Sri City
-
తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు రావాలి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/శ్రీసిటీ (వరదయ్యపాళెం): వివిధ పరిశ్రమలకు వేదికగా ఉన్న శ్రీసిటీ నుంచి తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుగా పారిశ్రామిక రంగం వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇప్పుడు సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో సోమవారం వివిధ పరిశ్రమలకు చంద్రబాబు సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు.శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించి మరో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా 5 కంపెనీలతో రూ.1,213 కోట్ల పెట్టుబడికి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తంగా 15,280 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీంతోపాటు ఫైర్ స్టేషన్‌ను ప్రారంభించి, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులపై చర్చించారు. అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా శ్రీసిటీ.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఈరోజు ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం గొప్ప విషయం. శ్రీసిటీలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. శ్రీసిటీలో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించడం, 4 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు సాధించడం గొప్ప విషయం. శ్రీసిటీని స్పెషల్ ఎకనమిక్ జోన్‌గా గుర్తించాం. 30 దేశాలు శ్రీసిటీలో పరిశ్రమల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సంపద çసృష్టి.. సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుంది.చెన్నై, కృష్ణపట్నం, తిరుపతికి శ్రీసిటీ దగ్గరగా ఉంది. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జో¯Œన్గా తీర్చిదిద్దాలనేదే నా ఆలోచన. నేను 1995లో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించాను. అప్పట్లోనే విజన్ 2020కి రూపకల్పన చేసి అమలు చేశా. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించా. భారత్‌ను ఐటీ ప్రపంచపటంలో నిలిచేలా చేస్తుందని ఆనాడే చెప్పా. ఈరోజు దాని ఫలితాలు అందరూ చూస్తున్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి.జి.భరత్, వంగలపూడి అనిత, డీజీపీ, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సోమశిల ప్రాజెక్టుకు పరిరక్షణకు చర్యలు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం సోమశిల ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. రాష్ట్రంలో రైతులకు సాగు ఖర్చులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామన్నారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏటా రూ.20 వేల సాయం అందిస్తామని తెలిపారు. సోమశిల ప్రాజెక్టును సద్వినియోగం చేసుకునేలా దాని పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమశిల జలాశయం 1988–89లోనే అప్పటి సీఎం ఎన్టీ రామారావు 75 టీఎంసీలు చేశారని చంద్రబాబు మాట్లాడడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. వైఎస్సార్ హయాంలోనే 72 టీఎంసీలకు సోమశిల చేరింది. -
అంతా ఆర్భాటం.. ప్రచార కండూతి!
సాక్షి, అమరావతి/శ్రీసిటీ (వరదయ్యపాళెం): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన కంపెనీలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా శ్రీ సిటీలో మళ్లీ లాంఛనంగా ప్రారంభించారు. రూ.1,570 కోట్ల విలువైన ఈ 16 కంపెనీల్లో ఇప్పటికే చాలా సంస్థలు వాణిజ్యపరంగా ఎప్పుడో ఉత్పత్తిని మొదలుపెట్టేశాయి. మరికొన్ని నిర్మాణాలను పూర్తి చేసే స్థితిలో ఉన్నాయి. అయినప్పటికీ తన హయాంలోనే ఈ కంపెనీలు వచ్చినట్టు.. వీటి ద్వారా 8,480 మందికి ఉపాధి కల్పించినట్లు చంద్రబాబు చెప్పుకోవడం గమనార్హం. ఈప్యాక్ డ్యూరబుల్స్, ఓజీ ఇండియా, ఎల్జీ పాలిమర్స్ వంటి కంపెనీలుఎప్పుడో వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించాయి.కానీ సీఎం చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 16 కంపెనీలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని కూడా ప్రారంభించామంటూ చెప్పుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఏ విధంగా పరుగులు తీసిందో.. విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో కుదిరిన ఒప్పందాలు ఎంత తొందరగా వాస్తవ రూపంలోకి వచ్చాయో పరోక్షంగా ప్రజలకు చాటిచెప్పారు. తద్వారా రాష్ట్రంలో గత ప్రభుత్వమే పారిశ్రామికాభివృద్ధికి బాటలు పరిచిందని.. దానికి తాము రాజముద్ర వేశామని చెప్పుకున్నట్టైంది. వాస్తవంలోకి జీఐఎస్ ఒప్పందాలు2023లో విశాఖ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్)లో గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న బెల్ ప్లేవర్స్ అండ్ ఫ్రాగ్నెసెస్ ఇండియా లిమిటెడ్, జెన్ లినెన్, డైకిన్, ఏజీపీ సిటీ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ఇప్పుడు వాస్తవరూపంలోకి వచ్చినట్లు చంద్రబాబు శ్రీసిటీ వేదికగా ఒప్పుకున్నారు. ఇందులో ఏజీపీ గ్యాస్ రూ.10,000 కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా డైకిన్ రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం చేసుకోవడమే కాకుండా ఇప్పటికే రూ.500 కోట్లతో తొలి దశను పూర్తి చేసింది.వాస్తవం ఇదయితే చంద్రబాబు మాత్రం ఆ సంస్థ ఇప్పుడు రూ.1,000 కోట్లతో విస్తరణకు కొత్తగా ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారానికి దిగారు. రూ.1,213 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి కొత్తగా చేసుకున్న ఒప్పందాలు, అదే విధంగా రూ.900 కోట్లకు సంబంధించి చేపట్టిన శంకుస్థాపన ప్రాజెక్టుల్లో అత్యధికం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చి ఉత్పత్తిని ప్రారంభించి విస్తరణ కార్యక్రమాలు చేపట్టినవే. ఎన్జీసీ ట్రాన్స్మిషన్స్, టీఐఎల్ హెల్త్‌కేర్, డైకిన్, ఎక్స్లెంట్ ఫార్మా ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే.గత ప్రభుత్వ ఘనతలు బాబు ఖాతాలోకే.. 2020లో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరగడంతో అప్పటి ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. జనావాసాల మధ్య ఉన్న కంపెనీని మూసివేయించి శ్రీసిటీలోని రెడ్‌జోన్ పరిధిలోకి తరలించింది. గత ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వడంతో ఎల్జీ పాలిమర్స్ వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకొని వాణిజ్యపరంగా ఉత్పత్తిని కూడా ప్రారంభించింది.అలాగే కోవిడ్ తర్వాత చైనా నుంచి దిగుమతులు తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకం కింద శ్రీసిటీలో బ్లూస్టార్, డైకిన్, ఈప్యాక్, హావెల్స్, పానాసోనిక్ వంటి అనేక ఏసీ తయారీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా అవి భారీ విస్తరణ కార్యక్రమాలను కూడా గతంలోనే ప్రకటించాయి. అనేక ఏసీ తయారీ కంపెనీలు రావడంతో వీటికి అనుబంధంగా విడిభాగాలు తయారు చేసే సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు రూ.10 కోట్లు, రూ.20 కోట్లతో ఏర్పాటయ్యాయి. వాటిని కూడా చంద్రబాబు తన ఖాతాలోనే వేసుకోవడం పట్ల పరిశ్రమల వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.గతేడాది శ్రీసిటీలో రూ.9 వేల కోట్లు పెట్టుబడులు..శ్రీసిటీ యాజమాన్యం ఏటా శ్రీసిటీకి వచ్చే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేస్తోంది. ఈ క్రమంలో 2023లో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించింది. తద్వారా 21,500 ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొంది. ఈ పెట్టుబడుల ద్వారా 18 కొత్త పరిశ్రమల స్థాపన, 7 పరిశ్రమల విస్తరణ జరిగినట్లు తెలిపింది. గతేడాది మార్చి 5న విశాఖ పెట్టుబడుల సదస్సులో బ్లూస్టార్ ఏసీ పరిశ్రమను సీఎం వైఎస్ జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. నేడు అదే బ్లూస్టార్ పరిశ్రమకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేపట్టడం గమనార్హం. అలాగే గతేడాది నవంబర్ 23న డైకిన్ ఏసీ పరిశ్రమ ప్రతినిధులు ఆ సంస్థ ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు. అదే పరిశ్రమకు సీఎం చంద్రబాబు తాజాగా ఎంవోయూ కుదుర్చుకున్నారు. అలాగే 2023లోనే ఉత్పత్తులు ప్రారంభమైన ఎక్స్లెంట్ ఫార్మా పరిశ్రమ విషయంలోనూ ఇలాగే చేశారు. గతేడాదే ఉత్పత్తులు ప్రారంభించిన ఎన్జీసీ, ఆర్ఎస్బీ ట్రాన్స్మిషన్ పరిశ్రమలకు సైతం చంద్రబాబు భూమిపూజ చేయడం పట్ల పరిశ్రమ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఇదే కోవలో ఈప్యాక్ డ్యురబుల్స్, బెల్ ప్లేవర్స్ అండ్ ఫ్రాగ్నెసెస్, జేజీఎల్ మెటల్ కన్వర్టర్స్, ఈఎస్ఎస్కే కాంపొనెంట్స్, జెన్‌లెనిన్ ఇంటర్నేషనల్ పరిశ్రమలకు కూడా ప్రారంభోత్సవాలు చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఇక ఊదండి బాకా
శ్రీసిటీ (వరదయ్యపాళెం): డప్పు కొట్టుకోవడంలో సీఎం చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని మరోమారు స్పష్టమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే రాష్ట్రంలో పరిశ్రమలు క్యూ కడుతున్నాయని ఎల్లో మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేసుకునేందుకు వ్యూహం రూపొందించారు. శ్రీసిటీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రారం¿ోత్సవాలు చేసిన పరిశ్రమలకే మళ్లీ ప్రారం¿ోత్సవాలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. అంతా సిద్ధమైపోయాక సీఎం పర్యటనను ఖరారు చేశారు. దీంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన పరిశ్రమలకు ప్రారం¿ోత్సవాలు, భూమిపూజలు, ఎంఓయూలు మరోమారు చంద్రబాబు చేతుల మీదుగా చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 పరిశ్రమలకు నేడు ప్రారంభోత్సవాలు చేసేందుకు సీఎం చంద్రబాబు శ్రీసిటీ వస్తున్నారు. ఎల్ల్జీ పాలిమార్స్, నైడెక్, ఈప్యాక్ డ్యురబుల్స్, న్యుయోలింక్ టెలి కమ్యూనికేషన్, ఓజీ ఇండియా ప్యాకేజింగ్, జెన్‌లెనిన్ ఇంటర్నేషనల్, బెల్ ఫ్లెవర్స్, జేజిఎల్ మెటల్ కన్వర్టర్స్, త్రినాథ్ ఇండస్ట్రీస్, ఎవర్ షైన్ మౌల్డర్స్, ఆటో డేటా, ఈఎస్ఎస్ కీ కాంపొనెంట్స్, అడ్మైర్ కేబుల్స్, బాంబై కోటెడ్ స్పెషల్ స్టీల్, శ్రీలక్ష్మీ ఆగ్రో ఫుడ్స్ పరిశ్రమలు గత ప్రభుత్వంలో ఏర్పాటై ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. ఇప్పుడు వీటినే సీఎం మరోమారు ప్రారంభించనున్నారు. రూ.1,570 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని ప్రచారం చేసుకోనున్నారు. మరో రూ.900 కోట్లతో ఇంకో 8 పరిశ్రమలకు భూమి పూజ, ఐదు పరిశ్రమలతో ఎంవోయూ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. -
శ్రీసిటీ.. ఇది సిరుల సిటీ: రవి సన్నా రెడ్డి
-
శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు సీఎం జగన్
సాక్షి, తిరుపతి: శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తాజ్ హోటల్లో జరిగిన వేడుకలో వధువు నిరీష, వరుడు సాగర్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. వారిని ఆశీర్వదించారు. -
నేడు సీఎం జగన్ తిరుపతి పర్యటన.. షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి/తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రజల నుంచి వినతులకు కూడా సీఎం జగన్ స్వీకరించనున్నారు. సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే.. సాయంత్రం ఐదు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు సాయంత్రం 5.15 గంటల వరకు విమానాశ్రయం వద్ద ప్రజలు నుంచి వినతులు స్వీకరణ సాయంత్రం 5.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి తాజ్ హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.30-5.45 గంటల వరకు శ్రీసిటీ ఎండి రవి సన్నా రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్లో వధూవరులను ఆశీర్వదించనున్న సీఎం జగన్ అనంతరం 5.45 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం సాయంత్రం ఆరు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. -
శ్రీసిటీ అభివృద్ధి అద్భుతం
వరదయ్యపాలెం : తిరుపతి జిల్లాలోని శ్రీసిటీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్‌ఓవెన్ మంగళవారం సందర్శించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికి శ్రీసిటీలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతి, సుస్థిర అభివృద్ధి, హరితహిత చర్యలు, వ్యాపార అనుకూలతలు, వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక ప్రోత్సాహకాలను వివరించారు. శ్రీసిటీలో విభిన్న రంగాలకు చెందిన 8 ప్రముఖ బ్రిటిష్ కంపెనీ ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీసిటీ ప్రపంచశ్రేణి మౌలిక వసతులు, వ్యాపార అనుకూల వాతావరణం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ శ్రీసిటీ పారిశ్రామిక అభివృద్ధిని అభినందించారు. 15ఏళ్లలో మంచి పారిశ్రామిక అభివృద్ధి సాధించడంతోపాటు పలు యూకే కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కావడం అద్భుతమని ప్రశంసించారు. త్వరలో వివిధ రంగాలకు చెందిన మరిన్ని బ్రిటిష్ కంపెనీలు శ్రీసిటీకి తరలివస్తాయన్నారు. హెడ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మిషన్ హెడ్ వరుణ్ మాలి మాట్లాడుతూ.. శ్రీసిటిలో టెక్నాలజీ, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో ముఖ్యంగా సుస్థిరతపై కలిసి పనిచేయాలని వ్యూహరచన చేస్తున్నట్టు చెప్పారు. పర్యటనలో భాగంగా గారెత్ విన్ ఓవెన్ శ్రీసిటీ పరిసరాలతో పాటు బెర్జిన్ పైప్స్ సపోర్ట్స్ ఇండియా, ఎంఎండీహెవీ మెషినరీ, రోటోలాక్ ఇండియా, ఎంఎస్ఆర్ గార్మెంట్స్, క్యాడ్బరీ కంపెనీలను సందర్శించారు. ఈ సందర్భంగా బెర్జిన్ పైప్స్ పరిశ్రమలో 350 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించారు. క్రియా యూనివర్సిటీని సందర్శించి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడారు. -
బ్లూస్టార్ ఉత్పత్తులకు హబ్‌గా శ్రీసిటీ: బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే రోజుల్లో తమ ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ హబ్‌గా మారగలదని ఎయిర్ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తుల సంస్థ బ్లూస్టార్ ఎండీ బి. త్యాగరాజన్ చెప్పారు. ఇప్పటికే అక్కడ ఇన్వెస్ట్ చేసినవి, కొత్తగా చేయబోయేవి కలిపి రాబోయే మూడేళ్లలో మొత్తం రూ. 1,000 కోట్ల పైచిలుకు పెట్టుబడి పెట్టినట్లవుతుందని త్యాగరాజన్ వివరించారు. వ్యూహాత్మక స్థానంలో ఉన్నందున సరుకు రవాణా, నిల్వ చేసుకోవడం వంటి విషయాలకు సంబంధించి తమకు ఇది ప్రయోజనకరంగా ఉంటోందని పేర్కొన్నారు. (March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!) శుక్రవారమిక్కడ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా త్యాగరాజన్ ఈ విషయాలు చెప్పారు. శ్రీసిటీలో రూమ్ ఏసీల తయారీకి సంబంధించి మొత్తం నాలుగు దశల్లో ప్రస్తుతం తొలి దశ పూర్తయి ఇటీవలే ఉత్పత్తి మొదలైందని చెప్పారు. మిగతావి కూడా పూర్తయితే 12 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. అటు కమర్షియల్ ఏసీల తయారీకి సంబంధించి రెండో ప్లాంటు నిర్మాణం కోసం 40 ఎకరాలు సమీకరించినట్లు, 2024లో పనులు, 2025లో ఉత్పత్తి ప్రారంభం కాగలదని అంచనా వేస్తున్నట్లు త్యాగరాజన్ చెప్పారు. గత కొద్ది త్రైమాసికాలుగా సానుకూల ఫలితాలు నమోదు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బిలియన్ డాలర్ల ఆదాయం (దాదాపు రూ. 8,200 కోట్లు) అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ. 6,046 కోట్ల ఆదాయం నమోదు చేసింది. అంతర్జాతీయంగా విస్తరణ..: కొత్త విభాగాల్లో ప్రవేశించడంకన్నా ఇతర దేశాల్లో మరింత విస్తరించడంపై దృష్టి పెడుతున్నట్లు త్యాగరాజన్ చెప్పారు. ప్రస్తుతం మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తుండగా అమెరికా, యూరప్ తదితర మార్కెట్లలోనూ కార్యకలాపాలకు సిద్ధమవుతున్నట్లు వివరించారు. ఆయా మార్కెట్లకు ఈ ఏడాది ఆఖరు నుంచే ఎగుమతులు మొదలుపెట్టే అవకాశం ఉందన్నారు. (Ugadi 2023 బిగ్ ‘సి’: వినూత్నఫెస్టివ్ ఆఫర్లు ) కొత్త ఫ్రీజర్ల శ్రేణి.. బ్లూస్టార్ ఆవిష్కరించిన కొత్త ఉత్పత్తుల శ్రేణిలో దేశీయంగా తీర్చిదిద్దిన డీప్ ఫ్రీజర్లు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులు ఉన్నాయి. వీటి కూలింగ్, నిల్వ సామర్థ్యాలు మరింత అధికంగా ఉంటాయని, వీటిని మహారాష్ట్రలోని వాడా ప్లాంటులో తయారు చేశామని త్యాగరాజన్ తెలిపారు. రాబోయే రోజుల్లో తమ సంస్థ వృద్ధికి కమర్షియల్ రిఫ్రిజిరేషన్ మరింతగా ఊతమివ్వగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ విభాగం నుంచి తమకు రూ. 70 కోట్లు, దక్షిణాదిలో రూ. 235 కోట్ల పైచిలుకు ఆదాయం వస్తోందన్నారు. మొత్తం అన్ని విభాగాల రీత్యా చూస్తే తమ సంస్థ 20–25 శాతం వృద్ధి సాధిస్తోందని, పరిశ్రమ వృద్ధి సుమారు 15–20 శాతం మేర ఉంటోందని పేర్కొన్నారు. -
Tirupati: వెంకన్న పాదాల చెంత ఎన్ఐఈఎల్ఐటీ..
తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక రాజధానిగా అవతరిస్తోంది. ఇప్పటికే బహుళజాతి కంపెనీలు, పారిశ్రామిక వాడలు, ప్రముఖ విద్యాసంస్థలతో అలరారుతోంది. ఇప్పుడు సరికొత్తగా మానవ వనరుల అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. నిరుద్యోగ సమస్య రూపుమాపడం, యువతకు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ మెరుగుపరచడం, ప్రపంచ స్థాయిలో రాణించేలా వివిధ కోర్సులు అందించడమే లక్ష్యంగా నైలెట్ సంస్థ ముందుకు వచ్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: వెంకన్న పాదాల చెంత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు ఎన్ఐఈఎల్ఐటీ బృందం తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో సోమవారం శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఐఐడీటీ కేంద్రాన్ని బృందం పరిశీలించింది. తిరుపతిలో ఎన్ఐఈఎల్ఐటీ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కమిటీ చైర్మన్, సంస్థ డైరెక్టర్ స్పష్టం చేశారు. నైలెట్ అంటే ఏంటి? దాని ముఖ్యఉద్దేశాలు ► ఎన్ఐఈఎల్ఐటీ(నైలెట్) భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న స్వయం ప్రతిపత్తమైన శాస్త్రీయ సంఘం. ► ఎన్ఐఈఎల్ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మానవనరులు అభివృద్ధి, సంబంధిత కార్యకలాపాలు అందుకు ఉపయోగపడే కోర్సులు అందించడం ముఖ్య ఉద్దేశం. ► ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలతో కూడిన శిక్షణ, గుర్తింపు సేవలను అందించడం ద్వారా ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అనుబంధ రంగాలలో నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి చేస్తుంది. ఎన్ఐఈఎల్ఐటీ అందిస్తున్న కోర్సులు ఫార్మల్ కోర్సుల్లో భాగంగా మూడేళ్ల బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ, వి.ఎల్.ఎస్.ఐ డిజైన్, నాన్ ఫార్మల్ రంగంలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, హార్డ్‌వేర్, సైబర్ చట్టం, సైబర్ భద్రతా, భౌగోళిక సమాచార వ్యవస్థ, క్లౌడ్ కంప్యూటరింగ్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ – మ్యానుఫ్యాక్చరింగ్, ఇ–వ్యర్థాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, ఇ–గవర్నెన్స్ వంటి కోర్సులు అందిస్తుంది. దేశంలో అత్యుత్తమమైన యూనివర్సిటీలలో ప్రాచుర్యం పొందిన కోర్సులను ఉమ్మడి భాగస్వామ్యంలో అందుబాటులోకి తీసుకురావడం నైలెట్ ప్రత్యేకత. ఎన్ఐఈఎల్ఐటీ తిరుపతిలో నెలకొల్పడం ద్వారా వృత్తి విద్య కోర్సుల తోపాటు అనుదినం మారూతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం అందుకు అవసరమైన కోర్సులు నేర్చుకోనేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన పనిలేకుండా తగిన నైపుణ్యాన్ని ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు వారి అర్హతలను బట్టి అవకాశాలను కూడా కల్పిస్తుంది. తైవాన్, జపాన్, చైనా, కొరియా వంటి దేశాలతో అవగాహన ఒప్పందం కలిగి ఉండడంతో విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. తిరుపతి జిల్లాలో త్వరలో ఐటీ కాన్సెప్ట్ సిటీ నెలకొల్పబోతున్నారు. తిరుపతి జిల్లాలో శ్రీసిటీ, రేణిగుంటలో ఈఎంసీ, మేనకూరు పారిశ్రామికవాడలో నెలకొల్పిన దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయనున్నారు. స్థానికంగా ఉన్న యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్య కు పరిష్కారం లభిస్తుంది. – మద్దెల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
ఏసీల తయారీ హబ్‌గా శ్రీ సిటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీ హబ్‌గా ఎదుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి ఏసీ తయారీ యూనిట్లు తిరుపతి జిల్లా శ్రీసిటీకి క్యూ కడుతున్నాయి. గత ఆరు నెలల్లోనే ఆరు అంతర్జాతీయ ఏసీ తయారీ, విడిభాగాల తయారీ సంస్థలు ఇక్కడకు వచ్చాయి. బ్లూస్టార్, డైకిన్ వంటి సంస్థలతో పాటు 20కిపైగా బ్రాండ్లకు విడిభాగాలను సరఫరా చేసే ఆంబర్, హావెల్స్, ఈప్యాక్ డ్యూరబుల్స్, పానాసోనిక్–యాంకర్ సంస్థలు ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటి ద్వారా రూ.3,755 కోట్ల పెట్టుబడులు రానుండగా, 9,700 మందికి ఉపాధి లభిస్తుంది. ఇందులో బ్లూస్టార్ ఏడాదికి 12 లక్షల ఏసీల సామర్థ్యంతో, డైకిన్ 15 లక్షల యూనిట్ల సామర్థ్యంతో పరిశ్రమలు నెలకొల్పుతున్నాయి. పానాసోనిక్ యాంకర్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. మిగిలిన పరిశ్రమల నిర్మాణం వేగంగా జరుగుతోంది. గతేడాది అక్టోబర్‌లో భూమి పూజ చేశామని, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని బ్లూస్టార్ ప్రతినిధి ‘సాక్షి’కి వివరించారు. ఒక్క శ్రీ సిటీకే రూ.8,349 కోట్ల పెట్టుబడులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2008 ఆగస్టు 8న ప్రారంభమైన శ్రీ సిటీలో ఇప్పటివరకు 28 దేశాలకు చెందిన 200కు పైగా సంస్థల పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 50,000 మందికి ఉపాధి లభిస్తోంది. మరీ ముఖ్యంగా శ్రీ సిటీ గత మూడేళ్లలో భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2019 జూన్ నుంచి ఇప్పటివరకు 38 సంస్థలు కొత్త పరిశ్రమలను నెలకొల్పాయి. ఇందులో కింబెర్లీ క్లార్క్, ఆల్స్టామ్ రెండో దశ విస్తరణ చేపట్టాయి. సీఆర్ఆర్సీ, ఎల్జీ పాలిమర్స్, కాస్‌మాక్స్ బ్యాటరీస్, ఓజి ఇండియా ప్యాకేజింగ్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్స్ వంటి పలు అంతర్జాతీయ కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో 14 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కోవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేవలం 14 నెలల రికార్డు సమయంలో యూనిట్‌ను ప్రారంభించినట్లు నోవా ఎయిర్ ప్రతినిధులు తెలిపారు. 2020 డిసెంబర్ 18న పనులు ప్రారంభించి 2021 నవంబర్‌లో సీఎం చేతులు మీదుగా ఈ పరిశ్రమ ప్రారంభించారు. ఇక్కడ 220 టన్నులు ఆక్సిజన్‌తో పాటు పారిశ్రామిక అవసరాలకు ఇతర వాయువులను తయారు చేస్తారు. పవన విద్యుత్‌కు తయరీలో కీలకమైన విండ్ మిల్ గేర్ బాక్స్‌లను తయారు చేసే చైనాకు చెందిన ఎన్జీసీ ట్రాన్స్మిషన్ పరిశ్రమ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం క్వాలిటీ ఆడిటింగ్ జరుగుతోందని, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. శ్రీ సిటీలో ఈ మూడేళ్లలో కొత్తగా రూ.8,349 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 21,540 మందికి ఉపాధి లభిస్తోంది. మూడేళ్లలో రాష్ట్రంలో రూ.36,313 కోట్ల పెట్టుబడులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 96 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.36,313 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 56,681 మందికి ఉపాధి లభిస్తోంది. మరో 36,000 కోట్ల విలువైన పెట్టుబడులతో 52 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే మరో 77 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఆర్సిలర్ మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు, అదానీ, సన్‌ఫార్మా, సెంచురీ ఫ్లైవుడ్స్, శ్రీ సిమెంట్స్, గ్రీన్కో ఎనర్జీ, అరబిందో వంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ మూడేళ్లలో 26,922 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంస్‌ఈ) యూనిట్లు రాష్ట్రంలో రూ.7,550 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 1.76 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. -
పెట్టుబడుల ఆకర్షణకు.. త్వరలో జపాన్‌లో రోడ్ షో
సాక్షి, అమరావతి: జపాన్ పెట్టుబడులకు రాష్ట్రం అనువైనదని, ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టగా.. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో త్వరలో జపాన్‌లో రోడ్ షో నిర్వహించనున్నట్లు ఏపీఈడీబీ (ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు) సీఈఓ జవ్వాది సుబ్రమణ్యం వెల్లడించారు. జపాన్‌కు చెందిన పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగ ప్రతినిధుల బృందం శుక్రవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సుబ్రమణ్యంను కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ఆసక్తిని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జవ్వాది మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో త్వరలో జపాన్‌లో రోడ్‌షోను నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని జపాన్ కంపెనీల సీఈఓలతో త్వరలో రాష్ట్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. అంతేకాక.. విశాఖపట్నంలో జపాన్‌కు చెందిన యొకొహమ గ్రూపునకు చెందిన ఏటీజీ టైర్స్ భారీ టైర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తుండటమే కాకుండా ఆ యూనిట్‌కు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కదుర్చుకున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. జైకా, జెట్రో తదితర జపాన్ సంస్థలతో కలిసి ప్రయాణిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు మరోవైపు.. శ్రీసిటీకి 25 కి.మీ దూరంలో ప్రత్యేకంగా జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ (జిట్)ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. ప్రత్యేకంగా జపాన్ కంపెనీలకే హెల్ప్‌డెస్క్ వెసులుబాటుతో పాటు శ్రీసిటీలో జపనీస్ భాష అనువాదకులనూ ఏర్పాటుచేశామన్నారు. ఇక దక్షిణాదిలో వాణిజ్యపరంగా ఏపీ అన్నింటికి అనువైన రాష్ట్రంగా ఎంయూఎఫ్‌జీ బ్యాంకు చెన్నై బ్రాంచ్ అధ్యక్షులు యుకిహిరో చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంయూఎఫ్‌జీ బ్యాంక్ ఢిల్లీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కజుయోషి షిబటని, జపనీస్ కార్పొరేట్ బ్యాంకింగ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్లు సహిల్ అగర్వాల్, సందీప్ వర్మ, ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ సవరపు ప్రసాద్ హాజరయ్యారు. -
ఆంధ్రప్రదేశ్‌లో ప్యానాసోనిక్ ప్లాంటు ప్రారంభం.. సౌత్‌లో ఇదే ఫస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో ఉన్న ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన ప్లాంటును ప్రారంభించింది. ఎలక్ట్రికల్ ఉత్పత్తుల విభాగంలో సంస్థకు దక్షిణాదిన ఇదే తొలి ప్లాంటు కాగా దేశవ్యాప్తంగా ఏడవది. రెండు దశలకుగాను మొత్తం రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. తొలి దశలో భాగంగా ఇప్పటికే రూ.300 కోట్లు వ్యయం చేశారు. వైరింగ్ డివైసెస్ అయిన రోమా, పెంటా మాడ్యులర్, రోమా అర్బన్ బ్రాండ్ల ఉత్పత్తులు తొలుత ఇక్కడ తయారు చేస్తారు. రానున్న రోజుల్లో స్విచ్గేర్స్, వైర్స్, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఉత్పత్తులను రూపొందిస్తారు. చదవండి: మంచి విజన్ ఉన్న యువ సీఎం జగన్: కుమార మంగళం బిర్లా -
పెట్టుబడులకు ఏపీ కీలకం
సాక్షి, అమరావతి/వరదయ్యపాళెం(తిరుపతి): దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలకు, ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రమని, దీర్ఘకాలిక వ్యాపారాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు జపాన్‌కు చెందిన ప్రపంచ నెంబర్‌వన్ ఏసీ కంపెనీ డైకిన్ వెల్లడించింది. భారీ వినియోగం ఉండే మూడు రాష్ట్రాలకు సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రదేశమైన శ్రీసిటీలో రూ.1,000 కోట్లతో భారీ ఏసీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు డైకిన్ ఇండియా ఎండీ, సీఈఓ కన్వాల్జీత్ జావా తెలిపారు. శ్రీసిటీలో గురువారం డైకిన్ ఏసీ తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ, చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ మసయుకి టాగా, ఫ్యుజిత సీనియర్ ఎండీ నయోకి నిషియొక, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, కన్వాల్జీత్ జావా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జావా మాట్లాడుతూ.. తమ ప్రపంచవ్యాప్త వినియోగదారులకు ఉత్తమ సేవలందించేందుకు అవసరమైన గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థను విస్తరించడం, సమతుల్యం చేయడం లక్ష్యంగా సంస్థ దీర్ఘకాలిక వృద్ధి ప్యూహంలో (ప్యూజన్–2025) భాగంగా ఈ పెట్టుబడి చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. శ్రీసిటీ ఫ్యాక్టరీ çవ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. కేవలం ఏసీ తయారీనే కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలు, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలు, ఉత్పత్తి సేవలను అందించనున్నట్లు తెలిపారు. అంచెలంచెలుగా పెట్టుబడిని మరింత పెంచనున్నట్లు జావా వెల్లడించారు. శ్రీసిటీ డొమెస్టిక్ టారిఫ్ జోన్లో 75.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తున్న ఈ ప్లాంట్ జూలై 2023 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే, సంవత్సరానికి 1.5 మిలియన్ ఏసీ యూనిట్లతో పాటు కంప్రెసర్లు, కంట్రోలర్ బోర్డులు, ఇతర విడిభాగాలను తయారుచేయగల ఈ ప్లాంట్ ద్వారా మొత్తం మూడువేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది డైకిన్‌కు దేశంలో మూడో కేంద్రం కాగా.. అతిపెద్ద తయారీ కేంద్రం కూడా. భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ మాట్లాడుతూ.. జపాన్–భారత్ ఆర్థిక భాగస్వామ్యానికి ఇది మరో ముందడుగుగా అభివర్ణించారు. గత నెలలో జపాన్, భారత్ ప్రధానుల మధ్య జరిగిన సమావేశంలో రెండు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పెద్దఎత్తున బలపడేందుకు పరస్పర అంగీకారం కుదిరిందన్నారు. అలాగే, భారత్‌లో రానున్న ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్ల మేర జపాన్ పెట్టుబడులను లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు. ఇందులో భాగంగానే నేడు డైకిన్ ఇండియా తొలి అడుగు వేసిందన్నారు. కోవిడ్ తర్వాత తొలి భారీ పెట్టుబడి ఇది.. ఇక దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నెంబర్‌వన్‌గా వున్న ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల నిమిత్తం డైకిన్ గ్రూప్ ఎంపిక చేసుకున్నందుకు శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలియచేశారు. కోవిడ్ అనంతరం అధికారికంగా, పెద్దఎత్తున నిర్వహించిన పరిశ్రమ భూమిపూజ కార్యక్రమం ఇదేనని.. అలాగే, పీఎల్ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీం కింద దక్షిణాదిలో ఏర్పాటవుతున్న తొలి భారీ తయారీ కేంద్రం కూడా ఇదేనన్నారు. శ్రీసిటీ జపనీస్ ఎనక్లేవ్లో ఇది 27వ జపాన్ కంపెనీ అని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో జపాన్ ప్రతినిధుల కోసం ఇక్కడ ప్రత్యేక సదుపాయాలు కల్పించామని.. త్వరలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని రవీంద్ర తెలిపారు. -
శ్రీసిటీని సందర్శించిన కేంద్ర కమిటీ
వరదయ్యపాళెం: ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల సవరణ (ఆర్వోడీటీఈపీ) నిర్ణయ కమిటీ బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. మాజీ కేంద్ర హోం, వాణిజ్య కార్యదర్శి జీకే పిళ్ళై (రిటైర్డ్ ఐఏఎస్) నేతృత్వంలో రిటైర్డ్ సీబీఈసీ స్పెషల్ సెక్రటరీ వైజీ పరాండే, కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ (రిటైర్డ్) గౌతమ్ రే కమిటీ సభ్యులుగా సందర్శనకు రాగా వీరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ అసన్ అహ్మద్, డిప్యూటీ డీజీఎఫ్టీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. శ్రీసిటీ ఎస్ఈజెడ్, డీటీజెడ్‌లోని పరిశ్రమల సీనియర్ మేనేజర్లతో వీరు పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. పిళ్ళై మాట్లాడుతూ..తక్కువ వ్యవధిలో శ్రీసిటీ సాధించిన పారిశ్రామిక వృద్ధిని ప్రశంసించారు. ఎగుమతులపై సుంకాలు, పన్నులు ఇతర సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎగుమతులకు ఆర్ఓడీటీఈపీ రేట్లను నిర్ణయించడానికి ఎగుమతి అథారిటీ పరిశ్రమల అభిప్రాయాలను తమ కమిటీ సేకరిస్తుందన్నారు. పన్నులు, సుంకాల రీయింబర్స్‌మెంట్‌ను సులభతరం చేయడానికి తమ ఉత్పత్తుల ధరలను నిర్దేశిత ఫార్మాట్లో ఇవ్వాలని కంపెనీలకు సూచించారు. కమిటీకి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. -
శ్రీసిటీతో గౌతమ్‌రెడ్డికి అనుబంధం
శ్రీసిటీ: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో చిత్తూరు జిల్లాలోని సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ (శ్రీసిటీ)లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణవార్త ఇక్కడి పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శ్రీసిటీతో గౌతమ్‌రెడ్డికి మంచి అనుబంధం ఉంది. గడచిన రెండేళ్లలో పలుసార్లు శ్రీసిటీని సందర్శించిన ఆయన పారిశ్రామికాభివృద్ధికి విశేష సహకారం అందించారు. కోవిడ్ కష్టకాలంలో ప్రత్యేక చొరవ చూపి పరిశ్రమల్లో ఉత్పత్తులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. 2020 ఫిబ్రవరిలో జపాన్‌కు చెందిన భారీ పరిశ్రమ టోరె ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన జపాన్ ప్రతినిధులతో సమావేశమై మరిన్ని పరిశ్రమలు ఇక్కడకు తరలివచ్చేలా ఒప్పించారు. తరచూ వర్చువల్ విధానంలో ఇక్కడ పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తూ వారి సమస్యలను పరిష్కరించేవారు. మంత్రిగా, స్నేహితుడుగా పరిశ్రమల సీఈవోలకు ప్రత్యక్షంగాను, ఫోన్లోను అందుబాటులో ఉంటూ అందరి మన్ననలు పొందారు. శ్రీసిటీకి తీరనిలోటు గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం రాష్ట్ర పారిశ్రామిక వర్గానికి, ముఖ్యంగా శ్రీసిటీకి తీరని లోటు. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి, ప్రత్యేకించి కరోనా సమయంలో పరిశ్రమల పునః ప్రారంభానికి ఆయన అందించిన సహకారం ఎంతో విలువైనది. – రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ -
శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్ ఎండీ గజనన్ నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 14 నెలల్లోప్లాంట్ ప్రారంభం కావడం ఒక మైలురాయి అని కొనియాడారు. 220 టన్నుల ఆక్సిజన్ తయారీ చేయడం చాలా ముఖ్యమైన విషయమన్నారు. 144 పీఎస్ఏ ప్లాంట్లు కూడా వివిధ ఆస్పత్రుల్లో పెట్టామని, మరో 32 ప్లాంట్లు కూడా పెడుతున్నామని పేర్కొన్నారు. చదవండి: CM YS Jagan: చెప్పాడంటే.. చేస్తాడంతే! దీనివల్ల ఆక్సిజన్ విషయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, 24వేల ఆక్సిజన్ బెడ్లు తయారు చేశామని సీఎం జగన్ అన్నారు. కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు సరిపడా ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 300 టన్నుల ఆక్సిజన్ తయారీలో ఉందని, ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి దీనికి అదనంగా వచ్చిచేరుతుందని పేర్కొన్నారు. చదవండి: పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు: విజయ్ కుమార్ కోవిడ్కే కాదు, పరిశ్రమలకూ ఆక్సిజన్ చాలా ముఖ్యమని నోవా ఎయిర్ ఎండీ గజనన్ నబర్ తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్లాంట్‌పెట్టామని ఇందుకు ఏపీ సరైనదని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, 14 నెలల్లో ప్లాంట్‌ను నిర్మించామని తెలిపారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బాగా సహకరించిందని చెప్పారు. కోవిడ్ వేవ్‌ల సమయంలో రవాణాకు, మానవవనరులకు కొరత లేకుండా అధికారులు చూశారని, అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా కోవిడ్ కారణంగా ఆక్సిజన్ కొరత రాకుండా ఓ ప్లాంట్‌ను తీసుకు రావాలని గతంలో ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. తద్వారా మెడికల్ ఆక్సిజన్‌కు లోటు రాకుండా రాష్ట్రం స్వయం సమృద్ధిసాధించాలంటూ అధికారులకు లక్ష్య నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోవిడ్ నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ లోటు లేకుండా చూసే చర్యల్లో భాగంగా ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ రోజుకు 220 టన్నుల సామర్ధ్యం కలిగి ఉంది. ఈ ప్లాంట్‌లో మెడికల్ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గోన్ వాయువుల తయారీ చేయనున్నారు. నోవా ఎయిర్‌తో జనవరి 24, 2020న ఏపీ ప్రభత్వం ఒప్పందం కుదుర్చుకుంది. డిసెంబర్ 18, 2020న పనులు ప్రారంభం కాగా, నవంబర్ 2021న పనులు పూర్తయ్యాయి. -
8 నెలల్లో రూ. 7,128 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు వేగంగా ముందుకొస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల కాలానికి రాష్ట్రంలోకి రూ. 7,128 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 31 ప్రాజెక్టుల ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొంది. ఇందులో వైఎస్సార్ జిల్లాలో పిట్టి రైల్ ఇంజనీరింగ్, చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో హావెల్స్ ఇండియా ఏసీ తయారీ యూనిట్, వైజాగ్‌లో అరబిందో ఫార్మా స్టెరిలైట్ యూనిట్, మోల్డ్‌టెక్ ప్లాస్టిక్ కంటైనర్ల తయారీ, అనంతపురం జిల్లాలో ఎస్బీ ఎనర్జీ సోలార్ యూనిట్, కర్నూలు జిల్లాలో ఎస్బీజీ క్లీన్టెక్ ప్రాజెక్ట్స్, చిత్తూరులో కోకాకోలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతిపాదనలు ఉన్నాయి. ఆయా కంపెనీలు పెట్టుబడులు పెట్టడం కోసం డీపీఐఐటీ వద్ద ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మెమోరాండం పార్ట్–ఏ దరఖాస్తు చేసుకున్నాయి. వీలయినంత త్వరగా తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో మొత్తం 26 యూనిట్లు వాణిజ్య పరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్లు డీపీఐఐటీ పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 8,611 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇందులో జెమినీ ఈడిబుల్ ఆయిల్, ఇండియా మెటల్‌వన్, వసంత ఇండస్ట్రీస్, రంగ ప్రాక్టికల్ బోర్డ్స్, అయన సోలార్, ఫాక్స్‌లింక్ ఎలక్ట్రానిక్ వంటి సంస్థలు ఉన్నాయి. అలాగే 2020 సంవత్సరంలో రాష్ట్రంలో రూ. 9,727 కోట్ల విలువైన 59 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. 42 సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడంతో రూ. 9,840 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. -
శ్రీసిటీ.. ఇట్స్ ఎ బ్రాండ్!
సాక్షి, న్యూఢిల్లీ/వరదయ్యపాళెం: దేశంలోని అత్యున్నత పారిశ్రామిక పార్కుల్లో ఒకటిగా ఏపీలోని శ్రీసిటీ నిలిచింది. కేంద్ర పరిశ్రమ, అంతర్గత వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (ఐపీఆర్‌ఎస్) రిపోర్ట్ 2.0 నివేదికలో 41 పారిశ్రామిక పార్కులను ‘లీడర్స్’గా గుర్తించారు. ఇందులో దక్షిణ భారత్ నుంచి శ్రీసిటీ మాత్రమే లీడర్స్ కేటగిరీలో చోటు దక్కించుకోవడం విశేషం. దేశంలోని 15 అత్యున్నత సెజ్‌లలో ఒకటిగా శ్రీసిటీ నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 449 పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లపై జరిపిన అధ్యయనంలో పారిశ్రామిక పార్కులను లీడర్స్, చాలెంజర్స్, ఆస్పిరర్స్‌గా విభజించారు. కాగా 90 పారిశ్రామిక పార్కులను చాలెంజర్ కేటగిరీలో, 185 పార్కులను ఆస్పిరర్స్‌గా చేర్చారు. ఈ రేటింగ్‌లు ఇప్పటికే ఉన్న కీలక పారామీటర్స్, మౌలిక సదుపాయాల ఆధారంగా కేటాయించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ ఈ నివేదికను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నివేదిక భారతదేశ పారిశ్రామిక పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని తెలిపారు. కాగా, ఐపీఆర్‌ఎస్ రేటింగ్‌పై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గౌరవం శ్రీసిటీ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు, పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణానికి, స్థిరమైన పర్యావరణ ఉత్తమ పద్ధతులకు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. -
శ్రీసిటీకి మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు శ్రీసిటీని వరించాయి. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందుకు సీఐఐ (భారత పారిశ్రామిక సమాఖ్య) రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు శ్రీసిటీని ఎంపిక చేసింది. శ్రీసిటీ చేపడుతున్న నీటి సుస్థిరత, అభివృద్ధి చర్యలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఆగస్టు 28న సీఐఐ నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను శ్రీసిటీ యాజమాన్యం అందుకోనుంది. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఇది నిజంగా తాము గర్వించదగ్గ గుర్తింపుగా వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన కార్పొరేట్‌గా నీటి వనరులను సంరక్షించడానికి, నీటి నిల్వలు పెంచడానికి శ్రీసిటీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ అవార్డులు తమ సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు వారి భవిష్యత్ ప్రయత్నాలకు మంచి ప్రేరణ ఇస్తాయన్నారు. -
Sri City: శ్రీ సిటీలో క్రయోజనిక్ ఆక్సిజన్
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే శ్రీ సిటీని క్రయోజనిక్ ఆక్సిజన్ తయారీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని తెలిపారు. నెల్లూరు జీజీహెచ్‌లో పీఎం కేర్స్ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంటుకు జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, ఇందుకోసం రాష్ట్రంలో భారీగా ఆక్సిజన్ ఉత్పత్తి, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాల తయారీకి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఇరవై రోజుల ముందు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడిన రాష్ట్రం ఇవాళ సర్‌ప్లస్‌లో ఉండటం ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనమన్నారు. -
ఐఐఐటీ శ్రీసిటీలో టీచింగ్ కొలువులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీసిటీ(ఐఐఐటీ).. అసిస్టెంట్/అసోసియేట్ ప్రొఫెసర్లు (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్), అసిస్టెంట్ ప్రొఫెసర్లు (మ్యాథమేటిక్స్/డేటాఅనలిటిక్స్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, స్పెషలైజేషన్ల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ సిటీ, చిత్తూరు, 630 జ్ఞాన్ మార్గ్, శ్రీ సిటీ, చిత్తూరు జిల్లా–517646, ఆంధ్రప్రదేశ్, ఇండియా చిరునామాకు పంపించాలి. ► ఈమెయిల్: careers.faculty@iiits.in ► దరఖాస్తులకు చివరి తేది: 11.06.2021 ► వెబ్సైట్: http://www.iiits.ac.in మరిన్ని నోటిఫికేషన్లు ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు CDFD Recruitment 2021: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు సీడ్యాక్, హైదరాబాద్‌లో 44 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు -
నిరుద్యోగుల పాలిట ‘సిరి’ సిటీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రజల సంక్షేమం కోసం పరితపించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన అది. రాళ్లు, రప్పలతో కూడిన భూముల్లో.. వర్షాధారిత వ్యవసాయంతో ప్రజలు అత్యంత దుర్భర జీవనం సాగించిన ప్రాంతమది. వారి జీవితాలను, ఆ ప్రాంతాన్ని మెరుగుపర్చాలనే సంకల్పం ఆ మహా నాయకుడిలో మొగ్గ తొడిగింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రజల జీవన ప్రమాణాలు బాగుపడతాయని భావించిన ఆయన ‘సెజ్’ (స్పెషల్ ఎకనమిక్ జోన్) ఏర్పాటు చేశారు. ఇప్పుడది ఇంతింతై.. ఒటుడింతై అన్నట్టుగా దినదినాభివృద్ధి చెందుతూ.. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు పొందుతోంది. చిత్తూరు జిల్లాకు మణిహారంగా నిలుస్తోంది. పారిశ్రామక వాడగా మొదలై.. పారిశ్రామిక నగరంగా వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల పరిధిలో 14 గ్రామాల మధ్య శ్రీసిటీని ఆగస్టు 8, 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. దీనిద్వారా ప్రస్తుతం 5 0వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరో ఐదేళ్లలో 1.50 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది. పారిశ్రామిక వాడగా మొదలైన శ్రీసిటీ పారిశ్రామిక నగరంగా రూపుదిద్దుకుంది. సామాజిక బాధ్యతను దృష్టిలో ఉంచుకుని వర్క్, లైవ్, లెర్న్, ప్లే అనే విధానంలో ప్రణాళికాబద్ధంగా వృద్ధి చెందుతోంది. ఇందులో ట్రిపుల్ ఐటీ, డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయి. నాలుగు లేన్ల రహదారులు వచ్చి చేరాయి. 3 లక్షల మంది నివసించేందుకు వీలుగా భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కన్జర్వేషన్ పద్ధతిలో భూగర్భ జలాలను పెంపొందించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా చెరువులు నిర్మించారు. కాలువల ద్వారా ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు చేరేలా లింక్ చానల్స్ నిర్మించారు. తద్వారా భూగర్భ జలాలు 4 మీటర్లు పెరిగాయి. శ్రీసిటీలో అన్ని పరిశ్రమలకు శుద్ధి చేసిన నాణ్యమైన నీరు సరఫరా చేస్తూనే.. పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత, వ్యర్ధ జలాలను శుద్ధి చేసి ఉద్యాన వనాలను పెంచుతున్నారు. 50 ఎకరాల్లో ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. సెజ్ వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటారు. ఫలితంగా కాలుష్య రహిత ప్రాంతం ఇక్కడ ఆవిష్కృతమైంది. సెకనుకు 3 సెల్ఫోన్ల తయారీ శ్రీసిటీ మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లల్లో ప్రతి సెకనుకు 3 సెల్ఫోన్ల చొప్పున నిమిషానికి 180 తయారవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, సిమెన్స్ సంస్థ సంయుక్తంగా శ్రీసిటీలో టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పి నిరుద్యోగులను నిష్ణాతుల్ని చేస్తున్నారు. ఇలా రెండేళ్లలో 5వేల మందిని తీర్చిదిద్దారు. శిక్షణ తర్వాత ఉద్యోగం చూపించే లక్ష్యంతో ట్రైనింగ్ ఇస్తుండటం విశేషం. ఇక్కడ 27 దేశాలకు చెందిన 185 కంపెనీలకు వివిధ ఉత్పత్తులను విదేశీ సామర్థ్యంతో చేపడుతున్నారు. ఇస్రో, నాసా పరిశోధన సంస్థల రాకెట్ ప్రయోగంలో వినియోగించే లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంక్స్, ఇసుజి వాహనాలు, సిద్ధార్థ లాజిస్టిక్స్, రఫేల్ యుద్ధ విమానాల ల్యాండింగ్ సీలింగ్ నిర్మాణం ఇక్కడే తయారవుతున్నాయి. డ్రగ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు సైతం ఇక్కడే చేస్తున్నారు. మహిళలకూ ఆర్థిక స్వావలంబన శ్రీసిటీ సెజ్ కారణంగా ఎందరో మహిళలు ఆర్థికంగా లాభపడ్డారు. దశాబ్ద కాలంలో అక్షరాస్యత అత్యంత వేగంగా పుంజుకుంది. పుష్కర కాలంలోనే ఇక్కడి పౌరుల సగటు ఆదాయం 200 శాతం పెరిగింది. ప్రతి కుటుంబంలో ఉద్యోగులు ఉన్నారు. పూరి గుడిసెల స్థానంలో అందమైన ఇళ్లు వెలిశాయి. శ్రీసిటీ పరిధిలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ వేలాది మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇందులో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 50 శాతం మంది మహిళలే ఉండటం మరో విజయం. ఫాక్స్గాన్ సెల్ఫోన్ల తయారీ కంపెనీలో దాదాపు 15 వేల మంది మహిళలు ఉద్యోగులున్నారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళలకు కూడా స్కిల్ డెవలప్మెంట్, డీఆర్డీఏ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి సెల్‌ఫోన్ ఉత్పత్తి ఉద్యోగాల్లో నియమించారు. ఎంఐ, ఆపిల్, నోకియా, ఒన్ ప్లస్ ఫోన్లు ఇక్కడ తయారై ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. తాజాగా శుక్రవారం కోవిడ్ బాధితులకు రూ.20 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల ఆక్సిజన్‌ను శ్రీసిటీ విరాళంగా అందించింది. -
శ్రీసిటీని సందర్శించిన జపాన్ కాన్సుల్ జనరల్
కేవీబీపురం (చిత్తూరు జిల్లా ): జపాన్ కాన్సుల్ జనరల్ టగామసుయుకి శ్రీసిటీని సందర్శించారు. సోమవారం శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. శ్రీసిటీలో పెట్టుబడుల అవకాశాలు, వ్యాపార ప్రయోజనాల గురించి రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు వివరించారు. శ్రీసిటీని ‘మినీ జపాన్’గా పిలుస్తారని, ఆ దేశానికి చెందిన ఆటో మొబైల్, ఇంజనీరింగ్, లాజిస్టిక్, వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన 24 పరిశ్రమలు ఇక్కడ కొలువు తీరాయన్నారు. ఈ పరిశ్రమలన్నింటిలో కలిపి రూ.9,500 కోట్లు పెట్టుబడులు, సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. (విజ్ఞానం పంచుకునే ‘ట్విన్నింగ్’) -
మరో ఐదు ‘శ్రీసిటీ’లు
సాక్షి, అమరావతి: భారీఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన మల్టీ ప్రొడక్ట్ సెజ్ ‘శ్రీసిటీ’ తరహాలో అన్ని వసతులతో ఐదు పారిశ్రామిక పార్కులను నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తోంది. గురువారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలన భవనంలో ఉన్న ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ తొలిసారి సమావేశమైంది. ఈ భేటీలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టాస్క్‌ఫోర్స్ కమిటీ వైస్ చైర్మన్ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్, టాస్క్‌ఫోర్స్ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పంచాయతీ రాజ్, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఐదు డిజిగ్నేటెడ్ క్లస్టర్స్, పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా రక్షణ–ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా–హెల్త్‌కేర్, టెక్స్టైల్ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే విధంగా అన్ని వసతులతో డిజిగ్నేటెడ్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లగ్అండ్ప్లే విధానంలో విదేశీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించుకునే విధంగా ఈ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ♦ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న దేశాలను గుర్తించి వాటి కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా దేశాల్లో స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ♦ పెట్టుబడి ప్రతిపాదనలు వేగంగా వాస్తవరూపం దాల్చడం కోసం దేశాల వారీగా, రంగాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. ♦ ప్రతిపాదన వచ్చిన 30 రోజుల్లో పరిశ్రమకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్, మానవ వనరులను అందించే విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ♦ పారిశ్రామిక పాలసీతో పాటు, ఐటీ–ఎలక్ట్రానిక్స్ పాలసీలను జూన్ 26న విడుదల చేసేందుకు కృషిచేస్తున్నామని మంత్రి చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా వచ్చే నాలుగేళ్లలో పెద్దఎత్తున సంపద సృష్టిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ♦సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఉండే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ముందుకు నేడు వచ్చే సుమారు రూ. 18,000 కోట్ల విలువైన 25 పెట్టుబడి ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు. నేతన్నల స్థితిగతులపై సర్వే చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సర్వే చేపట్టాలని చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చేనేతల స్థితిగతులపై గురువారం సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెలలో అందించే ‘నేతన్న నేస్తం’ సాయానికి అర్హులైన వారి జాబితాను రూపొందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సహాయ నిధికి కియా భారీ విరాళం
సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించేందకు పలువురు ప్రముఖులు, పలు సంస్థలు ముందుకొస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కియా మోటార్స్ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు కియా మోటార్స్ ఇండియా ఎండీ కుక్ హయాన్ షిమ్ గురువారం సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళాలకు సంబంధించిన వివరాలను అందజేశారు. (భారతి సిమెంట్స్ రూ.5 కోట్ల విరాళం) రూ. 2 కోట్లు విరాళం ప్రకటించిన శ్రీ సీటీ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన శ్రీ సిటీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సన్నారెడ్డి రవీంద్ర.. విరాళానికి సంబంధించిన చెక్‌ను అందజేశారు. మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన ఏపీ ఐఏఎస్‌లు.. కరోనా నియంత్రణ చర్యల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్.. వారి మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, విజయకుమార్, ప్రద్యుమ్న, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ విరాళాలకు సంబంధించిన వివరాలు అందించారు. రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన జీఎల్ మంధానీ గ్రూప్ కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఎంబీజీ కమొడిటీస్ తరఫున జీఎల్ మంధానీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని జీఎల్ మంధానీ గ్రూప్ ట్రస్టీ బిజయ్ మంధానీ ఆన్లైన్ ద్వారా సీఎం సహాయ నిధికి బదిలీ చేశారు. -
చైనాలో చిక్కుకుపోయిన తెలుగు ఇంజనీర్లు..
సాక్షి, అమరావతి : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ మహమ్మారి బారినపడి ఇప్పటికే 131 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో చైనాలో చిక్కుకుపోయిన తెలుగు ఇంజనీర్ల పరిస్థితిపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా శ్రీసిటీలోని టీసీఎల్ కంపెనీకి ఎంపికైన పలువురు ఇంజనీర్లు.. శిక్షణ నిమిత్తం చైనాకు వెళ్లారు. అయితే ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో తమ పిల్లలను క్షేమంగా భారత్‌కు తరలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు చైనాలో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌కు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసేందుకు ఇప్పటికే 7 విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీనింగ్ సదుపాయాన్ని 20 విమానాశ్రయాలకు విస్తరించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. భారత్‌లో ఒక్కవ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. మనవారిని వెనక్కి రప్పిస్తున్నాం.. చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని వూహాన్‌కి పంపనున్నట్టు చెప్పారు. అయితే అందుకు మరికొద్ది రోజులు పట్టొచ్చనీ, వారిని వెనక్కి తీసుకొచ్చి తీరుతామనీ, స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఒక్క భారతీయ విద్యార్థికి కూడా వైరస్ సోకలేదని చెప్పారు. చదవండి : కరోనా వైరస్‌పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చైనాలో 131కి పెరిగిన మృతుల సంఖ్య -
ముంబై మెట్రోకు ‘శ్రీసిటీ’ బోగీలు
వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): ముంబై మెట్రో లైన్–3 ప్రాజెక్టుకు శ్రీసిటీలో ఆల్స్టామ్ పరిశ్రమ ఉత్పత్తి చేస్తున్న రైలు బోగీలను వాడనున్నారు. ఈ మేరకు మెట్రో ప్రాజెక్టుతో ఒప్పందం కుదిరినట్లు ఆల్స్టామ్ ఇండియా, దక్షిణాసియా ఎండీ అలెన్ స్ప్యార్ చెప్పారు. నిర్ధేశిత సమయంలో 8 బోగీలుండే 31 ట్రైన్ సెట్లను అందజేస్తామని, వీటి తయారీని కూడా ఆరంభించామని అలెన్ స్ప్యార్ చెప్పారు. శ్రీసిటీ ప్లాంట్‌లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 240 నుంచి 480 రైళ్లకు చేర్చేందుకు తాము శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ చెన్నై మెట్రో, మాంట్రియల్ మెట్రో(కెనడా), ముంబై మెట్రో లైన్–3 ఆర్డర్లకు అనుగుణంగా ఉత్పత్తి జరుగుతోందన్నారు. సిడ్నీకి చెందిన మరో ప్రాజెక్టు ఒప్పందం కూడా జరిగిందని తెలియజేశారు. -
శ్రీసిటీలో టీహెచ్‌కే ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెషినరీ విడిభాగాల తయారీలో ఉన్న జపాన్‌కు చెందిన టీహెచ్‌కే భారత్‌లో తన తొలి ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో నెలకొల్పనుంది. 50 ఎకరాల్లో రానున్న ఈ యూనిట్ కోసం కంపెనీ సుమారు రూ.1,300 కోట్లు ఖర్చు చేయనుంది. 2018 ఆగస్టులో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి. ఇక్కడ వివిధ పరిశ్రమల్లో వాడే మెషినరీకి అవసరమైన లీనియర్ మోషన్ గైడ్స్ ఉత్పత్తి చేస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుతో (ఏపీఈడీబీ) మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందంపై టీహెచ్‌కే ప్రెసిడెంట్ అకిహిరో టెరమచి, ఏపీఈడీబీ సీఈవో జె.కృష్ణ కిషోర్ సంతకాలు చేశారు. 1971లో ప్రారంభం అయిన టీహెచ్‌కే పారిశ్రామిక యంత్రాలు, రవాణా వాహనాలకు కావాల్సిన లీనియర్ మోషన్ గైడ్స్ తయారు చేస్తోంది. భారత్‌లో 2012లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. -
ఏపీలో టోరే, రాక్‌మెన్ పెట్టుబడులు
శ్రీసిటీలో పరిశ్రమల ఏర్పాటు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్టు జపాన్‌కు చెందిన టోరే, హీరో మోటార్స్ గ్రూప్‌నకు అనుబంధంగా ఉన్న రాక్‌మెన్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ప్రకటించారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు తాము వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు టోరె ప్రతినిధులు వెల్లడించగా, రాక్‌మెన్ ఇండస్ట్రీస్ రూ. 540 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ఆ కంపెనీల ప్రతినిధులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ప్రాజెక్టుల వల్ల ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 300 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. వచ్చే ఏడాది జనవరిలో తమ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు వివరించారు. కంపెనీల ప్రతినిధులు కలసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాను దక్షిణ భారతదేశంలో లాజిస్టిక్ హబ్‌గా తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. -
శ్రీసిటీలో వయ లైఫ్ తయారీ కేంద్రం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోమ్ వేర్ ఉత్పత్తుల తయారీలో ఉన్న వయ లైఫ్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం కంపెనీ చైనా నుంచి విడిభాగాలను తెస్తోంది. ఒకటిరెండేళ్లలో ఇండియాలోనే తయారీ కేంద్రం పెడతామని వయ ఫౌండర్, సీఈవో వశిష్ట్ వసంతకుమార్ చెప్పారు. రూ.3 వేల ధరలో ఒక లీటరు సామర్థ్యంగల ఫుడ్ కంటైనర్‌ను (టిఫిన్ బాక్స్) శుక్రవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో ఈ విషయం చెప్పారు. ‘బాక్సుల తయారీలో వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌ను వాడాం. 4–6 గంటల వరకు బాక్సులోని ఆహార పదార్థాలు వేడిగా ఉంటాయి. దీనికి సంబంధించి 3 డిజైన్ పేటెంట్లు దక్కించుకున్నాం. ఆన్లైన్ ద్వారా 80 శాతం అమ్మకాలు జరుగుతున్నాయి’ అని చెప్పారాయన. ఉత్పత్తుల ధర రూ.1,890–3,000 ఉంది. -
కొబెల్కో కొత్త మైనింగ్ ఎక్స్కవేటర్లు
శ్రీసిటీలో ఉత్పత్తి ప్రారంభం వరదయ్యపాళెం(సత్యవేడు): మైనింగ్ రంగం కోసం అధునాతన ఎక్స్కవేటర్లను శ్రీసిటీలోని కొబెల్కో ఇండియా సంస్థ ప్రవేశపెట్టింది. 20–24 టన్నుల సామర్థ్యం గల జనరేషన్ 10 వండర్ ఎస్కె–220 ఎక్స్‌డి, ఎస్కె–220 ఎక్స్‌డిఎల్‌సి మోడల్ 20 నుంచి 24 టన్నుల సామర్థ్యం గల ఎక్స్కవేటర్లను గురువారం శ్రీసిటీలోని కొబెల్కో ప్లాంట్‌లో సంస్థ ఎండీ యుకోటో గోటో, చీఫ్ అడ్వైజర్ విక్రమ్ శర్మ, శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నా రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మొదటి యంత్రాన్ని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కె.నరసింహారెడ్డికి తాళం చెవి అందజేసి వాహనాన్ని అప్పగించారు. అత్యంత కష్టతరమైన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకు జనరేషన్ 10 ఎక్స్కవేటర్లు ఎంతో ఉపయోగకరమని యుకోటో గోటో చెప్పారు. 19శాతం వరకు ఇంధన పొదుపు, 19 శాతం వరకు అధిక ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు. ఛీప్ అడ్వైజర్ విక్రమ్ శర్మ మాట్లాడుతూ కొబెల్కో పరిశ్రమ ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో ఈ కొత్త ఎక్స్కవేటర్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించి అతి పెద్ద యంత్రాలు శ్రీసిటీ కొబెల్కోలో ఉత్పత్తి కావడం అభినందనీయమని ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి పేర్కొన్నారు. -
శ్రీసిటీకి అమెరికా కాన్సుల్ జనరల్
వరదయ్యపాళెం (సత్యవేడు): హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. సౌత్ ఇండియా కమర్షియల్ అధికారి జాన్ ఫ్లెమింగ్, ఇతర అమెరికన్ అధికారులతో కలసి ఆమె శ్రీసిటీ పర్యటనకు వచ్చారు. శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి వారికి శ్రీసిటీ మౌలిక వసతులు, ప్రత్యేకతలు, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. అనంతరం శ్రీసిటీ వాణిజ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. అమెరికాకు చెందిన పది పరిశ్రమలు శ్రీసిటీలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశాయన్నారు. వాటిలో పెప్సికో, క్యాడ్బరీ, కాల్గేట్ పామోలివ్, కెలాగ్స్ ఉన్నాయని గుర్తు చేశారు. అనంతరం కేథరిన్ మాట్లాడుతూ.. శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతిని నేరుగా వీక్షించడం సంతోషంగా ఉందని, మరికొన్ని అమెరికన్ కంపెనీలు శ్రీసిటీకి రావడానికి తన పర్యటన దోహదపడుతుందని చెప్పారు. అనంతరం శ్రీసిటీ సెజ్‌ను పరిశీలించారు. అమెరికన్ కంపెనీలు పెప్సీ, కెలాగ్స్ను సందర్శించారు. శ్రీసిటీ మౌలిక వసతులను ప్రశంసించారు. -
రెండు బస్సులు ఢీ.. 20 మందికి గాయాలు
-
రెండు బస్సులు ఢీ.. 20 మందికి గాయాలు
దొరవారిసత్రం (నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నెలబల్లి సమీపంలో జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. కోట నుంచి శ్రీసిటీకి మహిళా ఉద్యోగులతో వెళుతున్న బస్సు బోల్తాపడడంతో 20 మంది గాయపడ్డారు. శ్రీసిటీలోని సెల్‌ఫోన్ కంపెనీకి మహిళా ఉద్యోగులతో వెళ్తున్న బస్సును విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తున్న వెంకటరమణ ట్రావెల్స్ వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఉద్యోగినులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18మంది మహిళలు, ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగ్రాత్రులను 108లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
శ్రీసిటీలో పార్క్‌సన్ ప్యాకేజింగ్ పరిశ్రమ
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ముం బయికి చెందిన పార్క్‌సన్ ప్యాకేజింగ్ లిమిటెడ్ పరిశ్రమ నూతన ఉత్పత్తి కేంద్రాన్ని శ్రీసిటీలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆ సంస్థ చైర్మన్ ష్ కేజ్రీవాల్, బాబ్ట్స్ గ్రూప్ సీఈవో జీన్ పాస్కల్ బాబ్ట్స్, హెడెల్ బర్గ్ గ్రూప్ హెడ్ స్టీపెన్ ఖ్య అతిథులుగా హాజరయా్యరు. ప్రింటెడ్, లామినేటెడ్, ఫోల్డింగ్ కార్టన్ పెట్టెల తయారీలో ఈ పరిశ్రమ పేరొందింది. ఇప్పటికే నాలుగు యూనిట్లు ఉన్న ఈ పరిశ్రమ ఐదో యూనిట్‌ను శ్రీసిటీలో ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఛైర్మన్ రమేష్ కేజ్రీవాల్ తెలిపారు. శ్రీసిటీలో పది ఎకరాల విస్తీర్ణంలో రూ. 70 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటుచేసిన పార్క్‌సన్ జింగ్ పరిశ్రమ ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. 1986లో మొదట ముంబయిలో పరిశ్రమ ప్రారంభించామని, ప్రస్తుతం అదే ప్రాంతంలో నాలుగు యూనిట్లు విస్తరింపజేశామన్నారు. త్వరలో ఆరో ప్లాంటును గౌహతిలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్యాకేజింగ్ రంగంలో పేరుగాంచిన పార్క్‌సన్ పరిశ్రమ శ్రీసిటీలో ఏర్పాటుకావడం శుభపరిణామమని శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి చెప్పారు. వినూత్న ఆలోచనలతో ముందుకెళు్తన్న ఈ పరిశ్రమ ఉత్పతు్తలు కస్టమర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. శ్రీసిటీలో ఆహార శుద్ధి, పానీయాలు ఇతర తయారీ పరిశ్రమలు 150కిపైగా ఉన్నాయని, వీటికి పార్క్‌సన్ ఉత్పతు్తలు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. -
శ్రీసిటీని సందర్శించినచైనా మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారుల బృందం
శ్రీసిటీ(సత్యవేడు): చైనాలోని మొబైల్ పరిశ్రమకు చెందిన 40 మంది ఉన్నత శ్రేణి ప్రతినిధుల బృందం సోమవారం ఏపీలోని శ్రీసిటీని సందర్శించింది. ఈనెల నెల 22, 24 తేదీలలో డిల్లీలో జరిగిన ఇండియా-చైనా మొబైల్ ఉత్పత్తి దారుల వస్తుప్రదర్శనలో పాల్గొన్న ప్రతినిధుల బృం దంలో కొందరు తమ పర్యటనలో భాగంగా శ్రీసిటీకి విచ్చేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డెరైక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వీరికి స్వాగతం పలికారు. శ్రీసిటీ మౌలిక వసతులను, పారిశ్రామిక ప్రగతిని ఆయన వారికి వివరించారు. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల వినియోగంలో భారత్ ముందుండగా, వాటి ఉత్పత్తిలో చైనా అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు తయారు చేసే ఫ్యాక్స్‌కాన్ సంస్థ శ్రీసిటీలో ఉండడం, తిరుపతి, చెన్నైలో మొబైల్ హబ్ ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంతం మొబైల్ ఫోన్ల తయారీ వ్యాపారానికి అనుకూలంగా ఉందని ఆయన వివరించారు. -
శ్రీసిటీలో ‘పేక్స్ ఎన్విరాన్మెంటల్’ ప్లాంటు
శ్రీసిటీ(వరదయ్యుపాళెం): పారిశ్రామిక నీటి వ్యర్థాలను శుద్ధి చేసే పరికరాల తయూరీలో పేరొందిన నెదర్లాండ్స్ సంస్థ పేక్స్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ... తన కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని వుంగళవారం శ్రీసిటీలో ప్రారంభించింది. భారతదేశంలోని నెదర్లాండ్స్ అంబాసిడర్ అల్ఫోన్సెస్ స్టోలింగ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రవుంలో పేక్స్ హోల్డింగ్ సీఈఓ స్టీఫెన్ బోకెన్, ఫౌండర్ జాన్ పేక్స్, పేక్స్ ఇండియూ ఎండీ సుదీప్ సంగమేశ్వరన్, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యర్థ జలాల శుద్ధితో పాటు వాటి నుంచి వినియోగానికి పనికొచ్చే విలువైన పదార్థాలను ఈ యంత్రాలు వేరు చేస్తాయి. శుద్ధి ప్రక్రియులో ఉత్పన్నవుయ్యే బయోగ్యాస్.. కాలుష్య రహిత ఇంధనంగా ఉపయోగపడుతుంది. పేక్స్ సంస్థ తయూరు చేసిన 2వేల పైచిలుకు యుంత్రాలను 60 దేశాలలో పలు పారిశ్రామిక సంస్థలు, పురపాలక సంస్థలు ఉపయోగిస్తున్నట్లు నెదర్లాండ్స్ అంబాసిడర్ చెప్పారు. నెదర్లాండ్స్ భారీగా భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లే భారత్ నుంచి కూడా టాటా స్టీల్స్, అపోలో టైర్స్ తదితర సంస్థలు తవు దేశంలో పెట్టుబడులు పెట్టాయుని చెప్పారు. యుూరప్కు భారత్ ఎగువుతుల్లో 20శాతం నెదర్లాండ్స్‌కే వెళుతోందన్నారు. శ్రీసిటీ వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. -
శ్రీసిటీలో వెర్మీరియన్ యూనిట్ ప్రారంభం
శ్రీసిటీ(సత్యవేడు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసిటీలో శుక్రవారం బెల్జియం దేశానికి చెందిన వెర్మీరియన్ ఇండియా యూనిట్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆస్పత్రి పరికరాల తయారీలో పేరుగాంచిన వెర్మీరియన్ గ్రూప్ భారతదేశంలో మొట్టమొదట ఉత్పాదక కేంద్రాన్ని శ్రీసిటీలో ప్రారంభించింది. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ కంపెనీ ఉత్పత్తుల్లో ప్రధానమైనవి వీల్‌చైర్లని, ఆస్పత్రులు, వికలాంగులు మాత్రమే కాకుండా వయస్సు మీరిన వారికి కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. వెర్మీరియన్ గ్రూప్ సీఈవో పాట్రిక్ వెర్మీరియన్ మాట్లాడుతూ రూ. 40వేల కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చే శామని, ప్రపంచంలో ఇది నాలుగో ఉత్పత్తి కేంద్రమని తెలిపారు. ఇండియా తమకు చాలా ముఖ్యమైన వ్యాపార కేంద్రమని, ఇక్కడ తక్కువ ధరలకు ఉత్పత్తులు అందిస్తామని చెప్పారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఈ కంపెనీ ఏర్పాటుతో తక్కువ ధరతో నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని విశ్వసిస్తున్నానని చెప్పారు. -
శ్రీసిటీని సందర్శించిన‘ ఆధార్ ’ చైర్మన్
సత్యవేడు : ఆధార్ వ్యవస్థ పర్యవేక్షణ సాధికార సంస్థ యూనిక్ ఐడెంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా( యుఐడీఏఐ) చైర్మన్ జే. సత్యనారాయణ శనివారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. సెజ్‌లో మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. అనంతరం ఆయన శ్రీసిటీ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీసిటీ ఒక గొప్ప ప్రాజెక్టని, దీని అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రమోటర్లను ప్రశంసించారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ మంచి వసతులున్నాయని చెప్పారు. రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ సత్యనారాయణ 1990 ప్రాంతంలో తాను ఐటీ పరిశ్రమలో ఉన్నప్పుడు, ఆయన ఏపీ గవర్నమెంట్ ఉన్నతాధికారిగా పలు ఈ– గవర్నన్స్ ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు చేశారని తెలిపారు. గతంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచారశాఖ(డైటీ) కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఎలక్ట్రాక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్లు(ఈఎంసీ) ఏర్పాటు విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారని చెప్పారు. -
శ్రీసిటీ సమీపంలో టీవీఎస్ నైపుణ్య శిక్షణాకేంద్రం
శ్రీసిటీ(వరదయ్యుపాళెం): శ్రీసిటీ పరి శ్రమల అవసరాలకు అనుగుణంగా టీవీఎస్ వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం పని చేస్తుందని ఆ సంస్థ ప్రత్యేక డెరైక్టర్ వి.రఘు పేర్కొన్నారు. శ్రీసిటీ సమీపంలోని తడ ఐటిఐ కళాశాల ఆవరణలో టీవీఎస్ శిక్షణ-సేవా కేంద్రం ఏర్పాటు చేయునున్నట్లు తెలి పారు. ఈసందర్భంగా గురువారం శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీవీఎస్ సంస్థ ప్రత్యేక డెరైక్టర్ వి.రఘు వూట్లాడుతూ ప్రాధమికంగా కొన్ని ఐటిఐ శిక్షణా కోర్సులతో మొదలు పెట్టి అంచెలంచెలుగా కేంద్రాన్ని విస్తరింపజేయునున్నట్లు వివరించారు. టీవీఎస్ గ్రూప్ వూర్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ శ్రీనివాసరాఘవన్ వూట్లాడుతూ తవు సంస్థ గత 20ఏళ్ళుగా ఈ తరహా సేవలు అందిస్తున్నదన్నారు.శ్రీసిటీ సెజ్గ్రావూలలో నిరుద్యోగ యుువతకయ్యే నైపుణ్య శిక్షణ ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి తెలిపారు. -
శ్రీసిటీ పరిశ్రమలకు అనువుగా
