మృత్యుఘోష..'అంతా ఏపీకి చెందినవారే' | 11 dead bodys cought after building collapses in Nanakramguda | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 10 2016 7:51 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో పేకమేడలా కూలిపోయిన భవన శిథిలాల తొలగింపు ప్రక్రియ ముగిసింది. మొత్తం 11 మృతదేహాలను బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఓ తల్లీ, ఆమె మూడేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే ఉండి పర్యవేక్షించినా.. ఇరుకు రోడ్డు, విద్యుత్‌ తీగల కారణంగా సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరిగింది. శనివారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి. ఈ ఘటన బాధితుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందినవారే. కొందరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు, మరికొందరు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement