
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్ గూడలోని పటేల్ కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈత కోసం వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు కుంటలోపడి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీశారు. మరణించిన చిన్నారులను షాబాజ్(15), దీపక్(12), పవన్(14)గా గుర్తించారు.