
సాక్షి, హైదరాబాద్: నానక్‌రామ్ గూడలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకే సిలిండర్‌కు మూడు కనెక్షన్స్ పెట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఒక కనెక్షన్‌లో గ్యాస్ లీకేజీ కావడంతో.. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో లైట్స్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంగా యూపీ, బీహార్‌కు చెందినవారు. పొట్టకూటి కోసం నగరానికి వచ్చి పనులు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment