
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగర రియల్టీ రంగంలో అతిపెద్ద డీల్ నమోదైంది. నానక్‌రామ్‌గూడలోని ఐటీ సెజ్ వేవ్‌రాక్‌ను టిష్‌మన్ స్పేయర్, జీఐసీల నుంచి షాపూర్‌జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఫండ్ (ఎస్‌పీఆర్‌ఈఎఫ్ 2) కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ.1,800 కోట్లు. 12 ఎకరాల్లో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేవ్‌రాక్ విస్తరించింది. ఆపిల్, డీబీఎస్, డ్యూపాంట్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. అలియాంజ్, షాపూర్‌జీ పల్లోంజీల జేవీయే ఎస్‌పీఆర్‌ఈఎఫ్–2. విక్రేతల తరఫున జేఎల్‌ఎల్ మధ్యవర్తిగా వ్యవహరించింది.