Shapoorji Pallonji Group
-
ఐపీఓ ద్వారా రూ. 5,430 కోట్ల సమీకరణ
ముంబై: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి రూ. 440–463 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 4,180 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ గోస్వామి ఇన్ఫ్రాటెక్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 32 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 600 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 320 కోట్లు దీర్ఘకాలిక మూలధన అవసరాలకు, మరో రూ. 80 కోట్లు కన్స్ట్రక్షన్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది.కంపెనీ ప్రధానంగా ఐదు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఇవి.. మెరైన్ అండ్ ఇండస్ట్రియల్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైడ్రో, అండర్‌గ్రౌండ్, ఆయిల్ అండ్ గ్యాస్. 2024 జూన్ 30కల్లా కంపెనీ ఆర్డర్‌బుక్ విలువ రూ. 31,747 కోట్లకు చేరింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 3,154 కోట్ల ఆదాయం, దాదాపు రూ. 92 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో సైరస్ మిస్త్రీ కుమారులు
ముంబై : ఫోర్బ్స్ ఈ ఏడాది బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. అందులో 25 మంది అతిచిన్న వయస్సుల్లో బిలియనీర్లు ఉన్నారు. వారి మొత్తం సంపద 110 బిలియన్ డాలర్లు కాగా వారి వయస్సు 33 అంతకంటే తక్కువగా ఉందని ఫోర్బ్స్ తెలిపింది. 30 ఏళ్లలోపు యువ భారతీయ బిలియనీర్లలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కుమారులు జహాన్, ఫిరోజ్ ముందంజలో ఉన్నారు. వారిద్దరి సంపద 9.8 బిలియన్లుగా ఉంది. జహాన్ మిస్త్రీ 2022లో కారు ప్రమాదంలో తండ్రి సైరస్ మిస్త్రీ మరణించిన తర్వాత జహాన్ తన కుటుంబ సంపదలో కొంత భాగాన్ని వారసత్వంగా పొందారు. ఇందులో టాటా సన్స్‌లో వాటా 18.4శాతం, ముంబై నిర్మాణ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో జహాన్ 25 శాతం వాటా ఉంది. ఐర్లాండ్‌లో పౌరసత్వం కలిగిన జహాన్ మిస్త్రీ తన తండ్రి సైరస్ మిస్త్రీ మరణం తర్వాత ముంబైలో నివసిస్తున్నారు. ఫిరోజ్ మిస్త్రీ ఫిరోజ్ మిస్త్రీ (27) దివంగత సైరస్ మిస్త్రీకి పెద్ద కుమారుడు. కుటుంబ వారసత్వంగా టాటా సన్స్‌లో 18.4శాతం వాటాను, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో 25శాతం వాటాను దక్కించుకున్నారు. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఐపీఓకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఫిరోజ్ మిస్త్రీ యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో చదువుకున్నారు. ఐరిష్ పౌరసత్వం ఉన్నప్పటికీ అతను ముంబైలో నివసిస్తున్నారు. -
ఫోర్బ్స్ టూల్స్ బిజినెస్ విడదీత
న్యూఢిల్లీ: ప్రెసిషన్ టూల్స్ బిజినెస్‌ను విడదీయనున్నట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఫోర్బ్స్ అండ్ కంపెనీ(ఎఫ్‌సీఎల్) తాజాగా వెల్లడించింది. ఫోర్బ్స్ ప్రెసిషన్ టూల్స్ అండ్ మెషీన్ పార్ట్స్ లిమిటెడ్(ఎఫ్‌పీటీఎల్) పేరుతో కొత్త కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సోమవారం సమావేశమైన బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఎఫ్‌సీఎల్ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ షేరుకి మరో ఎఫ్‌పీటీఎల్ షేరుని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. వీటిని బీఎస్ఈలో లిస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. గతేడాది(2021–22) ఈ విభాగం రూ. 179 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్లు తెలియజేసింది. సంబంధిత విభాగంపై మరింత దృష్టి సారించడంతోపాటు వాటాదారులకు విలువ చేకూర్చే బాటలో తాజా ప్రణాళికకు తెరతీసినట్లు వివరించింది. కాగా.. ఇండస్ట్రియల్ ఆటోమేషన్, కోడింగ్ మెడికల్ పరికరాలు, విడిభాగాలు, అప్లికేషన్లు, వెంటిలేటర్లు, రియల్టీ తదితర వివిధ బిజినెస్‌లను షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే. -
సైరస్ మిస్త్రీ మరణం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ బాధ్యతలు ఎవరు చూసుకుంటారంటే!
157ఏళ్ల చరిత్ర, మల్టీ బిలియన్ డాలర్ల సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మూగబోయింది. ఆ గ్రూప్ ఛైర్మన్‌గా వ్యవహరించిన షాపూర్జీ పల్లోంజీ ఈ ఏడాది జూన్ 28న మరణించగా, ఇప్పుడు సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో కన్ను మూయడం వ్యాపార సామ్రాజ్యానికి తీరని లోటుని మిగిల్చాయి. అయితే ఇప్పుడు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనేది చర్చాంశనీయంగా మారగా..సైరస్ మిస్త్రీ అతని పిల్లలు, సోదరుడే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సైరస్ మిస్త్రీ, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది చదవండి: సైరస్ మిస్త్రీ హఠాన్మరణం: ఆనంద్ మహీంద్ర భావోద్వేగం ►1865లో సైరస్ మిస్త్రీ ముత్తాత పల్లోంజి మిస్త్రీ..లిటిల్‌వుడ్ పల్లోంజీ అండ్ కో సంస్థను స్థాపించారు. ఆ తర్వాతి కాలంలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌గా మారింది. ►సుమారు 30 బిలియన్ డాలర్ల నికర సంపద కలిగిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు.. టాటా గ్రూప్‌లో 18.6శాతం వాటాలున్నాయి. ►బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 2022లో షాపూర్జీ గ్రూప్ దాదాపు 30 బిలియన్ల నికర విలువను కలిగి ఉంది. ►2016 అక్టోబర్‌లో జరిగిన బోర్డ్ మీటింగ్‌లో టాటా గ్రూప్..సైరస్ మిస్త్రీని ఛైర్మన్‌గా తొలగించింది. ఆ నిర్ణయంతో భారత దేశ చరిత్రలో కార్పొరేట్ దిగ్గజ సంస్థల మధ్య వైరం మొదలైంది. ►సైరస్ మిస్త్రీ పర్యవేక్షణలో, టాటా గ్రూప్‌కు చెందిన టాప్-20 లిస్టెడ్ గ్రూప్ కంపెనీల వార్షిక వృద్ధి రేటు 12.5 శాతం పెరిగింది. ►టాటా గ్రూప్ మొత్తం నికర లాభం 42.3 శాతంతో వృద్ది చెందింది. సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ ఛైర్మన్‌గా విధులు నిర్వహించే సమయంలో కార్యకలాపాల్ని సమర్ధవంతంగా నిర్వహించారు. అతి తక్కువ కాలంలో 100 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించింది. ►షాపూర్జీ పల్లోంజీ గ్రూప్.. నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్యూమర్ గూడ్స్, సోలార్ పవర్, ఇంజనీరింగ్ అండ్ కన్ స్ట్రక్షన్లో కార్యకాలాపాల్ని నిర్వహించింది. ► 50 కంటే ఎక్కువ దేశాలలో 50వేల మందికి పైగా ఉద్యోగులు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో పనిచేస్తున్నారు. ►సైరస్ మిస్త్రీ 2012 డిసెంబర్లో టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా నియమితులైనప్పటి నుండి.. సైరస్ తన అన్నయ్య షాపూర్ మిస్త్రీకి కుటుంబ వ్యాపార కార్యకలాపాల బాధ్యతల్ని నిర్వహించారు. ►2019 చివరి కాలంలో షాపూర్జీ గ్రూప్ నిర్వహణ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. షాపూర్ కుమారుడు పల్లోన్ (26) గ్రూప్ హోల్డింగ్ కంపెనీ బోర్డులో చేర్చారు. కుమార్తె తాన్య గ్రూప్ కార్పొరేట్ బాధ్యల్ని నిర్వహిస్తున్నారు. -
Cyrus Mistry: గౌరవం కోసం పోరాటం..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీనితో, కొన్నాళ్ల క్రితమే టాటా గ్రూప్ నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీ తాజాగా జీవితం నుంచి కూడా అర్ధాంతరంగా నిష్క్రమించినట్లయింది. టాటా సన్స్‌లో అత్యధికంగా 18 శాతం పైగా వాటాలున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తరఫున 2012లో టాటా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టే వరకూ.. కుటుంబ వ్యాపార వర్గాల్లో తప్ప సైరస్ మిస్త్రీ పేరు పెద్దగా బైట వినిపించేది కాదు. 