US Consulate General
-
డిసెంబరు 7న హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2024
హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్, గోథే-జెంట్రమ్ హైదరాబాద్‌తో కలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2024 ప్రదర్శన జరగనుంది. ఈ ఫెస్టివల్ హైదరాబాద్‌లోని పబ్లిక్ స్కూల్లో డిసెంబర్ 7, శనివారం సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, ఇండియా, యూరప్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాండ్లతో ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఫెస్టివల్‌కు ప్రవేశం ఉచితమని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ది నేటివ్ జాజ్ క్వార్టెట్‌ను స్పాన్సర్ చేస్తోంది. వివిధ సంస్కృతులకు చెందిన బ్యాండ్ సభ్యులు, ఇతర నిపుణులు పాల్గొంటారు. ముఖ్యంగా డ్రమ్మర్ ఎడ్ లిటిల్‌ఫీల్డ్ లింగిట్ తెగకు చెందిన అలస్కాన్ నేటివ్, ఫిలిపినో-అమెరికన్ పియానిస్ట్ రీయుల్ లుబాగ్ ; జాజ్ ట్రంపెట్ కళాకారుడు నవజో సంతతికి చెందిన డెల్బర్ట్ ఆండర్సన్, వాషింగ్టన్‌లోని సియాటిల్‌కు చెందిన బాసిస్ట్ మైఖేల్ గ్లిన్ పాల్గొంటారు. ఇంకా ఈ ఉత్సవంలో జర్మనీ ,స్విట్జర్లాండ్ నుండి మాల్స్ట్రోమ్తో సహా ప్రదర్శనలు కూడా ఉంటాయి; పోర్చ్‌గీస్ ఆర్టిస్ట్ కాచా ముండిన్హో, ఇద్దరు భారతీయ సంగీతకారులతో పాటు డచ్ కళాకారుడు స్జాహిన్ డ్యూరింగ్ నేతృత్వంలోని బ్యాండ్; హైదరాబాద్‌కు చెందిన జార్జ్ హల్ కలెక్టివ్ కళాకారులు తమ ప్రదర్శన ఇవ్వనున్నారు.వరుసగా ఆరోసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్‌ను కోస్పాన్సర్ చేశామని హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. ఈ కచేరీకి U.S. ఆర్ట్స్ ఎన్వోయ్ ప్రోగ్రామ్ కూడా సపోర్ట్ చేస్తోంది. ఉత్తమ అమెరికా కళలను, సంస్కతిని ప్రపంచంతో పంచుకోవడం, క్రాస్-కల్చరల్ అవగాహన , సహకారాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అమెరికన్ ఆర్ట్స్ నిపుణులతో ఇంటరాక్ట్ కావాలనుకునే ఔత్సాహికులకు ఇదొక గొప్ప అవకాశమని నిర్వాహకులు తెలిపారు. -
మహిళా పారిశ్రామివేత్తలకు అభినందనలు: యూఎస్ కాన్సులేట్ జనరల్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్, అలయన్స్ ఫర్ కమర్షియలైజేషన్ అండ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ (ఎసిఐఆర్) భాగస్వామ్యంతో ఇంటెన్సివ్ అకాడమీని విజయవంతంగా పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలను యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా వ్యాపారవేత్తలకు వ్యాపారాల అభివృద్ధికి వ్యూహాత్మక ప్రణాళిక, మార్కెటింగ్, ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చింది. ఆరు నెలల పాటుసాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన 60మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మహిళా నాయకత్వం, మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం అమెరికా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని జెన్నిఫర్ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల అకాడమీ, వనరులు, కనెక్షన్లతో మహిళలను శక్తివంతం చేయడంతోపాటు, ఇండియాతో తమ భాగస్వామ్య లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళుతుందన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ తమ క్యాంపస్‌లలో ఏడబ్ల్యూఈ కోహార్ట్‌లను నిర్వహిస్తున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో శుక్రవారం కాన్సులేట్ నిర్వహించిన అకాడమీ ఫర్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (ఏడబ్ల్యూఈ) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం (నవంబర్ 22) జరిగింది. ఈ నెల(నవంబర్) 26న విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో మరో ఈవెంట్ జరగనుంది. -
అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..
గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా.. 2023–24లో ఈ సంఖ్య 3,31,602కి చేరింది. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. – రెబెకా డ్రామ్ ఏయూ క్యాంపస్: గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) కార్యాలయం కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కాన్సులేట్ నుంచి రోజుకి సగటున 1,600 వరకు వీసాలు ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కాన్సులేట్‌లో సిబ్బందిని రెట్టింపు చేసినట్లు తెలిపారు.వచ్చే ఏడాది సిబ్బందిని మూడు రెట్లు పెంచి రోజుకు 2,500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా అమెరికా–భారత్ సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఏపీలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. ఈ సందర్భంగా రెబెకా డ్రామ్ ఇంకా ఏమన్నారంటే..అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు..అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన విద్యార్థుల్లో 303.3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది 336 మంది రాగా ఈ సంవత్సరం 1,355 మంది వచ్చారు. ప్రస్తుతం 8 వేల మంది వరకు అమెరికన్ విద్యార్థులు భారత్‌లో ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా 2023–24లో ఈ సంఖ్య 13 శాతం వృద్ధితో 3,31,602కి చేరింది. మాస్టర్స్, పీహెచ్డీ కోర్సులకు అత్యధిక శాతం మంది విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ గతేడాది 35 వేలు, ఈ ఏడాది 47 వేల స్టూడెంట్ వీసా ఇంటర్వూ్యలు నిర్వహించింది.బీ1, బీ2 వీసాలకు గరిష్టంగా ఏడాది కాలం.. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. గతేడాది భారత్‌లో 1.4 మిలియన్ వీసాలను ప్రాసెస్ చేశాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు.స్టెమ్ కోర్సులనే ఎక్కువగా చదువుతున్నారు.. అమెరికా కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ అధికారి అలెక్స్ మెక్లీన్ మాట్లాడుతూ.. తమ దేశానికి వస్తున్న విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, మెడిసిన్ (స్టెమ్) కోర్సులను ఎక్కువగా చదువుతున్నారని తెలిపారు. యూఎస్‌లో ఉన్నత విద్యకు విద్యార్థులను పంపే దేశాల జాబితాలో ఈ ఏడాది భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ భాగస్వామ్యం అమెరికాను ఎంతో బలోపేతం చేస్తుందన్నారు. అమెరికాకు వస్తున్నవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారని చెప్పారు.మహిళలను సైతం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్‌పై స్పందిస్తూ ఈ కేంద్రం ఎంతో బాగా పనిచేస్తోందని తెలిపారు. తరచూ ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది అమెరికన్ నావికా సిబ్బంది ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి ఎన్సీసీ విద్యార్థినులతో మాట్లాడారని గుర్తు చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందిస్తూ రెండు దేశాల సంస్కృతుల మధ్య కొంత వైవిధ్యం ఉంటుందని.. వీటిని అలవాటు చేసుకోవడం, పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఆత్మహత్యలను నివారించడానికి తాము పూర్తిస్థాయిలో పనిచేస్తున్నామని తెలిపారు. -
మహిళా వ్యాపారవేత్తల కోసం గుడ్‌న్యూస్.. ఈ ట్రైనింగ్ మీకోసమే
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు యూఎస్ కాన్సులేట్ అకాడమీ ఫర్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ప్రోగ్రామ్(AWE)చక్కటి అవకాశం కల్పిస్తోంది. యూఎస్ పూర్వవిధ్యార్థులతో ఇన్-క్లాస్ డిస్కషన్, మెంటరింగ్ వంటి ట్రైనింగ్ సెషన్‌ను నిర్వహిస్తుంది. యుఎస్ కాన్సులేట్ జనరల్ సహకారంతో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ (KIIT-TBI) సంయుక్తంగా ఈ ప్రొగ్రామ్‌ను నిర్వహిస్తుంది.అయితే ఈ ట్రైనింగ్ సెషన్‌కు హాజరు కావాలంటే అభ్యర్థులు జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వరంగల్, భువనేశ్వర్, విశాఖపట్నం, తిరుపతి వంటి నాలుగు నగరాల్లో మొత్తం 100 మంది ఔత్సాహిక, మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి అకాడమీ ఫర్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ ఈ ట్రైనింగ్ సెషన్‌ను అందిస్తుంది. ప్రతి లొకేషన్లో 25మంది పాల్గొనొచ్చు. కాబట్టి అభ్యర్థులు ముందుగానే ఆన్లైన్లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరు ఈ ట్రైనింగ్‌కు అర్హులు? ♦ ట్రైనింగ్ సెషన్‌కు హాజరయ్యే వాళ్ల మహిళల వయసు 18-50 ఏళ్ల మధ్య ఉండాలి. ♦ అప్లికేషన్‌ను జూన్ 30లోగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ♦ అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదవుతున్న వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు ♦ ముందుగానే ఏ బిజినెస్ చేయాలి? ఎలా చేయాలి వంటివాటిపై అవగాహన కలిగి ఉండాలి. అప్లికేషన్ ఆన్లైన్లో https://awe.kiitincubator.inలో అందుబాటులో ఉంది. పూర్తి సమాచారం కోసం https://forms.gle/zqSFnhZ6veNq7JQV7 వెబ్‌సైట్‌ను వీక్షించండి. Don’t miss out! We only have a few seats left in our Academy of Women Entrepreneurs (AWE) program in Telangana, Andhra Pradesh, and Odisha. Aspiring women entrepreneurs are encouraged to apply. Application deadline is Friday, 30 June. More details: https://t.co/Q2vyoS7tRa https://t.co/0wtqiZrXAL — U.S. Embassy India (@USAndIndia) June 27, 2023 -
హైదరాబాదే మన ఫ్యూచర్ ..!
-
యూఎస్ కాన్సులేట్ వెలుపల ‘వందేమాతరం’ నినాదాల హోరు!
ఖలిస్తాన్ మద్దతుదారులు యూకేలోని భారత్ హైకమిషన్‌పై దాడి చేసిన ఘటన మరువ మునుపే సుమారు రెండు వేల మంది వేర్పాటు వాదులు భవంతి సమీపంలో నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసనను తెలియజేస్తూ..తగిన చర్యలను తీసుకోవాలని యూకేని కోరింది. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు వేర్పాటువాదుల దాడి యత్నాన్ని విఫలం చేశారు. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ మద్దతుదారులకు ప్రతిస్పందనగా అమెరికాలోని శాన్ ప్రావిన్స్స్కోలో భారత హైకమిషన్ వెలుపల భారతీయుల బృందం జాతీయ జెండాను, యూఎస్ జెండాను పట్టుకుని ఊపుతూ..వందేమాతరం, భారత్‌మాతాకీ జై అని నినాదాలు చేశారు. మరోవైపు ధోల్ దరువులు కూడా మారుమ్రోగాయి. అదేసమయంలో కొంతమంది నిరసనకారులు దూరంగా ఖలిస్తాన్ జెండాలను ఊపుతూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా, శాన్ప్రాన్సిస్కోలో భారతీయ కాన్సులేట్‌పై ఒక గుంపు దాడి చేసి భవనం వెలుపల గోడపై ఫ్రీ అమృత్‌పాల్ అని రాసి భారీ గ్రాఫిటీని స్ప్రే చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగడం గమనార్హం. అంతేగాదు అంతకుమునుపు యూఎస్‌లోని భారత్ హైకమిషన్ వెలుపల ఖలిస్తానీ మద్దతుదారులు భారత్ జెండాను తొలగించారు ప్రతిగా పెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసింది. అలాగే భారత్ దీనిపై తీవ్రంగా నిరసించడమే గాక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఒక ప్రకటనలో యూఎస్‌ని కోరింది. #WATCH | United States: Indians gather outside the Indian consulate in San Francisco in support of India's unity pic.twitter.com/tuLxMBV3q0 — ANI (@ANI) March 25, 2023 (చదవండి: ప్రకంపనలు రేపుతున్న ఉత్తర కొరియా ప్రకటన.. సునామీని పుట్టించే..) -
ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీల ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: అమెరికా, భారత్‌ల మధ్య పటిష్ట వాణిజ్య బంధానికి హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ కీలక పాత్ర పోషిస్తోందని వాషింగ్టన్లో అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడించారు. హైదరాబాద్‌లో పెట్టుబడుల కోసం ఎన్నో అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. నానక్‌రాంగూడలో సుమారు రూ.2,800 కోట్ల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించిన యూఎస్ కాన్సులేట్ భవనంలో ఈనెల 20 నుంచి ప్రారంభమైన కార్యకలాపాలను ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు. భారత్‌లో అమెరికా పెట్టుబడులే కాకుండా భారత్ నుంచి అమెరికాలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గాను ఈ కొత్త కాన్సులేట్ బిల్డింగ్ ఎంతో దోహదపడుతుందని వివరించారు. అమెరికా ఫారెన్ పాలసీ బ్రీఫింగ్ లో అమెరికా ఫారెన్ పాలసీ బ్రీఫింగ్ లో హైదరాబాద్ లోని కొత్త కాన్సులేట్ గురించి ప్రస్తావించడం ప్రాధాన్యమైన విషయమన్నారు. దక్షిణాసియాలోనే అతిపెద్ద కాన్సులేట్ హైదరాబాద్‌లో సౌత్ ఆసియాలోనే అతిపెద్ద విశాలమైన అమెరికన్ కాన్సులేట్ నిర్మించి భారతదేశంతోనే కాకుండా హైదరాబాద్‌తో కొనసాగుతున్న బలమైన బంధాన్ని అమెరికా మరోసారి గుర్తు చేసిందని వేదాంత్ పటేల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన తెలుగు వారికి వీసా సౌకర్యాల కోసమే కాకుండా హైదరాబాద్‌లో అమెరికాకున్న వాణిజ్య అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విశాలమైన కాన్సులేట్ భవనాన్ని 12 ఎకరాల్లో అధునాతన పరిజ్ఞానంతో నిర్మించినట్లు తెలిపారు. కాగా అమెరికాతో వాణిజ్యానికి సంబంధించి హైదరాబాద్‌లోని కాన్సులేట్ కార్యాలయం ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తన లింక్డిన్ ప్రొఫైల్ ద్వారా మెసేజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల వీసా కేంద్రంగా హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్ వీసాతో పాటు వాణిజ్య, పర్యాటక, డిపెండెంట్ వీసాల అవసరాలకు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు రావడం తప్పనిసరి. దేశంలో వీసా, దౌత్య కార్యకలాపాల కోసం నాలుగు కాన్సులేట్లు ఉండగా, అందులో హైదరాబాద్‌లోని కాన్సులేట్ అతిపెద్దది కావడం గమనార్హం. వీసా ఇంటర్వ్యూ అవసరం ఉన్నవారు మొదట హైటెక్ మెట్రో స్టేషన్‌లోని వీసా అప్లికేషన్ సెంటర్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. వీసా రెన్యువల్ కోసం ఇంటర్వ్యూ మినహాయింపు కలిగిన వారు వీసా అప్లికేషన్ సెంటర్ లో డాక్యుమెంట్స్ దాఖలు చేస్తే చాలు. ఇంటర్వ్యూ అవసరం ఉన్నవారు నానక్‌రాం గూడలోని కొత్త అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. -
హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్.. ఇక వీసాల జారీ మరింత సులభతరం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ అత్యాధునిక హంగులతో నిర్మించిన సొంత భవనంలోకి మారిపోయింది. నానక్‌రామ్‌గూడలోని కొత్త, శాశ్వత అమెరికన్ కాన్సులేట్ భవనంలో సోమవారం కార్యకలాపాలు మొదలయ్యాయని కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ ప్రకటించారు. భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇదో మైలురాయి అని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వీసాల జారీని సులభతరం చేసేందుకు ఇక్కడ అధికారుల సంఖ్య పెంచుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు అమెరికా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2008వ సంవత్సరంలో హైదరాబాద్‌లో తొలిసారి అమెరికన్ కాన్సులేట్ ప్రారంభం కాగా, ఇప్పటివరకూ అది బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో పనిచేసిన విషయం తెలిసిందే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శాశ్వత భవన నిర్మాణం కోసం నానక్‌రామ్ గూడలో సుమారు 12 ఎకరాల స్థలం కేటాయించారు. అందులోనే అమెరికా సుమారు 34 కోట్ల డాలర్ల (రూ.2,800 కోట్లు) వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించుకుంది. చిరునామా: సర్వే నంబరు 115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్ గూడ, హైదరాబాద్, తెలంగాణ, 500032. ♦ అత్యవసర కాన్సులర్ సేవల కోసం (అమెరికా పౌరులైతే) +91 040 6932 8000 నంబరులో సంప్రదించవచ్చు. ♦ సాధారణ సేవల కోసం ‘‘HydACS@state.gov.’’ఐడీకి మెయిల్ చేయవచ్చు. ♦ వీసా ఇంటర్వ్యూలు నిర్దిష్ట సమయాల్లో నానక్‌రామ్ గూడలోని కొత్త కార్యాలయంలో జరుగుతాయి. ♦ వీసాలకు సంబంధించిన ఇతర సరీ్వసులు (బయోమెట్రిక్స్, అపాయింట్మెంట్స్, ‘డ్రాప్‌బాక్స్’పాస్‌పోర్ట్ పికప్, అపాయింట్మెంట్స్ (ఇంటర్వ్యూ వెయివర్)లు ♦ మాదాపూర్‌లోని హైటెక్ సిటీ మెట్రోస్టేషన్లో ఏర్పాటు చేసిన ‘వీసా అప్లికేషన్ సెంటర్’లో కొనసాగుతాయి. ♦ కాన్సులర్ సేవలకు సంబంధించిన ప్రశ్నల కోసం +91 120 4844644 లేదా +91 22 62011000 నంబర్లను సంప్రదించవచ్చు. చదవండి: 11 గంటలు .. 14 ప్రశ్నలు.. కవిత సమాధానాలు పూర్తిగా వీడియో రికార్డింగ్ -
HYD: నూతన భవనంలోకి యూఎస్ కాన్సులేట్.. సేవలు ఎప్పటినుంచి అంటే..?
సాక్షి, హైదరాబాద్: యూఎస్ కాన్సులేట్ తమ కార్యకలాపాలను ఇక నుంచి నానక్‌రామ్‌గూడ నుంచి నిర్వహించనుంది. ఈ నెల 20న నూతన కాన్సులేట్ భవనం ప్రారంభం కానుంది. 340 మిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మించిన ఈ అత్యాధునిక భవనం అమెరికా - భారత్‌ల మధ్య బలపడుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనమని, ఈ సందర్భంగా అందించే వివిధ సేవల వివరాలను యూ.ఎస్. కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. బేగంపేట్ పైగా ప్యాలెస్‌లో ఈ నెల 15 వరకూ సేవలు కొనసాగనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 20వ తేదీ 8.30 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. అయితే, మార్చి 20 ఉదయం 08:30 వరకు అత్యవసర సేవలకు అమెరికా పౌరులు, +91 040-4033 8300 నంబర్‌పై సంప్రదించాలని యూఎస్ కాన్సులేట్ పేర్కొంది. మార్చి 20 ఉదయం 08:30 తర్వాత, అత్యవసర సేవలకు అమెరికా పౌరులు 91 040 6932 8000 నంబర్‌పై సంప్రదించాలని తెలిపింది. అత్యవసరం సేవలకు అమెరికా పౌరులు HydACS@state.gov కి ఈ- మెయిల్ కూడా చేయవచ్చని పేర్కొంది. సంబంధిత వార్త: వైఎస్సార్.. జార్జిబుష్‌ని ఒప్పించిన వేళ! మార్చి 15 వరకు వీసా ఇంటర్వ్యూ ఉన్న దరఖాస్తుదారులు బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌లో సంప్రదించాలని, మార్చి 23 నుండి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ కోసం నానక్‌రామ్‌గూడలోని నూతన కార్యాలయానికి వెళ్లాలని కాన్సులేట్ జనరల్ సూచించింది. బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్లు, “డ్రాప్‌బాక్స్” అపాయింట్మెంట్లు (ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్నవారు), పాస్‌పోర్ట్ పికప్ సహా ఇతర వీసా సేవలు – లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాదాపూర్, హైదరాబాద్ 500081, లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ (VAC)లో కొనసాగుతాయి. కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని కాన్సులేట్ జనరల్ వివరించింది. వీసా సేవలకి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే, +91 120 4844644, +91 22 62011000పై కాల్ చేయాలి. నానక్‌రామ్‌గూడ కాన్సులేట్ బదిలీ సమాచారం కోసం కాన్సులేట్ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వాలని కాన్సులేట్ జనరల్ పేర్కొంది. Twitter (@USAndHyderabad), Instagram (@USCGHyderabad), Facebook (@usconsulategeneralhyderabad) నాడు మహానేత కృషి 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఆయన చొరవతోనే హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటునకు ఆనాటి అధ్యక్షుడు బుష్ ప్రకటన చేశారు. ఆ వెంటనే బేగంపేటలో ప్యాలెస్‌ను వైఎస్సార్ కేటాయించి.. అదే ఏడాది అక్టోబర్ 24న ఆయనే ప్రారంభించారు. అప్పటి నుంచి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చూసుకున్న ఆ భవనం.. 14 ఏళ్ల పాటు సేవలు అందించింది. ఇప్పుడు యూఎస్ కాన్సులేట్ నానక్‌రామ్‌గూడలోని కొత్త భవనానికి షిఫ్ట్ కానుంది. -
Hyderabad: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు యూఎస్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: భారత్–అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే యూఎస్ కాన్సులేట్ కార్యాలయ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా వైఎస్సార్.. ఆయన్ను ఒప్పించడంతో తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఏర్పడింది. జార్జి బుష్ అమెరికా వెళ్లగానే వైఎస్సార్ కోరిక మేరకు హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇటు వైఎస్సార్ కూడా వేగంగా స్పందించి బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్‌ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్ 24న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చూసుకున్న ఈ భవనానికి ఇదే చివరి వార్షికోత్సవం. అందులో భాగంగా 14 ఏళ్ల పాటు సేవలందించిన కార్యాలయం పైన చివరిసారిగా అమెరికా జెండాను ఎగుర వేశారు. 300 మిలియన్ డాలర్లతో నూతన కాన్సులేట్.. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేదికగా 300 మిలియన్ డాలర్ల వ్యయంతో అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన నూతన భవనంలోకి ఈ కాన్సులేట్ మారనుంది. అనుకోకుండా కాన్సులేట్ ప్రారంభించిన రోజునే ఈ కార్యాలయం చివరి రోజు కావడం, దీపావళి పండుగ కలిసి రావడంతో సిబ్బంది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వీడియోను కాన్సులేట్ జనరల్ జెన్సిఫర్ లార్సన్ విడుదల చేశారు. (క్లిక్: నాగోలు ఫ్లై ఓవర్.. ఎల్బీనగర్– సికింద్రాబాద్ మధ్య ఇక రయ్రయ్) Want a sneak peak of our new consulate building? Here it is! pic.twitter.com/eu4g2Ui1uJ — Jennifer Larson (@USCGHyderabad) June 4, 2022 భారత్‌లో మొదటి శాశ్వత భవన అమెరికా దౌత్య కార్యాలయం.. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ.. భారత్–అమెరికా మధ్య సంబంధాలను మరింత ఉన్నతంగా మార్చడానికి హైదరాబాద్ అనువైన వేదిక అనే ఉద్దేశంతో యూఎస్ కాన్సులేట్‌ను ప్రారంభించామని అన్నారు. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత్‌లో నిర్మించిన మొదటి అమెరికా దౌత్యపరమైన శాశ్వత భవన కార్యాలయం ఇదేనని పేర్కొన్నారు. ఈ కార్యాలయం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. We raised the American flag at US Consulate #Hyderabad at Paigah Palace fourteen years ago today. We begin a new chapter - we’ll see you soon in the new space. pic.twitter.com/XEgJSm4ZMG — Jennifer Larson (@USCGHyderabad) October 24, 2022 -
Hyderabad: నూతన భవనంలోకి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్
-
నూతన భవనంలోకి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ త్వరలోనే నూతన భవనంలోకి మారనుంది. బేగంపేటలోని పైగా ప్యాలస్‌లో 14 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తోంది అమెరికా దౌత్య కార్యాలయం. 2008, అక్టోబర్ 24న హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌లో అమెరికా జెండా తొలిసారి ఎగిరింది. పైగా ప్యాలస్‌లోని కాన్సులేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి అక్కడ ఇదే చివరి వార్షికోత్సవం కానుంది. త్వరలోనే సుమారు 300 మిలియన్ డాలర్లతో నిర్మించిన కొత్త భవనంలోకి మారనున్నారు. ఈ క్రమంలో పైగా ప్యాలస్‌లో కాన్సులేట్ స్టాఫ్ తుది వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి నూతన భవనంలో అమెరికా జెండాను ఎగురవేయనున్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలతో అగ్రరాజ్య సంబంధాలను పర్యవేక్షిస్తోంది. ఇదీ చదవండి: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. -
సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ బుధవారం కలిశారు. కొత్త రాష్ట్రమైనా, ఆర్థిక ఇబ్బందులున్నా.. కొవిడ్ మేనేజ్మెంట్ బాగా చేశారని సీఎంను జెన్నిఫర్ అభినందించారు. జీడీపీ గ్రోత్‌రేట్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉండటంపై ఆమె ప్రశంసించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం అన్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధమని సీఎం పేర్కొన్నారు. చదవండి: ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
యూఎస్ కాన్సుల్ జనరల్‌గా జెన్నీఫర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ బాధ్యతలు చేపట్టారు. ముంబైలోని యూఎస్ కాన్సులేట్ డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా, యాక్టింగ్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన అనుభవమున్న జెన్నిఫర్ లార్సన్ తాజాగా హైదరాబాద్ కాన్సులేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆమె మాట్లాడుతూ ఉన్నత విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉమ్మడి మిలిటరీ విన్యాసాల వంటి అనేక అంశాల్లో అమెరికా–భారత్‌ల మధ్య సంబంధాలు బలపడుతున్నాయన్నారు. దాదాపు 19 ఏళ్లపాటు దౌత్యవేత్తగా పనిచేసిన అనుభవమున్న జెన్నిఫర్.. లిబియా, పాకిస్థాన్, ఫ్రాన్స్, సూడాన్, జెరూసలేం, లెబనాన్లలో పనిచేశారు. అంతకుముందు నేషనల్ పబ్లిక్ రేడియోలో ఓ టాక్ షో నిర్మాతగా వ్యవహరించారు. ‘అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లోని సాహిత్యాల్లో పోలికలు’, ‘మధ్యప్రాచ్య’అంశాలపై కాలిఫోర్నియా వర్సిటీలో అండర్గ్రాడ్యుయేట్ విద్యనభ్యసించారు. -
వీసా అపాయింట్మెంట్ల పెంపునకు కృషి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా తగ్గిపోయిన వీసా అపాయింట్మెంట్లను పెంచడానికి శాయశక్తులా కృషి చేయబోతున్నా మని హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లా ర్సన్ తెలిపారు. హైదరాబాద్‌లో యూఎస్ఏ కాన్సుల్ జనరల్‌గా నియమితులైన జెన్నిఫర్‌ను అమెరికాలో ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. కొద్దిరోజుల్లో ఆమె హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. జెన్నిఫర్ మాట్లాడుతూ.. అమెరికా, భారత్ మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తాన న్నారు. వచ్చే నవంబర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఎంబసీని హైదరాబాద్‌లో ప్రా రంభించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త భవన సముదాయంలో 55 వీసా విండోస్‌తో వేగంగా ప్రాసెస్ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా సమాజానికి అందించిన ఉత్తమసేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా ఇచ్చే ‘ప్రెసిడెంట్ వాలంటరీ అవార్డు’ను సాఫ్ట్వేర్ రంగంలోని వ్యాపారవేత్త రవి పులికి అందించారు. 2019లో కోవిడ్ సందర్భంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను రవి ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేర్చారు. 5,279 గంటల వాలంటరీ సమయాన్ని ఆయ న సమాజహితం కోసం కేటాయించడం గర్వించదగినదని జెన్నిఫర్ కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అవార్డుతోపాటు ఇచ్చే ‘బటన్’ను రవికి బహూకరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారత కాన్సులేట్ మినిస్టర్(ఎకనామిక్) డాక్టర్ రవి కోటతోపాటు యూఎస్ఐబీసీ, సీఐఐ, ఎఫ్ఐసీసీఐ, యూఎస్ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్, ఇండియన్ ఎంబసీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌కు ఘనసత్కారం
వాషింగ్టన్‌డీసీ: హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులెట్ జనరల్‌గా నియమితులైన జెన్నిఫర్ లార్సన్‌కు అభినందనలు తెలిపారు ప్రవాసాంధ్రులు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జెన్నిఫర్ లార్సన్‌కు గౌరవ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వ్యాపార దిగ్గజాలు పాల్గొన్నారు.. కార్యక్రమంలో మాట్లాడుతున్న జెన్నిఫర్ లార్సన్ అమెరికా-భారత వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల్లో చురుకుగా పాల్గొంటున్న వారు, వివిధ తెలుగు సంఘాల్లో పనిచేస్తున్న ప్రముఖులు జెన్నిఫర్ లార్సన్ను అభినందించారు. వ్యాపారవేత్త పార్థ కారంచెట్టి జెన్నిఫర్ లార్సన్ పూలగుచ్ఛంతో స్వాగతం పలికారు. అమెరికాలో పాతికేళ్లుగా సామాజిక సేవల్లో ముందుండేసాఫ్ట్వేర్ వ్యాపార దిగ్గజం రవి పులి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కోవిడ్ సమయంలో అమెరికాలో చిక్కుకు పోయిన ఎందరో భారతీయులను ప్రత్యేక విమానంలో భారత్‌కు చేర్చిన రవి పులి తెలుగువారికి సుపరిచుతులే. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కొత్త కాన్సులేట్ జనరల్ లార్సన్ను రవి పులి అభినందించారు. తాము ఈ దేశంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ, అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నా, మాతృదేశంపై మమకారంతో, రెండు దేశాల మధ్య సాంస్కృతిక, సాంకేతిక, ఆర్థిక, వైద్య లాంటి అన్ని రంగాల్లో పరస్పరం సహకరించుకుని, రెండు దేశాల అభివృద్ధిలో తమ వంతు సహకారం చేయడానికి ఈ సమావేశం ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నామని రవి పులి అన్నారు. ఈ సందర్భంగా జెన్నిఫర్ ప్రవాసాంధ్రులను అభినందించారు. వచ్చే నవంబర్‌లో, ఆసియాలోనే అతి పెద్ద ఎంబసీ హైదరాబాద్‌లో ప్రారంభించ బోతున్నామన్నారు. అక్కడ 55 వీసా విండోస్‌తో, కోవిడ్ మహమ్మారి సమయంలో వెనుకబడిన వీసా సంఖ్యని పెంచడానికి శాయశక్తులా కృషి చేయబోతున్నాం" అని అన్నారు. ప్రతీ సంవత్సరం అమెరికాలో సమాజానికి చేసే ఉత్తమ సేవలకు ఇచ్చే “ప్రెసెడెంట్ వాలంటరీ అవార్డు"ని రవి పులి గెలుచుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. 5279 గంటల వాలంటరీ సమయాన్ని రవి పులి, సమాజ హితం కోసం కేటాయించడం గర్వించదగిందని అమెరికా అధ్యక్షులు తమ అవార్డు సందేశంలో రవి పులి సేవలని కొనియాడారు. ప్రెసిడెంట్ బైడెన్ అవార్డు సందేశాన్ని చదివిన అనంతరం, అవార్డుతో పాటు ఇచ్చే బటన్‌ను రవి పులికి బహుకరించారు మిస్సెస్ జెన్నిఫర్. ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ మినిష్టర్ (ఎకనామిక్ ) డాక్టర్ రవి కోట ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతున్న రవి పులి హైద్రాబాద్‌లో అమెరికా కాన్సులేట్ కార్యాలయ విధులు నిర్వహిణకు ఎలాంటి మద్ధతు కావాలన్నా తామంతా ముందుంటామని ప్రవాసాంధ్రులు తెలిపారు. ఈ సమావేశంలో USIBC, CII, FICCI,US India SME Council, Indian Embassy ప్రతినిధులు, సైంటిస్టులు,, వ్యాపార వేత్తలు, CGI కంపెనీ అధికారులు పాల్గొన్నారు. చివరిగా వ్యాపారవేత్త జయంత్ చల్లా వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. -
పెట్టుబడుల స్వర్గానికి స్వాగతం
అమెరికా, భారత్ సంబంధాల్లో వాణిజ్య పరమైన బంధాలు కీలకమైనవి. అమెరికా, భారతీయ సంస్థలు హైదరాబాద్‌లో ఔషధ, అంతరిక్ష పరిజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో సన్నిహితంగా పనిచేస్తున్నాయి. నిజానికి 2014 నుంచి తెలంగాణలో అమెరికా కంపెనీలు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. భారత్‌లో అమెరికా మదుపులను మేం ప్రోత్సహిస్తూనే, అమెరికాలో భారత పెట్టుబడుల పొత్తులకు కూడా ఎదురుచూస్తున్నాం. అందుచేత ఈ సంవత్సరం ‘సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ సదస్సు’ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ‘సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ అమెరికాలో జరిగే ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్. ప్రపంచంలో అతిపెద్ద మదుపు మార్కెట్లో అవకాశాల కోసం ఇది వేలాది మదుపుదారులను ప్రపంచ మంతటి నుంచి ఆకర్షిస్తుంటుంది. అమెరికా వాణిజ్య విభాగానికి చెందిన సెలెక్ట్ యూఎస్ఏ ఆఫీసు నిర్వహించే ఈ సదస్సు... అమెరికాలో అపారమైన మదుపు అవకాశాల గురించి తెలుసుకోవడానికి ఉప యోగపడుతుంది. ఈ సంవత్సరం భారత్‌లోని అమెరికన్ ఎంబసీ... జూన్ 26 నుంచి 29 వరకు వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న సెలెక్ట్ యూఎస్ఏ సదస్సుకు భారీ భారతీయ వాణిజ్య ప్రతినిధుల బృందం హాజరయ్యేలా చూస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారులున్న మార్కెట్. మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఒడిశాలో కంపెనీ ఉండి... అంత ర్జాతీయంగా ఎదగాలని చూస్తున్నట్లయితే, అమెరి కాలో మీకు అవకాశాలకు కొదవే లేదు. ఏటా 20 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తినీ, 32 కోట్ల మంది ప్రజానీకాన్నీ కలిగి ఉన్న అమెరికా, మీకు ఇతరులతో పోల్చలేని వైవిధ్యభరితమైన అవకాశాలను అంది స్తుంది. అద్భుతమైన న్యాయపాలన, మేధా సంపత్తి హక్కుల పరిరక్షణ, అధునాతనమైన టెక్నాలజీ వంటి అనేక పెట్టుబడి అనుకూల పరిస్థితులు భారత్ నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లను ఇప్పటికే ఆకర్షించాయి. 2020లో అమెరికాలో భారతీయ పెట్టుబడులు 12.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆరోగ్య సంర క్షణ, ఔషధాలు, టెక్నాలజీ వంటి రంగాల్లో అతిపెద్ద భారతీయ కంపెనీలు అమెరికాలో పెట్టుబడి పెట్టాయి. 2011 నుంచి ఇప్పటి వరకు జరిగిన సదస్సుల్లో భారత్ నుంచి 400 మంది పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం నిర్వహించనున్న సదస్సు... దాదాపు 80 గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చే పెట్టుబడి దారులకు, సంస్థల ప్రతినిధులకు అనేక అవకాశాలను అందిస్తుంది. ఈడీఓలను, సర్వీస్ ప్రొవైడర్లను, ఇండస్ట్రీ నిపుణులను, అంతర్జాతీయ టెక్ స్టార్టప్‌లను కలుసు కుని వారి అనుభవాలు, ముందు ముందు వచ్చే అవకాశాల గురించి చర్చించవచ్చు. అలాగే అమెరికా లోని 50 రాష్ట్రాలు, ప్రాదేశిక ప్రాంతాల నెట్వర్క్. 80కి పైగా కంపెనీలు, మార్కెట్లు, స్పీకర్లు, ప్రభుత్వ అధికారులు వంటి వారితో... ఒక్కొక్కరితో కానీ లేదా గ్రూప్‌లతో కానీ జరిపే సమావేశాలు మీకు పెట్టుబడి ఒప్పందాలను కుదిర్చిపెడతాయి. 100కి పైగా సెషన్లలో పాలసీ, పరిశ్రమల నిపుణుల నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. అమెరికా వ్యాప్తంగా పరిశ్రమల భాగస్వాములతో విలువైన భాగస్వామ్యం ఏర్పర్చుకునే అవకాశాలను ఈ సదస్సు అందిస్తుంది. ఈ సదస్సు గురించి మరింత సమాచారానికి, రిజిస్ట్రేషన్ వివరాలకు, selectusasummit.usని చూడండి. సదస్సు గురించి మరింత సమాచారం, రిజిస్టర్ ఎలా చేయాలి వంటి వాటిపై సందేహాలను Andrew.Edlefsen@trade.govకి పంపించవచ్చు. - జోయెల్ రీఫ్‌మన్ యూఎస్ కాన్సుల్ జనరల్, హైదరాబాద్ -
అమెరికాకు బిగ్ షాక్.. రాయబార కార్యాలయంపై మిస్సైల్స్ దాడి
బాగ్దాద్: ఓ వైపు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయంగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయంపై ఆదివారం మిస్సైల్ దాడులు జరిగాయి. ఈ దాడులతో ఒక్కసారి అగ్రరాజ్యం అలర్ట్ అయ్యింది. వివరాల ప్రకారం.. ఉత్తర ఇరాక్‌లోని ఇర్బిల్ పట్టణంలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయ భవనం వైపు దాదాపు 12 మిస్సైల్స్ దూసుకొచ్చినట్లు అమెరికా భద్రతా వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇరాన్‌కు సమీప దేశాల నుంచి మిస్సైల్స్ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. మిస్సైల్ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అమెరికా భద్రతా సిబ్బంది ఒకరు మీడియాకు చెప్పారు. అయితే, ఈ దాడులపై బైడెన్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఈ దాడులు ఎవరు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ దాడులను ఖండిస్తున్నట్టు ఇరాన్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మిస్సైల్స్ దాడుల వల్ల అమెరికా రాయబార కార్యాలయం పరిసరాల్లో మాత్రమే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అది కొత్త భవనమని అందులో ప్రస్తుతానికి ఎవరూ ఉండటం లేదని సమాచారం. -
ఏపీ ప్రభుత్వానికి US కాన్సులేట్ అభినందనలు
-
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి యూఎస్ కాన్సులేట్ అభినందనలు
-
ఏపీ ప్రభుత్వానికి యూఎస్ కాన్సులేట్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యూఎస్ కాన్సులేట్ అభినందనలు తెలిపింది. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌పై యూఎస్ కాన్సులేట్ ప్రశంసలు కురిపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైద్య సిబ్బందిని యూఎస్ కాన్సులేట్ అభినందించింది. ఒకే రోజు 1.3 మిలియన్ ప్రజలకు వ్యాక్సిన్ వేయడంపై ప్రశంసించింది. చదవండి: శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి ఏపీపీఎస్సీపై నిరాధార ఆరోపణలు -
కరోనా వైరస్: అమెరికా వీసాలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో మే 3 నుంచి అన్ని రకాల రోజువారీ వీసాల జారీ ప్రక్రియను రద్దు చేసినట్లు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మంగళవారం ప్రకటించింది. తదుపరి ప్రకటన చేసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. అన్ని రకాల నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు, ఇంటర్వ్యూ మాఫీ చేసి అపాయింట్మెంట్లు సైతం రద్దు చేసినట్లు వెల్లడించింది. అమెరికా పౌరుల కోసం అన్ని రకాల రోజువారీ సేవల అపాయింట్మెంట్లను ఏప్రిల్ 27 నుంచి రద్దు చేసినట్టు తెలిపింది. అమెరికా పౌరులకు అత్యవసర సేవలు, వీసా అపాయింట్మెంట్లు కొనసాగుతాయని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం అత్యవసర అపాయింట్మెంట్లను యథాతథంగా జరుపుతామని తెలిపింది. చదవండి: 50% ప్రయాణికులతోనే ఆర్టీసీ బస్సులు -
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: అర్హులైన ప్రతి విద్యార్థికి వీసా జారీ చేసేందుకు కట్టుబడి పనిచేస్తున్నామని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్ చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ఇక్కడ దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో మూడొంతుల మందికి వీసాలు జారీ చేశామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల గతేడాది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు ఆటంకం కలిగిందని.. విద్యార్థులు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. తిరిగి వీసాల జారీ ప్రక్రియను పునరుద్ధరించాక హైదరాబాద్‌లోని కాన్సులేట్ లో స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్లకు భారీగా డిమాండ్ పెరిగిందన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వై-యాక్సిస్ ఫౌండేషన్‌లో శుక్రవారం ‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ సెంటర్’ను జోయెల్ రీఫ్‌మన్ ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు సకాలంలో క్యాంపస్‌లలో చేరేందుకు వీలుగా స్టూడెంట్ వీసాల జారీకి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. భారత్‌తో అమెరికా సంబంధాల్లో విద్యార్థులకు వీసాల జారీ ప్రక్రియ వెన్నెముక లాంటిందని పేర్కొన్నారు. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయులేనని చెప్పారు. ప్రస్తుతం యూఎస్‌లో 1,93,124 మంది భారత విద్యార్థులు ఉండగా.. అందులో 85 వేల మంది గ్రాడ్యుయేట్, 25 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్, 81 వేల మంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) చేస్తున్నారని వివరించారు. భారత్‌లోని ఇతర ప్రాంతాలతో పోల్చితే.. ఏపీ, తెలంగాణ నుంచే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు యూఎస్‌కు వస్తున్నారని చెప్పారు. ప్రతి నాలుగు తెలుగు కుటుంబాల్లో ఒకదానికి యూఎస్‌తో సంబంధాలు ఉన్నాయన్నారు. మరింత మంది భారత విద్యార్థులకు వీసాలు జారీ చేయడం కోసం వై-యాక్సిస్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎడ్యుకేషన్ యూఎస్ఏ సెంటర్‌ను ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల విద్యార్థులకు ఈ కేంద్రంలోని నిపుణులైన సలహాదారులు అమెరికాలో ఉన్న విద్యా అవకాశాలపై ఉచిత సలహాలు ఇస్తారని వివరించారు. భారతదేశంలో ఇది 8వ ఎడ్యుకేషన్ యూఎస్ఏ సెంటర్ అని చెప్పారు. యూఎస్‌లో 4000కు పైగా కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకు అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని కొత్త యూఎస్ కాన్సులేట్ భవనంలో 54 వీసా ఇంటర్వూ్య విండోలు ఉన్నాయని.. ఎక్కువ మందికి వీసా అపాయింట్మెంట్ ఇవ్వడానికి సదుపాయాలు మెరుగుపర్చామని చెప్పారు. కాగా.. జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని వై-యాక్సిస్ ఫౌండేషన్‌లో ఎడ్యుకేషన్ యూఎస్ఏ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలోని ఉన్నత విద్యా అవకాశాలపై పుస్తకాలు, మ్యాగజైన్లు, డీవీడీలను అందుబాటులో ఉంచారు. లాభాపేక్ష లేకుండా సలహాలు ఎడ్యుకేషన్ యూఎస్ఏ సెంటర్లో విద్యార్థులకు సరైన దిశా నిర్దేశం చేస్తామని వై-యాక్సిస్ వ్యవస్థాపకుడు జేవియర్ అగస్టిన్ వెల్లడించారు. సలహాల కోసం ప్రైవేటు ఏజెంట్ల దగ్గరికి వెళ్తే.. వారికి కమీషన్లు ఇచ్చే వర్సిటీలు, కళాశాలలకు పంపుతారన్నారు. తమ సంస్థ అలాంటి అనైతిక పనులు చేయదని, కేవలం విద్యార్థుల శక్తి సామర్థ్యాలు, వారి ఆసక్తి ఆధారంగా మాత్రమే సలహాలు ఇస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీ పబ్లిక్ అఫైర్ మినిస్టర్ కౌన్సిలర్ డెవిడ్ కెన్నడీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సీఎం జగన్ పాలనపై యూఎస్ కాన్సులేట్ జనరల్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: విశాఖలో హబ్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయల్ రీఫ్‌మెన్ వెల్లడించారు. మంగళవారం ఆయన కాన్సులేట్ అధికారులు డేవిడ్ మోయర్, సీన్ రూథ్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తాము విశాఖలో పర్యటించామని, అక్కడి వసతులు, సౌకర్యాలు తమకు ఎంతో సంతృప్తి నిచ్చాయని ఈ సందర్భంగా జోయల్ రీఫ్‌మెన్ ముఖ్యమంత్రికి తెలిపారు. కాన్సులేట్ లేని నగరాల్లో దేశంలో ఇప్పటి వరకు ఒక్క అహ్మదాబాద్‌లో మాత్రమే అలాంటి హబ్ ఉందని చెప్పారు. ఇంక్యుబేటర్ సెంటర్ కోసం వినతి ► విశాఖలో హబ్ ఏర్పాటు నిర్ణయాన్ని సీఎం జగన్ స్వాగతించారు. స్మార్ట్ సిటీగా విశాఖ ఎదగడంలో అమెరికా సహకరించాలని కోరారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో తెలుగు వారు రాణిస్తూ.. ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుండటం సంతోషదాయకం అన్నారు. ► ఢిల్లీలో ఉన్నట్లు విశాఖలోనూ అమెరికా ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తికి అమెరికా కాన్సుల్ జనరల్ సానుకూలంగా స్పందించారు. విశాఖలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ► అమెరికా –ఆంధ్ర మధ్య పరస్పర సహకారం మరింత పెంపొందేలా కాన్సుల్ జనరల్ చొరవ చూపాలని, ఆ దిశలో తాము కూడా కలిసి నడుస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆంగ్ల భాష ప్రాధాన్యం గుర్తించామని, అందువల్లే అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ► ఢిల్లీలోని ప్రాంతీయ ఆంగ్ల భాషా కార్యాలయం (రెలో) కార్యకలాపాలను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలో 98 శాతం స్కూళ్లు ఆంగ్లంలో బోధిస్తున్నాయని చెప్పారు. టీచర్లకు ఆంగ్ల భాషలో శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తమతో రెలో కలిసి రావాలని ఆకాంక్షించారు. పెట్టుబడులకు అనుకూలం ► పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైన రాష్ట్రం అని, విశాలమైన సముద్ర తీర ప్రాంతం అందుకు ఎంతో దోహదకారిగా నిలుస్తోందని సీఎం చెప్పారు. నౌకాశ్రయాల నిర్మాణంతో ఆర్థికాభివృద్ధి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ► అందువల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు కాన్సుల్ జనరల్ చొరవ చూపాలని, ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. రాష్ట్ర ప్రగతికి అమెరికా సహకరించాలని కోరారు. హబ్ అంటే.. అమెరికన్ కాన్సులేట్లలో హబ్ ఉంటుంది. అమెరికాకు సంబంధించిన సకల సమాచారం ఇందులో లభ్యమవుతుంది. ఒకరకంగా ఇది లైబ్రరీ లాంటిది. పుస్తకాలతో పాటు వీడియో, ఆడియో డాక్యుమెంటరీలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఎవరైనా వెళ్లి సమాచారం తెలుసుకోవచ్చు. కాన్సులేట్లు లేని నగరాల్లో తొలి హబ్ అహ్మదాబాద్‌లో మాత్రమే ఉండగా, ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలో ఏర్పాటుకు అమెరికా ఆసక్తి చూపిస్తోంది. (చదవండి: సీఎం జగన్‌ను కలిసిన స్వాత్మానందేంద్ర సరస్వతి) ప్రభుత్వ పనితీరు భేష్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు, పథకాలు విప్లవాత్మకంగా ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ స్థాయికి పరిపాలనను తీసుకెళ్లడం అభినందనీయం. వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల డోర్ డెలివరీ అత్యుత్తమ విధానం. దీని వల్ల ఎక్కడా అవినీతికి, దళారి వ్యవస్థకు తావుండదు. అన్ని పథకాల ప్రయోజనాలను ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. సామాజిక తనిఖీ వంటి వాటి ద్వారా పారదర్శక ప్రక్రియ కొనసాగుతోంది. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పని తీరు, కోవిడ్ మేనేజ్మెంట్ చాలా బావుంది. – జోయల్ రీఫ్‌మెన్, అమెరికా కాన్సుల్ జనరల్ -
కరోనా : ఆ 99మందిని వారి స్వదేశానికి తరలించారు
సాక్షి, హైదరాబాద్ : కరనా వైరస్ నేపథ్యంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన 99 మంది అమెరికన్ జాతీయులను మంగళవారం వారి సొంత దేశానికి తరలించారు. ముందుగా ముంబై నుంచి వచ్చిన ఎ320 ఎయిర్‌బస్ విమానంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారందరిని మధ్యాహ్నం 3.12 గంటల సమయంలో ముంబైకి తరలించారు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.15గంటల ప్రాంతంలో వారంతా అమెరికాకు బయలుదేరారు. కాగా యుఎస్ కాన్సులేట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చేసుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లో చిక్కుకున్న 99మందిని మధ్యాహ్నం 1 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. అనంతరం వారందరికి అప్పటికే పూర్తిగా సానిటైజ్ చేసిన ఎయిర్‌పోర్ట్‌లోని ప్రధాన టెర్మినల్ బిల్డింగ్‌లో ఉంచారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ప్రయాణికులందరికి థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారందరిని ఎ320 ఎయిర్‌బస్ విమానంలో తరలించారు. కాగా మార్చి 31న ఇదే విధంగా 38 మంది జర్మన్ దేశీయులను ఇండిగో ఫ్లైట్‌లో వారి స్వదేశానికి తరలించారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో 404 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. (తెలంగాణలో 404కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు) -
అమెరికా కాన్సులేట్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అమెరికా కాన్సులేట్ కీలయ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి వీసా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు వీసా సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొంది. వీసా అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. భారత్‌లోని అన్ని అమెరికన్ కాన్సులేట్లకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. కాగా, కరోనా వ్యాప్తిని దృష్ట్యా అమెరికాలో శుక్రవారం ఎమర్జెన్సీ(నేషనల్ ఎమర్జెన్సీ) విధించిన సంగతి తెలిసిందే. (చదవండి : కరోనా ఎఫెక్ట్: అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ) కరోనా ప్రపంచ దేశాల్లో మరణమృదంగం మోగిస్తోంది. ఈ కోవిడ్–19 వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5 వేలు దాటింది. కేసుల సంఖ్య 1.34 లక్షలకు చేరింది. కరోనా ప్రకంపనలు భారత్‌లో కూడా విస్తరిస్తున్నాయి.ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలు వైరస్ వ్యాప్తిని నిరోధించే దిశగా చర్యలను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఐటీ రాజధాని బెంగళూరు నగరం సహా కర్నాటక వ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. షాపింగ్ మాల్స్‌ను, సినిమా థియేటర్లను, పబ్‌లు, నైట్ క్లబ్‌లను తక్షణమే మూసేయాలని ఆదేశించారు. (చదవండి :భారత్‌లో రెండో మరణం) -
బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: ఇరాన్, అమెరికా దేశాల మధ్య దాడుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలను మొహరించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద భారీ భద్రత నేపథ్యంలో బేగంపేటలో ట్రాఫిక్‌కు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఉదయం ఆఫీసులు, విద్యాసంస్థలకు వెళ్లేవారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. రద్దీ సమయంలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా, మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై డిసెంబర్ 31న ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు దాడికి పాల్పడటంతో చిచ్చు రగిలింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానిని డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులతో అమెరికా అంతమొందించింది. సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై తాజాగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సంబంధిత వార్తలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు నష్టాన్ని అంచనా వేస్తున్నాం: ట్రంప్ ఇరాన్ దాడి : భగ్గుమన్న చమురు ట్రంప్–మోదీ ఫోన్ సంభాషణ 52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్! సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట -
రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ఏపీకి ఉజ్వల భవిత
సాక్షి, హైదరాబాద్ : రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ఏపీకి మంచి భవిష్యత్తు ఉం దని హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్ జోయ ల్ రీఫ్‌మన్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అమెరికా భారత్ రక్షణ సంబంధాల అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఢిల్లీ రాయబార కార్యాలయ అధికారి కెప్టెన్ డేనియల్ ఇ ఫిలియన్, ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల విశాఖలో అమెరికా, భారత్ త్రివిధ సైనిక దళాలు ప్రదర్శించిన సైనిక విన్యాసాలు రక్షణ రంగంలో ఏపీ సామర్థ్యానికి అద్దం పట్టాయన్నారు. ఏపీ, తెలంగాణతో అత్యున్నత రక్షణ సాంకేతిక సహకార బంధం ఏర్పర్చుకునేందుకు అమెరికన్ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయన్నారు.డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో రెండు రాష్ట్రాలకు అనేక అనుకూలతలున్నాయని తెలిపారు. అమెరికా విద్యాసంస్థల్లో చదివే భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీసాల జారీని కొనసాగించడంతో పాటు, భవిష్యత్తులో పెంచుతామని చెప్పా రు. తాజాగా అమెరికా భారత్ నడుమ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఒప్పందానికి తుది రూపునిచ్చినట్టు తెలిపారు. -
వైజాగ్ డిఫెన్సీ సెక్టార్లో పెట్టుబడులు పెట్టండి
-
సీఎం జగన్‌తో అమెరికన్ కాన్సుల్ జనరల్ భేటీ
-
సీఎంను కలిసిన అమెరికన్ కాన్సులేట్ జనరల్
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్‌లో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్మాన్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను తొలిసారి కలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సమయంలో రిఫ్మాన్ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన విధానాల గురించి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషి చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాలనా సంస్కరణలపై రిఫ్మాన్ ప్రశంసలు కురిపించారు. మరోవైపు ముఖ్యమంత్రితో హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ ఎస్ఈజెడ్ డెవలప్మెంట్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫుట్‌వేర్ తయారీ కోసం ప్రత్యేక ఆర్ధిక మండలి( ఎస్ఈజెడ్) ఏర్పాటుపై చర్చించారు. ఈ ఆర్ధిక మండలి ఏర్పాటుకు రూ.700 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, దాదాపు పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఇంటెలిజెంట్ ఎస్ఈజెడ్ ప్రతినిధులు చెప్పారు. అనుమతి ఇచ్చిన ఐదేళ్లలోగా రూ.350కోట్ల రూపాయల ఖర్చుతో మొదట విడత పెట్టుబడి పెడతామని ప్రతిపాదించారు. విస్తరణ రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్ అనుబంధ సంస్ధే ఇంటెలిజెంట్ ఎస్ఈజెడ్ డెవలప్మెంట్ లిమిటెడ్. ప్రపంచ ప్రఖ్యాత ఆడిడాస్ బ్రాండ్ ఉత్పత్తులు ఈ సంస్ధ నుంచే వస్తున్నాయి. భారత్, చైనా, వియత్నాం దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. రూ. 1750 కోట్ల రూపాయల పెట్టుబడితో యూనిట్లను నిర్వహిస్తూ 25వేలమందికి ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా ఉద్యోగాలిస్తోంది. నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టులో అపాచీ పుట్వేర్ ఎస్ఈజెడ్లో ఇంటెలిజెంట్ సంస్ధ భాగస్వామి. ఏపీలో 2006 నుంచి ఈ సంస్ధ నెలకు 12 లక్షల జతల పుట్‌వేర్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటివరకు రూ.700కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, 11వేల మందికి ఉద్యోగాలు కల్పించామని కంపెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అలాగే వియత్నాంలో కూడా ఏడాదికి 50లక్షల జతల పుట్‌వేర్‌ను ఉత్పత్తి చేస్తున్నామని ఆ దేశంలో దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. గవర్నర్‌ను కలిసిన కాన్సులేట్ జనరల్ కాగా అంతకు ముందు అమెరికన్ కాన్సుల్ జనరల్ రీఫ్‌మెన్, కాన్సుల్ సభ్యులు బుధవారం రాజ్ భవన్లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. వీరిరువురి మధ్య విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. అమెరికా, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, ఆ క్రమంలోనే విశాఖ స్మార్ట్ సిటి ఏర్పాటులో తమ భాగస్వామ్యం ఉంటుందని, నిధులు సద్వినియోగం అవుతున్నాయని కాన్సుల్ జనరల్ వివరించారు. అమెరికన్ కంపెనీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాకు చెందిన వారే గణనీయంగా విధులు నిర్వహిస్తున్నారని, మరింతగా వారికి అవకాశాలు వచ్చేలా చూస్తామని తెలిపారు. అలాగే అమెరికా, భారత్‌లోని గవర్నర్ వ్యవస్ధలపై వీరిరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. -
విశాఖ చాలా బాగుంది: యూఎస్ కాన్సుల్ జనరల్
సాక్షి, విశాఖపట్నం: భారత్‌తో మెరుగైన రక్షణపరమైన సంబంధాలకోసమే వచ్చే నెలలో సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్మన్ తెలిపారు. భారత్‌తో అమెరికాకు మంచి దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయని, వివిధ రంగాలలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. విశాఖ పోర్టులో అమెరికా నౌక ఎమౌరీ ఎస్ ల్యాండ్‌కు యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్మన్ స్వాగతం పలికారు. వచ్చే నెలలో విశాఖలో ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లతో యుఎస్ నేవీ సంయుక్త విన్యాసాలు జరగనున్న నేపధ్యంలో యూఎస్ నేవీ అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా తొలిసారిగా విశాఖ వచ్చిన జోయల్ రిఫ్మన్ మీడియాతో మాట్లాడుతూ రేపు(మంగళవారం) ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవబోతున్నట్లు తెలిపారు. యూఎస్ కాన్సుల్ జనరల్ ద్వారా అమెరికన్ వీసా జారీపై విద్యార్ధులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామన్నారు. అమెరికాలో రెండు లక్షల మంది భారతీయ విద్యార్ధులు ఉన్నారని, వారు నకిలీ విశ్వవిద్యాలయాల వల్ల మోసపోకుండా ఎడ్యు యుఎస్ ద్వారా ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. తొలిసారిగా విశాఖ వచ్చానని... విశాఖ నగరం చాలా బాగుందని ప్రశంసించారు. అమెరికా-భారత్ మధ్య మెరుగైన రక్షణపరమైన సంబంధాలకోసమే సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విశాఖ తీరానికి యుఎస్ షిప్ లు రావడం ఇది మూడోసారి అని అన్నారు. యుఎస్ షిప్ లో వంద మంది మహిళానేవీ అధికారులతో పాటు మొత్తంగా 500 మంది నేవీ అధికారులున్నారని... వీరంతా వచ్చే నెలలో భారత్ త్రివిధ దళాలతో జరిగే సంయుక్త విన్యాసాలలో పాల్గొంటారని తెలిపారు. భారత్-అమెరికా సంయుక్త భాగస్వామ్యంతో త్వరలో హైదరాబాద్ లో ఎఫ్ -16, ఎఫ్-21 విమానాల రెక్కల తయారీ జరగనున్నట్లు జోయల్ రిఫ్మన్ తెలిపారు. -
అమెరికా, ఏపీ మధ్య సంబంధాలు బలోపేతం
సాక్షి, అమరావతి: అమెరికాతో ఏపీ సంబంధాలు మరింతగా బలోపేతం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం నెలకొల్పి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందిస్తున్నట్టుగా తెలిపే వీడియో సందేశాన్ని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ అధికారులు విడుదల చేశారు. ఇందులో వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘‘నాకు బాగా గుర్తు. పదేళక్రితం నాన్నగారు సీఎంగా ఉండగా హైదరాబాద్‌కు అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని తీసుకువచ్చారు. ఈ పదేళ్లలో ఈ కాన్సులేట్ కార్యాలయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో సేవ చేసింది. ప్రపంచం వేగంగా మారుతోంది. భారతదేశానికి అమెరికా అన్ని విధాలుగా సహకరిస్తోంది. అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలి. అమెరికాతో కలసి పని చేయడం ఏపీకి ఎంతో ప్రయోజనకరం. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశం అమెరికా. ఏపీలో సాఫ్ట్వేర్ నిపుణులు మెరుగైన ఉద్యోగాలకోసం అమెరికా వైపు చూస్తున్నారు. మున్ముందు కూడా అమెరికా, ఏపీల మధ్య సన్నిహిత సంబంధాలు మరింతగా బలపడతాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
ఉద్వేగానికి లోనవుతున్నా
-
మీకు ఆల్ ది బెస్ట్: సీఎం జగన్
సాక్షి, హైదరాబాద్ : యూఎస్ కాన్సులేట్ పదో వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యూఎస్ కాన్సులేట్ భవనంలో సీఎం జగన్ తమతో మాట్లాడిన వీడియోను యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ‘మా పదేళ్ల ప్రయాణం గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రత్యేక సందేశం’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియోలో సీఎం జగన్ యూఎస్ కౌన్సిల్ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. ఉద్వేగంగా ఉంది.. ‘నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూఎస్ కాన్సులేట్‌ను హైదరాబాద్‌కు రప్పించేందుకు ఈ భవనాన్ని కేటాయించారు. సరిగ్గా పదేళ్ల క్రితం నేను ఇప్పుడు ఈ భవనానికి ముఖ్యమంత్రి స్థాయిలో రావడం ఎంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. ఈ సుదీర్ఘ కాలంలో ప్రపంచం ఎంతగానో మారిపోయింది. భారత్‌కు సహాయం చేసే విషయంలో అమెరికా ఎల్లప్పుడూ ముందుంటుందన్న విషయం తెలిసిందే. కాన్సులేట్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తోంది. పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో కీలక సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు మరింతగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సాఫ్ట్వేర్ లేదా ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఉద్యోగం కోసం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా వైపే చూస్తున్నారు. విజయవంతంగా పది వసంతాలు పూర్తి చేసుకున్న యూఎస్ కాన్సులేట్‌కు శుభాభినందనలు. ఆల్ ది బెస్ట్’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. Watch Andhra Pradesh CM @ysjagan sharing a special message for @USAndHyderabad as we continue our 10 year anniversary celebrations. #USinHYD10 #USIndiaDosti pic.twitter.com/jGLuvRhmv2 — U.S. Consulate General Hyderabad (@USAndHyderabad) August 30, 2019 -
బాధ్యతల స్వీకరించిన జోయల్ ఫ్రీమన్
సాక్షి, హైదరాబాద్: యూఎస్ కాన్సులేట్ నూతన కాన్సుల్ జనరల్‌గా జోయల్ ఫ్రీమన్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం నగరంలోని కాన్సులేట్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఢాకాలో యూఎస్ ఎంబసీలో ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా, వాషింగ్టన్ డీసీలో బ్యూరో ఆఫ్ ఇంటలిజెన్స్ అండ్ రీసెర్చ్‌లో సీనియర్ లైజన్ అధికారిగా పనిచేశారు. పలుదేశాల్లో అమెరికా తరఫున వివిధ హోదాల్లో పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జోయల్ మాట్లాడారు. హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో కాన్సుల్ జనరల్‌గా పనిచేసిన కేథరిన్ హడ్డా ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
అమెరికన్ కాన్సులేట్ జనరల్‌తో సీఎం జగన్ భేటీ
వాషింగ్టన్ డీసీ : అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యూఎస్ విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కొత్త జనరల్ జోయల్ రిచర్డ్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అనంతరం మధ్య, దక్షిణాసియా వ్యవహారాల ఉప మంత్రి థామస్ వాజ్దాతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ క్లాడియా లిలైన్‌ఫీల్డ్‌తో సీఎం చర్చలు జరిపారు. గ్లోబల్ సస్టైనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ క్లేనెస్లర్‌తోనూ భేటీ అయి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సోలార్ పవర్ & ఉపకరణాల తయారీలో ప్రముఖ సంస్థ అయిన జాన్స్ కంట్రోల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీ నిర్మాణంలో సహకారం అందిస్తామని జాన్సన్ కంట్రోల్స్ ప్రతినిధులు చెప్పారు. పట్టణాభివృద్ధి, జల నిర్వహణలో సహకారం అందించేందుకు సిద్ధమని జీలీడ్ సైస్సెస్ వెల్లడించింది. వ్యవసాయ పరిశోధనలో ఏపీకి సహకరిస్తామని జీలీడ్ సైన్సెస్ సభ్యులు పేర్కొన్నారు. (చదవండి : సీఎం జగన్‌తో ‘ఆస్క్ ఏ క్వశ్చన్ టు సీఎం’) (చదవండి : అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం మాది) -
హైదరాబాద్‌లో లేకున్నా.. చేనేతనే కట్టుకున్నా!
సాక్షి, హైదరాబాద్: తాను హైదరాబాద్‌లో లేకున్నా.. చేనేత దుస్తులను మర్చిపోనని అమెరికన్ మాజీ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆమె భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. తాను ప్రస్తుతం కాన్సులేట్‌లో లేనప్పటికీ ఈరోజు చేనేత దుస్తులనే ధరించానని బుధవారం ట్వీట్ చేసి కొన్ని ఫొటోలను జతచేశారు. ఆమె కాన్సుల్ జనరల్‌గా ఉన్న సమయంలో చేనేత రంగానికి తగిన ప్రాధాన్యం కల్పించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో సిబ్బంది మొత్తం చేనేత దుస్తుల్లో విధులకు హాజరవడం గమనార్హం. సుష్మ మృతిపై యూఎస్ కాన్సులేట్ దిగ్భ్రాంతి.. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతిపై యూఎస్ కాన్సులేట్ కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్‌తో కలసి సుష్మ సమావేశమైన ఫొటోను పోస్టు చేసింది. -
గేమ్స్‌తో సామాజిక చైతన్యం
సాక్షి, హైదరాబాద్ : ప్రజా జీవనాన్ని ప్రభావితం చేసేలా, సామాజిక చైతన్యాన్ని పెంచేలా ఆధునిక పద్ధతిలో గేమ్స్ రూపొందించాలని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని టీహబ్‌లో 4 రోజులపాటు జరగనున్న ‘గేమ్స్ ఫర్ గుడ్’కార్యక్రమాన్ని ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గేమింగ్ కోసం కార్యక్రమం నిర్వహించడం 30 ఏళ్ల అమెరికన్ కాన్సులేట్ చరిత్రలో ఇదే తొలిసారని వెల్లడించారు. ‘గేమ్స్ ఫర్ గుడ్’మంచి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. స్మార్ట్ఫోన్లు పెరుగుతున్న దరిమిలా అంతర్జాతీయంగా గేమింగ్‌కు చక్కటి ఆదరణ ఏర్పడిందన్నారు. సామాజిక మార్పుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రపంచాన్ని వేధిస్తోన్న శరణార్థులు, వాతావరణ మార్పులు, మానవ అక్రమ రవాణా, వ్యాధులు తదితర సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం పెంచేలా గేమ్స్ ఉండాలని సూచించారు. వినోదం, సృజనాత్మకతతోపాటు సామాజిక చైతన్యానికి గేమింగ్ రంగం చక్కటి వేదిక కావాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల సంస్కృతి, సంబంధాలను పెంపొందించేలా గేమ్‌లు రూపొందించాలని యువ గేమ్ డిజైనర్లకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడం చాలా సంతోషకరమని, ఇక్కడ అత్యున్నత విద్యాసంస్థలకు తోడు అమెరికాకు చెందిన 130 కంపెనీలు ఉన్నాయని గుర్తు చేశారు. టీ హబ్ అద్భుతాలకు చిరునామాగా.. నూతన ఆవిష్కరణలకు నిలయంగా మారిందని ప్రశంసించారు. భారత సవాళ్లను దృష్టిలో ఉంచుకోండి ‘భారత్ చాలా వైవిధ్యమున్న దేశం. ఇక్కడి జీవనశైలి, ఆచార వ్యవహారాలు, సవాళ్లను దృష్టిలో ఉంచుకుని గేమ్‌లు రూపొందించాలి. భారతీయులు ఇంటిని అత్యంత పరిశుభ్రంగా ఉంచుకుంటారు. కానీ బయటికెళ్లగానే ఆ విషయాన్ని మర్చిపోతారు. ఇక్కడి ప్రభుత్వాలు పారిశుద్ధ్యం కోసం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నాయి. నీటి ఎద్దడి, పర్యావరణంపై చైతన్యం పెంచేలా గేమ్స్ ఉండాలి. గేమింగ్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. డిజిటల్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతూ.. 20 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటిదాకా హైదరాబాద్ కంపెనీలు విదేశీ గేమ్‌ల రూపకల్పన కోసం పనిచేశాయి. గత రెండు, మూడేళ్లుగా ఆ పరిస్థితిలో మార్పువచ్చి.. మనవాళ్లే కొత్త పాత్రలు రూపొందిస్తున్నారు. చోటా భీమ్, బాహుబలి పాత్రలకు ప్రాణం పోసి వినూత్న ఆవిష్కరణలకు చిరునామాగా నిలవడమే దీనికి నిదర్శనం. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్‌లోనూ హైదరాబాద్ ఇప్పటికే తన ఘనతను చాటుకుంది’అని హడ్డా వెల్లడించారు. అంతకుముందు కార్యక్రమంలో గేమింగ్ నిపుణులు శాన్ బుచర్డ్, విజయ్ లక్ష్మణ్, కవితా వేమూరి తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వంతో కలసి పని చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధంగా ఉందని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ బీ హడ్డా తెలిపారు. మంగళవారం సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేథరిన్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఏపీ వారు పెద్దసంఖ్యలో అమెరికాలో ఉన్నారని చెప్పారు. రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని తాను కోరుకుంటున్నానన్నారు. విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అమెరికా సాంకేతిక సహకారాన్ని అందిస్తోందని, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని తెలిపారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ న్యూయార్క్ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా అమరావతిలో బౌద్ధుల సంస్కృతిని తెలియజేస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా విశాఖను ఆర్థికంగా, అభివృద్ధి పరంగా తీర్చిదిద్దే విషయంలో తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రంలో తాను అమలు చేస్తున్న సామాజిక అభివృద్ధి అజెండాను, నవరత్నాల్లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను అమెరికా కాన్సుల్ జనరల్‌కు వివరించారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనా ధృక్పథం తనను ఎంతో ఆకట్టుకుందని కేథరిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సూల్ జనరల్
సాక్షి, అమరావతి: అమెరికా కాన్సూల్ జనరల్ క్యాథరీన్ బీ హడ్డా మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అమరావతిలోని సచివాలయంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సూల్ జనరల్ కాథరీన్ హడ్డా ట్విటర్లో అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్ జగన్‌కు అభినందనలు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని ఆమె ట్వీట్ చేశారు. గతంలో వైఎస్ జగన్‌తో దిగిన ఫోటోను ఆమె ట్విటర్లో ఈ సందర్భంగా షేర్ చేశారు. (చదవండి: వైఎస్ జగన్‌కు యూఎస్ కాన్సులేట్ అభినందనలు) -
ప్రజల సహకారంతో మెరుగైన సేవలు
హైదరాబాద్: ప్రభుత్వంతోపాటు అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే హైదరాబాద్‌లో అమెరికా దౌత్య కార్యాలయం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా అన్నారు. నగరంలో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమీర్ పేట మెట్రోరైలు స్టేషన్లో బుధవారం ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలసి ఆమె ప్రదర్శనను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి రాష్ట్రంలో పర్యటించిన ఫొటోలు ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచాయని అన్నారు. ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 2006 సంవత్సరంలో నగర పర్యటనకు వచ్చిన జార్జిబుష్ హైదరాబాద్‌లో దౌత్య కార్యాలయ ఏర్పాటుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఫొటో ప్రదర్శన రెండు రోజుల పాటు ఉంటుందని తెలిపారు. -
వైఎస్ జగన్‌కు యూఎస్ కాన్సులేట్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రధానితో సహా పలువురు జాతీయ నేతలు కూడా వైఎస్ జగన్‌ను అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా కాన్సులేట్ జనరల్ కాథరీన్ హడ్డా వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్ జగన్‌కు అభినందనలు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. గతంలో వైఎస్ జగన్‌తో దిగిన ఫోటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా నిన్న వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Congratulations on your victory, @ysjagan! We at @USAndHyderabad look forward to working with you to further build U.S.-AP ties. pic.twitter.com/AjX5PfJACc — Katherine Hadda (@USCGHyderabad) 23 May 2019 -
మహిళా శ్రామిక శక్తితోనే దేశాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్ : మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని 131 దేశాల్లో భారత్ 120వ స్థానంలో ఉందని, భారత్ స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు వ్యాపార, వాణిజ్య రంగాల్లోకి మహిళలు ముందుకు రావాలని హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరీన్ హడ్డా అన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసిన ‘వి హబ్’ప్రథమ వార్షికోత్సవానికి హడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ‘వి హబ్’సానుకూల పురోగతి సాధిస్తుందని కితాబునిచ్చారు. భారత శ్రామిక శక్తిలో మహిళలు కేవలం 24% మాత్రమే ఉన్నారని, వ్యాపారవేత్తలుగా రాణించేందుకు వారు ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలన్నారు. ఆంగ్ల రచయిత్రి జేకే రౌలింగ్ మాటలను ఉటంకిస్తూ.. ‘ప్రపంచాన్ని మార్చేది ఇంద్రజాలం కాదని.. ప్రపంచాన్ని మార్చేది మానవ శక్తి మాత్రమేనని’వ్యాఖ్యానిస్తూ.. అలాంటి శక్తి మహిళలకే ఎక్కువగా ఉందని కేథరీన్ హడ్డా అన్నారు. వివిధ రంగాల్లో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపడంలో ‘వి హబ్ ’కీలక పాత్ర పోషిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్‌లు మహిళా వ్యాపారవేత్తలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. సాధికారతకు బాసటగా మెప్మా పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట్రంలోని 108 మున్సిపాలిటీల్లో 1.24లక్షల స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారతకు బాసటగా నిలుస్తోందని మెప్మా మిషన్ డైరక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. మెప్మా ఆధ్వర్యంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు రూ.2 వేల కోట్లు విలువ చేసే వ్యాపారాలు నిర్వహిస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని 1700 మహిళా స్వయం సహాయక సంఘాలను మైక్రో ఎంట్రప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్ల శ్రీదేవి వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన ‘నుమాయిష్’లో ‘వి హబ్’సహకారంతో కొంత మంది మహిళలు 55 స్టాళ్లను ఏర్పాటు చేసిన విషయాన్ని శ్రీదేవి ప్రస్తావించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం సందర్శంగా ఏర్పాటు చేసిన ‘వి హబ్’ప్రథమ వార్షికోత్సవానికి సంస్థ సీఈవో దీప్తి రావుల అధ్యక్షత వహించారు. ‘వి హబ్’ద్వారా లబ్ధిపొందిన పలు వురు మహిళా వ్యాపారవేత్తలు తమ అనుభవాలను పంచు కున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్శంగా హైదరాబాద్‌లోని ఫారిన్, కామన్వెల్త్ కార్యాలయం నుంచి ఒకరోజు పాటు ‘డిప్యూటీ హై కమిషనర్’గా గుర్తింపుపొందిన యువ మహిళ నయోనిక రాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌తో అమెరికన్ కాన్సూల్ జనరల్ భేటీ
-
అమెరికా వీసా పరిశీలన ఎప్పుడో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: జూన్ 6న వీసా డే నిర్వహించనున్నట్టు అమెరికా కాన్సుల్ జనరల్ జార్జ్ హెచ్ హోగ్మన్ గురువారం ప్రకటించారు. వీసా ఇంటర్వ్యూ సమయంలో అధికారులు అడిగే ప్రశ్నలను అభ్యర్థులు జాగ్రత్తగా వినాలని.. వాటికి వాస్తవమైన సమాధానాలు మాత్రమే ఇవ్వాలని ఆయన సూచించారు. అమెరికాలో చదువుతున్న ప్రతి ఆరుగురు విదేశీ విద్యార్థుల్లో ఒకరు భారత్ నుంచి వచ్చిన వారేనని చెప్పారు. జూన్ 6న ఢిల్లీలోని అమెరికా ఎంబసీ సహా హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ముంబైలోని కాన్సులేట్లతో అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారత విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలిస్తారు. -
సామాజిక కార్యక్రమాల్లో మోహన్ బాబు
ఇటీవల గాయత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ హీరో, విలక్షణ నటడు మోహన్ బాబు సామాజిక కార్యక్రమాల మీద దృష్టిపెట్టారు. తాజాగా యుఎస్ కాన్సూల్ జనరల్ కేథరిన్‌ను కలిసి మోహన్ బాబు మహిళ అక్రమ రవాణా విషయంలో అవగాహన కల్పించేందుకు ఆమె చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో భాగం పంచుకోనున్నట్టుగా ప్రకటించారు. మోహన్ బాబుతో సమావేశంపై కేథరిన్ హడ్డ స్పందించారు. ‘సినీ పరిశ్రమకు చెందిన లెజెండ్ మోహన్ బాబును కలవటం ఆనందంగా ఉంది. మీ స్ఫూర్తిదాయకమైన కథను వివరించినందుకు కృతజ్ఞతలు. మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. A pleasure to meet a legend of cinema, @themohanbabu! Thank you for sharing your inspirational story. Look forward to working with you. pic.twitter.com/MUo3slqHCR — Katherine Hadda (@USCGHyderabad) 5 March 2018 Was nice meeting @USCGHyderabad Ms. Katherine. Appreciate the efforts she has undertaken in creating awareness on the evils of women trafficking. Look forward working with her on social awareness programs. More power to you Ms.Katherine — Mohan Babu M (@themohanbabu) 6 March 2018 -
మెట్రో జర్నీ సూపర్బ్.. క్యాథరీన్
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సుల్ జనరల్ క్యాథరీన్ బి. హడ్డా గురువారం మెట్రో జర్నీ చేశారు. రసూల్‌పురా–మెట్టుగూ డ మార్గం లో మెట్రోలో ప్రయాణించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణీకులతో సరదాగా గడి పారు. ఆమెకు మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులకు కల్పించిన వసతులు, సౌకర్యాలను ఎండీ ఎన్వీఎస్రెడ్డి వివరించారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించిన ఆధునిక సాంకేతికత, పీపీపీ ఆర్థిక నమూన, అధిగమించిన ఇంజినీరింగ్ సవాళ్లను ఆయన వివరించారు. ఆమె వెంట అమెరికా రాయబార కార్యాలయం అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ ఆకాశ్ సూరీ, ఇతర ఉన్నతాధికారులున్నారు. -
మీ భద్రత చర్యలు భేష్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చేపట్టిన భద్రత చర్యలు భేష్ అని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ బి హడ్డా కితాబిచ్చారు. సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయిన కేథరిన్.. సదస్సు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అమెరికా ప్రభుత్వం తరఫున ఓవైపు చార్మినార్, మరోవైపు యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ఉన్న మెమెంటోను ప్రదానం చేశారు. భేటీలో శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్, పీఅండ్ఎల్ ఐజీ సంజయ్‌కుమార్ జైన్, కాన్సులేట్ అధికారులు పాల్గొన్నారు. -
మీ భద్రత చర్యలు భేష్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చేపట్టిన భద్రత చర్యలు భేష్ అని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ బి హడ్డా కితాబిచ్చారు. సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయిన కేథరిన్.. సదస్సు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అమెరికా ప్రభుత్వం తరఫున ఓవైపు చార్మినార్, మరోవైపు యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ఉన్న మెమెంటోను ప్రదానం చేశారు. భేటీలో శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్, పీఅండ్ఎల్ ఐజీ సంజయ్‌కుమార్ జైన్, కాన్సులేట్ అధికారులు పాల్గొన్నారు. -
యూఎస్‌లోని విదేశీ విద్యార్థుల్లో 16 శాతం భారతీయులే
సాక్షి, హైదరాబాద్: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని విదేశీ విద్యార్థుల్లో 16 శాతం భారతీయులే ఉన్నారని యూఎస్ కాన్సులేట్ హైదరాబాద్ కాన్సుల్ జనరల్ కేథరీన్ హడ్డా పేర్కొన్నారు. విదేశీ విద్యార్థుల్లో మొదటిస్థానంలో చైనా, రెండో స్థానంలో భారత్ ఉందన్నారు. తాజ్ కృష్ణా హోటల్లో యూఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్–2017ను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. యూఎస్‌లో ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలున్నాయని, వీటితోపాటు మరో 4,500 యూనివర్సిటీలు/కాలేజీలు వివిధ కోర్సులు నిర్వహిస్తున్నాయని చెప్పారు. 2015–16 విద్యాసంవత్సరంలో లక్షా 66 వేల మంది భారతీయ విద్యార్థులు ప్రవేశాలు పొందారని, వీరిలో 60 శాతం పీజీ, ఎంఎస్ కోర్సుల్లో చేరారని తెలిపారు. యూఎస్ వర్సిటీల్లో ప్రవేశాలపై అవగాహన కల్పించేందుకు జాతీయ స్థాయిలో ఎనిమిది పట్టణాల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రారంభిం చినట్లు తెలిపారు. యూఎస్ వర్సిటీల్లో ప్రవేశాలకు భారత్ నుంచి పురుషులే అధికంగా వస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల సంఖ్య పెరగాల్సి ఉందని అన్నారు. గతేడాది 600 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా... ఈసారి వెయ్యి మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. -
శ్రీసిటీకి అమెరికా కాన్సుల్ జనరల్
వరదయ్యపాళెం (సత్యవేడు): హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. సౌత్ ఇండియా కమర్షియల్ అధికారి జాన్ ఫ్లెమింగ్, ఇతర అమెరికన్ అధికారులతో కలసి ఆమె శ్రీసిటీ పర్యటనకు వచ్చారు. శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి వారికి శ్రీసిటీ మౌలిక వసతులు, ప్రత్యేకతలు, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. అనంతరం శ్రీసిటీ వాణిజ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. అమెరికాకు చెందిన పది పరిశ్రమలు శ్రీసిటీలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశాయన్నారు. వాటిలో పెప్సికో, క్యాడ్బరీ, కాల్గేట్ పామోలివ్, కెలాగ్స్ ఉన్నాయని గుర్తు చేశారు. అనంతరం కేథరిన్ మాట్లాడుతూ.. శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతిని నేరుగా వీక్షించడం సంతోషంగా ఉందని, మరికొన్ని అమెరికన్ కంపెనీలు శ్రీసిటీకి రావడానికి తన పర్యటన దోహదపడుతుందని చెప్పారు. అనంతరం శ్రీసిటీ సెజ్‌ను పరిశీలించారు. అమెరికన్ కంపెనీలు పెప్సీ, కెలాగ్స్ను సందర్శించారు. శ్రీసిటీ మౌలిక వసతులను ప్రశంసించారు. -
అమెరికాలో ఉన్నత విద్య కలలు కల్లలు
-
విద్యానిధి.. హతవిధీ!
