
భవనం కూలిన ఘటనలో ఇద్దరి అరెస్ట్
నానక్రాంగూడ భవనం కుప్పకూలిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : నానక్రాంగూడ భవనం కుప్పకూలిన ఘటనలో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. బిల్డింగ్ యజమాని, అతని కుమారుడు, కాంట్రాక్టర్తో పాటు ఆర్కిటెక్చర్పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 304, 304 ఎ కింద కేసులు నమోదు చేశారు.
భవన యజమాని సత్తూసింగ్, అతని కుమారుడు అనిల్ సింగ్ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బిల్డింగ్ కాంట్రాక్టర్, ఆర్కిటెక్చర్ పరారీలో ఉన్నారు. వారిద్దరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.