ముంబై : ఫోర్బ్స్ ఈ ఏడాది బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. అందులో 25 మంది అతిచిన్న వయస్సుల్లో బిలియనీర్లు ఉన్నారు. వారి మొత్తం సంపద 110 బిలియన్ డాలర్లు కాగా వారి వయస్సు 33 అంతకంటే తక్కువగా ఉందని ఫోర్బ్స్ తెలిపింది. 30 ఏళ్లలోపు యువ భారతీయ బిలియనీర్లలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కుమారులు జహాన్, ఫిరోజ్ ముందంజలో ఉన్నారు. వారిద్దరి సంపద 9.8 బిలియన్లుగా ఉంది.
జహాన్ మిస్త్రీ
2022లో కారు ప్రమాదంలో తండ్రి సైరస్ మిస్త్రీ మరణించిన తర్వాత జహాన్ తన కుటుంబ సంపదలో కొంత భాగాన్ని వారసత్వంగా పొందారు. ఇందులో టాటా సన్స్‌లో వాటా 18.4శాతం, ముంబై నిర్మాణ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో జహాన్ 25 శాతం వాటా ఉంది. ఐర్లాండ్‌లో పౌరసత్వం కలిగిన జహాన్ మిస్త్రీ తన తండ్రి సైరస్ మిస్త్రీ మరణం తర్వాత ముంబైలో నివసిస్తున్నారు.
ఫిరోజ్ మిస్త్రీ
ఫిరోజ్ మిస్త్రీ (27) దివంగత సైరస్ మిస్త్రీకి పెద్ద కుమారుడు. కుటుంబ వారసత్వంగా టాటా సన్స్‌లో 18.4శాతం వాటాను, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో 25శాతం వాటాను దక్కించుకున్నారు. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఐపీఓకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఫిరోజ్ మిస్త్రీ యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌లో చదువుకున్నారు. ఐరిష్ పౌరసత్వం ఉన్నప్పటికీ అతను ముంబైలో నివసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment