శ్రీసిటీకి అమెరికా కాన్సుల్‌ జనరల్‌ | US Consul General Katherine, Sri City, tour | Sakshi
Sakshi News home page

శ్రీసిటీకి అమెరికా కాన్సుల్‌ జనరల్‌

Published Wed, Apr 5 2017 12:56 AM | Last Updated on Fri, Aug 24 2018 6:29 PM

శ్రీసిటీకి అమెరికా కాన్సుల్‌ జనరల్‌ - Sakshi

శ్రీసిటీకి అమెరికా కాన్సుల్‌ జనరల్‌

వరదయ్యపాళెం (సత్యవేడు): హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. సౌత్‌ ఇండియా కమర్షియల్‌ అధికారి జాన్‌ ఫ్లెమింగ్, ఇతర అమెరికన్‌ అధికారులతో కలసి ఆమె శ్రీసిటీ పర్యటనకు వచ్చారు. శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి వారికి శ్రీసిటీ మౌలిక వసతులు, ప్రత్యేకతలు, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. అనంతరం శ్రీసిటీ వాణిజ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. అమెరికాకు చెందిన పది పరిశ్రమలు శ్రీసిటీలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశాయన్నారు.

వాటిలో పెప్సికో, క్యాడ్‌బరీ, కాల్గేట్‌ పామోలివ్, కెలాగ్స్‌ ఉన్నాయని గుర్తు చేశారు. అనంతరం కేథరిన్‌ మాట్లాడుతూ.. శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతిని నేరుగా వీక్షించడం సంతోషంగా ఉందని, మరికొన్ని అమెరికన్‌ కంపెనీలు శ్రీసిటీకి రావడానికి తన పర్యటన దోహదపడుతుందని చెప్పారు. అనంతరం శ్రీసిటీ సెజ్‌ను పరిశీలించారు. అమెరికన్‌ కంపెనీలు పెప్సీ, కెలాగ్స్‌ను సందర్శించారు. శ్రీసిటీ మౌలిక వసతులను ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement