drown to death
-
కేసులతో సంబంధమే లేదు.. పోలీసులను చూడగానే పరుగందుకుని..
వాషింగ్టన్: పోలీసులను రక్షకభటులని అంటారు. కానీ దొంగల కంటే వారిని చూస్తేనే ఎక్కువగా భయపడుతుంటారు జనం. ఆ భయమే అమెరికాలో ఓ అభాగ్యుడిని పొట్టనబెట్టుకుంది. పోలీసులు ఎందుకు వచ్చారో ఏంటో తెలుసుకోకుండా వారు కనపడగానే భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి కన్నింగ్ హాం సరస్సులోకి దూకేశాడు. కొద్దిసేపు ఈత కొట్టే ప్రయత్నం చేసిన అతను చూస్తుండగానే నీటమునిగిపోయాడు. గ్రీన్విల్లే కౌంటీ పోలీసు అధికారులు బెయిలుపై ఉన్న ఒక వ్యక్తికి అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు కన్నింగ్ హాం రోడ్డులోని ఒక ఇంటిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్నాడు చక్ గిల్బర్ట్ షెల్టన్ జూనియర్ (38). కేసుతో అసలు ఏమాత్రం సంబంధం లేని అతడు పోలీసులను చూస్తూనే పరుగందుకున్నాడు. అది చూసి బిత్తరపోయిన పోలీసులు వాడెందుకు పరిగెడుతున్నాడన్న డైలమాలో ఉండిపోయారు. అంతలోనే గిల్బర్ట్ షెల్టన్ దగ్గర్లో ఉన్న కన్నింగ్ హాం సరస్సులోకి దూకేశాడు. ఒడ్డు నుండి 15-20 అడుగుల దూరం ఈత కొట్టుకుంటూ వెళ్లిన షెల్టన్ క్రమక్రమంగా మునిగిపోయాడు. వెంటనే గ్రీన్విల్లే పోలీసులు, స్థానిక ఈతగాళ్లు కొందరు కాలువలోకి దూకి వెతికినా ప్రయోజనం లేకపోయింది. సుదీర్ఘంగా కొనసాగిన గాలింపుల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు. అతను ఎందుకు పారిపోయాడు? అతడిపై నేరారోపణలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఏదైతేనేం భయం దెయ్యం కంటే చెడ్డదని మరోసారి రుజువైంది. ఇది కూడా చదవండి: ఖలిస్థానీల ముసుగులో అక్రమ వలసలు.. -
హైదరాబాద్‌లో విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్ గూడలోని పటేల్ కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈత కోసం వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు కుంటలోపడి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీశారు. మరణించిన చిన్నారులను షాబాజ్(15), దీపక్(12), పవన్(14)గా గుర్తించారు. -
‘నాన్న.. దుబాయ్ నుంచి రాంగ సెల్‌ఫోన్ తీసుకురా అన్నావే’
సాక్షి,ధర్మపురి: ‘నాన్న.. దుబాయ్ నుంచి రాంగ సెల్‌ఫోన్, టీవీ తీసుకురా.. ఇక్కడ చెల్లె నేను మంచిగ చదువుకుంటున్నం అంటూ రోజూ ఫోన్లో మాట్లాడినవు.. నీ మాటలు దూరమయ్యాయి. బిడ్డా నువ్వు వెళ్లిపోయావా.. దుబాయ్ నుంచి నీ కోసం అచ్చిన లే బిడ్డా’.. అంటూ తండ్రి కిషన్.. ‘మరో మూడు నెలల్లో రావాలని అనుకుంటే నాన్నను ఇప్పుడే నీ దగ్గర కు రప్పించుకున్నావా కోడుకా’.. అంటూ తల్లి పుష్పలత రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. మండలంలోని తుమ్మెనాల చెరువులో ఆదివారం ఈత కోసం వెళ్లి ముగ్గరు చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్న విసయం తెలిసిందే. చివరిచూపు కోసం.. చెరువులో ఆదివారం మృతిచెందిన మారంపెల్లి శరత్, పబ్బతి నవదీప్‌ల మృతదేహాలను తుమ్మెనాలలో బాడీ ప్రీజర్లలో భద్రపరిచారు. సోమవారం మధ్యాహ్నం మృతుడు శరత్ మృతదేహానికి తండ్రి సతీశ్ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఈక్రమంలో మంగళవారం నవదీప్‌కు తుమ్మెనాల గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. దుబాయ్ నుంచి తండ్రి కిషన్ కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించాడు. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకే తండ్రి తలకొరివి పెట్టడం అందరినీ కంటతడి పెట్టించింది. చదవండి: Bholakpur Corporator: పోలీసులకు వార్నింగ్.. కేటీఆర్ సీరియస్.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్ -
పొట్ట కూటి కోసం చేసే పనే పొట్టన పెట్టుకుంది..
సాక్షి,మంచిర్యాల: పొట్టకూటి కోసం ట్రాక్టర్ డ్రైవర్ పనిచేస్తున్న ఓ దినసరి కూలీని రాళ్లవాగు మింగేసింది. ఇసుక తోడేందుకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన కనుకుంట్ల దుర్గయ్య తన ట్రాక్టర్ ద్వారా ఇసుక సరఫరా చేస్తుంటాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు ఇసుక తరలించేందుకు బొంతల శంకర్ (27)తోపాటు మరో ఇద్దరు కూలీలను తీసుకెళ్లాడు. ఉదయం 9 గంటల సమయంలో శంకర్ నీటిలో మునిగి మృతి చెందాడని, వెంట వెళ్లిన కూలీలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శంకర్ అనారోగ్యంతో ఉన్నా ట్రాక్టర్ యజమాని బలవంతంగా పనిలోకి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ట్రాక్టర్ యజమాని దుర్గయ్య ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన దిగారు. సమాచారం అందుకున్న ఎస్సై ప్రవీణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య పప్పి, ఇద్దరు కుమార్తెలు హేమలత, యేసుమణి, కుమారుడు ఏసుమంత్ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే.. రాళ్లవాగు నీటి నుంచి అక్రమంగా ఇసుక తోడుతున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు కూలీలతో ప్ర మాదకరంగా నీటి అడుగుభాగం నుంచి ఇసుక ను వెలికితీస్తున్నారని వారు పేర్కొంటున్నారు. రోజుకు వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ప్రమాదకరంగా వాగుల నుంచి ఇసు క తోడుతున్న ట్రాక్టర్ యజమానులపై కఠిన చ ర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: -
బడికి పోయినా బతికెటోళ్లు
-
బడికి పోయినా బతికెటోళ్లు
సాక్షి, బచ్చన్నపేట : బడికి వెళ్లి ఉంటే ఆ ఇద్దరు బాలురు బతికి ఉండేవారు.. ఒకే పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి బాలురు ఆడుకోవడానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగిన సంఘటన జనగామ జిల్లా మండలం పోచన్నపేట గ్రామంలో చోటుసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పోచన్నపేటకు చెందిన బేడ బుడిగ జంగాల కాలనీకి చెందిన నూనె ఎల్లమ్మ–మదార్ పెద్దకుమారుడు జక్కరయ్య(7)తో పాటు అదే కాలనీకి చెందిన కడకంచి లక్ష్మీ–సారయ్య దంపతుల పెద్ద కుమారుడు పాలయ్య(7) స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు. శనివారం పాఠశాలకు వెళ్లకుండా కాలనీ పక్కనే ఉన్న చెరువు వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. చెరువులో మిషన్‌భగీరథ పనుల్లో భాగంగా జేసీబీతో పెద్ద గుంతలను తీశారు. సమీపంలో ఆడుకుంటున్న పిల్లలిద్దరూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. నీట మునుగుతున్న క్రమంలో పిల్లలను కేకలు వేయడంతో సిద్ధులు అనే స్థానిక వ్యక్తి గమనించి అక్కడకి చేరుకుని పిల్లలను బయటకు తీసేసరికే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. మృతి చెందిన బాలుడు పాలయ్య తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ గువ్వల ఎల్లమ్మ పోషిస్తోంది. ‘అమ్మ నాయిన లేకపోయినా కంటికి రెప్పలా కాపాడుకుంటాన.. బడికి పోయి ఉంటే నా మనవడు బతికెటోడు’.. అంటై ఎల్లమ్మ గుండెలు పగిలేలా రోదిస్తున్న దీరు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. రెండో శనివారం పాఠశాలలకు సెలవు.. అయితే ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రకటించిన సెలవుల నేపథ్యంలో రెండో శనివారాలు ప్రభుత్వ పాఠశాలలకు పనిదినాలుగా సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శనివారం స్కూల్ తెరిచే ఉంది. అయితే ఇద్దరు చిన్నారులు వెళ్లలేదు. -
డ్యాంలో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి
పూణె : డ్యాంలో మునిగి తమిళనాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. చెన్నైలోని ఈసీఎస్ మెట్రిక్యులేషన్ స్కూల్‌కు చెందిన 20 మంది విద్యార్థులు నలుగురు టీచర్లతో కలసి సమ్మర్ క్యాంప్‌లో భాగంగా మహారాష్ట్రలోని ముల్షి తాలూకాకు వచ్చారు. ఉపాధ్యాయులకు తెలియకుండా ముగ్గురు విద్యార్థులు ఈత కొడదామని దగ్గరలో ఉన్న ఓ డ్యాం వద్దకు వెళ్లారు. డ్యాంలోకి దిగి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. ఈ విషయం తెలిసి వారితో పాటు వచ్చిన ఉపాధ్యాయులు పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. దానిష్ రాజా అనే విద్యార్థి మృతదేహం లభించింది. సంతోష్, సర్వన్న అనే ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతుంది. తప్పిపోయిన విద్యార్థులు 13 ఏళ్లలోపు వారే. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన ఫొటో సరదా
పశ్చిమ గోదావరి జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజి ఒడ్డున పడవమీద నుంచొని ఫొటో తీయుంచుకుంటుండగా ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.ఈ సంఘటన కొవ్వూరు సమీపంలోని మద్దూరులంకలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. కనుమ పండగరోజున సరదాగ గడుపుదామని 20 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మద్దూరు లంక సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వెళ్లారు. సరదా... సరదాగా గడుపుతూ ఒడ్డున ఆగివున్న పడవపై ఫొటో తీయుంచుకుంటున్నారు. అలా ఫొటో తీయుంచుకుంటున్న సమయంలో ఇంజినీరింగ్ విద్యార్థి పెనుగొండ రవి (22) ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి మృతి చెందాడు. మృతుడిని పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన వాడుగా పోలీసులు భావిస్తున్నారు.