కృష్ణపట్నం పోర్టు సేవలు... సత్యవేడు: శ్రీసిటీలోని పరిశ్రమలకు అత్యంత అనువుగా కృష్ణపట్నం పోర్టు సేవలు లభిస్తాయని కృష్ణపట్నం పోర్టు కంపెనీ (కేపీసీటీ) సీఈవో, డెరైక్టర్ అనిల్ యెండ్లూరి శ్రీసిటీలోని పరిశ్రమల యాజమాన్యాలకు చెప్పారు. బుధవారం శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో పోర్టు యాజమాన్యం నిర్వహించిన శ్రీసిటీ కస్టమర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు పోర్టు సేవలను వివరించారు. రోడ్డు, రైలు కనెక్టివిటీ, తక్కువ చార్జీలు, నిర్ణీత సమయానికి సరఫరా ఇంకా పలు అంశాల తమ ప్రత్యేకతలుగా ఆయన పేర్కొన్నారు. రాష్టంలో నేడు అత్యంత చెప్పుకోదగ్గ ప్రాజెక్టులుగా శ్రీసిటీ, కేపీసీటీలని అభివర్ణించారు. ఈ రెండూ ప్రాజెక్టులూ 8 ఏళ్ళక్రితం ప్రస్ధానం ప్రారంభించి, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రతిష్టాత్మకంగా ఎదిగాయన్నారు. ఈకార్యక్రమంలో సెజ్ డెవలప్ మెంట్ కమిషనర్ ఎస్కె సమల్, శ్రీసిటీ ప్రెసిడెంట్(వర్క్స్) సతీష్కామత్, పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
శ్రీసిటీలో కొబెల్కొ, పైలాక్స్ అదనపు యూనిట్లు
సత్యవేడు: శ్రీసిటీలోని జపాన్ దేశానికి చెందిన కొబెల్కొ ప్లేట్ ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్, పైలాక్స్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమ అదనపు ఉత్పత్తి యూనిట్లకు బుధవారం ప్రారంభోత్సవం జరిగింది. కొబెల్కొ కొత్త యూనిట్‌ను ఆ సంస్థ డెరైక్టర్ సటొరు హొషినా ప్రారంభించగా, పైలాక్స్ అదనపు యూనిట్‌ను పైలాక్స్ గ్రూప్ ప్రెసిడెంట్ యుకిహికొ షిమాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ కొబెల్కో, పైలాక్స్ రెండూ కూడా శ్రీసిటీలో అడుగు పెట్టిన మొట్టమొదటి జపాన్ పరిశ్రమలు కాగా, రెండూ తమ యూనిట్లను విస్తరించడం సంతోషదాయకమన్నారు. కొబెల్కొకు సంబంధించి ఏడాదిలో ఇది రెండో యూనిట్ విస్తరణ అని తెలిపారు. జపాన్‌కు చెందిన కొబెల్కొ కన్స్ట్రక్షన్ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన కొబెల్కొ ప్లేట్ ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్‌లో స్టీల్ ప్లేట్ల తయారీ జరుగుతుంది. పైలాక్స్ జపాన్ గ్రూప్‌కు చెందిన పైలాక్స్ ఇండియా లిమిటెడ్ ఆటోమొబైల్ విడి భాగాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ. ఇక్కడ కార్లలో వినియోగించే కూల్ స్ప్రింగులు, ప్లాట్ స్ప్రింగులు, వైర్లు, మెటల్, ప్లాస్టిక్ ఫాస్టనర్లు తయారు చేస్తారని తెలిపారు. -
చైనా వాణిజ్య సంస్థల ప్రతినిధుల బృందం శ్రీసిటీ పర్యటన
సత్యవేడు(చిత్తూరు జిల్లా): చైనాలోని షెజి యాంగ్ రాష్ట్రం నుంచి 10 మంది సభ్యుల వాణిజ్య సంస్థల ప్రతినిధుల బృందం శుక్రవారం శ్రీసిటీలో పర్యటించింది. హిసేహ్ చింగ్ టోంగో ఈ బృందానికి నేతృత్వం వహించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి వారికి స్వాగతం పలికి పారిశ్రామిక పరంగా సాధించిన ప్రగతిని వివరించారు.సమావేశానంతరం బృందం సభ్యు లు శ్రీసిటీలోని పలు ప్రదేశాలలో పర్యటించి పాల్స్ ప్లష్ బొమ్మల కంపెనీని సందర్శించారు. శ్రీసిటీ లాంటి పెద్ద పారిశ్రామిక పార్కును నెల కొల్పి, సమర్ధవంతంగా నిర్వహిస్తున్నందుకు చైనా బృందం రవీంద్రసన్నారెడ్డిని అభినందించింది. -
శ్రీసిటీకి సీఎం వరాలు
సత్యవేడు: శ్రీసిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. బుధవారం శ్రీసిటీలోని ఇసుజు కార్ల కంపెనీ ప్రారంభోత్సవాన్నికి హాజరైన ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. శ్రీసిటీలో ప్రస్తుతం ఉన్న పోలీస్ ఔట్ పోస్టు స్థాయిని పెంచి డీఎస్స్పీ ఆధ్వర్యంలో పనిచేసేట్లు పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేస్తామని తెలిపారు. కార్మికులకు నివాస సముదాయాలు, గ్రామీణ యువతకు వివిధ వృత్తుల్లో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు ఒక శిక్షణా సంస్థ ఏర్పాటు చేస్తామని వరాలు ఇచ్చారు. ఇసుజులో 2వేల మందికి ఉపాధి శ్రీ సిటీలో నెలకొల్పిన ఇసుజు కంపెనీ వల్ల 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. శ్రీ ఇసుజు కంపెనీని 107 ఎకరాల స్థలంలో రూ.3వేల కోట్లు పెట్టుబడితో నిర్మించారని ఆయన తెలిపారు. ఏడాదికి 1.2 లక్షల ఇసుజు వాహనాలు ఉత్పత్తి చేస్తారని వివరించారు. ఇసుజూ కంపెనీ ప్రారంభించడం వల్ల ఆ కంపెనీకి వివిధ విడి భాగాలను సరఫరా చేసే అనుబంధ సంస్థలు కూడా త్వరలో శ్రీసిటీకి రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామమోహనరావు, రాష్ర్టముఖ్య మంత్రులు గోపాల కృష్ణారెడ్డి, నారాయణ, ఎమ్మెల్యే ఆదిత, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తదితరులుపాల్గొన్నారు. -
శ్రీసిటీలో ఉత్పత్తి ప్రారంభించిన రోటోలాక్
తడ: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ సమీపంలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో సోమవారం యూకేకి చెందిన రోటోలాక్ వాల్వ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ప్రారంభమైంది. తన ఉత్పత్తుల తయారీని మొదలుపెట్టింది. రోటోలాక్ హోల్డింగ్స్ లిమిటెడ్ గ్రూపునకు చెందిన ఈ ప్లాంటును గ్రూప్ మేనేజింగ్ డెరైక్టర్ సీన్ స్వేల్స్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వేల్స్ మాట్లాడుతూ మెటీరియల్స్ హ్యాండిలింగ్కు అవసరమైన రోటరీ ఎయిర్లాక్స్, డైవర్టర్, సైడ్ వాల్వులు, రోటరీ వాల్వులు, కన్వేయర్లు ఇక్కడ ఉత్పత్తవుతాయన్నారు. ఇప్పటివరకు భారత్‌లో లభించే వాల్వులు యూకేలో తమ ప్లాంటులో తయారై దిగుమతి చేసుకున్నవని, ఇకనుంచి అవి ఇక్కడే తయారవుతుండటంతో అదే నాణ్యత తో తక్కువ ధరకు పొందే అవకాశం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యూకే వాణిజ్య, పెట్టుబడుల శాఖ సీనియర్ అడ్వయిజర్ సుజిత్ థామస్, పరిశ్రమ జీఎం ప్రసన్న వీరరాఘవన్ పాల్గొన్నారు. -
శ్రీ సిటీలో కోల్గేట్ టూత్‌బ్రష్‌ల యూనిట్ ప్రారంభం
తడ: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడకు సమీపంలోని శ్రీసిటీలో బుధవారం కోల్గేట్ - పామోలివ్ కంపెనీ టూత్‌బ్రష్‌లు తయారుచేసే యూనిట్‌ను లాంచనంగా ప్రారంభించింది. ఆ సంస్థ దక్షిణ ఆసియా రీజియన్ వైస్ ప్రెసిడెంట్ ఇస్సామ్ బచ్చాలాని సమక్షంలో రీజియన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఫెబియన్ టీ గార్సియా పరిశ్రమను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ భారత దేశంలో తొలి టూత్‌బ్రష్‌ల పరిశ్రమను శ్రీసిటీలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ పరిశ్రమ ద్వారా ఏటా 220 మిలియన్ల బ్రష్‌లను తయారు చేస్తారన్నారు. దీనిని త్వరలో 600 మిలియన్ బ్రష్‌లు ఉత్పత్తి చేసే విధంగా విస్తరణ జరుగుతుందన్నారు. దీని ద్వారా 1200 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య పాల్గొన్నారు. -
శ్రీసిటీని సందర్శించిన తైవాన్ ప్రతినిధుల బృందం
సత్యవేడు: తైవాన్ దేశానికి చెందిన ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సోమవారం శ్రీసిటీని సందర్శించింది. తైవాన్ ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చర్స్ అసోసియేషన్( టీమా) అధ్యక్షుడు ఫ్రాన్సిస్ సయ్ ఆధ్వర్యంలో 20 మంది ప్రతినిధులు శ్రీసిటీకి వచ్చారు. శ్రీసిటీలో ఎలక్ట్రానిక్స్ యూనిట్స్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధికారిక సర్వే చేయడానికి వచ్చినట్లు బృందం సభ్యులు తెలిపారు. శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధికి ఎంతో అనువుగా ఉంటుందని చెప్పారు. టీమా ప్రతినిధులు మొబిల్ట్రాన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్, సీఈవో వైసీ కిమ్, ట్యోమ్ ఎలక్ట్రానిక్ వర్క్స్ కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్ సామ్యూట్కియో తదితరులు పాల్గొన్నారు. -
శ్రీసిటీని సందర్శించిన తైవాన్ పారిశ్రామిక బృందం
సత్యవేడు (చిత్తూరు): తైవాన్ దేశానికి చెందిన ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సోమవారం శ్రీసిటీని సందర్శించింది. తైవాన్ ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చర్స్ అసోసియేషన్( టీమా) అధ్యక్షుడు ఫ్రాన్సిస్ సయ్ ఆధ్వర్యంలో 20 మంది ప్రతినిధులు శ్రీసిటీకి వచ్చారు. సెజ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాగిణి పీటర్ మౌలిక వసతుల గురించి వివరించారు. శ్రీసిటీలో ఎలక్ట్రానిక్స్ యూనిట్స్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సర్వే చేయడానికి వచ్చినట్లు బృందం సభ్యులు తెలిపారు. -
శ్రీసిటీలో ‘మెజ్జో హోల్డింగ్స్’ బృందం
తడ : హాంకాంగ్ కేంద్రంగా సాగుతూ పలుదేశాల్లో విస్తరించిన మెజ్జో హోల్డింగ్స్ గ్రూప్ ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ సమీపంలోని శ్రీసిటీని సందర్శించింది. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలను పరి శీలించేందుకు సంస్థ అంతర్జాతీయ డెరైక్టర్ రఫీక్ సిద్దిఖీ నేతృత్వంలో వచ్చిన 35 మంది ప్రతినిధుల బృందానికి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీలోని మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధిని మెజ్జో ప్రతినిధులకు వివరించారు. అనంతరం సెజ్‌లో పర్యటించిన బృందం అక్కడ ఏర్పాటైన పరిశ్రమలను పరిశీలించారు. పరిశీలన అనంతరం మెజ్జో ప్రతినిధులు మాట్లాడుతూ మెజ్జో గ్రూప్ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు శ్రీసిటీ విశ్వాసం కలిగిస్తోందని సిద్దిఖీ అన్నారు. ఈ సందర్భంగా సన్నారెడ్డి మాట్లాడుతూ మెజ్జో పర్యటన తమకు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ఇక్కడి పరిస్థితులను వారు ఆసక్తితో అడిగి తెలుసుకోవడం ద్వారా త మ పెట్టుబడులను ఇక్కడ పెట్టేందుకు అవకాశం ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
లక్ష్యం
శ్రీసిటీలో వెయ్యి పరిశ్రమల ఏర్పాటు లక్ష మందికి ఉద్యోగావకాశాలు 12 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, 11 కంపెనీలకు భూమిపూజ చేసిన సీఎం రోడ్లు అభివృద్ధి చేస్తామని ప్రకటన సత్యవేడు : శ్రీసిటీలో వెయ్యి పరిశ్రమల ఏర్పాటే లక్ష్యమని, ప్రస్తుతానికి 10శాతం కంపెనీలే వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇక్కడ వెయ్యి కంపెనీలు ఏర్పాటైతే లక్ష మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయని తెలిపారు. శ్రీసిటీలో శుక్రవారం ముఖ్యమంత్రి 12పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, మరో 11కంపెనీలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పెప్సికో యూనిట్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సభలో సీఎం మాట్లాడుతూ సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల పరిధిలోని శ్రీసిటీలో 7600 ఎకరాల్లో 25 దేశాలకు చెందిన 106 పరిశ్రమల ఏర్పాటుకు *20,500 కోట్లు పెట్టుబడి పెట్టారని, 25వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. జపాన్‌కు చెందిన 16 కంపెనీలు, అమెరికాకు చెందిన 9కంపెనీలు, మరిన్ని కంపెనీలు ఇందులో ఉన్నాయన్నారు. సౌత్ ఇండియాలో పెప్సీ మార్కెట్‌ను పెంచేందుకు శ్రీసిటీలో 86 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయని, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ మామిడితోటలు అధికంగా ఉన్నాయని చెప్పారు. బొప్పాయి,మామిడి, అరటి రైతులకు ఈ ప్లాంటు ఏర్పాటుతో రైతులకు ఆదాయం మెరుగుపడే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. శ్రీసిటీలో ట్రిపుల్ఐటీ, ఐఐఎఫ్ఎం ఏర్పాటు చేయాలని కోరారని,ప్రస్తుతం ట్రిపుల్ఐటీ ఏర్పాటు చేశామని చెప్పారు. నెల్లూరులో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణపట్నం కాకుండా మరో పోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తిరుపతి, ఏర్పేడు, గూడూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి రోడ్లు శ్రీసిటీకి అనుసంధానంగా అభివృద్ధి చేస్తామన్నారు. రైతులు వ్యవసాయంపై దృష్టిపెట్టాలని కోరారు. అందరికీ ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీలు ఏర్పాటు కావాలని, ఇండస్ట్రీ ఏర్పాటుకు 21 రోజుల్లో క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు. పెప్సీకో సీఈవో ఇంద్రనూయి లాగే మహిళలు ఎదగాలని కోరారు. స్థానిక కంపెనీలు సీఈవోలుగా ఎక్కువ మంది మహిళలనే నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. పెప్సికో సీఈవో సందీవ్చద్దా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా చైర్మన్ శివకుమార్, మంత్రులు నారాయణ, గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు ఆదిత్య, సుగుణమ్మ , శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, ఎండీ రవీంద్రసన్నారెడ్డి. ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, ఇండస్ట్రియల్ సెక్రటరీ రావత్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు శ్రీసిటీలో సీఎం ప్రారంభోత్సవాలు
సత్యవేడు: శ్రీసిటీ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు శుక్రవారం 12 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, 11 నూ తన పరిశ్రమలకు భూ మిపూజ చేయనున్నా రు. పెప్సీకో కంపెనీ సీఈవో ఇంద్రనూయి, ఇతర ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి తొలుత పెప్సీకో పానీయ, ఆహార వస్తు ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వెస్టుఫార్మా పరిశ్రమను ప్రారంభించి డేనియలీ కంపె నీ వందో వార్షికోత్సవంలో పాల్గొంటారు. తరువాత బిజినెస్ సెంటర్లో ఉత్పత్తి దశకు చేరిన జెడ్‌టీటీ, నిస్సాన్, నిట్టాన్, వాల్వ్, ఎంఎం హలీ టెక్, కుసాకబే, వైటల్ సొల్యూషన్, సిద్ధార్థ లాజి స్టిక్, సీఎక్స్ ప్రిసిషన్, ఆర్చురా ఫార్మాస్యూటికల్ ను ప్రారంభిస్తారు. అనంతరం రెక్సామ్, వెర్మిరాన్, గోదావరి ఉద్యోగ్, ఆయుర్వేట్, బిరోలెక్స్, పవర్ గ్యాస్ ఎనర్జీ, బెవాసిలికోన్స్, కాస్పెఫ్ట్పాలిప్రో, పేజిల్, కేజీఐక్లాతింగ్, బ్రిండ్కో కంపెనీలకు భూమి పూజ చేస్తారు. అనంతరం మీడియా ప్రతినిధులు, స్ధానిక ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం హంటర్ డగ్లస్ పరిశ్రమను ప్రారంభిస్తారు. కొబెల్ క్రేన్స్‌కు చేరుకుని ఎగుమతి చేయనున్న తొలి క్రేన్‌కు జెండా ఊపుతారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రాష్ట్రముఖ్యమంత్రిగా తొలిసారి శ్రీసిటీకి రావడం ఆనంద దాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం ఆశాజనకంగా ఉందన్నారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా పారిశ్రామిక సంస్థలు తమ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను, శ్రీసిటీని ఎంచుకుంటున్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెప్సీకో అధినేత ఇంద్రనూయి శ్రీసిటీకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అతి పెద్ద పెప్సీకో ప్లాంటును శ్రీసిటీలో నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. రాష్ట్రమంత్రులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. -
నేడు శ్రీసిటీలో పెప్సికో ప్లాంటు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, పెప్సికో సీఈఓ ఇంద్ర నూయి రాక సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పెప్సికో సీఈఓ ఇంద్ర నూయిలు శుక్రవారం చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీ సెజ్‌ను సందర్శించనున్నారు. అక్కడ రూ.500 కోట్ల వ్యయంతో నెలకొల్పిన పెప్సికో ప్లాంటును సీఎం ప్రారంభిస్తారు. మొత్తం రూ.1,800 కోట్ల వ్యయంతో వివిధ దశలలో ఈ ప్లాంటును విస్తరించాలన్నది ఆ కంపెనీ ప్రణాళిక. దక్షిణ భారతదేశంలో పెప్సికో వ్యాపారానికి ఈ ప్లాంటు కీలకం కాబోతోందని, తద్వారా రాష్ట్రానికి మరిన్ని ఉద్యోగావకాశాలు లభించవచ్చని అంచనా. రాష్ట్రంలో ఏఏ రంగాలలో తోడ్పాటు అందించేందుకు అవకాశాలున్నాయి? ఏఏ రంగాలలో భాగస్వామ్యం వహించే వీలున్నది? అనే అంశాలపై ఇంద్ర నూయి సీఎంతో ఈ పర్యటనలో చర్చించనున్నారు. ఇంద్రనూయితో భేటీ తర్వాత చంద్రబాబు శ్రీసిటీలో నెలకొల్పిన పలు పారిశ్రామిక యూనిట్లను ప్రారంభిస్తారు. -
ఉగ్రవాదుల కలకలం: శ్రీహరికోటలో హై అలర్ట్
-
ఉగ్రవాదుల కలకలం: శ్రీహరికోటలో హై అలర్ట్
నెల్లూరు: సిమీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పోలీసులు బుధవారం హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితులు తమిళనాడు నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఏపీ , తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తప్పించుకుని తిరుగుతున్న ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఫయాజుద్దీన్, మహబూబ్ఉద్దు ఫోటోలను తమిళనాడు పోలీసులు ఇప్పటికే తడ పోలీసులకు పంపించారు. దాంతో శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టి... అక్కడ పని చేస్తున్నవారి వివరాలను సేకరిస్తున్నారు. శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. -
బాబూ.. డాబు!
- శ్రీసిటీలో రూ.1,500 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు గతేడాది భూమి పూజ చేసిన ఇసుజు - ఏడాదికి 1.20 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో పరిశ్రమ నిర్మాణానికి శ్రీకారం - జపాన్ పర్యటనలో శ్రీసిటీలో పరిశ్రమ ఏర్పాటుకు ఇసుజు సంస్థ తనకు హామీ ఇచ్చిందన్న చంద్రబాబు సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిమ్మిని బమ్మిని చేయడం అంటే ఇదే..! ఎప్పుడో కుదిరిన ఒప్పందం.. ఇప్పుడే తన సమక్షంలో కుదిరిందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. జిల్లాలో సత్యవేడు సమీపంలోని శ్రీసిటీ సెజ్‌లో రూ.1,500 కోట్ల వ్యయంతో వాహనాల త యారీ సంస్థ ఏర్పాటుకు జనవరి 28, 2013న ఇసుజు సంస్థ ప్రతినిధి బృందం భూమిపూజ చేసింది. ఆ సంస్థ ప్రతినిధి బృందంతో జపాన్‌లో ఈ నెల 27న సమావేశమైన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఇసుజు సంస్థ శ్రీసిటీలో వాహనాల తయారీ పరిశ్రమకు అంగీకరించిందని.. ఇది పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తుందని పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే శ్రీసిటీ సెజ్‌లో ఇసుజు సంస్థ పరిశ్రమ నిర్మాణ పనులను సైతం ప్రారంభించిందని.. ఇప్పుడే ఆ పరిశ్రమ మం జూరైనట్లు చంద్రబాబు ప్రకటించడంపై మేధావులు, పరిశీలకులు, పారిశ్రామికవేత్తలు నివ్వెరపోతున్నారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం విదేశీ పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. మొన్న మలేషియాలో పర్యటించిన చంద్రబాబు.. నేడు ఆరో రోజు జపాన్ పర్యటన పూర్తిచేసుకుని మన రాష్ట్రానికిచేరుకోనున్నారు. తన జపాన్ పర్యటన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహ దం చేస్తుందని శనివారం తెలుగు సమాజం అక్కడ నిర్వహించిన సత్కారసభలో చంద్రబాబు పేర్కొన్నారు. జపాన్ పర్యటన సఫలమైందని. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి సంస్థలు ముందుకొచ్చాయని ప్రకటించారు. ఈ క్రమంలోనే శ్రీసిటీ సెజ్‌లో వాహనాల తయారీ సంస్థను ఏర్పాటుచేయడానికి ఇసుజు సంస్థ అంగీకరించిందన్నారు. ఇదంతా తన జపాన్ పర్యటన వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవాలు మాత్రం తద్భిన్నంగా ఉన్నాయి. శ్రీసిటీ సెజ్‌లో వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి ఇసుజు సంస్థ ప్రతినిధులు జనవరి 28, 2013న భూమి పూజ చేశారు. రూ.1,500 కోట్ల వ్యయంతో ఏడాదికి 1.20 లక్షల వాహనాల(80 వేలు దేశంలో విక్రయించేందుకు.. 40 వేల వాహనాలు విదేశాలకు ఎగుమతి చేసేందుకు) తయారీ సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటుచేయడానికి మార్చి 15, 2013న అప్పటి పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, ఇసుజు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో అప్పుడే ఎంవోయూ కుదుర్చుకుందన్నది రికార్డులను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఆ ఎంవోయూ మేరకు ఇసుజు సంస్థ ఇప్పటికే శ్రీసిటీ సెజ్‌లో వాహనాల తయారీ పరిశ్రమ నిర్మాణ పనులు చేపట్టింది. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం తాను జపాన్‌లో పర్యటించి, ఆ సంస్థ ప్రతినిధులను ఒప్పించడం వల్లే ఇసుజు సంస్థ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి అంగీకరించిందని ప్రకటించడం గమనార్హం. -
ఏపీలో ఇసుజు పికప్ ట్రక్స్ తయారీ ప్లాంట్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పికప్ ట్రక్స్ తయారీ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నామని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ టకాషి కికుచి తెలిపారు. నగరంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా శ్రీ సిటి వద్ద ఉన్న తడలో 107 ఎకరాల్లో పికప్ ట్రక్స్ తయారీ కంపెనీ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రూ.3 వేట కోట్లు పెట్టుబడితో నిర్మించనున్నా ఫ్యాక్టరీలో 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించానున్నామన్నారు. 2016 నాటికి పూర్తి స్థాయిలో ఈ ఫ్యాక్టరీ వినియోగంలోకి రానుందని చెప్పారు. ఏడాదికి 50 వేల యూనిట్ల తయారీ లక్ష్యమన్నారు. జపాన్ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబుతో ఇసుజు ట్రక్స్ తయారీ ఫ్యాక్టరీ, ఉపాధి తదితర విషయాలు చర్చిస్తామన్నారు. ప్రస్తుతం ఇసుజు వెహికల్స్ విడిభాగాలు దిగుమతి చేసుకుని చైన్నై హిందుస్థాన్ కంపెనీలో వాహనాలను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. 11 మంది డీలర్‌షిప్‌ల ద్వారా రాష్ట్ర మార్కెట్లో తమ వెహికల్స్ అమ్ముడవుతున్నాయని చెప్పారు. 2016 నాటికి 60 డీలర్‌షిప్‌లు పెంచుతామన్నారు. సమావేశంలో ఇసుజు మోటార్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్ శిగెరు వాకాబాయషి, జనరల్ మేనేజర్ శంకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
శ్రీసిటీలో జపాన్ పారిశ్రామిక సంస్థల బృందం
సత్యవేడు : జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు చెందిన 17మంది సభ్యుల బృందం సోమవారం చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ (సత్యవేడు)లో పర్యటించింది. ప్రఖ్యాత ఏక్కాన్ కాగ్యో షింబున్ ప్రచురణ సంస్థ అధ్యక్షుడు హరుహిటో ఇమిజూ, మన దేశ జపాన్ మాజీ రాయబారి యసుకునీ యనోకీ ఆధ్వర్యంలో వీరు శ్రీసిటీని సందర్శించారు. మన దేశంలో వ్యాపారాభివృద్ధికిగల అవకాశాలను పరిశీలించడానికి వారు వచ్చారు. శ్రీసిటీలో ఏర్పరచిన అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, జపాన్ దేశ పరిశ్రమలకు కేటాయించిన ప్రదేశం విశిష్టత, శ్రీసిటీ సాధించిన ప్రగతిని శ్రీసీటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి వారికి వివరించారు. బృందం సభ్యులు కొబెల్కో, డేనియల్ పరిశ్రమలను సందర్శించారు. జపాన్ పరిశ్రమలకు ప్రత్యేకంగా ఏర్పరచిన ప్రదేశం అత్యంత అనుకూలంగా ఉందని, జపాన్ నుంచి మరిన్ని పరిశ్రమలు శ్రీసిటీకి రావడానికి తమ సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. -
శ్రీసిటీకి మరిన్ని జపాన్ కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీపై మరిన్ని జపాన్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే జపాన్‌కు చెందిన 15 కంపెనీలు ఈ సెజ్‌లో అడుగు పెట్టాయి. తయారీ రంగాల్లో ఉన్న కంపెనీలు ఇక్కడ ప్లాంటు పెట్టే ఆలోచనలో ఉన్నాయి. ప్రధానంగా ఆటోమొబైల్, ఇంజనీరింగ్ సంస్థలు రానున్నాయని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. శ్రీసిటీలో భారత్‌తోపాటు పలు దేశాలకు చెందిన 116 కంపెనీలు చేతులు కలిపాయి. ఇందులో 55కిపైగా కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ ఏడాది మరో 20-25 కంపెనీలు వీటికి జతకూడనున్నాయని ఆయన చెప్పారు. కాగా, జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీకి చెందిన దక్షిణాసియా విభాగం డిప్యూటీ డెరైక్టర్ జనరల్ కట్సువో మట్సుమోటో బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ చంద్రతోనూ ఈ బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. రానున్న రోజుల్లో శ్రీసిటీ నుంచి మరింత వ్యాపారం ఆశిస్తున్నట్టు మట్సుమోటో చెప్పారు. -
రెండేళ్లలో ఇసుజు వాహనాల ఉత్పత్తి
తొలి దశలో 50 వేల వాహనాల తయారీ సిటీలో ప్లాంటుకు సీఎం శంకుస్థాపన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలోని శ్రీసిటీలో నెలకొల్పుతున్న ప్లాంటులో వచ్చే రెండేళ్లలో వాహనాల ఉత్పత్తి ప్రారంభిస్తామని జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం ఇసుజు మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ టకాషి కికుచి తెలిపారు. ఇందులో ప్రధానంగా పికప్ ట్రక్స్, ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తామన్నారు. శ్రీసిటీలో ఇసుజు మోటార్స్ తలపెట్టిన ప్లాంటుకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారమిక్కడ లాంఛనంగా శంకుస్థాపన చేశారు. స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా ఇసుజుకు ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కంపెనీకి అన్నివిధాలా సహాయం అందిస్తామని ఆయన హామీనిచ్చారు. అవగాహన ఒప్పందం కుది రిన తొమ్మిది నెలల్లోనే ప్లాంటు పనులు ప్రారంభం కావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇసుజుకు సంబంధించి ఈ ప్లాంటులో తయారైన వాహనాన్నే తాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తయారీ రంగానికి ప్రోత్సాహమిచ్చేలా రాష్ట్రంలో తయారీ జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటాన్ని సీఎం ప్రస్తావించారు. మరోవైపు, వాహన పరిశ్రమకు కావాల్సిన విధంగా కార్మికులకు శిక్షణనిచ్చేందుకు ఉద్దేశించిన ట్రైనింగ్ కిట్‌ను ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మకు ఇసుజు యాజమాన్యం అందించింది. రూ. 3 వేల కోట్ల పెట్టుబడి.. శ్రీసిటీ ప్లాంటుపై 2020 నాటికి రూ.3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఇసుజు ఇండియా ప్రెసిడెంట్ కికుచి తెలియజేశారు. ఏటా 1.20 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని, 2016 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని, తొలి దశలో 50 వేల యూనిట్లు ఉత్పత్తి చేస్తామని తెలియజేశారు. వీటిలో ఉపయోగించే విడిభాగాల్లో దాదాపు 70 శాతాన్ని ప్రారంభదశలో స్థానిక సంస్థల నుంచే తీసుకుంటామన్నారు. దీని ద్వారా స్థానికంగా 2,000-3,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. భారత్‌లో ఈ జాయింట్ వెంచర్లో మిత్సుబిషికి 38 శాతం, ఇసుజు మోటార్స్‌కి 62 శాతం వాటా ఉంటుంది. ప్రస్తుతం తమకు నాలుగు డీలర్‌షిప్‌లు ఉండగా.. త్వరలో వైజాగ్, తిరుపతి తదితర ప్రాంతాల్లో మరో నాలుగు డీలర్‌షిప్‌లు ఆరంభిస్తామని కికుచి చెప్పారు. -
ఇస్రోకు శ్రీసిటీ అభినందన
చెన్నై, సాక్షి ప్రతినిధి: జీఎస్ఎల్వీ-డీఎస్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను శ్రీసిటీ యూజమాన్యం, భారత వాణిజ్య, వ్యాపార మండలి (అసోచెమ్, దక్షిణం) సంయుక్తంగా గురువారం రాత్రి సన్మానించారుు. ఈ సందర్భంగా సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ మాట్లాడుతూ తనకు చేసిన సన్మానాన్ని ఇస్రోకు అంకితం ఇస్తున్నానని అన్నారు. ఒక ప్రయోగం ఫలప్రదానికి ఇస్రోలోని అందరి కృషి ఉంటుందన్నారు. ప్రత్యక్షంగా 16,500 ఉద్యోగులతో పాటు సుమారు 50 వేల మంది సమష్టిగా పాటుపడ్డారని ఆయన పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఇస్రో కేంద్రాలు, కార్యాలయాల్లో అంతరిక్ష నౌక, శాటిలైట్ తయారై శ్రీహరికోటలోని లాంచింగ్ పాడ్ వద్ద ఒకటిగా అమర్చి ప్రయోగం చేపడతామని తెలిపారు. అందరూ రాకెట్ ప్రయోగించే స్థానానికే విజయాన్నంతా కట్టబెడతారని చమత్కరించారు. అందుకే ఈ సన్మానం ప్రతి ఒక్కరికీ చెందుతుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ కింద తమకు కేటాయించే 0.4 శాతం నిధులు (రూ.5వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు)కు తాము జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉందన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశాభివృద్ధికి అందుబాటులోకి తేవడం తమ కర్తవ్యమని చెప్పారు. శ్రీసిటీ చైర్మన్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జీఎస్ఎల్వీ-డీఎస్‌ను సమర్ధవంతంగా ప్రయోగించడం ద్వారా భారత్ కీర్తిప్రతిష్టలు మరోసారి ఆకాశాన్ని తాకాయని ప్రశంసించారు. ఈ ఘనతను సాధించిన షార్ శాస్త్రవేత్తలను సన్మానించుకోవడం భారతీయులుగా తమ కనీస బాధ్యతని పేర్కొన్నారు. సన్మానం అందుకున్న వారిలో షార్ శాస్త్రవేత్తలు వి.శేషగిరిరావు (అసిస్టెంట్ డెరైక్టర్), ఎస్వీ సుబ్బారావు (డెప్యూటీ డెరైక్టర్, వాస్ట్), ఎంఎస్ పన్నీర్ సెల్వం (రేంజ్ ఆపరేషన్ డెరైక్టర్), వి.రంగనాథన్ (సీజీఎం, ఎస్పీపీ), ఎం.బద్రీనారాయణ మూర్తి (సీజీఎం, ఎల్ఎస్ఎస్ఎఫ్) ఉన్నారు. శ్రీసిటీ చైర్మన్ రవీంద్ర సన్నారెడ్డితోపాటు చెన్నైలోని జపాన్, థాయిలాండ్, మలేషియా, జర్మనీ దేశాల వాణిజ్య దూతలు షార్ శాస్త్రవేత్తలను సన్మానించి అభినందించారు. అంతకుముందు ప్రముఖ సినీనటులు అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
2018 నాటికి పూర్తి స్వదేశీ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ రూ.3 వేల కోట్లతో శ్రీసిటీలో నెలకొల్పుతున్న ప్లాంటు 2016కల్లా సిద్ధం కానుంది. కంపెనీ ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు, పిక్ అప్ ట్రక్‌లను థాయ్‌లాండ్ నుంచి తెప్పించి భారత్‌లో విక్రయిస్తోంది. కొత్త ప్లాంటు ద్వారా 2018 నాటికి పూర్తి స్వదేశీ పరికరాలతో వాహనాలు తయారవుతాయని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ టకషి కికుచి గురువారం తెలిపారు. తద్వారా పోటీ ధరలో మోడళ్లను విక్రయించేందుకు వీలవుతుందని చెప్పారు. ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ఎంయూ-7ను హైదరాబాద్‌లో తొలి వినియోగదారునికి అందజేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్యూవీ, పిక్ అప్ ట్రక్లపైనే ప్రధానంగా దృష్టి పెడతామని కంపెనీ డిప్యూటీ ఎండీ షిగెరు వకబయషి తెలిపారు. ఇతర దేశాల్లో ఇసుజు విక్రయిస్తున్న తేలికపాటి వాణిజ్య వాహనాలు, మధ్యంతర వాణిజ్య వాహనాలను భారత్‌లో ప్రవేశపెట్టడంపై అధ్యయనం చేస్తున్నట్టు ఆయన వివరించారు. భారత వాహన పరిశ్రమ పరిమాణం ప్రస్తుతమున్న 35 లక్షల యూనిట్ల నుంచి 2020 నాటికి 1 కోటి యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. కాగా, హైదరాబాద్ ఎక్స్ షోరూంలో ఎంయూ-7 ధర రూ.22.6 లక్షలుగా ఉంటుంది. -
రాష్ట్రంలో పెప్సీ భారీ యూనిట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద బాట్లింగ్ యూనిట్‌ను మన రాష్ట్రంలో పెప్సికో ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లోని 80 ఎకరాల్లో రూ. 1,200 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌కు శనివారం ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో లాంఛనంగా భూమి పూజ చేశారు. భారత్‌లో 2020 నాటికి రూ. 33,000 కోట్ల పెట్టుబడులు పెట్టే లక్ష్యంలో భాగంగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, పెప్సీకి ఉన్న 38 ప్లాంట్లలో ఇదే పెద్దదని పెప్సికో ఇండియా చైర్మన్ అండ్ సీఈవో శివ్ శివకుమార్ చెప్పారు. మొత్తం మూడు దశల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం 3.6 లక్షల లీటర్లు. మొదటి దశలో రూ. 450 కోట్ల పెట్టుబడి అంచనాతో 1.2 లక్షల లీటర్ల ఉత్పత్తిని 2014 చివరికల్లా అందుబాటులోకి తెస్తామని, రెండో దశ 2015కి, మూడో దశ 2017కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శివకుమార్ తెలియజేశారు. ఈ యూనిట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 8,000 మందికి ఉపాధి లభిస్తుందని, ఈ యూనిట్‌కు అవసరమైన నీటిని తెలుగుగంగ నుంచి తీసుకోనున్నామని తెలిపారు. దేశంలో అతి ఎక్కువ మామిడి గుజ్జు (పల్ప్) ఉత్పత్తి అయ్యేది ఆంధ్రప్రదేశ్‌లోనేనని, ఇక్కడ తమ వాటాను పెంచుకోవాలనుకుంటున్నామని, మూడు దశలూ పూర్తయితే సుమారు 50,000 నుంచి 60,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు. పెప్సికోకి ఇప్పటికే సంగారెడ్డిలో ఒక యూనిట్ ఉంది. కరెంటు కోతలుండవు... ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి... రాజకీయ ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం వెనుకబడలేదని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 1.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గతేడాది విద్యుత్ కోత ఉన్నప్పటికీ ఈ ఏడాది అలాంటి పరిస్థితి లేదని, వచ్చే వేసవిలో కూడా కోతలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. ఇప్పటికే రూ. 40,000 కోట్లతో 7,000 మెగావాట్ల విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసినప్పటికీ గ్యాస్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి చేయలేకపోతున్నామన్నారు. ఒక్కసారి గ్యాస్ సరఫరా జరిగితే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటుందన్నారు. పెప్సీ దేశంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రూ. 33,000 కోట్లలో అత్యధిక భాగం రాష్ట్రానికి కేటాయించాలని, ఇందుకు కావల్సిన మౌలిక వసతులను కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. -
ఇసుజు తొలి దేశీ ఎస్యూవీ
రూ.3,000 కోట్లతో శ్రీ సిటీలో తయారీ కేంద్రం 2016 మార్చి నాటికి తొలి యూనిట్ పూర్తి మొదటి దశలో ఉత్పత్తి సామర్థ్యం 50,000 యూనిట్లు భారత్‌లో తయారైన ‘ఎంయూ-7’ ఎస్యూవీ విడుదల చెన్నై ఎక్స్‌షోరూం ధర రూ. 22.3 లక్షలు 2016 నాటికి 60 డీలర్‌షిప్‌లు ఎస్యూవీ, ఎల్సీవీలపైనే ప్రధానంగా దృష్టి... ఇసుజు ఇండియా ఎండీ టకాషి కికుచి వెల్లడి చెన్నై నుంచి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: దేశీయంగా బాగా డిమాండ్ ఉన్న స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ), తేలికపాటి వాణిజ్య వాహనాల (ఎల్సీవీ)పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం ఇసుజు ప్రకటించింది. ఇందుకోసం దేశీయంగా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, వివిధ సంస్థలతో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు ఇసుజు ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ టకాషి కికుచి ‘సాక్షి’తో పేర్కొన్నారు. రూ.3,000 కోట్ల పెట్టుబడి అంచనాతో శ్రీసిటీలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మొదటి దశలో 50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఇది 2016 నాటికి అందుబాటులోకి వస్తోందన్నారు. మొత్తం యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం లక్ష యూనిట్లని, పూర్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తే పొరుగు దేశాలతో పాటు మధ్యప్రాచ్య దేశాలకు ఇక్కడ నుంచే ఎగుమతి చేయనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ సిటీ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అందిస్తున్న సహాయ సహకారాలు బాగున్నాయని, ప్రధానంగా ఎస్యూవీ, ఎల్సీవీ వాహనాల ఉత్పత్తిపైనే దృష్టిసారిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యూనిట్ గురించి ఇంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేమన్నారు. భారతీయ అవసరాలకు అనుగుణంగానే... దేశీయంగా తయారు చేసిన మొదటి ఎస్యూవీ వెహికల్ ‘ఎంయూ-7’ను టకాషి మంగళవారం లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత మూడేళ్ళ నుంచి దేశీయ మార్కెట్‌ను పరిశీలించిన తర్వాత ఇక్కడి అవసరాలకు అనుగుణంగా ఎంయూ-7 ఎస్యూవీను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఎంయూ-7 ధర రూ.22.3 లక్షలు .. దేశీయంగా తయారు చేసిన ఎంయూ-7 ధరను రూ.22.3 లక్షలుగా (చెన్నై ఎక్స్ షోరూం) నిర్ణయించినట్లు ఇసుజు ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షిగేరు వకబయాషి తెలిపారు. బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఎస్యూవీ మూడు రంగుల్లో లభిస్తుందని, ఏటా 5,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. చెన్నైలోని హిందుస్థాన్ మోటార్స్‌లో ఈ వాహనాలను తయారు చేస్తున్నామని, శ్రీసిటీ యూనిట్ వచ్చినా ఈ ఒప్పందం కొనసాగుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపైనే దృష్టిసారిస్తున్నామని, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంతో సహా ప్రస్తుతం 8 డీలర్షిప్స్ ఉన్నాయని, వీటి సంఖ్యను వచ్చే మూడేళ్లలో 60కి పెంచనున్నట్లు తెలిపారు. -
శ్రీసిటీలో క్యాడ్బరీ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘క్యాడ్బరీ’ బ్రాండ్ నేమ్‌తో చాక్లెట్స్‌ను ఉత్పత్తి చేస్తున్న మాంటెజ్ ఆసియా పసిఫిక్‌లోనే అతిపెద్ద తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీ సిటీ సెజ్‌లో 134 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో క్యాడ్బరీ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, క్యాడ్బరీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ మను ఆనంద్ సంతకం చేశారు. తదనంతరం లాంఛనంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మను ఆనంద్ మాట్లాడుతూ ఇది దేశంలో ఏడవ తయారీ కేంద్రమని, 2.50 లక్షల టన్నుల సామర్థ్యంగల ఈ ప్రాజెక్టును 2020కి నాలుగు దశల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశ యూనిట్ 2015 మధ్య నాటికి అందుబాటులోకి వస్తుందని, ఇందుకోసం రూ.1,000 కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో క్యాడ్బరీ బ్రాండ్ పేరుమీద అయిదు రకాల ఉత్పత్తులు అందిస్తున్నామని, కాని ఈ యూనిట్ మొదటి దశలో చాక్లెట్స్పైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. చాక్లెట్స్కు ప్రధానముడిసరుకైన ‘కోకా’కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 6,000 మంది రైతులతో కాంట్రాక్టింగ్ పద్ధతిలో కోకా సాగును చేపట్టినట్లు తెలిపారు. నాలుగున్నర లక్షలమంది రైతులకు ఉపయోగం క్యాడ్బరీ చాక్లెట్ తయారీ కేంద్రానికి అవసరమైన పాలు, పంచదార సరఫరా చేయడం ద్వారా నాలుగున్నర లక్షలమంది రైతులు నేరుగా ప్రయోజనం పొందనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే రోజుకి పదిలక్షల లీటర్ల పాలు, 100 టన్నుల పంచదార అవసరమవుతుందన్నారు. ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు రూ.1.30 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చినట్లు కిరణ్ కుమార్ తెలిపారు. గతేడాది రాష్ట్రం ఎదుర్కొన్న విద్యుత్ సంక్షోభం ఈ ఏడాది నుంచి ఉండదని రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ముఖ్యమంత్రి అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతా రెడ్డి మాట్లాడుతూ త్వరలో మెదక్ జిల్లాలో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
మూడేళ్లలో 73 ప్రాజెక్టులు
శ్రీసిటీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంతో పాటు అంతర్జాతీయంగా కూడా పారిశ్రామిక రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా తమ ప్రభుత్వం గడచిన మూడేళ్లలో 1.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చే 73 మెగా ప్రాజెక్టులను ఆమోదించిందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. తద్వారా లక్షా యాభైవేల మందికి ఉద్యోగాలొచ్చాయన్నారు. బుధవారమిక్కడి చిత్తూరు జిల్లా శ్రీసిటీ పారిశ్రామిక వాడలో ఇప్పటికే ఏర్పాటై కార్యకలాపాలు మొదలుపెట్టిన 13 యూనిట్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ 13 యూనిట్లూ ఇప్పటిదాకా రూ.1,200 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. వీటితో పాటు రూ.వెయ్యి కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులతో రానున్న 10 కంపెనీలు సైతం బుధవారం ముఖ్యమంత్రి సమక్షంలో భూమిపూజ చేశాయి. పారిశ్రామిక రంగం వృద్ధి చెందితేనే ఉద్యోగాలొస్తాయంటూ... రాష్ట్రంలో జహీరాబాద్, ఒంగోలు, చిత్తూరులో మూడు తయారీ పారిశ్రామిక వాడలు (ఎన్ఐఎంజెడ్) రానున్నాయని సీఎం తెలియజేశారు. ఇసుజు, పెప్సీ, క్యాడ్బరీ వంటి దిగ్గజాలు శ్రీసిటీని ఎంచుకోవటం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. దుగ్గరాజపట్నం పోర్టుకు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నామని, తద్వారా చెన్నై-బెంగళూరు కారిడార్ మరింత పారిశ్రామిక పురోగతి సాధిస్తుందని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర పరిశ్రమలు ఎదుర్కొన్న విద్యుత్తు సంక్షోభాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. శ్రీసిటీలోని పరిశ్రమలకు మున్ముందు అలాంటి పరిస్థితి రాకుండా చూస్తానని, నూరుశాతం విద్యుత్తు సరఫరా చేస్తామని హామీనిచ్చారు. అంతకుముందు మాట్లాడిన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర... పారిశ్రామిక రంగంలో వందేళ్ల ముందున్న రాష్ట్రాలతో సైతం పోటీపడి మన రాష్ట్రం పలు ప్రాజెక్టులను దక్కించుకుందని తెలియజేశారు.