ఏపీ ప్రభుత్వం పని కల్పించకే వలసలు: బొత్స
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పని కల్పించలేని దుస్థితిలో ఉండటం వల్లే ఉత్తర కోస్తా వలసజీవుల బతుకులు ఛిద్ర మయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పని కల్పించలేని దుస్థితిలో ఉండటం వల్లే ఉత్తర కోస్తా వలసజీవుల బతుకులు ఛిద్ర మయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ విమర్శించారు.నానక్‌రాం గూడలో కుప్పకూలిన ఏడంతస్థుల మేడను ఆయన శుక్రవారం పరిశీలించారు. విజయనగరం జిల్లాకు చెందిన బాధితులను ఆయన ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
‘‘తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.10 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. ఏపీ అందుకు రెండింతలు ఇవ్వాల్సిన అవసరముంది’’ అన్నారు. ‘‘ఏపీ దుర్భర స్థితిలో ఉండడం వల్లే పని కోసం వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు వలస వస్తున్నారు. దీనిపై ఏపీ సీఎం, మంత్రులు ఏం సమాధానం చెబుతార’’ని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తరపున బాధిత కుటుంబాలకు బొత్స ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకు ముందు ఆయన మంత్రి కేటీఆర్‌ను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. బొత్స వెంట వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి తదితరులున్నారు.