
సాక్షి, హైదరాబాద్: యూఎస్ కాన్సులేట్ తమ కార్యకలాపాలను ఇక నుంచి నానక్‌రామ్‌గూడ నుంచి నిర్వహించనుంది. ఈ నెల 20న నూతన కాన్సులేట్ భవనం ప్రారంభం కానుంది. 340 మిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మించిన ఈ అత్యాధునిక భవనం అమెరికా - భారత్‌ల మధ్య బలపడుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనమని, ఈ సందర్భంగా అందించే వివిధ సేవల వివరాలను యూ.ఎస్. కాన్సులేట్ జనరల్ ప్రకటించింది.
బేగంపేట్ పైగా ప్యాలెస్‌లో ఈ నెల 15 వరకూ సేవలు కొనసాగనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 20వ తేదీ 8.30 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని కాన్సులేట్ జనరల్ వెల్లడించింది.
అయితే, మార్చి 20 ఉదయం 08:30 వరకు అత్యవసర సేవలకు అమెరికా పౌరులు, +91 040-4033 8300 నంబర్‌పై సంప్రదించాలని యూఎస్ కాన్సులేట్ పేర్కొంది. మార్చి 20 ఉదయం 08:30 తర్వాత, అత్యవసర సేవలకు అమెరికా పౌరులు 91 040 6932 8000 నంబర్‌పై సంప్రదించాలని తెలిపింది. అత్యవసరం సేవలకు అమెరికా పౌరులు HydACS@state.gov కి ఈ- మెయిల్ కూడా చేయవచ్చని పేర్కొంది.
సంబంధిత వార్త: వైఎస్సార్.. జార్జిబుష్‌ని ఒప్పించిన వేళ!
మార్చి 15 వరకు వీసా ఇంటర్వ్యూ ఉన్న దరఖాస్తుదారులు బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌లో సంప్రదించాలని, మార్చి 23 నుండి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ కోసం నానక్‌రామ్‌గూడలోని నూతన కార్యాలయానికి వెళ్లాలని కాన్సులేట్ జనరల్ సూచించింది.
బయోమెట్రిక్స్ అపాయింట్‌మెంట్‌లు, “డ్రాప్‌బాక్స్” అపాయింట్‌మెంట్‌లు (ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్నవారు), పాస్‌పోర్ట్ పికప్ సహా ఇతర వీసా సేవలు – లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాదాపూర్, హైదరాబాద్ 500081, లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ (VAC)లో కొనసాగుతాయి. కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని కాన్సులేట్ జనరల్ వివరించింది.
వీసా సేవలకి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే, +91 120 4844644, +91 22 62011000పై కాల్ చేయాలి. నానక్‌రామ్‌గూడ కాన్సులేట్ బదిలీ సమాచారం కోసం కాన్సులేట్ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వాలని కాన్సులేట్ జనరల్ పేర్కొంది. Twitter (@USAndHyderabad), Instagram (@USCGHyderabad), Facebook (@usconsulategeneralhyderabad)
నాడు మహానేత కృషి
2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఆయన చొరవతోనే హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటునకు ఆనాటి అధ్యక్షుడు బుష్ ప్రకటన చేశారు. ఆ వెంటనే బేగంపేటలో ప్యాలెస్‌ను వైఎస్సార్ కేటాయించి.. అదే ఏడాది అక్టోబర్ 24న ఆయనే ప్రారంభించారు. అప్పటి నుంచి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చూసుకున్న ఆ భవనం.. 14 ఏళ్ల పాటు సేవలు అందించింది. ఇప్పుడు యూఎస్ కాన్సులేట్ నానక్‌రామ్‌గూడలోని కొత్త భవనానికి షిఫ్ట్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment