wave rock
-
ఐటీ కారిడార్లలో వజ్ర పరుగులు.. చార్జీలు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలో వజ్ర ఏసీ బస్సులు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. గతంలో హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ తదితర దూర ప్రాంతాలకు నడిచిన ఈ బస్సులను నగరంలో నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్యాబ్‌లకు ఎక్కువగా డిమాండ్ ఉండే హైటెక్ సిటీ, ఐటీ కారిడార్లలో వీటిని నడుపుతున్నారు. ఐటీ దిగ్గజ సంస్థల్లో పనిచేసే సాఫ్ట్వేర్ నిపుణులు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఆయా సంస్థల నుంచి సమీపంలోని మెట్రో స్టేషన్లకు, ప్రధాన ప్రాంతాలకు చేరుకొనేలా ఇవి అందుబాటులో ఉంటాయి. సుమారు 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు.. ► సాధారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు సుమారు 1,500 బస్సులు ఐటీ పారిశ్రామిక ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్లకు ప్రయాణం చేస్తారు. కోవిడ్ కారణంగా ఐటీ సంస్థలను మూసివేసి వర్క్‌ఫ్రమ్ హోమ్ ప్రకటించడంతో ఈ మార్గంలో ప్రజా రవాణా కూడా స్తంభించింది. (క్లిక్: జూన్‌లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం) ► కొంతకాలంగా కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఐటీ సంస్థల కార్యకలాపాలను పునరుద్ధరించారు. రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో క్యాబ్‌లు, ఆటోలు తదితర ప్రైవేట్ వాహనాల నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ ప్రస్తుతం వజ్ర మినీ ఏసీ బస్సులను ఈ మార్గంలో నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రయాణికులకు అనుగుణంగా.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మెట్రో, ఇతర మార్గాల్లో జేఎన్టీయూకు చేరుకొనే ప్రయాణికులు అక్కడి నుంచి వేవ్‌రాక్ వరకు వెళ్లేందుకు అనుగుణంగా వజ్ర బస్సులు ఉంటాయి. సైబర్టవర్స్, మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, డీఎల్ఎఫ్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసీఐసీఐ, అమెజాన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని పలు ప్రాంతాలకు తక్కువ చార్జీలతో ప్రయాణం చేయవచ్చు. (క్లిక్: ఇకపై ఆ లైసెన్సుల జారీ కఠినతరం) బస్సుల వేళలు.. జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ వరకు.. ఉదయం 8, 8.30, 9.50, 10.20, సాయంత్రం 4.25, 4.55, 6.15, 6.45 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. వేవ్‌రాక్ నుంచి జేఎన్టీయూ వరకు... ఉదయం 8.50, 9.20, సాయంత్రం 3.35, 4.05, 5.25, 5.55 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. చార్జీలు జేఎన్టీయూ నుంచి మైండ్‌స్పేస్‌కు రూ.20, జేఎన్టీయూ నుంచి వేవ్‌రాక్‌కు రూ.40, మైండ్‌స్పేస్ నుంచి వేవ్‌రాక్‌కు రూ.20. వీకెండ్లో సమతామూర్తి వద్దకు సిటీబస్సులు ఓ నెటిజన్ విజ్ఞప్తికి స్పందించిన ఆర్టీసీ ఎండీ ముచ్చింతల్‌లోని కొలువైన సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్ సిటీ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవని, క్యాబ్‌లో వెళ్లేందుకు రూ.1000 వరకు ఖర్చవుతుందని ఓ నెటిజన్ ట్విట్టర్లో ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. ‘ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు’ అంటూ అభినందించారు. -
షాపూర్జీ–అలియాంజ్ చేతికి వేవ్‌రాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగర రియల్టీ రంగంలో అతిపెద్ద డీల్ నమోదైంది. నానక్‌రామ్‌గూడలోని ఐటీ సెజ్ వేవ్రాక్ను టిష్మన్ స్పేయర్, జీఐసీల నుంచి షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఫండ్ (ఎస్పీఆర్ఈఎఫ్ 2) కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ.1,800 కోట్లు. 12 ఎకరాల్లో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేవ్‌రాక్ విస్తరించింది. ఆపిల్, డీబీఎస్, డ్యూపాంట్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. అలియాంజ్, షాపూర్జీ పల్లోంజీల జేవీయే ఎస్పీఆర్ఈఎఫ్–2. విక్రేతల తరఫున జేఎల్ఎల్ మధ్యవర్తిగా వ్యవహరించింది. -
ప్రపంచంలో మేలైన పారిశ్రామిక విధానం
* పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధి చెందండి * యాపిల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో మేలైన వస్తూత్పత్తి సంస్థగా యాపిల్ కంపెనీ పేరొందినట్లే... పారిశ్రామిక విధానానికి తెలంగాణ రాష్ట్రం ప్రఖ్యాతి గాంచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ పురోభివృద్ధిలో పాలుపంచుకునేందుకు యాపిల్ ముందు కొచ్చినందుకు హర్షం వెలిబుచ్చారు. ‘‘హైదరాబాద్ విశ్వనగరంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులతో ముందుకురావటం ఆనందకరం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత స్థాయి పారిశ్రామిక విధానాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారులకు ఏ మాత్రం ఇబ్బందులు కలుగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు. ‘తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, కలసికట్టుగా అభివృద్ధి చెందేందుకు దోహదపడండి..’ అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని వేవ్‌రాక్‌లో యాపిల్ సంస్థ మ్యాప్స్ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో పాటు ఆయన బృందంతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. ఆటంకాలేమీ లేకుండా, నిర్ణీత సమయంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన విధానాలను తాము అమలుపరుస్తున్నామన్నారు. ఆ దిశగా ఇప్పటికే తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దేశ విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగిస్తున్నాయని చెప్పారు. ‘‘ప్రపంచ ఐటీ రంగ దిగ్గజాలైన ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను స్థాపించుకున్నాయి. వాటికి యాపిల్ తోడవడం తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశ, దశ ప్రపంచ దిగ్గజమైన యాపిల్ సీఈవో టిమ్ కుక్ రాకతో రూఢీ అయ్యాయి. ఆయనకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నామని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను’’ అని సీఎం అన్నారు. యాపిల్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టిమ్‌కుక్ ఆనందంతో సీఎం కేసీఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఐటీ మంత్రి కె.తారకరామారావు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించారు. ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, యాపిల్ సంస్థ అధికారులు, డిజిటల్ మీడియా డెరైక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, యాపిల్ సీఈవో టీమ్ కుక్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్నటి దాకా ఐటీ మంత్రి కేటీఆర్ లేవనెత్తిన సస్పెన్స్‌కు టిమ్ కుక్ రాకతో తెరపడిందని ఈ సందర్భంగా సీఎం చమత్కరించారు. -
కేటీఆర్ రేర్ సెల్ఫీ ఏంటో తెలుసా?
హైదరాబాద్ : తెలంగాణా ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు చివరికి ఆ బిగ్ న్యూస్ ను రివీల్ చేశారు. గురువారం నాడు ఒక బిగ్ న్యూస్ చెబుతానని, అది అప్పటివరకు సస్పెన్స్ అంటూ ఊరించిన మంత్రి భాగ్యనగరంలో యాపిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభంకావడమే బిగ్ న్యూస్ అని తేల్చేశారు. హైదరాబాద్ లో యాపిల్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభం కావడం పట్ల ఐటీ శాఖా మంత్రి ఆనందంలోమునిగి తేలుతున్నారు. భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్‌కుక్ గురువారం హైదరాబాద్ లోని వేవ్ రాక్ భవనంలో టెక్ సెంటర్ ను ప్రారంభించగా, మంత్రి కేటీర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కేటీఆర్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి, తండ్రి, కేసీఆర్ సహా, టిమ్ కుక్ తో తీసుకున్న అరుదైన సెల్ఫీని మంత్రి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఫ్రెంజీ ఔట్ సైడ్ వేవ్ రాక్ అంటూ మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతోపాటు యాపిల్ సంస్థ ఎంబ్లమ్ 'యాపిల్' ను తమ పార్టీ గులాబీ రంగుతో పూర్తిగా నింపేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. అమెరికా తరువాత అతి పెద్ద డెపలప్ మెట్ సెంటర్ కు హైదరాబాద్ వేదిక అయిందని ట్విట్ చేశారు. గత ఏడాది మేనెలలో గూగుల్ వస్తే.. ఇపుడు యాపిల్ హైదరాబాద్ కు తరలి వచ్చిందని కమెంట్ చేశారు. ప్రపంచంలో అతి విలువైన దిగ్గజ టెక్ కంపెనీలు అయిందింటిలో యాపిల్ తో కలిపి నాలుగు కంపెనీలు( గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్) కార్యాలయాను స్థాపించడం విశేషమని, ఇది హైదరాబాద్ కు గర్వకారణమని కేటీర్ అన్నారు. కాగా యాపిల్ ప్రాభవాన్ని తిరిగి పునరుద్ధరించే చర్యలో భాగంగా టిమ్ కుమ్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత ఆయన ఈ ఉదయం భాగ్యనగరం చేరుకున్నారు. యాపిల్ సంస్థతో ప్రభుత్వంఎంవోయూ కుదుర్చుకున్న తరువాత గురువారం మీకో పెద్ద వార్త చెబుతా అని ట్వీట్ చేయడంతో ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే.