ప్రాణం తీసిన ఫొటో సరదా
పశ్చిమ గోదావరి జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజి ఒడ్డున పడవమీద నుంచొని ఫొటో తీయుంచుకుంటుండగా ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.ఈ సంఘటన కొవ్వూరు సమీపంలోని మద్దూరులంకలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. కనుమ పండగరోజున సరదాగ గడుపుదామని 20 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మద్దూరు లంక సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వెళ్లారు.
సరదా... సరదాగా గడుపుతూ ఒడ్డున ఆగివున్న పడవపై ఫొటో తీయుంచుకుంటున్నారు. అలా ఫొటో తీయుంచుకుంటున్న సమయంలో ఇంజినీరింగ్ విద్యార్థి పెనుగొండ రవి (22) ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి మృతి చెందాడు. మృతుడిని పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన వాడుగా పోలీసులు భావిస్తున్నారు.