- వీసాలు తిరస్కరించిన అమెరికన్ కాన్సులేట్ - అమెరికాలో ఉన్నత విద్య కలలు కల్లలు - దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నిరాశ - తాజాగా 55 మందికి వీసాలు నిరాకరణ - అంతా విద్యానిధి పథకం లబ్ధిదారులే.. - అన్ని వివరాలు సరిగా ఉన్నా కూడా నో! - బదులుగా ఆస్ట్రేలియా వైపు చూస్తున్న విద్యార్థులు - విద్యానిధి పథకం దరఖాస్తుల్లో మార్పు కోసం సంక్షేమ శాఖలకు వినతులు ఎల్బీనగర్కు చెందిన రేఖ గతేడాది బీటెక్ పూర్తి చేసింది. ఎమ్మెస్ చదివేందుకు అమెరికాలోని కన్సాస్ వర్సిటీకి దరఖాస్తు చేసుకుంది. అమెరికా వర్సిటీలో సీటు వచ్చింది.. విద్యానిధి పథకం కింద రూ.20 లక్షల ఆర్థిక సాయానికి ఎంపికైంది. కానీ అమెరికా కాన్సులేట్ రేఖ వీసాకు నిరాకరించింది. కాన్సులేట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పినా, అన్ని సరిగా ఉన్నా వీసా తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారనే కారణమూ చెప్పలేదు. రేఖ మాత్రమే కాదు మరో 55 మందికి ఇదే పరిస్థితి ఎదురైంది. వీసాల జారీలో అమెరికా కాన్సులేట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో.. రాష్ట్ర విద్యార్థుల ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల అమెరికా కలలు కల్లలవుతున్నాయి. వీసాల జారీలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తుం డడం, కావాలనే తిరస్కరిస్తుండడంతో వారి ఆశలు ఆవిరవుతున్నాయి. ఇటీవల మహాత్మాజ్యోతి బాపూలే విద్యానిధి కింద ఎంపికైన పలువురు విద్యార్థులు.. అమెరికాలో ఎమ్మెస్ చదివేందుకు వివిధ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా వర్సిటీలు సీట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పినా.. అమెరికన్ కాన్సులేట్ మాత్రం వీసాల జారీకి నిరాకరించిం ది. ఇలా తిరస్కరించడానికి కాన్సులేట్ అధికారులు ఎలాం టి కారణాలూ వెల్లడించకపోవడం గమనార్హం. అటు విద్యార్థులు మాత్రం కన్నీటితో ఆందోళనలో మునిగిపోతున్నారు. విద్యానిధి లబ్ధిదారులకు షాక్! రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేద విద్యార్థుల కోసం ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. బీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులకు గతేడాది నుంచి ఈ పథకం అందుబాటులోకి రాగా.. వారికి అమెరికాలో చదివే అవకాశాన్ని కల్పించింది. 2016–17లో రాష్ట్రవ్యాప్తంగా 300 మందికి ఆర్థిక సహకారం అందించేలా నిధులు కేటాయించినా.. పథకం అమల్లో జాప్యం, ప్రచారం పెద్దగా లేకపోవడంతో 203 దరఖాస్తులే వచ్చాయి. అందులోనూ అర్హత ఉన్న 110 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో 90 మందికి సంబంధించి ప్రొసీడింగ్‌లను బీసీ సంక్షేమ శాఖ వెబ్సైట్లో పొందుపర్చింది. వారిలో 70 మంది అమెరికా యూనివర్సిటీలనే ఎంపిక చేసుకున్నారు. విద్యానిధి పథకానికి ఎంపికకావడంతో ఆయా విద్యార్థులు.. అమెరికా వీసా కోసం ఇంటర్వూ్యలకు వెళ్లారు. కానీ అందులో దాదాపు 55 మందికి వీసా తిరస్కరణకు గురైనట్లు సమాచారం. ఇంటర్వూ్యలో ‘ఏ కోర్సు చేయాలనుకుంటున్నావు..? ఎందుకు ఆ కోర్సు ఎంపిక చేసుకున్నావు..?’వంటి ప్రశ్నలు అడిగారని, వాటికి çసరిగానే బదులిచ్చినా వీసా తిరస్కరించారని రేఖ అనే అభ్యర్థి వాపోయింది. జీఆర్ఈ స్కోర్‌తో పాటు ఎంపిక చేసుకున్న కోర్సుకు సంబంధించి సరైన వివరాలు ఇచ్చానని, వీసా ఎందుకు రాలేదో తెలియడం లేదని మరో విద్యార్థిని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వెళ్లే చాలామందికి ఇలాగే ఉద్దేశపూర్వకంగా వీసా తిరస్కరిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా వైపు చూపు అమెరికాలో ఉన్నత విద్యకు అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో ఆస్ట్రేలియా యూనివర్సిటీల వైపు విద్యార్థులు దృష్టి సారిస్తున్నారు. ఇటీవల వీసా తిరస్కరణకు గురైన పలువురు విద్యానిధి లబ్ధిదారులు ఆస్ట్రేలియా, కెనడా వర్సిటీల్లో చదివేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక సహకార పథకం కింద అమెరికా వర్సిటీ పేర్లు నమోదు చేసిన నేపథ్యంలో.. వాటిని మార్చాలంటూ బీసీ సంక్షేమ శాఖకు విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనిపై అధికారులు సైతం సానుకూలంగా స్పందిస్తూ.. ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిస్తా మని పేర్కొంటున్నారు. మరోవైపు విద్యా నిధి పథకం కింద ఎంపికైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో పరిగణనలోకి తీసుకుంటున్నారని, ఫీజు చెల్లింపులకు కొంత గడువు ఇస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. -
అమ్మకి అనారోగ్యం: సిటిజన్లకు ఎమర్జెన్సీ వార్నింగ్
చెన్నై : అమ్మ జయలలిత ఆరోగ్యం విషమించిందనే వార్తను ఆపోలో వైద్యులు వెల్లడించడంతో ఒక్కసారిగా తమిళనాడులో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా కన్సలేట్ తన సిటిజన్లకు అత్యవసర సందేశాన్ని జారీచేసింది. స్థానికంగా నెలకొన్న ఈ పరిస్థితుల్లో అమెరికన్ సిటిజన్లు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత భద్రతా ప్లాన్స్‌ను ఎప్పడికప్పుడూ సమీక్షించుకుంటూ ఉండాలని ఆదేశించింది. అమ్మ ఆరోగ్య పరిస్థితుల్లో చెలరేగే ఆందోళనల ప్రాంతాలకు దూరంగా ఉండాలని అమెరికన్లకు సూచించింది. అమెరికన్ సిటిజన్లకు, వీసా దరఖాస్తుదారులకు అందించే సాధారణ సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టు కూడా ప్రకటించింది. అమ్మ జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో గోపాలపురం ప్రాంతం జెమినీ సర్కిల్లో యూఎస్ కన్సలేట్ జనరల్ ఉంది. దీంతో తమ సేవలను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా తమిళనాడులోని టోల్‌ప్లాజాలు, హైవేలపై భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అపోలో చుట్టుపక్కల ప్రాంతాల షాపులను భద్రతా సిబ్బంది ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే. కర్నాటక, చిత్తూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. పెట్రోల్‌బంక్‌లు, విద్యాసంస్థలు మూసివేశారు. -
'తప్పుడు సర్టిఫికెట్లతో విద్యార్థులు జాగ్రత్త'
హైదరాబాద్: ఉన్నత చదువులకు అమెరికా వెళ్లే విద్యార్థులు తప్పుడు సర్టిఫికెట్లతో జాగ్రత్తగా ఉండాలని యూఎస్ కాన్సులేట్ అవినీతి నిరోధక అధికారి ఆడం ఫర్గుసన్ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. అమెరికా కల్పిస్తోన్న ఉన్నత విద్యావకాశాలను వినియోగించుకొనేందుకు విద్యార్థులు సన్నద్ధం కావాలన్నారు. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు అందుకు కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని, అదే సందర్భంలో తప్పుడు సర్టిఫికెట్లను నివేదించడం వారి భవిష్యత్తుకి ప్రమాదకరమని చెప్పారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ నేతృత్వంలో భారతీయ విద్యార్థుల పట్ల ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. తప్పుడు సర్టిఫికెట్ల పట్ల యుఎస్ అనుసరిస్తున్న అవినీతి నిరోధక విధానాలను ఫర్గుసన్ విద్యార్థులకు వివరించారు. -
భారత్‌తో సంబంధం మరింత బలోపేతం
యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా సాక్షి, హైదరాబాద్: తమ దేశానికి కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత కూడా అమెరికా-ఇండియాల మధ్య సంబంధాల బలోపేతానికి చర్యలు యథాతథంగా కొనసాగుతాయని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఆర్థిక, రక్షణ కొనుగోళ్లు తదితర రంగాల్లో భారత దేశంలో భాగస్వామ్యాన్ని అమెరికా కోరుకుంటోందన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల పరిశీలన కోసం హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం బుధవారం నగరంలోని ఓ హోటల్లో అధికార, వ్యాపార రంగ ప్రముఖులకు అల్పాహార విందు ఇచ్చింది. ఈ కార్యాక్రమంలో కేథరిన్ హడ్డా మాట్లాడారు. వచ్చే ఏడాది ఇరు దేశాల మధ్య పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, వీసాల జారీని సరళీకృతం చేస్తామన్నారు. అమెరికాలో 1.2 లక్షల మంది భారత విద్యార్థులు నివాసముంటున్నారని తెలిపారు. అర్హులైన విద్యార్థులు సైతం వీసా కోసం తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పిస్తుండటంతోనే సమస్యలు వస్తున్నాయన్నారు. -
జేఎన్టీయూకే అధికారులతో భేటీ
బాలాజీచెరువు (కాకినాడ) : జేఎన్టీయూకే రిజిస్ట్రార్ సాయిబాబు, పరీక్షల విభాగం అధికారులు యూఎస్ కాన్సులేట్ ప్రతినిధులు ఫ్రాడ్ ప్రివెన్షన్ మేనేజర్ మిస్టర్ ఆడమ్ ఫెర్గూసన్, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ మేడమ్ తెన్నేరు సునీత సోమవారం కాన్ఫరెన్స్హాల్లో సమావేశమయ్యారు. జేఎన్టీయూకే పరీక్షల విభాగంలో సర్టిఫికెట్ డాక్యుమెంటేషన్ విధానంపై సమీక్షించారు. జేఎన్టీయూకే స్థాపించిన నాటినుంచి నకిలీ ధ్రువపత్రాలు జారీ కాకుండా సాంకేతిక పద్దతులను అనుసరించే విధానం, సాప్‌్టవేర్ వినియోగం, ధ్రువీకరణ పత్రాల జారీ వంటి అంశాలను రిజిస్ట్రార్ సాయిబాబు యూఎస్ ప్రతినిధులకు వివరించారు. ఈ సమీక్షలో జేఎన్టీయూకే రెక్టార్ ప్రభాకరరావు, డీఈ సుబ్బారావు, సీఈ మోహనరావు, వైస్ ప్రిన్సిపాల్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్-1 బీ దరఖాస్తుల జోరు తగ్గలేదట!
బెంగళూరు: హెచ్ -1 బీ వీసాల ఫీజు పెంచినా భారతదేశంనుంచి దరఖాస్తుల వెల్లువ ఏమాత్రం తగ్గలేదని అమెరికా సీనియర్ కాన్సులర్ అధికారి జోసెఫ్ ఎం పాంపర్ తెలిపారు. భారత ఐటి పరిశ్రమకు ఆందోళన కలిగించిన హెచ్ -1 బీ వీసా ఫీజు రెట్టింపు వీసా అప్లికేషన్ల సంఖ్యను, వ్యాపార లావాదేవీలను ప్రభావితం చేయదని పేర్కొన్నారు. హెచ్ -1 బీ కేటగిరీలో భారత్ తమకు మాణి మకుటం లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ పరంపర ఇక ముందు కొనసాగనున్నట్టు వెల్లడించారు. భారతదేశం లోని ఐదు అమెరికా కాన్సులేట్ ఆఫీసులు ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా బెంగళూరులో పర్యటించిన అనంతరం పాంపర్ మీడియాతో ముచ్చటించారు. మరోవైపు హెచ్ -1 బీ వీసాలపై రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై చెలరేగిన ఆందోళనను ఆయన కొట్టి పారేశారు. వీసా, ఇమ్రిగ్రేషన్ చట్టాలను యూఎస్ కాంగ్రెస్ నియంత్రిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార వేడిలో ఎవరో ఏదో మాట్లాడినదాన్ని పరిగణనలోకి తీసుకు రావాల్సిన అవసరం లేదని పాంపర్ తెలిపారు. వీసా జారీలో ఫీజు పెంపు ఒక్క ఇండియాకే పరిమితం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఇది వర్తిసుందన్నారు. అయితే భారత్ నుంచి ఎక్కువ సంఖ్యలో హెచ్ -1 బీ వీసా దరఖాస్తులు వస్తుండడంతో ఎక్కువ భారమనిపిస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది భారతదేశానికి సంబంధించి 1.1 మిలియన్ల వీసాలను జారీ చేశామన్నారు. అలాగే ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో 80,000 విద్యార్థి వీసాలు విడుదల చేసినట్టు అధికారి చెప్పారు. కాగా ప్రత్యేకించిన నైపుణ్యం వృత్తులు విదేశీ కార్మికులు పని చేయడానికి అనుమతించే వలసేతర వీసా ఫీజును డిసెంబర్ 2015 లో రూ.270441 (నాలుగువేల డాలర్లు) నిర్ణయించింది. ఈ పెంపు పదేండ్ల (సెప్టెంబర్ 2025) వరకు అమలులో ఉంటుందని ప్రకటించడం ఐటి పరిశ్రమలో కలకలం రేపింది. హెచ్1బీ, ఎల్ 1 వీసాలపై ప్రత్యేక రుసుమును రెట్టింపు చేయడంతో దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీలపై కోట్ల మేర భారం పడనుందని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ఉన్నత విద్యాభ్యాసానికి కేరాఫ్ అడ్రస్ అమెరికా
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా కేరాఫ్ అడ్రస్‌గా మారిందని యూఎస్ కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) మైఖేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌లో గురువారం ‘స్టూడెంట్ వీసా డే’ నిర్వహించారు. ఈ ఒక్క రోజే దాదాపు 700 మందికిపైగా విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్ని రకాల అర్హతలున్న విద్యార్థులకు అప్పటికప్పుడే వీసాలను ముల్లిన్స్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా వీసాలు పొందిన విద్యార్థులతో అమెరికాలో చదువుకున్న భారతీయ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ముల్లిన్స్ మాట్లాడుతూ.. స్టూడెంట్ వీసా డే సందర్భంగా చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలో ఉన్న కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో 4 వేల మంది విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఒక్క హైదరాబాద్ కార్యాలయం నుంచే 700 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారని పేర్కొన్నారు. చైనా తర్వాత ఇండియా నుంచే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు యూఎస్‌ను ఆశ్రయిస్తున్నారని.. అక్కడ నైపుణ్యంతో కూడిన నాణ్యమైన విద్య, పేరుగాంచిన యూనివర్సిటీలు ఉండటమే కారణమని అన్నారు. అమెరికాలో విద్య తీరు, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం తదితర అంశాలపై అమెరికా పూర్వ విద్యార్థులతో త్వరలో ఇక్కడి వారికి అవగాహన కల్పిస్తామని కాన్సులర్ చీఫ్ జామ్సన్ ఫాస్ వెల్లడించారు. జూలై నెలాఖరున ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాలున్నాయని చెప్పారు. గత ఐదేళ్లలో వీసా పొందేవారి సంఖ్య 80 శాతం పెరిగిందన్నారు. వీసాలు తీసుకుంటున్న వారిలో విద్యార్థులే అత్యధికమని చెప్పారు. కార్యక్రమంలో ఎన్ఐవీ చీఫ్ బ్రియాన్ సాల్వర్సన్, అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ జెన్నిఫర్ గోల్డ్‌స్టీన్, యూఎస్ఈఎఫ్/ఎడ్యుయూఎస్ఏ రీజినల్ ఆఫీసర్ పియా బహదూర్ తదితరులు మాట్లాడారు. -
హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కొత్త భవనం
డిజైన్ ఆవిష్కరించిన కాన్సుల్ జనరల్ సాక్షి, హైదరాబాద్: యూఎస్ కాన్సులేట్‌కు హైదరాబాద్‌లో సరికొత్త భవవనం నిర్మించనున్నట్టు కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ చెప్పారు. అరిజోనాకు చెందిన రిచర్డ్స్ బయర్ సంస్థ రూపొం దించిన భవన డిజైన్‌ను శుక్రవారం హోటల్ పార్క్‌హయత్‌లో ఆయన ఆవిష్కరించారు. ముల్లిన్స్ మాట్లాడుతూ.. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 12.3 ఎకరాల విస్తీర్ణంలో పర్యావరణ హితమైన అధునాతన భవనాన్ని నిర్మించనున్నామన్నారు. హైదరాబాద్ వినూత్న భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా ప్రత్యేక డిజైన్లతో నిర్మాణం ఉంటుందన్నారు. ప్రపంచలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో ఐదో అతిపెద్ద భవనం ఇదే అవుతుందన్నారు. ఇందుకు అవసరమైన నిధులు ఈ ఏడాది సెప్టెంబరులో మంజూరయ్యే అవకాశం ఉందని, ఆ తరువాత గ్లోబల్ టెండర్లు పిలిచి వచ్చే ఏడాది ఆగస్టులో శంకుస్థాపన చేస్తామన్నారు. అక్టోబరు 2020 కల్లా నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, నూతన ప్రాంగణంలో రోజుకు సుమారు రెండు వేల మందికి వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలవుతుందన్నారు. ఇందుకోసం 52 విండోలు ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాంకులు, ప్రముఖ ఆసుపత్రులు, ప్రఖ్యాత హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల నడుమ అందమైన, కాన్సులేట్ ప్రాంగణం హైదరాబాద్ ప్రజలకు గొప్ప బహుమతి కానుందని ముల్లిన్స్ చెప్పారు. -
యూఎస్ కాన్సులేట్ భవనం 2020 నాటికి పూర్తి
హైదరాబాద్ : మెరుగైన సేవలు అందించేందుకు త్వరతగతిన వీసాలు మంజూరు చేసేందుకు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ త్వరలో సువిశాల ప్రాంగణంలోకి మారనుంది. కొత్త కన్సూలేట్ భవనానికి వచ్చే ఏడాది ఆగస్టులో శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ నానక్‌రాంగూడలో 12.3 ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయలతో కూడిన భవనం 2020 నాటికి అందుబాటులోకి రానుంది. కొత్తభవనంలో ఒకేరోజు 15 వందల నుంచి 2500 వీసా కోసం దరఖాస్తులు తీసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ భవనం నిర్మించనున్నారు. -
డాలర్డ్రీమ్స్కు ‘భాగ్య’రేఖ!
సాక్షి, హైదరాబాద్: 2008 జూన్‌లో అమెరికాలోని ఇల్లినాయిస్లో కరీంనగర్‌కు చెందిన ఓ విద్యార్థి ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు వీసా తీసుకుని అమెరికాకు చేరుకోవడానికి 11 రోజులు పట్టింది. చెన్నై కాన్సులేట్‌లో వీసా అపాయింట్మెంట్ తీసుకోవడం, అక్కడ రెండు రోజులు ఉండాల్సి రావడం, ఆ వెంటనే విమాన టికెట్లు అందుబాటులో లేకపోవడం వల్ల బాగా జాప్యం జరిగింది. 2011 నవంబర్‌లో ఓ కారు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మరణించారు, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈసారి వారి బంధువులు కేవలం ఐదు రోజుల్లో అమెరికాకు చేరుకోగలిగారు. హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ ఏర్పాటు కావడం, అత్యవసర పరిస్థితుల్లో అమెరికా వెళ్లేందుకు వీసా ఇచ్చే ఏర్పాటు ఉండడంతో ఇది సాధ్యమైంది. వాస్తవానికి బెంగళూరులో ఏర్పాటుకావాల్సిన ఈ అమెరికా కాన్సులేట్... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో హైదరాబాద్‌కు తరలివచ్చింది. అమెరికాకు వెళ్లే లక్షలాది మంది తెలుగు ప్రజలకు ఇబ్బందులను తొలగించిన ఈ కాన్సులేట్ ఏర్పాటు, పనితీరుపై ఈ వారం ‘ఫోకస్’... 2009కి ముందు చెన్నై కాన్సులేట్‌తో ఇబ్బందులు ప్రయాణం దగ్గరి నుంచి భాషదాకా ఎన్నో సమస్యలు అప్పట్లో ఏటా అమెరికా వెళ్లిన విద్యార్థులు 5 నుంచి 6 వేలలోపే హైదరాబాద్‌లో కాన్సులేట్‌తో భారీగా పెరిగిన విద్యార్థుల సంఖ్య గత ఏడేళ్లలో ఉన్నత చదువు కోసం వీసాలు పొందినవారు 1.64 లక్షలు 2015లో దేశంలోనే అత్యధికంగా 42 వేల మంది విద్యార్థులకు వీసాలు గత ఏడేళ్లలో 10.51 లక్షల సందర్శక (బీ1/బీ2) వీసాలు జారీ * హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్‌తో సులభమైన అమెరికా వీసా * వైఎస్సార్ చొరవతో ఏర్పాటు.. దేశంలోనే అత్యధికంగా వీసాల జారీ 2009కి ముందు ఎన్నో సమస్యలు అమెరికాలో తమ పిల్లలు, దగ్గరి బంధువులు ఉన్నవారు.. చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు.. సరదాగా సందర్శించి వద్దామనుకునే పర్యాటకులు.. ఇలా ఎవరికైనా అమెరికా వీసా కావాలి. వీసా పొందాలంటే ఎంతో తతంగం ఉంటుంది. ఎన్నో రకాల ధ్రువపత్రాలు కావాలి, కాన్సులేట్‌లో అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఒకరోజు వెళ్లి వేలిముద్రలు ఇవ్వాలి, మరుసటిరోజున ఇంటర్వ్యూకు హాజరుకావాలి. అవసరమైన వివరాలన్నీ వెల్లడించగలగాలి. ఇన్ని చేసినా కాన్సులేట్ ఉన్న చోటికి వెళ్లి రావడం, ఖర్చులు, భాషా సమస్య వెంటాడుతాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ ఉండడంతో ఇవన్నీ పెద్ద సమస్యలుగా కనిపించడం లేదు. కానీ 2009కి ముందు అమెరికా వీసా కోసం తమిళనాడులోని చెన్నైకి వెళ్లాల్సి రావడంతో... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అమెరికా వీసా పొందేందుకు అన్ని అర్హతలున్నా చెన్నైకి వెళ్లాల్సి రావడం, భాషాపరమైన సమస్య వంటివాటితో వెనుకాడేవారు. ఇప్పుడు ఎంతో సులువు.. ఇప్పుడు హైదరాబాద్‌లోనే కాన్సులేట్ వీసాలు మంజూరు చేయడం, తెలుగులో మాట్లాడే అవకాశమివ్వడంతో ఏటా అమెరికా వీసాలు పొందుతున్న తెలుగువారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏటా సగటున 1.5 లక్షల మంది అమెరికా వీసాలు పొందుతున్నారు. వెంటనే వెళ్లే అవసరం లేకపోయినా... అమెరికాలో చదువుకుంటున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారి తల్లిదండ్రులు పదేళ్ల సమయానికి ‘బీ1/బీ2 (సందర్శకుల)’ వీసాలు తేలిగ్గా పొందుతున్నారు. హైదరాబాద్‌లో 2009 మార్చి 5న అమెరికా కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు చెన్నై వెళ్లే తెలుగువారి సంఖ్య సగటున నెలకు 3,500 దాకా ఉండేది. ఇక్కడ వీసాల మంజూరు మొదలుపెట్టిన ఆరునెలలకే అంటే 2009 సెప్టెంబర్‌లో హైదరాబాద్ కాన్సులేట్ నుంచి 17 వేల మందికి పైగా వీసాలు పొందారు. అమెరికా వెళ్లి వచ్చే ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరిగింది. 2008లో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 76 వేల మంది అమెరికాకు వెళితే... 2010లో అది సుమారు 2.5 లక్షలు దాటింది. ఏదైనా పని మీద అమెరికా వెళ్లాల్సి వస్తే వెంటనే వీసా పొందే సౌకర్యం ఉండటమే దీనికి కారణమని ట్రావెల్ అండ్ టూరిజం వర్గాలు చెప్పాయి. భారీగా పెరిగిన విద్యార్థులు హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే ఇక్కడి విద్యార్థుల సంఖ్య 6వేల లోపే. 2007-08లో 6,800 మంది విద్యార్థి వీసాలు పొందగా... ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన 2009లో అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య సుమారు 13 వేలు. తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్ కాన్సులేట్‌లో వీసాలు పొందిన విద్యార్థుల సంఖ్య 42 వేల వరకు ఉంటుంది. ఇందులో ఏటా తొలిస్థానంలో ఉండే ముంబైని 2015లో హైదరాబాద్ దాటేసింది. ఖర్చులూ తగ్గాయి హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటుకు ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారెవరైనా తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. వీసా ఇంటర్వ్యూకు ఒక రోజు ముందే వేలిముద్రలు ఇవ్వడానికి ఉదయాన్నే వెళ్లాలి. దాని కోసం అంతకు ముందు రోజే చెన్నై వచ్చి బస చేయాల్సిన పరిస్థితి. మొత్తంగా మూడు రోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చేది. ఇలా వీసా కోసం చెన్నై వెళ్లి, రావడానికి ప్రయాణ ఖర్చులతో పాటు మూడు రోజుల బస వ్యయమూ భరించాల్సి వచ్చేది. మొత్తంగా కనీసం రూ.7,500 నుంచి రూ.10 వేల దాకా ఖర్చయ్యేది. ఇప్పుడా ఖర్చు తగ్గింది. భాషతో తంటాలు.. చెన్నై కాన్సులేట్‌లో ఇంగ్లిష్-తమిళ భాషలు తెలిసిన ఆఫీసర్లు మాత్రమే ఉండేవారు. ఏపీ, తెలంగాణల నుంచి తెలుగు భాష ఎంపిక చేసుకున్న వారికి మధ్యలో అనువాదకుడు అవసరమయ్యేది. తమిళనాడులో తెలుగు తెలిసిన వారిని మాత్రమే అనువాదకులుగా పెట్టుకునేవారు. దీంతో తెలుగు-తమిళం అనువాదం ఇబ్బందిగా ఉండేది. అసలే తమిళం అంతంతగా వచ్చే అమెరికా కాన్సులేట్ అధికారులు పలుమార్లు భాషా సమస్య కారణంగా వీసాలు తిరస్కరించేవారు. 2003-2004లో వీసాల కోసం వెళ్లినవారిలో ఏకంగా 67 శాతం మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. హైదరాబాద్‌లో తెలుగు తెలిసిన అధికారులు ఉండడంతో ఈ సమస్య తప్పింది. అపాయింట్మెంట్ కూడా కష్టమే చెన్నైలో ఉండగా వీసా అపాయింట్మెంట్ అతి కష్టంగా దొరికేది. హైదరాబాద్ లేదా చెన్నైలో ఉన్న దళారులపై ఆధారపడాల్సి వచ్చేది. ఆన్లైన్ సౌకర్యం లేకపోవడం కూడా దానికి కారణం. ఇప్పుడు అమెరికా వెళ్లాలనుకునేవారు అన్ని పత్రాలు ఉంటే ఒక్క రోజులోనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వేలిముద్రలు ఇవ్వడం, ఇంటర్వ్యూకు హాజరుకావడం అంతా ఒకటిన్నర రోజుల్లో పూర్తవుతుంది. ఏపీకి చెందిన వారు లేదా తెలంగాణకు చెందిన ఇతర ప్రాంతాల వారు వీసా కోసం వస్తే ఒకటిన్నర రోజుల్లో తిరిగి వెళ్లిపోవచ్చు. ఒక్క రాత్రి హైదరాబాద్‌లో ఉంటే సరిపోతుంది. వైఎస్ చొరవతోనే.. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా తరువాత అమెరికా కాన్సులేట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేయాలని 2003 నుంచి ప్రతిపాదనలున్నాయి. మెట్రో నగరాల సరసన బెంగళూరు ఉండడంతో అక్కడే ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. అయితే హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ ఏర్పాటు చేయించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ పర్యటనను మంచి అవకాశంగా తీసుకున్నారు. అమెరికా కాన్సులేట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని, సకల సౌకర్యాలూ కల్పిస్తామని హామీ ఇస్తూ బుష్‌కు లేఖ ఇచ్చారు. దానికి తోడు పర్యటనలో తన వెంటే ఉన్న వైఎస్ఆర్ ఆహార్యానికి బుష్ ముగ్ధుడయ్యారు. ఇక మరోవైపు హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటుపై వైఎస్సార్ అంతకు ముందే పలుమార్లు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ దృష్టికి తీసుకువచ్చారు. అమెరికా కాన్సులేట్ ఏర్పాటు కోసం ఏ చిన్న అవకాశాన్నీ వైఎస్సార్ వదిలిపెట్టలేదు. ఆయన చొరవ కారణంగానే 2009 మార్చి 5న హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభించింది. గతేడాది 1.83 లక్షల సందర్శక వీసాలు హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటుతో వీసాలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. అమెరికాను సందర్శించాలనుకునే పర్యాటకులు టూర్ ఆపరేటర్లను సంప్రదించి ముందే ప్రయాణానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకుని.. సులభంగా బీ1/బీ2 (సందర్శకుల) వీసా పొందగలుగుతున్నారు. 2015లో దేశవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా ఈ వీసాలు పొందితే... అందులో 1.83 లక్షల వీసాలు హైదరాబాద్ కాన్సులేట్ జారీ చేసినవే. సందర్శక వీసాల జారీలో ముంబై, ఢిల్లీ తరువాత హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. -
మీడియా ద్వారానే ప్రజాస్వామ్యం
* అమెరికా కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ వెల్లడి * ఐజేయూ ఆధ్వర్యంలో ‘విస్తరిస్తున్న మీడియా- జర్నలిస్టుల నైతిక విలువల’పై చర్చ సాక్షి, హైదరాబాద్: ప్రజలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, అలాంటి వాతావరణం మీడియా ద్వారానే సాధ్యమని అమెరికా కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. మీడియా చైతన్యం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో ‘విస్తరిస్తున్న మీడియా- జర్నలిస్టుల నైతిక విలువలు’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైఖేల్ ముల్లిన్స్తోపాటు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు కె.అమరనాథ్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్, హిందూ బిజినెస్‌లైన్ డిప్యూటీ ఎడిటర్ ఎం.సోమశేఖర్, ప్రొఫెసర్ పి.వినోద్ తదితరులు పాల్గొన్నారు. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే మీడియా వాతావరణం పారదర్శకంగా, స్వేచ్ఛగా ఉండాలని మైఖేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. మీడియా ఏదైనా సమాచారాన్ని అందించడమే కాదు.. ఆ ఘటన ఎందుకు జరిగింది, అందులో ఉన్న మర్మమేమిటి, దానిపై ప్రభుత్వం, పౌర సమాజం ఏమని భావిస్తున్నాయనే అంశాలను కూలంకషంగా వివరిస్తుందని చెప్పారు. చాలా దేశాల్లో ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పత్రికల మూసివేత, వార్తల పట్ల సెన్సార్ విధించడం, సరైన వేతనాలు చెల్లించకుండా వేధింపులకు గురిచేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. వ్యతిరేక వార్తలు రాసేవారిపై భౌతిక దాడులకు దిగుతున్న ఘటనలూ చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. విపరీత పోకడల వల్ల వృత్తికే ఇబ్బంది: ఎమ్మెల్సీ రామచంద్రరావు మీడియా వృత్తి ఆహ్వానించదగినదేగానీ, విపరీత పోకడల వల్ల వృత్తికే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. కావాలంటే పత్రిక పాలసీకి తగినట్లుగా ఎడిటోరియల్ పేజీలో అభిప్రాయాలు చెప్పుకోవచ్చన్నారు. స్టింగ్ ఆపరేషన్ల పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదని వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ మీడియాను స్వీయ నియంత్రణలో ఉంచడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాదిరి ఒక వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చెల్లింపు వార్తలు ప్రజాస్వామ్యానికి చేటని, వాటిని నిలువరించాలని కోరారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించే అంశం చాలా కాలం నుంచి నానుతోందని, ఈ విషయమై ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కమ్యూనిటీ మీడియా యునెస్కో చైర్మన్, ప్రొఫెసర్ వినోద్ పావురాల అభిప్రాయపడ్డారు. కమ్యూనిటీ రేడియో వంటి ప్రసార సాధనాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. అమెరికాలో సీఐఏ అధికారులు లాడెన్‌ను కాల్చిచంపిన పోస్టులను రీట్వీట్ చేసిన అంశంపై అక్కడి మీడియా రక్షణ శాఖను ప్రశ్నించిందని, అలాంటి పరిస్థితులు భారత్‌లో కూడా రావాలని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. అమెరికాలో స్టింగ్ ఆపరేషన్ చేస్తే అక్కడి ప్రభుత్వాలు మీడియా సలహాలు సూచనలు స్వీకరిస్తాయని... అలాంటి పరిస్థితి భారత్‌లో లేదని ఎం.సోమశేఖర్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో మీడియాకు ఇస్తున్న స్వేచ్ఛ, ప్రాధాన్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. -
యూఎస్ కాన్సులేట్ వద్ద సీపీఐ ధర్నా
హైదరాబాద్: తెలుగు విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు వ్యతిరేకంగా సీపీఐ ధర్నా నిర్వహించింది. హైదరాబాద్ బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో పాటు చేరుకున్న వామపక్ష నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి సుధాకర్ లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నేతలను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎటువంటి అవాంచిత ఘటనలు జరగకుండా.. భారీ ఎత్తున పోలీసు బలగాలను యూఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద మోహరించారు. కాగా.. ఇటీవల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్న తెలుగు విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వేధించడమే కాకుండా.. పెద్ద సంఖ్యలో వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే 100 పైగా విద్యార్థులను తిరిగి పంపించిన సంగతి తెలిసిందే. -
యూఎస్ కాన్సులేట్ వద్ద సీపీఐ ధర్నా
-
యూఎస్ కాన్సుల్ జనరల్‌తో కేటీఆర్ భేటీ
వీసా విషయంలో తెలుగు విద్యార్థుల ఇబ్బందులపై చర్చ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌కు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లి కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్‌తో చర్చించారు. ఈ సమస్య ఒక్క హైదరాబాద్ విద్యార్థులే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులది అని తెలిపారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ముల్లిన్స్ హామీ ఇచ్చారు. విద్యార్థులు ప్రైవేటు ఏజెంట్ల మోసానికి గురి కాకుండా, యూఎస్-ఇండియా ఎడ్యుకేషన్ ఫెయిర్లను పటిష్టంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు. అమెరికాలోని హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని కోరతానని చెప్పారు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల డాక్యుమెంట్లను అమెరికాలో కాకుండా ఇక్కడ తనిఖీ చేశాకే వీసాలు మంజూరు చేయాలని యూఎస్ కాన్సులేట్‌కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. తెలుగు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అమెరికా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. -
అమెరికన్ కాన్సులేట్ అధికారులతో కేటీఆర్ భేటీ
హైదరాబాద్: అమెరికా దౌత్యకార్యాలయం(కాన్సులేట్) అధికారులతో తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం భేటీ అయ్యారు. ఇటీవల అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ప్రభుత్వం తిప్పిపంపిన అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. వీసాలు ఇచ్చేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలని కాన్సులేటు అధికారులను ఆయన ఈ సందర్భంగా కోరినట్టు తెలిసింది. దాంతో సమస్య వచ్చిన మాట వాస్తవమేనని కాన్సులేట్ అధికారులు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒక హైదరాబాద్ విద్యార్థులకే సమస్య రాలేదని.. వారికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను కోరినట్టు కేటీఆర్ చెప్పారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కాన్సులేట్ అధికారులు హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాగా, విద్యార్థుల సమస్యలపై విదేశాంగ శాఖకు లేఖ రాస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. -
యూఎస్ రాయబార కార్యాలయంపై కాల్పులు
అంకారా : టర్కీలో ఇస్తాంబుల్ నగరంలోని యూఎస్ రాయబారి కార్యాలయంపై సోమవారం తీవ్రవాదుల విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై... తీవ్రవాదులపై ఎదురు కాల్పులకు తెగబడింది. దాంతో తీవ్రవాదులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ మేరకు స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపింది. కాగా స్థానిక మూడంతస్థుల పోలీస్ స్టేషన్ భవనంపై తీవ్రవాదులు గత రాత్రి బాంబులతో దాడి చేశారు. దాంతో భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. దీంతో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని మీడియా పేర్కొంది. -
ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యం
వాషింగ్టన్: సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యమయ్యాయి. భారత్ సహా పలు దేశాల్లో పాస్ పోర్టు, వీసా సేవలు నెమ్మదించాయి. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విదేశాల్లోని తమ పాస్ పోర్టు, వీసా కార్యాలయాల్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా కాన్సులర్ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సాంకేతిక సమస్య కారణంగా అన్ని దేశాల్లోనూ తమ సేవలు ఆలస్యమయ్యాయని వెల్లడించింది. దరఖాస్తుదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సమస్యను పరిష్కరించి సేవల పునరుద్ధరణకు ప్రయత్నం జరుగుతోందని తెలిపింది. సాంకేతిక సమస్యతో న్యూఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్లలో సేవలు స్తంభించాయి. దీంతో మే 26 తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి పాస్ పోర్టులు ఆలస్యం కానున్నాయి. -
యూఎస్ కాన్సులేట్ వద్ద తెలంగాణ లాయర్ల ఆందోళన
హైదరాబాద్: బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ వద్ద తెలంగాణ న్యాయవాదులు సోమవారం ఆందోళనకు దిగారు. భారత జాతిపిత మహాత్మ గాంధీ ని అవమానించినందుకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. అమెరికా కాన్సులేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు న్యాయవాదులు ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. మహాత్మ గాంధీ పేరు, చిత్రాలతో కూడిన బీరు టిన్ లను తయారు చేసి అమెరికా కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేసింది.అమెరికా కనెక్టికట్‌లోని న్యూ ఇంగ్లాండ్ బ్రెవింగ్ కంపెనీ ఈ బీర్ టిన్స్ తయారు చేసింది. దీనిపై భారత్‌తో పాటు అమెరికాలోని భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది. -
వచ్చే నెలలో అమెరికా వెళ్లనున్న కేసీఆర్!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అమెరికా కాన్సులేట్ కార్యాలయానికికు వెళ్లారు. అమెరికా వెళ్లేందుకు ఆయన డిప్లొమాట్ వీసాకు దరఖాస్తు నిమిత్తం కాన్సులేట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వచ్చే నెలలో అమెరికా వెళ్లే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘అమెరికాలో ఉన్నత విద్యపై హైదరాబాద్ విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి’
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తి హైదరాబాద్ విద్యార్థుల్లో ఏటేటా పెరుగు తోందని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మైకేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలోని పలు యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూ ట్లలో 97 వేల మంది భారత విద్యార్థులున్నారని చెప్పారు. అమెరికాలోని విద్యా సంస్థల్లో ఫాల్ సెషన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో మైకేల్ ముల్లిన్స్ మాట్లాడారు. ఔత్సాహిక విద్యార్థులకు పలు సూచనలు చేశారు. యునెటైడ్ స్టేట్స్- ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్ తనుష్క బాలి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కార్యాలయ ప్రాంగణంలో యుఎస్‌ఐఈఎఫ్ కేంద్రం నెలకొల్పామని.. విద్యార్థులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్యలో ఈ సెంటర్‌కు వచ్చి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు ఒక రోజు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ 1800 103 1231 ద్వారా కూడా సంప్రదించవచ్చని చెప్పారు. www.usief.org.in వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సిల్వర్ ఓక్స్ స్కూల్లో డిజైన్ ఫెస్టివల్ సృజనాత్మకత, వైవిధ్యమైన ఆలోచనలే ప్రపంచాన్ని నడిపిస్తాయని అంటున్నారీ చిన్నారులు. నైపుణ్యాలను పెంచుకుంటే ప్రతి వస్తువునూ అందంగా తీర్చిదిద్దవచ్చని నిరూపిస్తు న్నారు. చిట్టిబుర్రలకు పదునుపెట్టేలా నిర్వహించిన ప్రోగ్రామ్‌కు హైదరాబాద్‌లోని సిల్వర్‌ఓక్స్ పాఠశాల వేదికైంది. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ‘చిల్డ్రన్ డిజైన్ ఫెస్టివల్’ పేరిట ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా సుమారు 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్కిటెక్చర్, డిజైన్, ఆటోమొబైల్, ఫిల్మ్‌మేకింగ్, గ్రాఫిక్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ, శిల్పకళ తదితర అంశాల్లో విద్యార్థుల ప్రతిభా పాటవాలను పెంపొందించుకునేందుకు అనువైన వాతావరణం కల్పించారు. -
యూఎస్ రాయబార కార్యాలయ ఉద్యోగి కాల్చివేత
పాకిస్థాన్‌లోని యూఎస్ రాయబార కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న పెషావర్‌కు చెందిన ఉద్యోగి ఫైసల్ సయ్యద్ (33)ని ఆగంతకుడు సోమవారం తుపాకితో కాల్చి చంపాడు. ఆ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించాడు. పెషావర్ గుల్బహర్ కాలనీలోని తన నివాసం నుంచి బయటకు వస్తున్న అతడిని ఆగంతకుడు కాల్చి చంపాడని పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. -
అమెరికా సదస్సుకు ఒడిశా మహిళా సర్పంచ్
భువనేశ్వర్: ఆరతీ దేవి (28) అనే ఒడిషాకు చెందిన మహిళా సర్పంచికి ఫిబ్రవరిలో అమెరికాలో జరిగే ఓ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగాం (ఐవీఎల్పీ)గా పిలిచే ఈ మూడు వారాల కార్యక్రమానికి భారత్ నుంచి ఆమె ఒక్కరే ఎంపికవడం విశేషం. గంజాం జిల్లాలోని ధుంకపరా అనే మారుమూల గ్రామ సర్పంచి అయిన ఆరతి, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఫోన్ చేసి విషయం చెప్పగానే ఒక్కసారిగా ఆశ్చర్యానందాలకు లోనయ్యానన్నారు. ఇల్లినాయీ రాష్ట్రంలోని స్ప్రింగ్ఫీల్డ్లో జరిగే ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తదితరాలపై ఆమె మాట్లాడతారు. పర్యటన ఖర్చులన్నీ అమెరికానే భరిస్తుంది. ఎంబీఏ పట్టభద్రురాలైన ఆరతి, సర్పంచ్ గా ఎన్నికవడం కోసం ఐడీబీఐలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఉద్యోగాన్ని కూడా వదులుకోవడం విశేషం. వయోజన విద్యా కార్యక్రమం, తదితరాలతో కొద్దికాలంలోనే ఊరి రూపురేఖలే మార్చేసి జేజేలందుకున్నారు. మన దేశం నుంచి మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, ప్రతిభా పాటిల్ ఐవీఎల్పీలో గతంలో పాల్గొన్నారు. -
నీఘా నీడలో ‘కాన్సులేట్’!
సాక్షి, చెన్నై : వరుస ఆందోళనలతో రాష్ర్ట పోలీసు యంత్రాంగం మేల్కొంది. నగరంలోని అమెరికా కాన్సులేట్‌ను నిఘా నీడలోకి తెచ్చారు. ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాలకు ఆంక్షలు విధించారు. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో ప్రధాన ప్రాంతాల్లో జెమినీ వంతెన ప్రదేశం ఒకటి. ఈ వంతెనకు ఆనుకుని అమెరికా దౌత్య కార్యాలయం ప్రహరీ ఉంటుంది. నిత్యం వందలాది మంది ఆ ప్రహరీ వద్ద వీసాల కోసం బారులు తీరి ఉంటారు. ఈ మార్గంలో ఆ కార్యాలయానికి భద్రత కల్పించడం అన్నది నగర పోలీసు యంత్రాంగానికి పెద్ద సవాలే. ఓ వైపు మెట్రో రైలు పనులతో ట్రాఫిక్ మళ్లింంచడం వాహన చోదకులకు గందరగోళ పరిస్థితిని సృష్టిస్తోంది. మరో వైపు ఈ కాన్సులేట్‌కు వ్యతిరేకంగా అప్పుడప్పుడు బయలు దేరే నిరసనలు మరింతగా సమస్యల్ని సృష్టిస్తున్నాయి. ఆందోళనలు: గత ఏడాది సెప్టెంబరులో అమెరికాలో మహ్మద్ ప్రవక్తను అవహేళన చేస్తూ అమెరికాలో ఓ చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ చెన్నైలో ఆగ్రహ జ్వాల రగిలింది. అమెరికా దౌత్య కార్యాలయంపై నిరసనకారులు ప్రతాపాన్ని చూపించారు. ఈ దాడిలో సీసీ కెమెరాలు, అక్కడి అద్దాలు ధ్వంసం కావడం పెను వివాదానికి దారి తీసింది. దీంతో అప్పటి కమిషనర్ త్రిపాఠి పదవి ఊడింది. అప్పటి నుంచి ఆ కాన్సులేట్‌కు గట్టి భద్రతను కల్పించి అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే, గత వారం రోజులుగా ఈ కార్యాలయంవద్ద ఆందోళనలు చోటు చేసుకుంటోన్నాయి. అమెరికాలో భారత రాయబారి దేవయానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ నిత్యం నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. నిఘా నీడ: వరుస ఆందోళనలు ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు పెడుతాయోనన్న బెంగ పోలీసుల్ని వెంటాడుతోంది. దీంతో ఆ కార్యాలయాన్ని నిఘా నీడలోకి తెచ్చారు. ఆ పరిసరాల్లో వాహనాలు పార్కింగ్ చేయకుండా, ఆగకుండా ఆంక్షలు విధించారు. ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు, ఇద్దరు జాయింట్ కమిషనర్లు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, పది మంది సబ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో 50మంది హెడ్ కానిస్టేబుళ్లు, మరో 300 మంది పోలీసుల్ని భద్రతకు నియమించారు. వీరితో పాటుగా ఆ కాన్సులేట్ ప్రైవేట్ సెక్యూరిటీ, ఆయుధ బలగాలు ఇక భద్రతా విధుల్లో నిమగ్నమయ్యాయి. జెమిని వంతెనపై ప్రత్యేకంగా అక్కడక్కడ తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆ వంతెన పరిసరాల్లోని ఫుట్ పాత్లలో ఎవరూ నడవకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. -
హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్‌గా మైఖేల్ ములిన్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రధాన అధికారి హోదా అయిన యూఎస్ కాన్సుల్ జనరల్‌గా మైఖేల్ ములిన్స్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈనెల ఏడోతేదీన బాధ్యతలు చేపట్టినట్టు ఇక్కడి యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ములిన్స్ ఇప్పటివరకు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో.. ‘మినిస్టర్ కాన్సులర్ ఫర్ మేనేజ్మెంట్ అఫైర్స్’ హోదాలో పనిచేశారు. సీనియర్ ఫారిన్ సర్వీసు అధికారి అయిన ములిన్స్ మినిస్టర్ కాన్సులర్ హోదాలో ఉన్నారు. ఆయన ఇంతకుముందు థాయిలాండ్, వియత్నాం, హాంకాంగ్, ఇండొనేసియా తదితర దేశాల్లో ఫారిన్ సర్వీసు అధికారిగా పనిచేశారు. ఫారిన్ సర్వీసుకు సంబంధించి ఆయన ఇప్పటివరకు ఆరు అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.