1991లో మిస్త్రీ తమ కుటుంబ వ్యాపార సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో (ఎస్పీ) డైరెక్టరుగా చేరారు. 1994లో ఎండీగా నియమితులయ్యారు. ఎస్పీ గ్రూప్ కార్యకలాపాలు మెరైన్, ఆయిల్, గ్యాస్, రైల్వే తదితర రంగాల్లోకి విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2006లో కీలకమైన టాటా సన్స్ బోర్డులో చేరారు. అప్పటివరకూ ఆయన పలు టాటా కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగారు. సాధారణంగా నలుగురిలో ఎక్కువగా కలవకపోయినా.. తెలిసినంత వరకూ వ్యాపార దక్షత విషయంలో ఆయనకు మంచి పేరు ఉండేది. ఇదే టాటా గ్రూప్ చీఫ్ రతన్ టాటా తన వారసుడిగా మిస్త్రీని ఎంచుకునేలా చేసింది. వాస్తవానికి టాటా పగ్గాలు చేపట్టడానికి మిస్త్రీకి ఇష్టం లేకపోయినప్పటికీ రతన్ టాటా స్వయంగా నచ్చచెప్పడంతో ఆయన అంగీకరించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతాయి. అలా 44 ఏళ్ల వయస్సులో, దేశంలోనే అతి పెద్ద దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూప్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న మిస్త్రీ సంస్థను కొత్త బాటలో నడిపించే ప్రయత్నం చేశారు. టాటాల కుటుంబానికి చెందిన వారు కాకుండా వేరొకరు టాటా గ్రూప్‌నకు సారథ్యం వహించడం అదే ప్రథమం. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను మెరుగుపర్చడంపై ఆయన దృష్టి పెట్టారు. నష్టాల్లో ఉన్న సంస్థలను, ఉత్పత్తులను నిలిపివేసి.. లాభదాయక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటివరకూ ఎక్కువగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ)కి పరిమితంగా ఉంటున్న సంస్థ .. మరింతగా వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులు, సేవలవైపు మళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం తగు సిఫార్సులు చేసేందుకు టాటా గ్రూప్‌లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలతో ఒక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను (జీఈసీ) ఏర్పాటు చేశారు. టాటాతో విభేదాలు.. ఉద్వాసన .. అయితే, ఈ క్రమంలో వ్యాపార వ్యవహార శైలి విషయంలో మిస్త్రీ, రతన్ టాటాల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి 2016 అక్టోబర్‌లో ఆయన అర్ధాంతరంగా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆ తర్వాత టాటా సన్స్ డైరెక్టరుగా కూడా ఆయన్ను తప్పించారు. మిస్త్రీ కుటుంబం అతి పెద్ద వాటాదారే అయినప్పటికీ సైరస్ తన పదవిని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్ చంద్రశేఖర్ (టీసీఎస్ చీఫ్) .. గ్రూప్ పగ్గాలు అందుకున్నారు. న్యాయస్థానాల్లో చుక్కెదురు.. అవమానకరంగా తనను పంపించిన తీరుపై మిస్త్రీ న్యాయపోరుకు దిగారు. స్వయంగా టాటాపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘అహంభావంతో ఒక్కరు’’ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో గ్రూప్ వ్యాపారానికి నష్టం జరుగుతోందని, టాటా వాస్తవాలు మాట్లాడటం లేదని ఆరోపించారు. తనను తొలగించడంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించారు. అంతకు కొన్నాళ్ల క్రితమే తన పనితీరు అద్భుతమని ప్రశంసించి, అంతలోనే అలా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో బాంబే డయింగ్ చీఫ్ నుస్లీ వాడియా, ఆయన చిన్ననాటి స్నేహితురాలు.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తదితరులు ఆయన పక్షాన నిల్చారు. అయితే, బోర్డు, మెజారిటీ వాటాదారులు ఆయనపై విశ్వాసం కోల్పోయారంటూ ఎన్సీఎల్టీ 2018లో మిస్త్రీ పిటీషన్‌ను తోసిపుచ్చింది. దీనిపై ఆయన నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కానీ దీనిపై టాటాలు సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా 2021 మార్చిలో ఇచ్చిన తుది తీర్పులో.. అత్యున్నత న్యాయస్థానం టాటాల పక్షం వహించింది. అయితే, అంతకు ముందు తీర్పులో ఆయనపై చేసిన కొన్ని ప్రతికూల వ్యాఖ్యలను తొలగించడం ద్వారా కొంత ఊరటనిచ్చింది. -
బిజినెస్ టైకూన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
సాక్షి, ముంబై: బిజినెస్ టైకూన్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93) కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. 18.4 శాతం వాటాతో టాటా గ్రూప్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా ఉన్నారు పల్లోంజీ. 1929లో జన్మించిన మిస్త్రీ లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించారు. అంతకుముందు ముంబైలోని కేథడ్రల్ & జాన్ కానన్ స్కూల్లో చదువుకున్నారు. కేవలం18 సంవత్సరాల వయస్సులో కరియర్‌ను స్టార్ట్ చేసిన ఆయన క్రమంగా బడా పారిశ్రామికవేత్తగా రాణించారు. 28.90 బిలియన్ డాలర్లతో పల్లోంజీ మిస్త్రీ బిలియనీర్‌గా ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం భారతదేశంలో 5వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. పార్సీ కుటుంబంలో జన్మించిన షాపూర్జీ 2003లో వివాహం ద్వారా ఐరిష్ పౌరసత్వాన్ని పొందారు. వాణిజ్య రంగంలో చేసిన విశేష సేవలకుగాను 2016లో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మభూషణ్ అందుకున్నారు. 1865లో స్థాపితమై ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో వ్యాపారాలను నిర్వహిస్తోంది పల్లోంజీ గ్రూపు. ముంబైకి చెందిన 156 ఏళ్ల ఈ గ్రూప్ ఇప్పుడు ఆఫ్రికా, ఇండియా, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియాలో నిర్మాణ వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాగా పల్లోంజీ మిస్త్రీకి ఇద్దరు కుమారులు షాపూర్ మిస్త్రీ, సైరస్ మిస్త్రీ, ఇద్దరు కుమార్తెలు లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ ఉన్నారు. సైరస్ మిస్త్రీ 2012 నుండి 2016 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా పనిచేశారు. అయితే 2016 అక్టోబర్‌లో మిస్త్రీ చిన్న కుమారుడు సైరస్ను టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించడంతో టాటా, మిస్త్రీల మధ్య వివాదం రగిలిన సంగతి తెలిసిందే. -
టాటా గ్రూప్ నుంచి ఇలా విడిపోతాం..!
సాక్షి, ముంబై: టాటా గ్రూప్‌తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంబంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు షాపూర్జీ పలోంజీ (ఎస్పీ) గ్రూప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. టాటా గ్రూప్‌లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని బోర్డ్ తొలగించిన 2016 అక్టోబర్ 28 తర్వాత మిస్త్రీలు-టాటాల మధ్య న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి సంగతి తెలిసిందే. ‘‘టాటా సన్స్ అనేది రెండు గ్రూపులు కలిసిన కంపెనీ. టాటా గ్రూప్‌లో టాటా ట్రస్టులు, టాటా కుటుంబ సభ్యులు, టాటా కంపెనీలు ఉన్నాయి. వీరికి 81.6 శాతం వాటా ఉంది. ఇక 18.37 శాతం వాటా మిస్త్రీల కుటుంబానికి ఉంది’’ అని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసినట్లు షాపూర్జీ పలోంజీ గ్రూప్ ప్రకటన పేర్కొంది. (టాటా గ్రూపునకు ఎస్పీ గ్రూప్ టాటా) ప్రకటన ప్రకారం... విడిపోవడానికి సంబంధించిన ప్రణాళిక ఇలా: ప్రో-రేటా స్ప్లిట్ ఆఫ్ లిస్టెడ్ అసెట్స్ (షేర్ ధరల విలువ ప్రాతిపదిక) ప్రో-రేటా షేర్ ఆఫ్ ఆఫ్ ది బ్రాండ్ (ఇప్పటికే టాటాలు పబ్లిష్ చేసిన బ్రాండ్ విలువ ప్రాతిపదికన) నికర రుణాలు సర్దుబాటు చేసిన అన్‌లిస్టెడ్ అసెట్స్‌కు సంబంధించి తటస్థంగా ఉండే థర్డ్ పార్టీ వ్యాల్యూషన్ ప్రకారం... టాటా సన్స్ ప్రస్తుతం వాటా కలిగిన లిస్టయిన టాటా సంస్థల్లో ప్రో–రేటా షేర్ల ప్రాతిపదికన నాన్-క్యాష్ సెటిల్మెంట్ జరగాలని ఎస్పీ గ్రూప్ కోరుతోంది. ఉదాహరణకు టీసీఎస్‌లో టాటాలకు 72 శాతం వాటా ఉంటే (టాటా సన్స్‌లో 18.37 శాతం ఎస్పీ గ్రూప్ యాజమాన్యం ప్రాతిపతికన) ఇందులో 13.22 శాతం ఎస్పీ గ్రూప్‌కు దక్కాల్సి ఉంటుంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.1,35,000 కోట్లు. నికర రుణానికి సంబంధించి సర్దుబాటు చేసిన బ్రాండ్ వ్యాల్యూ ప్రో–రేటా షేర్‌ను నగదు లేదా లిస్టెడ్ సెక్యూరిటీల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అన్‌లిస్టెడ్ కంపెనీల విషయానికి వస్తే, ఇరు పార్టీలకూ సమ్మతమైన వ్యాల్యూయేటర్లు వీటి విలువను నిర్ధారిస్తారు. దీనిని కూడా నగదు లేదా లిస్టెడ్ సెక్యూరిటీల ద్వారా పరిష్కరించుకోవచ్చు. -
టాటా గ్రూపునకు ఎస్పీ గ్రూప్ టాటా
సాక్షి, ముంబై: టాటా సన్స్, సైరస్ మిస్త్రీ మధ్య రగిలిన కార్పొరేట్ వార్ మరింత ముదిరి తమ బంధానికి వీడ్కోలు పలకడానికే టాటా గ్రూపు షాపూర్జీ పల్లొంజీ కంపెనీలు సిద్దమయ్యాయి. దీంతో రెండు కార్పొరేట్ దిగ్గజాల మధ్య ఏడు దశాబ్దాల బంధానికి త్వరలో తరపడనుంది. బిలియనీర్ మిస్త్రీ కుటుంబానికి చెందిన ఎస్పీ గ్రూప్ టాటా సన్స్ వాటాలను విక్రయించి నిధులను సమీకరించాలని భావించింది. ఈ మేరకు పల్లోంజీ గ్రూపు సుప్రీంలో అఫడివిట్ దాఖలు చేసింది. అయితే టాటా సన్స్ దీనిపై అభ్యంతరం చెప్పడంతో వాటాలను తాకట్టు పెట్టడం లేదా అమ్మకంపై స్టేటస్ కో ఇచ్చింది. దీనిపై అక్టోబర్ 28 న తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీం కోరింది. దీంతో అసలు పూర్తిగానే కంపెనీనుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది షాపూర్జీ పల్లొంజీ ప్రమోటర్స్ మిస్త్రీ కుటుంబం. అయితే ఇందుకు న్యాయమైన, సహేతుకమైన పరిష్కారం కావాలని ప్రకటించింది. పల్లోంజీ వాటా కొనుగోలు చేస్తామని టాటా సన్స్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే తాము టాటా గ్రూపునుంచి బయటకు రావాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. టాటా సన్స్ లో లిస్టెడ్ కంపెనీలు నష్టాలు, ఆయా కంపెనీల్లో షేర్ హోల్డర్స్ ప్రయోజనాలు కాపాడేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్పీ గ్రూపు తెలిపింది. టాటా గ్రూప్ కంపెనీలలో గత మూడేళ్లలో సుమారు 11,000 కోట్లుకు పెరిగాయని పేర్కొంది. అయితే టాటా గ్రూపు దీన్ని అడ్డుకోవడాన్ని కంపెనీ తప్పుబట్టింది. 70 ఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య నమ్మకం, స్నేహం, పరస్పర అవగాహనతో వ్యాపారబంధం కొనసాగినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కావడం లేదని తెలిపింది. బరువైన మనసుతో బయటకు రావాల్సి వస్తుందని షాపూర్జీ పల్లోంజీ వ్యాఖ్యానించింది. దేశంలోనే అతిపెద్ద గ్రూపు టాటా సన్స్ లో మిస్త్రీ కుటుంబం 18.37 శాతం వాటాతో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఉంది. తన వాటాకు 1.78 ట్రిలియన్ల రూపాయలు ఎస్పీ గ్రూప్ అంచనా వేస్తోంది. అయితే ఎస్పీ వాటాలను ఎంతకు కొనుగోలు చేసేదీ, సమయ పరిధి టాటా ప్రకటించలేదు. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయనీ, ఇది కీలక అడుగు అని సీనియర్ కార్పొరేట్ న్యాయవాది ఎస్ పి రనినా అన్నారు. కాగా అక్టోబర్, 2016లో టాటా సన్స్ ఛైర్మన్ పదవినుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తరువాత వివాదం రగిలింది. టాటా గ్రూప్, మిస్త్రీల మధ్య న్యాయ పోరు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా మిస్త్రీ కుటుంబం నిధులు సేకరించే పనిలో ఉంది. అంతేకాకుండా తన లిస్టెడ్ కంపెనీకి ఎస్ అండ్ డబ్ల్యూ సోలార్ నుంచి రుణాలపై బకాయి పడింది. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత ఆస్తుల అమ్మకానికి సిద్ధపడుతోంది. -
షాపూర్జీ–అలియాంజ్ చేతికి వేవ్‌రాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగర రియల్టీ రంగంలో అతిపెద్ద డీల్ నమోదైంది. నానక్‌రామ్‌గూడలోని ఐటీ సెజ్ వేవ్రాక్ను టిష్మన్ స్పేయర్, జీఐసీల నుంచి షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఫండ్ (ఎస్పీఆర్ఈఎఫ్ 2) కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ.1,800 కోట్లు. 12 ఎకరాల్లో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేవ్‌రాక్ విస్తరించింది. ఆపిల్, డీబీఎస్, డ్యూపాంట్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. అలియాంజ్, షాపూర్జీ పల్లోంజీల జేవీయే ఎస్పీఆర్ఈఎఫ్–2. విక్రేతల తరఫున జేఎల్ఎల్ మధ్యవర్తిగా వ్యవహరించింది. -
టాటా గ్రూప్ నిర్ణయం: మిస్త్రీతో పూర్తిగా కటీఫ్
న్యూఢిల్లీ : కొత్త చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో టాటా గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారు అయిన షాపూర్జి పల్లోంజి గ్రూప్‌తో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. ఈ గ్రూప్‌ను టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ కుటుంబం ప్రమోట్ చేస్తోంది. దీంతో సైరస్ మిస్త్రీ కుటుంబానికి చెందిన అన్ని సంస్థలతో ఉన్న డీలింగ్స్‌కు చెక్ పెట్టాలని నిర్ణయిస్తోంది. టాటా సన్స్ బోర్డు, టాటా గ్రూప్‌లోని మేజర్ ఆపరేటింగ్ సంస్థల ప్రమోటర్ గత నెలలో సమావేశమయ్యాయని, ఈ మీటింగ్‌లో షాపూర్జి పల్లోంజి గ్రూప్‌తో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని సంస్థలను ఆదేశించినట్టు టాటా గ్రూప్ ఇన్సైడర్స్ తెలిపారు. టాటా సన్స్ చైర్మన్‌గా ఉన్న సైరస్ మిస్త్రీకి, గతేడాది బోర్డు సభ్యులు అర్థాంతరంగా ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఈ హఠాత్తు పరిణామం అనంతరం నుంచి టాటా సన్స్‌కు, మిస్త్రీకి వాదనలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టాటా గ్రూప్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 18.4 శాతం వాటాతో టాటా సన్స్‌లో షాపూర్జి పల్లోంజి గ్రూప్ అతిపెద్ద సింగిల్ వాటాదారునిగా ఉంది. అయితే మిస్త్రీ టాటా సన్స్‌కు చైర్మన్‌గా ఉన్నప్పుడు తమకెళ్లాంటి కొత్త ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టులు దక్కలేదని ఎస్పీ గ్రూప్ చెబుతోంది. 2012-13లో రూ.1,125 కోట్లగా ఉన్న టాటా గ్రూప్‌నుంచి తమకి వచ్చిన ఆర్డర్లు, 2015-16 నాటికి జీరోకి పడిపోయాయని పేర్కొంది. మిస్త్రీకి, టాటా గ్రూప్‌కు నెలకొన్న యుద్ధం, ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.