్, అపాయింట్మెంట్స్, ‘డ్రాప్‌బాక్స్’పాస్‌పోర్ట్ పికప్, అపాయింట్మెంట్స్ (ఇంటర్వ్యూ వెయివర్)లు ♦ మాదాపూర్‌లోని హైటెక్ సిటీ మెట్రోస్టేషన్లో ఏర్పాటు చేసిన ‘వీసా అప్లికేషన్ సెంటర్’లో కొనసాగుతాయి. ♦ కాన్సులర్ సేవలకు సంబంధించిన ప్రశ్నల కోసం +91 120 4844644 లేదా +91 22 62011000 నంబర్లను సంప్రదించవచ్చు. చదవండి: 11 గంటలు .. 14 ప్రశ్నలు.. కవిత సమాధానాలు పూర్తిగా వీడియో రికార్డింగ్ -
కొత్త భవనంలో యూఎస్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: అమెరికా.. నూతన కాన్సులేట్ భవనాన్ని మార్చి 20న హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ప్రారంభిస్తోంది. రూ. 27.87 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక భవనం నుంచే ఇక నుంచి యూఎస్ కాన్సులేట్ కార్యకలాపాలు సాగనున్నాయి. నూతన కాన్సులేట్‌లో అందించే వివిధ సేవల వివరాలను యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం యూఎస్ కాన్సులేట్ కొనసాగుతున్న బేగంపేట ‘పైగా ప్యాలెస్’లో ఈనెల 15 మధ్యాహ్నం 12:00 గంటల నుంచి కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 15వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటల నుండి 20వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు కాన్సులేట్ మూసివేసి ఉంటుంది. ఈ నెల 20న ఉదయం 8.30 గంటల నుంచి అధికారికంగా నూతన భవనం నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది. మార్చి 20 ఉదయం 8:30 వరకు అత్యవసర సేవలు కోరే అమెరికా పౌరులు +91 040–4033 8300 నంబర్ పైన సంప్రదించాలని కాన్సులేట్ జనరల్ వివరించింది. మార్చి 20 ఉదయం 08:30 తరవాత అత్యవసర సేవలు కోరుతున్న అమెరికా పౌరులు +91 040 6932 8000 పై సంప్రదించవలసి ఉంటుంది. అత్యవసరంకాని సందేహాల కోసం, అమెరికా పౌరులు HydACS@ state.gov కి ఈ–మెయిల్ చేయవలసి ఉంటుంది. బయోమెట్రిక్ అపాయింట్మెంట్లు, ‘‘డ్రాప్‌బాక్స్’’అపాయింట్మెంట్లు (ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్నవారు), పాస్‌పోర్ట్ పికప్ సహా ఇతర వీసా సేవలు – లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాదాపూర్, హైదరాబాద్ 500081లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ (Vఅఇ) లో కొనసాగుతాయని తెలిపింది. కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. వీసా సేవలకి సంబంధించి సందేహాలకు +91 120 4844644 లేదా +91 22 62011000 పై కాల్ చేయాలని యూఎస్ కాన్సులేట్ పేర్కొంది. కొత్త ఆఫీస్ చిరునామా సర్వే నం. 115/1, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ, 500032. -
HYD: నూతన భవనంలోకి యూఎస్ కాన్సులేట్.. సేవలు ఎప్పటినుంచి అంటే..?
సాక్షి, హైదరాబాద్: యూఎస్ కాన్సులేట్ తమ కార్యకలాపాలను ఇక నుంచి నానక్‌రామ్‌గూడ నుంచి నిర్వహించనుంది. ఈ నెల 20న నూతన కాన్సులేట్ భవనం ప్రారంభం కానుంది. 340 మిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మించిన ఈ అత్యాధునిక భవనం అమెరికా - భారత్‌ల మధ్య బలపడుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనమని, ఈ సందర్భంగా అందించే వివిధ సేవల వివరాలను యూ.ఎస్. కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. బేగంపేట్ పైగా ప్యాలెస్‌లో ఈ నెల 15 వరకూ సేవలు కొనసాగనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 20వ తేదీ 8.30 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. అయితే, మార్చి 20 ఉదయం 08:30 వరకు అత్యవసర సేవలకు అమెరికా పౌరులు, +91 040-4033 8300 నంబర్‌పై సంప్రదించాలని యూఎస్ కాన్సులేట్ పేర్కొంది. మార్చి 20 ఉదయం 08:30 తర్వాత, అత్యవసర సేవలకు అమెరికా పౌరులు 91 040 6932 8000 నంబర్‌పై సంప్రదించాలని తెలిపింది. అత్యవసరం సేవలకు అమెరికా పౌరులు HydACS@state.gov కి ఈ- మెయిల్ కూడా చేయవచ్చని పేర్కొంది. సంబంధిత వార్త: వైఎస్సార్.. జార్జిబుష్‌ని ఒప్పించిన వేళ! మార్చి 15 వరకు వీసా ఇంటర్వ్యూ ఉన్న దరఖాస్తుదారులు బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌లో సంప్రదించాలని, మార్చి 23 నుండి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ కోసం నానక్‌రామ్‌గూడలోని నూతన కార్యాలయానికి వెళ్లాలని కాన్సులేట్ జనరల్ సూచించింది. బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్లు, “డ్రాప్‌బాక్స్” అపాయింట్మెంట్లు (ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్నవారు), పాస్‌పోర్ట్ పికప్ సహా ఇతర వీసా సేవలు – లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాదాపూర్, హైదరాబాద్ 500081, లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ (VAC)లో కొనసాగుతాయి. కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని కాన్సులేట్ జనరల్ వివరించింది. వీసా సేవలకి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే, +91 120 4844644, +91 22 62011000పై కాల్ చేయాలి. నానక్‌రామ్‌గూడ కాన్సులేట్ బదిలీ సమాచారం కోసం కాన్సులేట్ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వాలని కాన్సులేట్ జనరల్ పేర్కొంది. Twitter (@USAndHyderabad), Instagram (@USCGHyderabad), Facebook (@usconsulategeneralhyderabad) నాడు మహానేత కృషి 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఆయన చొరవతోనే హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటునకు ఆనాటి అధ్యక్షుడు బుష్ ప్రకటన చేశారు. ఆ వెంటనే బేగంపేటలో ప్యాలెస్‌ను వైఎస్సార్ కేటాయించి.. అదే ఏడాది అక్టోబర్ 24న ఆయనే ప్రారంభించారు. అప్పటి నుంచి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చూసుకున్న ఆ భవనం.. 14 ఏళ్ల పాటు సేవలు అందించింది. ఇప్పుడు యూఎస్ కాన్సులేట్ నానక్‌రామ్‌గూడలోని కొత్త భవనానికి షిఫ్ట్ కానుంది. -
హైదరాబాద్‌లో విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్ గూడలోని పటేల్ కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈత కోసం వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు కుంటలోపడి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీశారు. మరణించిన చిన్నారులను షాబాజ్(15), దీపక్(12), పవన్(14)గా గుర్తించారు. -
ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు నానక్‌రామ్‌గూడలోని కృష్ణ ఇంటికి చేరుకున్న కేసీఆర్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మహేష్ బాబును పరామర్శించారు. కుటుంబసభ్యులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సుప్రసిద్ధ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని, పార్లమెంట్ సభ్యుడిగా కూడా చేశారని ప్రస్తావించారు. మంచి మిత్రుడుని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా చాలా సార్లు చూశానని గుర్తు చేసుకున్నారు. కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం వెంట మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Mahesh Babu-Krishna Death: తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్ -
నానక్‌రామ్‌గూడలోని స్వగృహంలో కృష్ణ పార్థీవదేహం
-
కాసేపట్లో నానక్ రామ్ గూడలోని కృష్ణ స్వగృహానికి పార్థీవదేహం
-
Hyderabad: ఇల్లు శుభ్రం చేస్తుండగా బాల్కీనీలో నుంచి కింద పడిన మహిళ
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కొంపల్లి బొబ్బిలి ఎంపైర్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న రీనితా రెడ్డి(33) బుధవారం అదే ఆపార్ట్మెంట్ 5వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆరోగ్య కారణాల రీత్యా గత కొన్ని రోజులుగా మానసికంగా కృంగిపోయిన రీనిత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: ఉప్పల్: ల్యాబ్ సెంటర్లో డ్రగ్స్ తయారీ!.. ఇద్దరు అరెస్ట్ గచ్చిబౌలి: భవనంపై నుంచి పడి ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ తెలిపిన మేరకు.. నీలంపేట గ్రామం, చీడికాడ మండలం, వైజాగ్‌కు చెందిన బోను సత్యవతి(42) నానక్‌రాంగూడలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో నివాసం ఉంటోంది. సాయి సిగ్నేచర్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 305లో పది రోజుల క్రితమే ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అద్దెకు తీసుకున్నారు. వారి వద్ద సత్యవతి హౌస్‌మేడ్‌గా పని చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఫ్లాట్ నెంబర్ 305లో శుభ్రం చేస్తుండగా బాల్కానీలోని వాష్ ఏరియా నుంచి కింద పడింది. దీంతో ఆమె తల, శరీరంపై అనేక గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. వెంటనే కాంటినెంటల్ హస్పిటల్‌కు తరలించగా అప్పటికే సత్యవతి మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు దృవీకరించారు. ఆత్మహత్యకు పాల్పడిందా, ప్రమాద వశాత్తు జారి పడిందా అనే విషయం విచారణలో తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. భర్త బోను ఈశ్వర్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దేశంలో డేటా సైన్స్ రంగం వేగంగా పుంజుకుంటోంది: కేటీఆర్
-
ఒకే సిలిండర్‌కు 3 గ్యాస్ కనెక్షన్లు.. నానక్‌రామ్‌గూడలో భారీ పేలుడు
సాక్షి, హైదరాబాద్: నానక్‌రామ్ గూడలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకే సిలిండర్‌కు మూడు కనెక్షన్స్ పెట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఒక కనెక్షన్లో గ్యాస్ లీకేజీ కావడంతో.. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో లైట్స్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంగా యూపీ, బీహార్‌కు చెందినవారు. పొట్టకూటి కోసం నగరానికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. -
హెల్మెట్ ఉంటే ప్రాణం దక్కేది!
సాక్షి, గచ్చిబౌలి: హెల్మెట్ విలువ ఓ ప్రాణంతో సమానం. అది ధరించకుండా బండి నడిపి ప్రమాదానికి గురైతే నిండు ప్రాణాలు గాలిలో కలుస్తానేందుకు ఈ దుర్ఘటనే ఉదాహరణ. అందుకే హెల్మెట్ ప్రాధాన్యం గుర్తించాల్సిన అవసరముందని తేల్లతెల్లం చేస్తోందీ ఘటన. ఆగి ఉన్న స్కూల్ బస్సును బైక్ ఢీకొట్టి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలయ్యాడు. హెల్మెట్ పెట్టుకోకపోవడమే అతడి పాలిట శాపంలా పరిణమించింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ఎస్.రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు శిబ్పూర్నకు చెందిన ప్రతీక్ మోహన్ రాతి (30) గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. భార్య మేఘన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐసీఐసీఐలో ఉద్యోగం చేస్తున్నారు. నానక్‌రాంగూడలో వీరు నివాసం ఉంటున్నారు. కాగా.. ప్రతీక్ మోహన్ సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు యాంకరింగ్ సైతం చేస్తుంటాడు. శుక్రవారం మాదాపూర్‌లోని ఓ పాఠశాల వార్షిక దినోత్సవంలో యాంకరింగ్ చేసి ద్విచక్ర వాహనంపై నానక్‌రాంగూడకు బయలుదేరాడు. సాయంత్రం 6.30 గంటలకు ఓఆర్ఆర్పై నానక్‌రాంగూడ జంక్షన్‌కు ముందు ఆగి ఉన్న యాంగ్లిస్ట్ హైస్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108లో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రతీక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రతీక్ వెనకాలే బైక్‌పై వస్తున్న మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రఫీక్ అదుపు తప్పి కిందపడటంతో అతడికి గాయాలయ్యాయి. ప్రతీక్ మోహన్ తల వెనక భాగంలో బలమైన గాయమైందని, హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని పోలీసులు పేర్కొంటున్నారు. నాలుగు రోజుల క్రితమే మ్యారేజ్ డే సంబరాలు.. ప్రతీక్ మోహన్, మేఘనలకు గత ఏడాది జనవరిలో వివాహమైంది. నాలుగు రోజుల క్రితమే పెళ్లి రోజు జరుపుకొన్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రతీక్ మృతి చెందడంతో ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త మృతి చెందడంతో మేఘన రోదనలు మిన్నంటాయి. ఉస్మానియా ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు ప్రతీక్ మృతదేహన్ని అప్పగించారు. -
షాపూర్జీ–అలియాంజ్ చేతికి వేవ్‌రాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగర రియల్టీ రంగంలో అతిపెద్ద డీల్ నమోదైంది. నానక్‌రామ్‌గూడలోని ఐటీ సెజ్ వేవ్రాక్ను టిష్మన్ స్పేయర్, జీఐసీల నుంచి షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఫండ్ (ఎస్పీఆర్ఈఎఫ్ 2) కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ.1,800 కోట్లు. 12 ఎకరాల్లో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేవ్‌రాక్ విస్తరించింది. ఆపిల్, డీబీఎస్, డ్యూపాంట్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. అలియాంజ్, షాపూర్జీ పల్లోంజీల జేవీయే ఎస్పీఆర్ఈఎఫ్–2. విక్రేతల తరఫున జేఎల్ఎల్ మధ్యవర్తిగా వ్యవహరించింది. -
'నానక్‌రామ్‌గూడా' బాధితులకు వైఎస్ జగన్ ఓదార్పు
- చిలకలపల్లిలో నానక్‌రామ్‌గూడా బాధితులకు జగన్ ఓదార్పు - అన్ని పరిహారాలు వచ్చేదాకా పోరాడుతాం సాక్షి ప్రతినిధి, విజయనగరం: హైదరాబాద్ భవన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నుంచి రావాల్సిన పరిహారం త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బిల్డర్ నుంచి కూడా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. తానొస్తున్నాననే చంద్రన్న బీమా పంపిణీని ఆదరాబాదరాగా చేశారని విమర్శించారు. రావాల్సిన బీమాలను, ప్రయోజనాలను కల్పించేవరకూ పోరాడుతామని భరోసానిచ్చారు. ఆయన సోమవారం రాత్రి విజయనగరం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లిలో పర్యటించారు. నానక్రామ్గూడాలో ఈ నెల 8న నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
‘నానక్‌రామ్‌గూడ’ ఘటనలో నలుగురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన కేసులో నలుగురిని సైబరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరిలో భవన యజమాని తుల్జారామ్ సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తూ సింగ్, అతని కుమారుడు అనిల్ కుమార్‌సింగ్, మేస్త్రి బిజ్జా వేణుగోపాల్, సివిల్ ఇంజనీర్ అల్లం శివరామకృష్ణ ఉన్నారు. వీరిపై ఐపీసీ 304(టూ), 304(ఏ), 338, 427 ఆర్/డబ్ల్యూ సెక్షన్ల కింద గచ్చిబౌలి ఠాణాలో కేసులు నమోదు చేశారు. ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి సులువుగా డబ్బు వస్తుందనే ఆశతో భవనాన్ని నిర్మించారని పోలీసులు చెబుతున్నారు. గురువారం కూలిన భవనానికి పక్కనే ఉన్న ఇంటి యజమాని తుల్జారామ్ బీరేందర్ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. (ఆశలు సమాధి!) నిబంధనలు అతిక్రమించారు: ‘భవన యజమాని సత్తూ సింగ్ 267 చదరపు గజాల్లో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించారు. సరైన ప్లాన్ లేకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించి శివరామకృష్ణ ప్లాన్ ఇవ్వడం, దాన్ని మేస్త్రి వేణుగోపాల్ అమలు చేశారని విచారణలో తేలింది’ అని అడిషనల్ డీసీపీ(క్రైమ్స్) శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈ నిర్మాణం విషయంలో కొంత మంది జీహెచ్ఎంసీ అధికారులకు లంచం ఇచ్చినట్టుగా కూడా గుర్తించామన్నారు. భవన శిథిలాలను పూర్తి స్థాయిలో తొలగిస్తే ఆ ప్రమాద తీవ్రత తెలుస్తుందన్నారు. నిందితులు గతంలో నిర్మించిన భవన నిర్మాణాల డిజైన్లను నిఫుణులకు అందించామని, వారి నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
భవనం కూలిన ఘటనలో ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్ : నానక్‌రాంగూడ భవనం కుప్పకూలిన ఘటనలో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. బిల్డింగ్ యజమాని, అతని కుమారుడు, కాంట్రాక్టర్‌తో పాటు ఆర్కిటెక్చర్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 304, 304 ఎ కింద కేసులు నమోదు చేశారు. భవన యజమాని సత్తూసింగ్, అతని కుమారుడు అనిల్ సింగ్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బిల్డింగ్ కాంట్రాక్టర్, ఆర్కిటెక్చర్ పరారీలో ఉన్నారు. వారిద్దరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
ఆశలు సమాధి!
- భవన శిథిలాల కింద మొత్తం 11 మంది మృతి - ప్రాణాలతో బయటపడింది ఇద్దరే - నానక్‌రాంగూడలో 30 గంటలపాటు కొనసాగిన శిథిలాల తొలగింపు - మృతుల్లో 9 మంది విజయనగరం జిల్లా వాసులు - ఉస్మానియాలో పూర్తయిన పోస్టుమార్టం సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని నానక్‌రాంగూడలో కుప్పకూలిన భవనం కింద ఎవరైనా బతికి ఉన్నారేమోనన్న ఆశలు శిథిలాల కిందే సమాధి అయ్యాయి! ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్తో సహా వివిధ ప్రభుత్వ విభాగాలు నిర్విరామంగా 30 గంటలపాటు శ్రమించి శిథిలాలు తొలగించేసరికి మొత్తం పదకొండు మంది మృతి చెందినట్టు తేలింది. శిథిలాల్లో ఇరుక్కుపోయిన వారిలో ఒక్కరు కొన ఊపిరితో ఉన్నా వారిని బతికించాలనే లక్ష్యంతో అత్యంత జాగ్రత్తగా శిథిలాల తొలగింపు పనులు చేశారు. అయినా శుక్రవారం ప్రాణాలతో బయట పడిన ఇద్దరు తప్ప ఇంకెవరూ మిగల్లేదు. అంతా విగతజీవులయ్యారు. శిథిలాలను తొలగించాక మొత్తం పదకొండు మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. గురువారం రాత్రి 10 గంటలకు మొదలైన సహాయక చర్యలు శనివారం తెల్లవారు జామున 4 గంటల వరకు కొనసాగాయి. శుక్రవారం ఉదయం 5 గంటలకు దీపక్, అతని తల్లి రేఖను సురక్షితంగా వెలికి తీశారు. శనివారం తెల్లవారు జామున 3.15 గంటలకు చివరగా నెల్లి శంకర్రావు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతులు ఎక్కడివారు? మృతుల్లోని 11 మందిలో తొమ్మిది మంది విజయనగరం జిల్లా బలిజపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన వారు. మరో ముగ్గురు అదే జిల్లా సుభద్రకు చెందిన వారు. మరొకరిని శ్రీకాకుళం జిల్లా హిర మండలం గొట్టా బ్యారేజీకి చెందిన కొత్తపల్లి దుర్గారావుగా గుర్తించారు. మరో వ్యక్తి శివను ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాడిగా గుర్తించారు. ఈయన భార్య రేఖ, కొడుకు దీపక్ గాయాలతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు వీరే.. కోమటిపల్లి వెంకటలక్ష్మీ(24), నేతేటిæ పైడమ్మ(46), నేతేటి నేటి సాంబయ్య(48), తేటి గౌరీశ్వరీ(14), కొత్తపల్లి దుర్గారావు(25), శివ, పిరిడి పొలినాయుడు(25), ఆయన భార్య పిరిడి నారాయణమ్మ(23), పిరిడి మోహన్(4), కోమటిపల్లి పోలినాయుడు(32), నెల్లి శంకర్ రావు(20). మంత్రుల పర్యవేక్షణ: శిథిలాల తొలగింపు, మృతదేహాల వెలికితీత ప్రక్రియను పర్యవేక్షించేందుకు మంత్రులు గంటల తరబడి ఘటనా స్థలంలోనే ఉండిపోయారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని శనివారం తెల్లవారు జామున 2.45 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. దాదాపు 16 గంటలకు పైగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆయనతో పాటు మంత్రి మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్ధీన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఉన్నారు. గురువారం రాత్రి డిప్యూటీ సీఎం మహుమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహ్మ రెడ్డి, మంత్రి పద్మారావులు దాదాపు 8 గంటల పాటు సహయక చర్యలను పర్యవేక్షించారు. మరో ఇద్దరి సస్పెన్షన్.. భవనం కూలిన ఘటనలో మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. సర్కిల్–11 టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్న సెక్షన్ ఆఫీసర్ పి.మధుతోపాటు ఇదివరకు ఇక్కడ పనిచేసి, ప్రస్తుతం సర్కిల్లో 7లో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ ఆర్.రాజేందర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్ నష్టపరిహారం సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం శనివారం నష్టపరిహారం ప్రకటించింది. ఘటనలో మృతి చెందిన పెద్దలకు రూ.5 లక్షలు, పిల్లలకు రూ.2.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ సీఎం బాబు తెలిపారు. కొచ్చిలో సత్తూసింగ్ అరెస్టు! హైదరాబాద్: నానక్‌రాంగూడలో కుప్పకూలిన భవనం యాజమాని సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తూసింగ్ను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు కొచ్చిలో అరెస్టు చేసినట్లు సమాచారం. అయ్యప్ప మాలధారణ వేసిన సత్తూసింగ్ కొద్దిరోజుల క్రితం శబరిమలై వెళ్లి తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. భవనం కూలి 11 మంది మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే సైబరాబాద్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించింది. ఫోన్ కాల్స్ ఆ«ధారంగా సత్తూసింగ్ ఆచూకీ కనుగొన్న ఎస్వోటీ పోలీసులు.. శుక్రవారం అర్ధరాత్రి అతనిని కొచ్చిలో అరెస్టు చేసి విమానంలో నగరానికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అతనిపై ఐపీసీ 304 పార్ట్–2, 304ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధ్యులైన వారందరిపై కేసులు భవనం కూలిన ఘటనలో బాధ్యులైన వారందరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. సత్తూసింగ్తో పాటు అతని కుటుంబ సభ్యులు, ఇంజనీర్, మేస్త్రీ, జీహెచ్ఎంసీ అధికారులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శనివారం జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులను విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘సుమధుర’పై తర్జన భర్జన : కాగా, భవనం కూలడానికి సుమధుర కనస్ట్రక్షన్ కంపెనీ లోతైన సెల్లార్ తీయడం కూడా కారణం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సుమధుర కనస్ట్రక్షన్పై కేసు నమోదు చేయాలా? వద్దా? అనే విషయంపై పోలీసులు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. అయినప్పటికీ కేసు నమోదు చేయడంపై వారు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. -
ఇంకా షాక్ లోనే ఆ బస్తీ..
రాయదుర్గం: నానక్‌రాంగూడలోని లోధిబస్తీ భవనం కుప్పకూలడంతో ఇక్కడివారు గురు, శుక్రవారాలు నిద్రలేని రాత్రులు గడిపారు. స్థానికంగానే మంత్రులు, ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది అక్కడే మకాం వేసి సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ ఏం జరిగిందో.. ఎలా జరిగిందో ఊహించుకుటూ షాక్‌లో ఉండిపోయారు. తమతో కలిసున్న 11 మంది మృత్యువాత పడడం వారిని బాధిస్తోంది. అంత భవనం నేలమట్టం కావడంతో అందులో చిక్కుకున్నవారిని కాపాడాలనుకున్నా నిస్సహాయులమే అయ్యామని కన్నీటి పర్యంతమయ్యారు. కుడివైపు కూలి పడింటే ఘోరం జరిగేది.. భవనం ఒకేచోట కుప్పకూలింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆ ఏడంతస్తుల భవనం కుడివైపు కూలిపోయింటే మాత్రం అక్కడ ఉన్న బీరేందర్‌సింగ్ ఇల్లు, ఆ పక్కనే చిన్నచిన్న ఇళ్లపై పడేది అప్పుడు మృతులు సంఖ్య ఇంకే పెరిగేదని ఇక్కడివారు చెబుతున్నారు. ఇక్కడివారు కాకపోయినా 11 మంది చనిపోవడం కలచివేస్తోందని, తమ బంధువులు కాకపోయినా స్నేహంగా ఉండేవారని, ఏడాదిగా తమతోనే మసలారని ఇక్కడివారు తెలిపారు. భోజనం చేసిన 10 నిమిషాలకే.. తాను కుప్పకూలిన భవనంలో ఉంటున్నవారి వద్దే భోజనం చేసేవాడినని పక్కనే ఉన్న సత్యనారాయణసింగ్ మరో భవనం వాచ్మెన్ టి.వెంకటేశ్వరరావు తెలిపాడు. గురువారం రాత్రి 8 గంటలకు వారింటిలో అందరితో కలిసి టీవీ చేస్తూ భోజనం తిన్నామన్నాడు. అన్నం తిని పది నిమిషాలు అక్కడే వారితో మాట్లాడి తన గదికి వెళ్లానని, పదినిమిషాల్లో పెద్ద శబ్దం వచ్చిందని సంఘటనను గుర్తు చేసుకున్నాడు. బయటకు వచ్చి చూడగా ఏడంతస్తుల భవనం కుప్పకూలి కనిపించిందన్నాడు. పశ్చిమ గోదావరిజిల్లా ఆచంట వేమవరం గ్రామం నుంచి వచ్చిన తాను.. ఇక్కడ వాచ్మెన్ గా పనిచేసే తమ బంధువు కోటేశ్వరరావు సొంతూరు వెళుతూ తనను అక్కడ వాచ్మెన్ గా ఉండమన్నాడని, భోజనం సాంబయ్య ఇంట్లో చేయాలని చెప్పి వెళ్లాడన్నాడు. గురువారం, శుక్రవారం అసలు నిద్రనే లేదని కన్నీట పర్యంతమయ్యాడు. – వెంకటేశ్వరరావు -
మరో ఇద్దరు అధికారులు సస్పెండ్
హైదరాబాద్: నానక్‌రాంగూడలో భవనం కూలిన ఘటనలో మరో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. ఇద్దరు సెక్షన్ ఆఫిసర్లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ.. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అక్రమ కట్టడాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను వేటు వేసినట్లు తెలిపారు. ఇప్పటికే స్థానిక డిప్యూటీ కమిషనర్ మనోహర్, సహాయ సిటీ ప్లానర్ కృష్ణమోహన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనలో మొత్తం నలుగురు అధికారులపై వేటు పడింది. -
మరో ఇద్దరు అధికారులపై వేటు
హైదరాబాద్: నానక్‌రామ్ గూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరో ఇద్దరు అధికారులపై వేటు పడింది. టౌన్ ప్లానింగ్ అధికారులు ఆర్ రాజేందర్, పీ మధులను జీహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ రమణారావు ఈ ప్రమాదంపై జీహెచ్ఎంసీకి నివేదిక సమర్పించారు. అపార్ట్మెంట్ డిజైన్ సక్రమంగా లేదని, ఎక్కువ అంతస్తులు నిర్మించడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. పక్కపక్కనే భవనాలు నిర్మించడం కూడా ప్రమాదానికి కారణమని, శిథిలాలు తొలగించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని రమణారావు చెప్పారు. గురువారం రాత్రి నానక్‌రామ్ గూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 11 మృతదేహాలను వెలికితీశారు. అదృష్టవశాత్తూ ఓ తల్లీ, ఆమె మూడేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దల కుటుంబాలకు 5 లక్షలు, పిల్లల కుటుంబాలకు 2.5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. -
కేరళలో సత్తుసింగ్ అరెస్ట్
హైదరాబాద్: పదకొండు మందిని బలి తీసుకున్న నానక్‌రాంగూడ భవన యజమాని సత్తు సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అతను ఎవరికీ కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలించి, చివరికి కేరళలో ఉన్నట్లు తెలుసుకుని పట్టుకున్నారు. కాగా, ఈ ఘటనలో భవన శిథిలాల తొలగింపు పూర్తయింది. అధికార యంత్రాంగం 28 గంటల పాటు నిర్విరామంగా పనిచేసింది. మొత్తం 11 మంది చనిపోగా ఇద్దరిని మాత్రమే రక్షించ గలిగారు. -
మృత్యుఘోష..'అంతా ఏపీకి చెందినవారే'
-
ఐదుకు చేరిన మృతుల సంఖ్య
-
మృత్యుఘోష
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో పేకమేడలా కూలిపోయిన భవన శిథిలాల తొలగింపు ప్రక్రియ ముగిసింది. మొత్తం 11 మృతదేహాలను బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఓ తల్లీ, ఆమె మూడేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే ఉండి పర్యవేక్షించినా.. ఇరుకు రోడ్డు, విద్యుత్ తీగల కారణంగా సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరిగింది. శనివారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి. ఈ ఘటన బాధితుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందినవారే. కొందరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు, మరికొందరు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు ఉన్నారు. నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది గురువారం రాత్రి 10 గంటల నుంచే సహాయక చర్యలు చేపట్టారు. మూడు ప్రొక్లెయినర్లు, పదుల సంఖ్యలో సిబ్బందితో శిథిలాల తొలగింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రేఖ అనే మహిళ, ఆమె కుమారుడు దీపక్ (3)లను ప్రాణాలతో బయటికి తీశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ వెంటనే కాంటి నెంటల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం శనివారం తెల్లవారుజాము వరకు మిగతా మృత దేహాలను వెలికితీశారు. (‘మృత్యుఘోష’కు సంబంధించిన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అంతా ఏపీకి చెందినవారే.. వెలికి తీసిన మృతదేహాలను కోమటిపల్లి వెంకటలక్ష్మి (28), తేనేటి గౌరిశ్రీ (14), తేనేటి పైడమ్మ (35), తేనేటి సాంబయ్య (38), కోమటి పల్లి పోలినాయుడు (30), ఎన్.శంకర్ (18), శ్రీకాకుళం జిల్లా హీరా మండలానికి చెందిన దుర్గారావు (22), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివ (30)గా గుర్తించారు. వీరిలో దుర్గారావు, శివ మినహా మిగతా వారు ఏపీలోని విజయ నగరం జిల్లా చిలకలపల్లి వారే. ఇదే జిల్లా సుభద్ర ప్రాంతానికి చెందిన పిరిడి పోలినాయడు (30), పిరిడి నారాయణమ్మ (23), పిరిడి మోహన్ (3) ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తల్లీ కొడుకులు రేఖ (25), దీపక్ (3) ప్రాణాలతో బయటపడ్డారు. చిలకలపల్లికి చెందిన వారిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారుకాగా.. సుభద్ర గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. అది అక్రమ నిర్మాణమే నానక్‌రామ్‌గూడ గ్రామ కంఠంలో ఎలాంటి అనుమతులూ లేకుండానే జీ ప్లస్ ఆరు అంతస్తుల ఈ భవనం నిర్మించినట్లు తేలిం ది. భవన యజమాని తుల్జారాం సత్య నారాయణసింగ్ అలియాస్ సత్తూసింగ్ అధికార టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండడం వల్లే ఈ అక్రమ నిర్మాణం వైపు శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని సమా చారం. కింది స్థాయి సిబ్బంది అక్కడికి వెళ్లినా సత్తూసింగ్ భయపెట్టేవాడని స్థానికులు చెబు తున్నారు. కాగా భవనం కుప్పకూలిన అనంతరం సత్తూ సింగ్ పరారీలో ఉన్నట్లు తెలు స్తోంది. కొంత మంది స్థానికులు అతను శబ రిమల వెళ్లాడని చెబుతుండగా.. మరికొందరు హైదరాబాద్‌లోనే ఉండవచ్చని చెబుతున్నారు. శిథిలాల తొలగింపులో జాప్యం కూలిన భవనం శిథిలాలు తొలగింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఇరుకైన రోడ్లు, విద్యుత్ తీగలు ఉండటంతో శిథిలాలను వేగంగా తొలగించడం, టిప్పర్లలో తరలించడం వంటివి ఆలస్యమయ్యాయి. దాంతో గంటల తరబడి సహాయక చర్యలు కొనసాగాయి. మృత్యుంజయులు ఆ తల్లీబిడ్డ సాక్షి, హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం పేక మేడలా కుప్పకూలినా ఓ తల్లీకొడుకు మాత్రం మృత్యుంజయులుగా బయటపడ్డారు. అయితే కూలిన భవనానికి ఉత్తరం వైపున మరో భవనం ఉంది. ఆ భవనాన్ని ఆనుకొని శాంతాబాయికి చెందిన భవనం ఉంది. అక్కడ శిథిలాల్లో కొందరు ఉండే అవకాశముందని స్థానికులు అధికారులకు సూచించారు. దీంతో పక్కనున్న భవనాన్ని కొద్ది మేర కూల్చి, సమాంతరంగా గొయ్యి తవ్వారు. డాగ్‌స్క్వాడ్ కూడా అక్కడ ఎవరో ఉన్నట్లుగా సూచించింది. గురువారం అర్ధరాత్రి అనంతరం 2 గంటల సమయంలో మహిళ, చిన్నారి ఏడుపులు వినిపించడంతో.. ఎన్డీఆర్ఎఫ్ బృందం అప్రమత్తమైంది. చిన్నపాటి రంధ్రం చేయగా రేఖ (25) కనిపించింది. అక్కడే ముగ్గురం ఉన్నామని, తమను త్వరగా కాపాడాలని అర్థించింది. అధికారులు మరో మూడు గంటల పాటు శ్రమించి, మెల్లమెల్లగా శిథిలాలను తొలగించి ఆమెతోపాటు కుమారుడు దీపక్ (3)ను ప్రాణాలతో బయటకు తీశారు. అయితే రేఖ భర్త శివ (30) మాత్రం మృతిచెందాడు. అయితే రేఖ వెన్నెముక, కాలు, మోకాలికి తీవ్రగాయాలుకాగా.. దీపక్ ఎడమ కాలు విరగింది, తలకు గాయాలయ్యాయి. వారిని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఓవైపు భర్త మరణించడం, కుమారుడు తీవ్రగాయాలపాలై తనతోపాటు ఆస్పత్రిలో ఉండడంతో రేఖ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మంత్రి కేటీఆర్‌తో బాధితుల వాగ్వాదం వెలికితీసిన మృతదేహాలను వెంటనే తరలిస్తున్నారని, చనిపోయిన వారు ఎవరో కూడా చూడనివ్వడం లేదని బాధిత కుటుంబాలకు చెందినవారు మంత్రి కె.తారకరామారావుతో వాగ్వాదానికి దిగారు. అయితే మృతదేహాలను తాత్కాలికంగా కాంటినెంటల్ ఆస్పత్రికి తరలిస్తున్నామని, అక్కడ బంధువులకు చూపించాకే పోస్టుమార్టంకు తరలిస్తామని చెప్పడంతో శాంతించారు. రాత్రంతా పర్యవేక్షించిన మంత్రులు: పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే ఉండి భవనం శిథిలాల తొలగింపును పర్యవేక్షించారు. గురువారం రాత్రే ఘటనా స్థలికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తదితరులు... తీవ్రమైన చలిలో రాత్రంతా అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం తల్లి, కొడుకు సురక్షితంగా బయటపడ్డ తరువాత మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు శుక్రవారం ఉదయమే మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని... రాత్రి వరకూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావులు పలువురు టీడీపీ నాయకులతో కలసి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు షబ్బీర్‌అలీ, భిక్షపతియాదవ్, రవికుమార్‌యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు కూడా బాధితులను పరామర్శించినవారిలో ఉన్నారు. బతికుంటే బాగుండు దేవుడా.. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చిల కలపల్లి గ్రామానికి చెందిన వారంతా కొన్నేళ్ల కింద ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. గచ్చిబౌలి, కూకట్పల్లి, బోరబండ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనుల్లో వారు కూలీలుగా పనిచేస్తున్నారు. నానక్‌రామ్‌గూడలో భవనం కూలి తమ గ్రామస్తులు చనిపోయారని తెలుసుకున్న వారంతా శుక్రవారం పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలికి వచ్చారు. తమ వారు బతికుంటే బాగుండు దేవుడా అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. రూ.10 లక్షల పరిహారం మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కేటీఆర్ హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష నష్ట పరిహారం చెల్లిస్తామని మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఘటనా స్థలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమోహన్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాధ్యులను పట్టుకుంటామన్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారని తెలిపారు. కూలిపోయిన భవనం పక్కనే ఉన్న రెండు భవనాలు కూడా కొంత వరకు దెబ్బతిన్నాయని.. వాటిని నిపుణులతో పరిశీలన చేయించి, ప్రమాదకరమని తేలితే కూల్చివేస్తామని కేటీఆర్ తెలిపారు. కూలిన ఘటనపై నివేదిక ఇవ్వండి: దత్తాత్రేయ హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో భవనం కూలిన ఘటనపై నివేదిక ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖ ప్రధాన కమిషనర్ అనీల్‌కుమార్ నాయక్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదేశించారు. ఘటనకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్లతో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితిని సమీ క్షించారు. ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులు మరణించడంతో ఆ రాష్ట్ర కార్మిక మంత్రి లాల్ రాజ్వాడే తో మాట్లాడి మృతుల బంధువులకు విషయం తెలియజేయాలని చెప్పారు. కూలిన ఘటనపై విచారణ జరపండి: సీపీఐ, సీపీఎం డిమాండ్ హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడలో నిర్మా ణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరాయి. బాధ్యులపై కఠిన చర్యలు ‘‘నానక్‌రామ్‌గూడ ఘటనలో బాధ్యులెం తటి వారైనా కఠిన చర్య లు తప్పవు. కూలీలు చనిపోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవన యజమాని సత్తూసిం గ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు..’’ - రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి -
రాజధానిలో విషాదం
బతుకు మెరుగుపరుచుకుందామని, వెన్నాడుతున్న సమస్యలను విరగడ చేసుకుం దామని ఆశించి ఉన్న ఊరును వదిలి పొట్ట చేతబట్టుకుని వచ్చిన నిర్మాణ రంగ కూలీలను మృత్యువు కాటేసింది. హైదరాబాద్ నగరంలోని నానక్‌రాంగుడాలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఉదంతంలో 16మంది అభాగ్యులు మరణించారని వార్తలొచ్చినా 24 గంటలు గడిచాక కూడా మృతులెం దరో నిర్ధారణ కాలేదు. శుక్రవారం రాత్రికి ఆరు మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరు సజీవంగా బయటపడ్డారు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లో మూలకు విసిరేసిన ట్టుండే విజయనగరం జిల్లా నుంచి ఇంత దూరం వచ్చిన కూలీలకు ఏ విధమైన బతుకు భద్రతా లేదని ఈ ఉదంతం నిరూపించింది. కేవలం 170 గజాల స్థలంలో ఎలాంటి అనుమతీ లేకుండా ఏడంతస్తుల భవనం నిర్మాణమవుతుంటే ప్రభుత్వ శాఖలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌కు సంబంధించిన విభాగాలు కళ్లు మూసు కున్నాయి. పన్నులు వసూలు చేయడానికి, అధికారాలు చలాయించడానికి ఎక్కడ లేని ఉత్సాహమూ ప్రదర్శించే అధికారులు ఏడాది నుంచి ఈ తంతు నడుస్తున్నా ఏమీ పట్టనట్టు ఉండిపోయారు. వాస్తవానికి అనుమతులు తీసుకున్న నిర్మాణాల విషయంలో సైతం పర్యవేక్షణ ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగానే అన్నీ సాగుతున్నాయా అన్న ఆరా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనిఖీలుంటాయి. కానీ నగరంలో గత కొంతకాలంగా చోటుచేసుకున్న ఉదంతాలను గమనిస్తే అవేమీ సక్రమంగా సాగటం లేదని అర్ధమవుతుంది. నిరుడు షేక్‌పేటలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం ఒరిగింది. ఫిలింనగర్ సాంస్కృతిక కేంద్రం ఎదుట నిర్మిస్తున్న పోర్టికో కుప్పకూలి ఇద్దరు కూలీలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఆ మరు సటి నెలలో జూబ్లీహిల్స్‌లో మరో మూడంతస్తుల భవనం కూలింది. ఆ నిర్మాణం నాణ్యత సరిగా లేదని అప్పట్లో అధికారులు చెప్పారు. మాదాపూర్‌లో మరో నిర్మాణం కూలడంతో పలువురు గాయపడ్డారు. కూకట్పల్లి కాలనీలో సైతం ఒక నిర్మాణం కూలి ముగ్గురు కార్మికులు చనిపోయారు. ఈ ఉదంతాలన్నిటా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదుగానీ... కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉండేది కాదని తేటతెల్లమవుతుంది. ఎక్కడో మారుమూల పల్లె టూరులో అయితే వేరు... కానీ రాజధాని నగరం నడిబొడ్డున ఎలాంటి అనుమ తులూ లేకుండా సుదీర్ఘకాలంగా పనులు సాగుతుంటే అధికారులెవరి దృష్టికీ రాలే దని నమ్మగలమా? ఆ నిర్మాణానికి చేర్చి ఆవాసాలున్నాయి. కానీ ఫలితం ఉంటుం దన్న విశ్వాసం లేకపోవడంవల్లే కావొచ్చు... ఎవరూ ఫిర్యాదు చేయడానికి సాహ సించలేదు. ఇలాంటి ఉదంతాలు సామాన్య పౌరులకు ప్రభుత్వ యంత్రాంగంపై ఉండే అపనమ్మకాన్ని చాటిచెబుతాయి. ఏ నిర్మాణమైనా ఉన్నట్టుండి కుప్పకూలి నట్టు కనిపిస్తుందిగానీ అందుకు సంబంధించిన జాడలు పగుళ్లు, బీటల రూపంలో జాగ్రత్తగా గమనిస్తే ముందే కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు జరిగే తనిఖీల్లో ఇలాం టివి వెల్లడవుతాయి. నిర్మాణ రంగానికి సంబంధించి నిరంతరం జరిగే పరిశోధనలు ఎన్నో కొత్త అంశాలను వెలుగులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, అమెరికన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ వంటివి ఈ పరిశోధనలకు అను గుణంగా తమ తమ బిల్డింగ్ కోడ్లను మార్చుకున్నాయి. బాంబు పేలుళ్ల వంటివి సంభవించినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు ఒక్కసారిగా భవనాలు కుప్ప కూలి పోకుండా చూడటానికి నిర్మాణానికి ఉపయోగించే స్టీల్‌కు సాగే గుణం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కాంక్రీట్ నాణ్యతకు సంబంధించి సైతం కొత్త ప్రమా ణాలు వచ్చాయి. కాంక్రీట్‌లో సూదివంటి స్టీల్ మైక్రో ఫైబర్లను కలిపే పద్ధ తిని ప్రవేశపెట్టారు. బాంబు పేలుళ్ల వంటి ఉదంతాల్లో వెనువెంటనే భవనాలకు ఏం కాకుండా ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పౌరుల ప్రాణాలకు విలువ నిచ్చి, నష్టాన్ని కనిష్ట స్థాయిలో ఉంచడం కోసం ఈ మాదిరి పరిశోధనలు నిరంతరం సాగుతున్నాయి. మనదగ్గర కూడా పదిహేనేళ్లక్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భవనాలు కుంగిన ఉదంతాలు చోటుచేసుకున్నప్పుడు ప్రభుత్వానికి హైకోర్టు విలువైన సూచనలు చేసింది. భవన నిర్మాణానికి సంబంధించిన నాణ్యతపై బిల్డర్ నుంచి మాత్రమే కాక ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ డిజైనర్ తదితరుల నుంచి సైతం గట్టి హామీ తీసు కోవాలని తెలిపింది. అవి ఏమేరకు అమలవుతున్నాయో తెలియదు. ఇప్పుడిప్పుడు భూకంపాలను తట్టుకునే స్థాయిలో నిర్మాణాలు ఉండాలన్న నిబంధనలొస్తున్నాయి. అలాగే అనుకోని ఇబ్బందులు తలెత్తినప్పుడు అగ్నిమాపక సిబ్బంది చర్యలకు వీలుగా భవన నిర్మాణానికి చుట్టూ నిర్దిష్టమైన జాగా వదలాలని, అందులో నివాసం ఉండే వారు అక్కడినుంచి సులభంగా బయటపడటానికి వీలైన మార్గాలుండాలని నిర్దే శిస్తున్నారు. వీటన్నిటి సంగతలా ఉంచి... అసలు ఏ అనుమతులూ లేకుండానే అతి తక్కువ స్థలంలో భారీ భవనం నిర్మించడం అత్యంత దుర్మార్గం. ఇదంటే సొంతానికి నిర్మించుకుంటున్న భవనం కావొచ్చు. కానీ బిల్డర్ ఎవరైనా బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నానని చెప్పి అందరివద్దా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తే లక్షలు పోసి సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకున్నవారి గతేమిటి? ఒకచోట డబ్బుకు కక్కుర్తిపడి చూసీ చూడనట్టు ఊరుకున్న అధికారి మరోచోట చిత్తశుద్ధితో వ్యవహరిస్తాడన్న గ్యారెంటీ ఏం లేదు. ఎన్నో నిబంధనలు అమల్లోకొచ్చిన వర్తమానంలో సైతం బిల్డర్ తమను మోసం చేశాడంటూ వస్తున్న ఫిర్యాదులు తక్కువేమీ కాదు. అక్రమ నిర్మా ణాల విషయంలో ఉపేక్ష, అధికారుల చేతివాటం, అడ్డగోలుగా అనుమతులీయడం దేశ మంతటా వ్యాధిలా పెరిగింది. ఏదైనా నిబంధన వచ్చిందంటే అది అమలు చేయ డానికి కాక... పైసలు దండుకోవడానికే ఉపయోగపడుతోంది. తాజా ఉదంతం ప్రభు త్వానికి గుణపాఠం కావాలి. బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడంతోపాటు బాధ్యులుగా తేలినవారి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలి. -
ఏపీ ప్రభుత్వం పని కల్పించకే వలసలు: బొత్స
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పని కల్పించలేని దుస్థితిలో ఉండటం వల్లే ఉత్తర కోస్తా వలసజీవుల బతుకులు ఛిద్ర మయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ విమర్శించారు.నానక్‌రాం గూడలో కుప్పకూలిన ఏడంతస్థుల మేడను ఆయన శుక్రవారం పరిశీలించారు. విజయనగరం జిల్లాకు చెందిన బాధితులను ఆయన ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.10 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. ఏపీ అందుకు రెండింతలు ఇవ్వాల్సిన అవసరముంది’’ అన్నారు. ‘‘ఏపీ దుర్భర స్థితిలో ఉండడం వల్లే పని కోసం వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు వలస వస్తున్నారు. దీనిపై ఏపీ సీఎం, మంత్రులు ఏం సమాధానం చెబుతార’’ని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తరపున బాధిత కుటుంబాలకు బొత్స ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకు ముందు ఆయన మంత్రి కేటీఆర్‌ను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. బొత్స వెంట వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి తదితరులున్నారు. -
మృత్యుంజయులు ఆ తల్లీబిడ్డ
సాక్షి, హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం పేక మేడలా కుప్పకూలినా ఓ తల్లీకొడుకు మాత్రం మృత్యుంజయులుగా బయటపడ్డారు. అయితే కూలిన భవనానికి ఉత్తరం వైపున మరో భవనం ఉంది. ఆ భవనాన్ని ఆనుకొని శాంతాబాయికి చెందిన భవనం ఉంది. అక్కడ శిథిలాల్లో కొందరు ఉండే అవకాశముందని స్థానికులు అధికారులకు సూచించారు. దీంతో పక్కనున్న భవనాన్ని కొద్ది మేర కూల్చి, సమాంతరంగా గొయ్యి తవ్వారు. డాగ్‌స్క్వాడ్ కూడా అక్కడ ఎవరో ఉన్నట్లుగా సూచించింది. గురువారం అర్ధరాత్రి అనంతరం 2 గంటల సమయంలో మహిళ, చిన్నారి ఏడుపులు వినిపించడంతో.. ఎన్డీఆర్ఎఫ్ బృందం అప్రమత్తమైంది. చిన్నపాటి రంధ్రం చేయగా రేఖ (25) కనిపించింది. అక్కడే ముగ్గురం ఉన్నామని, తమను త్వరగా కాపాడాలని అర్థించింది. అధికారులు మరో మూడు గంటల పాటు శ్రమించి, మెల్లమెల్లగా శిథిలాలను తొలగించి ఆమెతోపాటు కుమారుడు దీపక్ (3)ను ప్రాణాలతో బయటకు తీశారు. అయితే రేఖ భర్త శివ (30) మాత్రం మృతిచెందాడు. అయితే రేఖ వెన్నెముక, కాలు, మోకాలికి తీవ్రగాయాలుకాగా.. దీపక్ ఎడమ కాలు విరగింది, తలకు గాయాలయ్యాయి. వారిని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఓవైపు భర్త మరణించడం, కుమారుడు తీవ్రగాయాలపాలై తనతోపాటు ఆస్పత్రిలో ఉండడంతో రేఖ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. (ప్రధానవార్త: మృత్యుఘోష) -
మృత్యుఘోష
- నగరంలో భవనం కూలిన ఘటనలో ఆరు మృతదేహాలు వెలికితీత - శిథిలాల కింద మరో ఐదుగురు - మృత్యుంజయులుగా బయటపడ్డ తల్లి, బిడ్డ - శుక్రవారం అర్ధరాత్రి తర్వాతా కొనసాగుతున్న సహాయక చర్యలు - రాత్రంతా ఉండి పర్యవేక్షించిన మంత్రులు, ఉన్నతాధికారులు - తమ వారికోసం బంధువుల ఆక్రందనలు - పరారీలో భవన యజమాని సత్తూసింగ్ - మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష పరిహారం: కేటీఆర్ - డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీలపై సస్పెన్షన్ వేటు హైదరాబాద్: కాపాడండి.. కాపాడండి అంటూ ఆర్తనాదాలు.. తమవారు ప్రాణాలతో ఉన్నారో లేదోనన్న ఆవేదనతో బంధువుల రోదనలు.. ఎంత తీసినా తరగని శిథిలాలు.. భవనం శ్లాబ్‌ల మధ్య ముక్కలు ముక్కలుగా బయటపడిన మృతదేహాలు.. తీవ్ర ఉద్వేగం మధ్య సహాయక చర్యలు.. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో పేకమేడలా కూలిపోయిన భవనం శ్మశానాన్ని తలపించింది. గురువారం రాత్రి నుంచి సహాయక చర్యలు జరుగుతుండగా.. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆరు మృతదేహాలను వెలికితీశారు. మరో ఐదుగురు శిథిలాల కింద ఉన్నట్లు గుర్తించారు. అదృష్టవశాత్తూ ఓ తల్లీ, ఆమె మూడేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే ఉండి పర్యవేక్షించినా.. ఇరుకు రోడ్డు, విద్యుత్ తీగల కారణంగా సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటన బాధితుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందినవారే. కొందరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు, మరికొందరు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు ఉన్నారు. కొనసాగుతున్న సహాయక చర్యలు నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది గురువారం రాత్రి 10 గంటల నుంచే సహాయక చర్యలు చేపట్టారు. మూడు ప్రొక్లెయినర్లు, పదుల సంఖ్యలో సిబ్బందితో శిథిలాల తొలగింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రేఖ అనే మహిళ, ఆమె కుమారుడు దీపక్ (3)లను ప్రాణాలతో బయటికి తీశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ వెంటనే కాంటి నెంటల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం శుక్రవారం రాత్రి వరకు ఆరు మృత దేహాలను వెలికితీశారు. (‘మృత్యుఘోష’కు సంబంధించిన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అంతా ఏపీకి చెందినవారే.. వెలికి తీసిన మృతదేహాలను కోమటిపల్లి వెంకటలక్ష్మి (28), తేనేటి గౌరిశ్రీ (14), తేనేటి పైడమ్మ (35), తేనేటి సాంబయ్య (38), శ్రీకాకుళం జిల్లా హీరా మండలానికి చెందిన దుర్గారావు (22), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివ (30)గా గుర్తించారు. వీరిలో దుర్గారావు, శివ మినహా మిగతా నలుగురూ ఏపీలోని విజయ నగరం జిల్లా చిలకలపల్లి వారే. ఇక శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నట్లుగా భావిస్తు న్నారు. వారిలో చిలకలపల్లికే చెందిన కోమటి పల్లి పోలినాయుడు (30), ఎన్.శంకర్ (18), ఇదే జిల్లా సుభద్ర ప్రాంతానికి చెందిన పిరిడి పోలినాయడు (30), పిరిడి నారాయణమ్మ (23), పిరిడి మోహన్ (3) ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తల్లీ కొడుకులు రేఖ (25), దీపక్ (3) ప్రాణాలతో బయటపడ్డారు. చిలకలపల్లికి చెందిన వారిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారుకాగా.. సుభద్ర గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. అది అక్రమ నిర్మాణమే నానక్‌రామ్‌గూడ గ్రామ కంఠంలో ఎలాంటి అనుమతులూ లేకుండానే జీ ప్లస్ ఆరు అంతస్తుల ఈ భవనం నిర్మించినట్లు తేలిం ది. భవన యజమాని తుల్జారాం సత్య నారాయణసింగ్ అలియాస్ సత్తూసింగ్ అధి కార టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండడం వల్లే ఈ అక్రమ నిర్మాణం వైపు శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని సమా చారం. కింది స్థాయి సిబ్బంది అక్కడికి వెళ్లినా సత్తూసింగ్ భయపెట్టేవాడని స్థానికులు చెబు తున్నారు. కాగా భవనం కుప్పకూలిన అనం తరం సత్తూ సింగ్ పరారీలో ఉన్నట్లు తెలు స్తోంది. కొంత మంది స్థానికులు అతను శబ రిమల వెళ్లాడని చెబుతుండగా.. మరికొందరు హైదరాబాద్‌లోనే ఉండవచ్చని చెబుతున్నారు. శిథిలాల తొలగింపులో జాప్యం కూలిన భవనం శిథిలాలు తొలగింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఇరుకైన రోడ్లు, విద్యుత్ తీగలు ఉండటంతో శిథిలాలను వేగంగా తొలగించడం, టిప్పర్లలో తరలించడం వంటివి ఆలస్యమయ్యాయి. దాంతో గంటల తరబడి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భవనం కుప్పకూలిన దాదాపు 8 గంటల తర్వాత ఇద్దరిని ప్రాణాలతో రక్షించగా.. మరో నాలుగు గంటల తర్వాత నాలుగు మృతదేహలను 12 గంటలకు వెలికితీశారు. మంత్రి కేటీఆర్‌తో బాధితుల వాగ్వాదం వెలికితీసిన మృతదేహాలను వెంటనే తరలిస్తున్నారని, చనిపోయిన వారు ఎవరో కూడా చూడనివ్వడం లేదని బాధిత కుటుంబాలకు చెందినవారు మంత్రి కె.తారకరామారావుతో వాగ్వాదానికి దిగారు. అయితే మృతదేహాలను తాత్కాలికంగా కాంటినెంటల్ ఆస్పత్రికి తరలిస్తున్నామని, అక్కడ బంధువులకు చూపించాకే పోస్టుమార్టంకు తరలిస్తామని చెప్పడంతో శాంతించారు. రాత్రంతా పర్యవేక్షించిన మంత్రులు: పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే ఉండి భవనం శిథిలాల తొలగింపును పర్యవేక్షించారు. గురువారం రాత్రే ఘటనా స్థలికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తదితరులు... తీవ్రమైన చలిలో రాత్రంతా అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం తల్లి, కొడుకు సురక్షితంగా బయటపడ్డ తరువాత మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు శుక్రవారం ఉదయమే మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని... రాత్రి వరకూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావులు పలువురు టీడీపీ నాయకులతో కలసి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు షబ్బీర్‌అలీ, భిక్షపతియాదవ్, రవికుమార్‌యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు కూడా బాధితులను పరామర్శించినవారిలో ఉన్నారు. బతికుంటే బాగుండు దేవుడా.. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చిల కలపల్లి గ్రామానికి చెందిన వారంతా కొన్నేళ్ల కింద ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. గచ్చిబౌలి, కూకట్పల్లి, బోరబండ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనుల్లో వారు కూలీలుగా పనిచేస్తున్నారు. నానక్‌రామ్‌గూడలో భవనం కూలి తమ గ్రామస్తులు చనిపోయారని తెలుసుకున్న వారంతా శుక్రవారం పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలికి వచ్చారు. తమ వారు బతికుంటే బాగుండు దేవుడా అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. రూ.10 లక్షల పరిహారం మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కేటీఆర్ హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష నష్ట పరిహారం చెల్లిస్తామని మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఘటనా స్థలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమోహన్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాధ్యులను పట్టుకుంటామన్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారని తెలిపారు. కూలిపోయిన భవనం పక్కనే ఉన్న రెండు భవనాలు కూడా కొంత వరకు దెబ్బతిన్నాయని.. వాటిని నిపుణులతో పరిశీలన చేయించి, ప్రమాదకరమని తేలితే కూల్చివేస్తామని కేటీఆర్ తెలిపారు. కూలిన ఘటనపై నివేదిక ఇవ్వండి: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో భవనం కూలిన ఘటనపై నివేదిక ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖ ప్రధాన కమిషనర్ అనీల్‌కుమార్ నాయక్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదేశించారు. ఘటనకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్లతో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితిని సమీ క్షించారు. ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులు మరణించడంతో ఆ రాష్ట్ర కార్మిక మంత్రి లాల్ రాజ్వాడే తో మాట్లాడి మృతుల బంధువులకు విష యం తెలియజేయాలని చెప్పారు. కూలిన ఘటనపై విచారణ జరపండి: సీపీఐ, సీపీఎం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడలో నిర్మా ణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరాయి. బాధ్యులపై కఠిన చర్యలు ‘‘నానక్‌రామ్‌గూడ ఘటనలో బాధ్యులెం తటి వారైనా కఠిన చర్య లు తప్పవు. కూలీలు చనిపోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవన యజమాని సత్తూసిం గ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు..’’ - రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి స్పందించకపోవడం వల్లే.. ‘‘ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ కొనసాగుతున్న తరుణంలోనే అధికారులు అక్రమ నిర్మాణాలకు ఊతమివ్వడం గమ నార్హం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి..’ - భిక్షపతియాదవ్,శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే రాత్రి ఫోన్ చేశా.. ‘‘మా ఆడపడుచు వెంకటలక్ష్మి గురువారం రాత్రి 8.30 గంటలకు నాకు ఫోన్ చేసింది. జ్వరంగా ఉందని ఆస్పత్రికి వెళ్లేందుకు డబ్బులు కావాలని అడిగింది. ఉదయమే డబ్బులు ఇస్తానని చెప్పాను. 9 గంటల తరువాత మళ్లీ ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తలేదు. టీవీల్లో చూస్తే.. మావాళ్లు ఉండే ఇల్లే కూలిపోయిందని తెలిసింది..’’ - లక్ష్మి, సిద్దిఖీనగర్ -
మంత్రి పదవికి కేటీఆర్ రాజీనామా చేయాలి
హైదరాబాద్: నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. నానక్ రాంగూడలో నిన్న రాత్రి కుప్పకూలిన భవనాన్ని శుక్రవారం షబ్బీర్ అలీతో కలిసి పరిశీలించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నానక్‌రాంగూడ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. -
ఐదుకు చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్: నగరంలోని నానక్‌రామ్‌గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. సహాయ సిబ్బంది మరో మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. అంతకుముందు బయటకు తీసిన నలుగురి మృతదేహాలు శివ, నారాయణమ్మ, పైడమ్మ, గౌరీశ్వరివిగా గుర్తించారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గట్టు శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. అధికారులను అడిగి ప్రమాద కారణాలను తెలుసుకున్నారు. మరోవైపు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉదయం నుంచి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వైఎస్ జగన్ సంతాపం భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
మృతుల వివరాలు ఇవీ..
నానక్‌రాంగూడ ప్రాంతంలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతులను గుర్తించారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకటలక్ష్మి (28), సాంబయ్య (38), గౌరి (18), పైడమ్మ (35). ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని రేఖ, ఆమె కొడుకు దీపక్‌గా గుర్తించారు. వీళ్లు కాక శిథిలాల కింద మరో ఏడుగురు చిక్కుకుని ఉన్నారు. వారిలో ఎందరు సజీవంగా ఉన్నారో ఇంకా తెలియాల్సి ఉంది. కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేఖ, ఆమె కుమారుడు దీపక్ -
ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం
-
మరో మృతదేహం వెలికితీత
-
బిల్డర్‌పై చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి
-
మరో మృతదేహం వెలికితీత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. కాగా, మరో 8మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా మృతులను శివ, నారాయణమ్మ, పైడమ్మ, గౌరీశ్వరిగా గుర్తించారు. శివ తప్ప మిగతా వారంతా విజయనగరం జిల్లా వాసులుగా తేలింది. శిథిలాల కింద ఇరుక్కున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ మహిళ, చిన్నారిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించగలిగింది. టోలిచౌకి ప్రాంతానికి చెందిన తుల్జాపూర్ సత్యనారాయణ సింగ్ ఈ భవనం యజమాని. ఆయన కేవలం 260 గజాల స్థలంలో ఏకంగా జీప్లస్ 6 (ఏడు అంతస్తులు)తో పాటు పైన పెంట్‌హౌస్ కూడా నిర్మిస్తున్నారు. 2015 సెప్టెంబర్ నుంచి ఈ భవన నిర్మాణం కొనసాగుతోందని, నిర్మాణంలోని ఆ భవనంలోనే జిల్లాల నుంచి వచ్చిన 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు జేసీబీలు, క్రేన్లతో ప్రయత్నిస్తు న్నారు. భవనం వద్దకు వెళ్లేదారి ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోందని పోలీసులు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ, రాచకొండ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందిం చేందుకు సమీప ఆసుపత్రుల నుంచి అంబులెన్స్‌లను రప్పించారు. ఎందుకు కూలిపోయింది? లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని కొందరు స్థానికులు చెబుతుండగా... ఆ భవనానికి వెనుక మరో భవన నిర్మాణం కోసం బాంబులతో పేల్చి సెల్లార్ గుంత తీస్తుండడమే ప్రమాదానికి కారణమని మరికొందరు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా సత్యనారాయణసింగ్ భవనం కుప్పకూలిపోవడంతో.. ఆ ధాటికి పక్కనే ఉన్న తుల్జాపూర్ వీరేంద్రసింగ్‌కు చెందిన రెండస్తుల భవనం బీటలు వారి, కొంత మేర దెబ్బతిన్నది. వీరేంద్రసింగ్ కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ నానక్‌రామ్‌గూడలో భారీ భవంతి కుప్పకూలడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యజమాని గుడుంబా డాన్! నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన భవనం యాజమాని తుల్జారాం సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తూ సింగ్ ఆ ప్రాంతంలో గుడుంబా డాన్ అని తెలిసింది. కూలిన భవనానికి ఎదురుగా సత్తు సింగ్‌కు ఆరు అంతస్తుల మరో భవనం ఉంది. అతను రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో గుడుంబా అక్రమ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. ఇక కూలిపోయిన భవనానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులూ లేవు. గుడుంబా అ క్రమ వ్యాపారం నిర్వహిస్తుండగా కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులపై సత్తూ సింగ్ ఎన్నోసార్లు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. సత్తూసింగ్ కుమారుడు అనిల్‌సింగ్ జీహెచ్ఎంసీ ఎ న్నికల్లో గచ్చిబౌలి కార్పొరేటర్ స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. -
'అక్రమకట్టడం అని ఇటీవలే నోటీస్ ఇచ్చాం'
-
'అక్రమకట్టడం అని ఇటీవలే నోటీస్ ఇచ్చాం'
హైదరాబాద్: నానక్‌రాం గూడలో కుప్పకూలిన భవనానికి సరైన అనుమతులు లేవని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. కూలిన భవనం అక్రమకట్టడం అని ఇటీవలే నోటీసులు కూడా ఇచ్చామని మేయర్ తెలిపారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని..భవన ప్రమాదానికి కారణమైన బిల్డర్ సత్యనారాయణ సింగ్ పై చర్యలు తీసుకుంటామని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. -
బిల్డర్‌పై చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి
హైదరాబాద్: నానక్‌రాం గూడలో భవన ప్రమాదానికి కారణమైన బిల్డర్ సత్యనారాయణ సింగ్ పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. భవనం వెనుక సెల్లార్ కోసం తవ్వకాలు జరిపినందునే ఈ ప్రమాదం జరిగినట్లు హోం మంత్రి తెలిపారు. మరో వైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ మహిళ, చిన్నారిని వెలికి తీసింది. ప్రాణాలతో బయటపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భవన శిథిలాల కింద 12 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. శిథిలాల నుంచి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివ అనే యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. శిథిలాల కింద నుంచి ఆర్తనాదాలు వినిపిస్తుండటంతో పైపుల ద్వారా ప్రాణవాయువును పంపిస్తూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తక్కువ స్థలంలో ఆరు అంతస్థులతోపాటు పెంట్‌హౌస్ నిర్మించిన సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తుసింగ్పై అధికారులను బెదిరించిన ఘటనలకు సంబంధించి పలు పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. -
కుప్పకూలిన భవనం: పెరుగుతున్న మృతుల సంఖ్య
-
ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో రెస్క్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ మహిళ, చిన్నారిని వెలికి తీసింది. ప్రాణాలతో బయటపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు శిథిలాల కింద నుంచి తమను రక్షించాలంటూ క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. బాధితుల్లో బొబ్బిలికి చెందిన వాచ్ మెన్ సాంబయ్య, నేతేటి పైడమ్మ, వెంకటలక్ష్మీ, నారాయణమ్మ, పోలినాయుడు, మోహన్, దుర్గారావు, శంకర్లు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. జేసీబీల ద్వారా శిథిలాలను రెస్క్యూ టీం తొలగిస్తుంది. -
కూలిన బతుకులు
నగరంలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. 16 మంది మృతి చెందినట్లుగా అనుమానం నిర్మాణంలో ఉండగానే భారీ ప్రమాదం భవనంలోనే 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు! వేగంగా కొనసాగుతున్న సహాయక చర్యలు కేవలం 260 గజాల్లోనే ఏడంతస్తుల భవనం లోపభూయిష్టంగా, ఎలాంటి అనుమతులూ లేకుండానే నిర్మాణం భవన యజమాని సత్తూ సింగ్ పెద్ద గుడుంబా డాన్! సాక్షి, హైదరాబాద్ నిర్మాణంలో ఉన్న ఓ ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.. ఆ నిర్మాణంలోనే పనిచేస్తున్న పలువురు కూలీల కుటుంబాలను బలితీసుకుంది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరింత మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. భవన శిథిలాల కింద ఓ మహిళ, ఓ చిన్నారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని సహాయక సిబ్బంది చెబుతున్నారు. వారిని శిథిలాల నుంచి బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టోలిచౌకి ప్రాంతానికి చెందిన తుల్జాపూర్ సత్యనారాయణ సింగ్ ఈ భవనం యజమాని. ఆయన కేవలం 260 గజాల స్థలంలో ఏకంగా జీప్లస్ 6 (ఏడు అంతస్తులు)తో పాటు పైన పెంట్‌హౌస్ కూడా నిర్మిస్తున్నారు. 2015 సెప్టెంబర్ నుంచి ఈ భవన నిర్మాణం కొనసాగుతోందని, నిర్మాణంలోని ఆ భవనంలోనే జిల్లాల నుంచి వచ్చిన 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది. ప్రమాద సమయంలో వారంతా భవనంలోనే ఉన్నారని, కొన్ని కుటుంబాలకు చెందిన చిన్న పిల్లలు కూడా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు చేస్తున్న ఆర్తనాదాలు అక్కడున్న అందరినీ కలచి వేస్తున్నాయి. ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు జేసీబీలు, క్రేన్లతో ప్రయత్నిస్తు న్నారు. భవనం వద్దకు వెళ్లేదారి ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోందని పోలీసులు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ, రాచకొండ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందిం చేందుకు సమీప ఆసుపత్రుల నుంచి అంబులెన్స్‌లను రప్పించారు. ఎందుకు కూలిపోయింది? లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని కొందరు స్థానికులు చెబుతుండగా... ఆ భవనానికి వెనుక మరో భవన నిర్మాణం కోసం బాంబులతో పేల్చి సెల్లార్ గుంత తీస్తుండడమే ప్రమాదానికి కారణమని మరికొందరు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా సత్యనారాయణసింగ్ భవనం కుప్పకూలిపోవడంతో.. ఆ ధాటికి పక్కనే ఉన్న తుల్జాపూర్ వీరేంద్రసింగ్‌కు చెందిన రెండస్తుల భవనం బీటలు వారి, కొంత మేర దెబ్బతిన్నది. వీరేంద్రసింగ్ కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ నానక్‌రామ్‌గూడలో భారీ భవంతి కుప్పకూలడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించుకోవాలని సూచించారు. కారకులపై చర్యలు తీసుకుంటాం ‘‘అనుమతుల్లేని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అయినా కొత్త బిల్డర్లు వచ్చి ఇష్టారాజ్యంగా కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ప్రమాదానికి కారకులైన వారిని వదిలిపెట్టం. అనుమతుల్లేని నిర్మాణా లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు..’’ –బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ మేయర్ తక్షణ వైద్యసాయానికి చర్యలు ‘‘కూలిన భవనంలో చిక్కుకున్న క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందించేందుకు చర్యలు చేపట్టాం. సమీపంలోని ఆసుపత్రులను అప్రమత్తం చేసి అంబులెన్సులు రప్పించాం. వీలైనంతవ రకు ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం..’’ జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ యజమాని గుడుంబా డాన్! నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన భవనం యాజమాని తుల్జారాం సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తూ సింగ్ ఆ ప్రాంతంలో గుడుంబా డాన్ అని తెలిసింది. కూలిన భవనానికి ఎదురుగా సత్తు సింగ్‌కు ఆరు అంతస్తుల మరో భవనం ఉంది. అతను రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో గుడుంబా అక్రమ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. ఇక కూలిపోయిన భవనానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులూ లేవు. గుడుంబా అ క్రమ వ్యాపారం నిర్వహిస్తుండగా కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులపై సత్తూ సింగ్ ఎన్నోసార్లు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. సత్తూసింగ్ కుమారుడు అనిల్‌సింగ్ జీహెచ్ఎంసీ ఎ న్నికల్లో గచ్చిబౌలి కార్పొరేటర్ స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. -
హైదరాబాద్ లో కుప్పకూలిన భవనం
-
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: మేయర్
హైదరాబాద్: నగరంలోని నానక్ రాంగూడాలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలను చేపట్టామని చెప్పారు. బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని, ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్న దానిపై స్పష్టత లేదన్నారు. ఆ భవనం సత్తుసింగ్ అనే వ్యక్తికి చెందినదని అధికారులు భావిస్తున్నారు. వాచ్ మెన్ కుటుంబం, మరో నాలుగు కార్మికుల కుటుంబాలు ఇందులో నివసిస్తున్నాయి. బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కడ ట్రీట్ మెంట్ తీసుకున్నా ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని మేయర్ చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు పర్మిషన్ ఐదు అంతస్తులకు తీసుకుంటే.. కట్టేది మాత్రం అంతకంటే ఎక్కువ అంతస్తులని, అధికారుల కళ్లుగప్పి అక్కడక్కడా ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. ఫిల్మ్ నగర్ సొసైటీలో ఇటీవల ఓ భవనం కూలిన ఘటనపై చర్యలు తీసుకోనందున ఇదే తరహాలో నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిపోతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫిల్మ్ నగర్ సొసైటీ క్లబ్ వారికి ఇప్పటివరకూ మళ్లీ నిర్మాణం చేపట్టేందుకు పర్మిషన్ ఇవ్వలేదని మేయర్ రాంమోమన్ మీడియాకు వివరించారు. -
హైదరాబాద్ లో కుప్పకూలిన భవనం
హైదరాబాద్: నగరంలోని నానక్ రాంగూడాలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. గురువారం రాత్రి దాదాపు10 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిలాల కింద నాలుగు కార్మిక కుటుంబాలు చిక్కుకున్నట్లు సమాచారం. ఆ భవనం సత్తుసింగ్ అనే వ్యక్తికి చెందినదని అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు అంబులెన్సులు కూడా ఘటనాస్ధలికి చేరుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆరో అంతస్తులో ఫ్లోరింగ్ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఎంత మంది చిక్కుకుపోయారన్న దానిపై స్పష్టత లేదు. భవన యజమాని సత్యనారాయణ్ సింగ్(సత్తూ సింగ్) 360 గజాల్లో ఆరు అంతస్తులతో పాటు పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే రెండు అంతస్తులను సత్యనారాయణ అద్దెకు ఇచ్చారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండీ -
హైదరాబాద్ కు వస్తున్న యాపిల్ సీఈవో
హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఈ నెల19న హైదరాబాద్ కు రానున్నారు. ఎల్లుండి(గురువారం) ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ తో భేటీ కానున్నారు. నానక్ రాంగూడలోని వేవ్ రాక్ బిల్డింగ్ లో జరిగే కార్యక్రమంలో యాపిల్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. యాపిల్ అభివృద్ధి కేంద్రాన్ని టిమ్ కుక్ ప్రారంభించనున్నారు. అయితే ఆయన వస్తారని కచ్చితంగా చెప్పలేమని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. కొన్ని అనుమతుల కోసం యాపిల్ సంస్థకు చెందిన ప్రతినిధులు గతంలో తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిశారని వెల్లడించారు. యాపిల్ అభివృద్ధి కేంద్రానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. అయితే ఎంత పెట్టుడులు పెడుతుందనేది ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న టిమ్ కుక్ ఈ రోజు రాత్రి ముంబై చేరుకుంటారు. ముంబై తాజ్ ప్యాలెస్ లో బస చేస్తారు. 20, 21 తేదీల్లో ఢిల్లీలో పర్యటిస్తారు. ఈనెల 21 ప్రధాని నరేంద్ర మోదీతో టిమ్ కుక్ సమావేశమవుతారు. బెంగళూరుకు కూడా ఆయన వెళ్లే అవకాశముందని సమాచారం. -
మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్ : ప్రేమ వ్యవహారంలో విబేధాల కారణంగా ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రీతి(26) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ నగరంలోని ఒక బహుళ జాతి సంస్థలో నాలుగు నెలల క్రితం జాయినయింది. ఆమె ప్రస్తుతం నానక్‌రాం గూడలోని సెరెనిటీ అపార్టుమెంట్లో ఉంటోంది. కాగా ఆమె స్నేహితుడితో ప్రేమ వ్యవహారంలో విఫలమైనట్లు సమాచారం. ఇదే విషయంలో ఆమె, అతడు గురువారం అర్థరాత్రి వరకు ఫోన్లో మెసేజ్‌లు పంపుకున్నారు. తెల్లవారుజామున సమయంలో తన అపార్టుమెంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శుక్రవారం ఉదయం చుట్టుపక్కలవారు తెలుసుకుని స్థానికంగా అయ్యప్ప సొసైటీ కాలనీలో ఉంటున్న ఆమె సోదరుడికి సమాచారం అందించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.