మరో ఇద్దరు అధికారులపై వేటు | Nanakramguda building collapse tragedy; 2 more officers suspended | Sakshi
Sakshi News home page

మరో ఇద్దరు అధికారులపై వేటు

Published Sat, Dec 10 2016 7:09 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మరో ఇద్దరు అధికారులపై వేటు - Sakshi

మరో ఇద్దరు అధికారులపై వేటు

హైదరాబాద్‌: నానక్‌రామ్‌ గూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరో ఇద్దరు అధికారులపై వేటు పడింది. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఆర్‌ రాజేందర్‌, పీ మధులను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు.

జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ రమణారావు ఈ ప్రమాదంపై జీహెచ్‌ఎంసీకి నివేదిక సమర్పించారు. అపార్ట్‌మెంట్‌ డిజైన్‌ సక్రమంగా లేదని, ఎక్కువ అంతస్తులు నిర్మించడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. పక్కపక్కనే భవనాలు నిర్మించడం కూడా ప్రమాదానికి కారణమని, శిథిలాలు తొలగించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని రమణారావు చెప్పారు.

గురువారం రాత్రి నానక్‌రామ్‌ గూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 11 మృతదేహాలను వెలికితీశారు. అదృష్టవశాత్తూ ఓ తల్లీ, ఆమె మూడేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దల కుటుంబాలకు 5 లక్షలు, పిల్లల కుటుంబాలకు 2.5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement